సయ్యద్ సిబ్తే రాజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయ్యద్ సిబ్తే రాజీ
Razi in 2015
అస్సాం 22వ గవర్నర్
In office
27 జూలై 2009 – 10 నవంబర్ 2009
Chief Ministerతరుణ్ గొగోయ్
అంతకు ముందు వారుకె. శంకరనారాయణన్
తరువాత వారుజాన‌కి బ‌ల్ల‌భ ప‌ట్నాయ‌క్
జార్ఖండ్ 4వ గవర్నర్
In office
10 డిసెంబర్ 2004 – 25 జూలై 2009
Chief Minister
అంతకు ముందు వారువేద్ మార్వా
తరువాత వారుకె. శంకరనారాయణన్
రాజ్యసభ సభ్యుడు
In office
1980–1985
In office
1988–1998
వ్యక్తిగత వివరాలు
జననం(1939-03-07)1939 మార్చి 7
రాయ్‌బరేలి, యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
మరణం2022 ఆగస్టు 20(2022-08-20) (వయసు 83)
లక్నో, ఉత్తరప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులుసయ్యద్ విరాసత్ హుస్సేన్, రజియా బేగం
చదువు
  • హుసైనాబాద్ హయ్యర్ సెకండరీ స్కూల్
  • షియా కళాశాల
కళాశాలలక్నో విశ్వవిద్యాలయం (బి.కామ్)

సయ్యద్ సిబ్తే రాజీ (7 మార్చి 1939 - 20 ఆగస్టు 2022) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

సయ్యద్ సిబ్తే రాజీ 1939 మార్చి 7న జన్మించాడు. ఆయన రాయ్‌బరేలీలోని హుసేనాబాద్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 10వ తరగతి పూర్తి చేసి ఆ తర్వాత షియా కాలేజీలో చేరాడు. ఆయన 1969లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చి లక్నో యూనివర్శిటీ నుంచి బి.కామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సయ్యద్ సిబ్తే రాజీ 1969లో ఉత్తరప్రదేశ్ యూత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1971లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1973 వరకు పని చేశాడు. ఆయన 1980 నుండి 1985 వరకు రాజ్యసభ సభ్యుడు,1980 నుండి 1984 వరకు ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, 1988 నుండి 1992 వరకు రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా, 1992 నుండి 1998 వరకు మూడవసారి రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.

మరణం[మార్చు]

సయ్యద్ సిబ్తే రాజీ ఛాతీ నొప్పితో లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ)లోని చేరి ఆ తరువాత ట్రామా సెంటర్‌లోని క్రిటికల్ కేర్ మెడిసిన్ యూనిట్‌కు చేర్పించగా ఆయన పరిస్థితి విషమించి 20 ఆగస్టు 2022న మరణించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. India Today (28 March 2005). "Jharkhand political drama ends with Arjun Munda winning trust vote" (in ఇంగ్లీష్). Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  2. The Times of India (21 August 2022). "Lucknow: Former Jharkhand governor Syed Sibte Razi passes away". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.