సరళా కే. సుబ్బారావు
సరళా కే. సుబ్బారావు | |
---|---|
వృత్తి | మహిళా శాస్త్రవేత్త |
సరళా కె సుబ్బారావు పుట్టిపెరిగింది సికిందరాబాదు. వారిది మద్యతరగతి కుటుంబం. ఆమె తల్లితండ్రులు చదువుకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చి ఆరుగురు పిల్లలకు చక్కగా చదువు అందించారు. సాధారణంగా ఆడపిల్లలను డిగ్రీ చదువులకు అనుమతించని రోజులలో సరళా కే. సుబ్బారావు తండ్రి ఆమెకు డిగ్రీచదువుకు ప్రోత్సహించడమే కాక మస్టర్ డిగ్రీ వరకు చదివించాడు. ఆమె బయాలజీ డిగ్రీ చేయండం ఆరభించిన తరువాత ఆమెకు ఆర్గానిక్ కెమెస్ట్రీ అంటే ఆసక్తి ఏర్పడింది. ఆమెకు జువాలజీ అంటే ఆసక్తి తక్కువ అయినా ఆమెకు ఫైనల్ పరీక్షలలో జువాలజీలో అత్యధిక మార్కులు లభించాయి. అందువలన ఆమె ఎం.ఎస్.సి జువాలజీ చేసింది. ఆమె 1964లో హెల్మితాలజీ స్పెషలైజేషన్‌తో డిగ్రీ పూర్తిచేసింది.
రీసెర్చ్
[మార్చు]సరళా కే. సుబ్బారావుకు రీసెర్చ్ చేయాలని ఆసక్తి ఉన్నా ఎం.ఎస్.సి పూర్తిచేయగానే జువాలజీ లెక్చరర్‌గా కొంతకాలం పనిచేసింది. 1967లో ఆమె వివాహం చేసుకుని భర్తతో అమెరికా వెళ్ళింది. అక్కడ ఆమెకు ప్రఖ్యాత కార్న్‌జెనెటిస్ట్ ప్రొఫెసర్ జాన్ లగ్నన్‌తో పనిచేసే అవకాశం లభించింది. ఆమె 1970 లో మొదటి కుమార్తెకు జన్మ ఇచ్చింది. 1973లో ఆమె " యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాస్ " నుండి జెనెటిక్స్‌లో డాక్టొరేట్ పుచ్చుకున్నది.
పోస్ట్‌డాక్టొరల్ ఒజిషన్
[మార్చు]డాక్టొరేట్ పూర్తి అయిన తరువాత కుటుంబంతో భారతదేశం తిరిగి వచ్చారు. 1974 లో హెల్త్ ఆర్గైనైజేషన్ (WHO)-ఇండియన్ కౌంసిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (సి.ఎం.ఆర్) ఢిల్లీలో స్థాపించిన " జెనెటిక్ కంట్ర్జోల్ ఆఫ్ మద్కిటోస్ " ప్రాజెక్ట్‌లో సరళా కే. సుబ్బారావు ఇంసెక్ట్ జెనెటిస్ట్‌గా ఉద్యోగబాధ్యతలు చేపట్టింది. 1975లో ప్రాజెక్ట్ సభ్యులు కొత్తగా స్థాపించబడిన ఐ.సి.ఎం.ఆర్ ఇంస్టిట్యూటుకు తరలించబడ్డారు.
గుర్తింపు
[మార్చు]సరళా కే. సుబ్బారావు 25 సంవత్సరాల రీసెర్చ్ తరువాత రిసెర్చ్ విద్యార్ధులకు మార్గదర్శిగా ఉండే అవకాశం లభించింది. ఆమె వద్ద అధ్యయనం చేసిన విద్యార్ధులలో చాలామంది డాక్టొరేట్ పూర్తిచేసి పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్ సంపాదించుకున్నారు. ఆమె చేసిన విశేష కృషిఫలితంగా ఆమెకు ఎం.ఒ.టి. అయంగార్ మెమోరియల్ అవార్డ్ అందుకుంది.ఆమె రీసెర్చ్ సహాధ్యాయులు, పైఅధికారుల చేత గుర్యించబడింది. ఆమె చేసే పరిశోధనలు సాంఘికసంక్షేమానికి సంబంధించించింది కనుక ఆమె తన పరిశోధనలు నిరంతరంగా కొనసాగించాలనుకున్నది.
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.