Jump to content

సరస్వతి పుష్కరాలు - 2025

అక్షాంశ రేఖాంశాలు: 18°26′07″N 79°35′24″E / 18.4353°N 79.5901°E / 18.4353; 79.5901
వికీపీడియా నుండి
సరస్వతి పుష్కరాలు - 2025
జన్మ నామం సరస్వతి పుష్కరాలు - 2025
ఆంగ్ల పేరుSARSWATI PUSKRALU-2025
తేదీ15–26 మే 2025 (2025-05-15 – 2025-05-26)
వ్యవధి12 రోజులు
ఘటనా స్థలంత్రివేణి సంగమం
ప్రదేశంకాళేశ్వరం
భౌగోళికాంశాలు18°26′07″N 79°35′24″E / 18.4353°N 79.5901°E / 18.4353; 79.5901
ఇలా కూడా పిలుస్తారు(सरस्वती पुस्कारालु - 2025) సరస్వతి పుష్కరాలు
రకంసామాజిక పద్ధతులు
ఇతివృత్తంపండుగ కార్యక్రమాలు
కారణంఆచారాలు (Rituals)
Patronsసన్యాసులు, బ్రహ్మచారులు, సాధువులు,సాధ్విలు, భక్తులు, యాత్రికులు.
Organised byతెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ.
Inquiriesహెల్ప్ లైన్ నెంబర్ +919484950056
Websiteweb: https://endowments.ts.nic.in web:https://saraswatipushkaralu.com web:https://yatradham.org/saraswati-pushkaralu-telangana

సరస్వతి పుష్కరాలు -2025 తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్‌పూర్ మండలం, కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. బృహస్పతి మిథునరాశి లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజులు పాటు ఆచరిస్తారు. ఇచ్చట గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వల్ల త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు తొలి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది[1][2][3].

స్థల పురాణం

[మార్చు]

కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం విశేషం. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామి ని కూడా దర్శించుకుంటారు.ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.

సరస్వతి పుష్కరాలు

[మార్చు]

తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పోస్టర్‌, వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ను మంత్రులు ఆవిష్కరించారు. పుష్కరాలకు నిత్యం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వేదికగా సరస్వతి నది పుష్కరాలు నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ను ప్రారంభించి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

పుష్కర సమాచారం

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మే 15, 2025 సాయంత్రం 5:00 గంటలకు శ్రీ సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ చేస్తారు.అనంతరం సరస్వతి ఘాట్ ప్రారంభోత్సవం, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ, తోగుట ఆశ్రమం పీఠాధిపతి గారు 2025 మే 15న ఉదయం 5:44 గంటలకు సంకల్పంతో పాటు పుష్కరస్నానాన్ని ఆరంభిస్తారు.

ప్రతి రోజూ ఉదయం 8:30 నుండి 11:00 గంటల వరకు యాగాలు నిర్వహించబడతాయి

ప్రతి రోజు సాయంత్రం 6:45 నుండి 7:35 గంటల వరకు సరస్వతి ఘాట్లో ప్రత్యేక సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహించబడుతుంది

తాత్కాలిక నివాస ఏర్పాట్లు (టెంట్ సిటీ) అందుబాటులో ఉంటాయి.

ప్రతి రోజూ సాయంత్రం 7:30 నుండి 9:00 గంటల వరకు ప్రముఖ కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి

పుష్కర ఘాట్ ఏర్పాట్లు

[మార్చు]

తెలంగాణ లోనే తొలి సారిగా తేదీ 15 మే 2025 నుండి 26 మే 2025 వరకు మొత్తం 12 రోజులు అంతర్వాహిని ఐయిన సరస్వతి నదికి పుష్కరాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు[4][5]. కాళేశ్వరం లో కాశీ పండితులతో త్రివేణి సంగమ తీరానికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి అయిన దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజారా మయ్యర్, కమిషనర్ వెంకట్రావ్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణరేతో కలిసి మంత్రి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని జ్ఞానసరస్వతీ ఘాట్లను సందర్శించారు. పనుల పురోగతి గురించి తెలుసుకుని మెట్లు నిర్మాణం, సరస్వతి విగ్రహ నిర్మాణం, జ్ఞానదీపం ఏర్పాటు పనులు, తీర ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం టెంట్ సిటీ కాటేజీలో వివిధ శాఖల అధి కారులతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతున్న సందర్భంగా ఏర్పాట్ల విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఇబ్బం దులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.


ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో ఇటీవల నిర్వహించిన కుంభమేళా మాదిరిగానే ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణను చేపడుతూ టెంట్సిటీలను నెలకొల్పుతోంది. పుష్కరాలకు వచ్చే భక్తులు హెలికాఫ్టర్లో ఆహ్లాదంగా విహరిం చేందుకు జాయైడ్లను ఏర్పాటు చేస్తోంది. నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశంలో ఎక్కడా లేని విదంగా ఒకే పాన వట్టంపై రెండు తీశ్వరస్వామి శివలింగాలు (కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి) ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒక్కటే ఈ రెండు లింగా లకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండటంతో త్రివేణి సంగమ తీరానికి హారతి ఏర్పాట్ను పరిశీలించారు. సీఎం ఈ నెల 15న జ్ఞానసరస్వతీ ఘాట్లను హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, నది తీరాన ఏర్పాటుచేస్తున్న సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు. పుష్కర మహోత్స వాల్లో రెండో రోజున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మిగిలిన రోజుల్లో గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

నదులు రాశి చక్ర గుర్తులు

[మార్చు]

భారతదేశం లో ఉన్న నదులకు హిందూ మతం సనాతన ధర్మం ప్రకారం 12 సంవత్సరాలకు ఒకసారి నదు లకు ప్రత్యేక పండుగలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఒక్క పుస్కరము ఒక రాశి చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది.

నదులు రాశి చక్రాలు
గంగ మేష రాశి
యమునా కర్కాటక రాశి
సరస్వతి మిథున రాశి
నర్మదా వృషభ రాశి
గోదావరి సింహ రాశి
క్రిష్ణా కన్యా రాశి
కావేరి తుల రాశి
భీమా వృశ్చిక రాశి
తుంగభద్ర మకర రాశి
సింధూ కుంభ రాశి
ప్రాణహిత మీనా రాశి
తపతి ధనుస్సు రాశి

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రాణహిత పుష్కరాలు

గోదావరి నది పుష్కరం

కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం

మూలాలు

[మార్చు]
  1. Telugu, ntv (2025-05-13). "Saraswati Pushkaralu: ఈ నెల 15 నుంచి 26 వరకు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు." NTV Telugu. Retrieved 2025-05-13.
  2. ABN (2025-04-15). "Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే." Andhrajyothy Telugu News. Retrieved 2025-05-13.
  3. Velugu, V6 (2025-05-11). "కాళేశ్వరంలో పుష్కరశోభ.. మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలు". V6 Velugu. Retrieved 2025-05-13.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "మే 15 నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు". telugu.news18.com. 2025-05-13. Retrieved 2025-05-13.
  5. Bureau, The Hindu (2025-03-20). "Telangana gears up for Saraswati Pushkaralu 2025 with New App". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2025-05-13. {{cite news}}: |last= has generic name (help)