సరస్వతి (2026 సినిమా)
| సరస్వతి (2026 సినిమా) | |
|---|---|
సినిమా విడుదల పోస్టర్ | |
| దర్శకత్వం | వరలక్ష్మి శరత్ కుమార్ |
| స్క్రీన్ ప్లే | వరలక్ష్మి శరత్ కుమార్ |
| కథ | సాయి మాధవ్ బుర్రా |
| ఎగ్జిక్యూటివ్ నిర్మాత | ఆంటోని ప్రవీణ్ డేనియల్ |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | ఎడ్విన్ సకాయ్ |
| కూర్పు | వెంకట్ రాజన్ |
| సంగీతం | థమన్ |
| ఆర్ట్ డైరెక్టర్ | సుధీర్ మాచర్ల |
విడుదల తేదీ | 2026 మార్చి 6 |
| దేశం | |
సరస్వతి 2026లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. దోశ డైరీస్ బ్యానర్‌పై పూజా శరత్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాకు వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించింది.[2] వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి,[3] సినిమాను మార్చి 6న విడుదల చేశారు.[4][5]
నటీనటులు
[మార్చు]- వరలక్ష్మి శరత్ కుమార్[6]
- ప్రకాష్ రాజ్
- ప్రియమణి
- నాజర్
- మురళీ శర్మ
- రాధిక
- రావు రమేశ్
- తులసి
- సప్తగిరి
- శ్రీకాంత్ అయ్యంగర్
- మైమ్ గోపి
- హరీశ్ పేరడీ
- రఘుబాబు
- గెటప్ శ్రీను
- వెంకట్
- నివేక్ష
- ప్రమీలా రాణి
వివాదం
[మార్చు]సినీ రచయిత సాయిమాధవ్ బుర్రా సోషల్ వేదికగా “నా కథతో మొదలై వేరే కథతో ముగిసింది. ఒక్క మాట చెప్పకుండా కథను పూర్తిగా మార్చేశారు. నా కథని మానభంగం చేశారు. నేను రాసింది రివెంజ్ డ్రామా కాదు. అసలు కథకు వేరే ఆత్మ ఉంది” అంటూ పోస్ట్ చేశాడు.[7] అయితే వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందిస్తూ సాయిమాధవ్ బుర్రా అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, కథను కాపీ చేశారన్న ఆరోపణలను ఆమె ఖండించింది. ఆయన నుంచి డబ్బులు ఇచ్చి కథ హక్కులు తీసుకున్న తర్వాత అది నా కథ అవుతుందని, కథను సినిమాగా తీర్చిదిద్దే సమయంలో కొన్ని మార్పులు అవసరం అవుతాయని తెలిపింది. అందులోని ప్రధాన ఆలోచనను తీసుకుని నేను స్క్రీన్‌ప్లేను మార్చుకున్నాను” అని వివరించింది. కథ హక్కులను కొనుగోలు చేసినప్పటికీ, గౌరవ సూచకంగా సినిమా టైటిల్స్‌లో సాయి మాధవ్ బుర్రా పేరును కథా రచయితగా వేశామని తెలిపింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ "ఉత్కంఠతో సాగే ప్రయాణం". NT News. 4 March 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
- ↑ "దర్శకురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్.. టైటిల్ పోస్టర్ రిలీజ్". NTV Telugu. 27 September 2025. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
- ↑ "ప్రతి అమ్మాయి 'సరస్వతి'లా ఉండదు.. మిస్టరీగా వరలక్ష్మి సినిమా ట్రైలర్!". BigTvLive. 21 February 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
- ↑ "ఎస్ సరస్వతి రివ్యూ: దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటి అడుగు - సినిమా హిట్టేనా?". ABP Desam. 6 March 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
- ↑ "రివ్యూ: ఎస్.సరస్వతి.. వరలక్ష్మి శరత్‌కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్ మెప్పించిందా?". Eenadu. 6 March 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
- ↑ "సరస్వతిగా వరలక్ష్మి". NT News. 28 September 2025. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
- ↑ "సాయి మాధవ్ బుర్రా: నా కథను మానభంగం చేశారు." Chitrajyothy. 6 March 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
- ↑ "వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం.. కథను మార్చారా? అసలు ఏం జరిగింది?". ABP Desam. 7 March 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.