సరిదె మాణిక్యమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సరిదె మాణిక్యమ్మ (1921-200?) సంగీతకారిణి, నాట్యకళాకారిణి, నాట్యవేత్త[1].

తొలినాళ్ళ జీవితం, అభ్యాసం[మార్చు]

సరిదె మాణిక్యమ్మ 1921 సంవత్సరంలో బల్లిపాడు గ్రామంలో సరిదె సన్యాసి, గౌరమ్మలకు జన్మించారు. వారి కుటుంబంలో వంశానుగతంగా దేవనర్తకి బాధ్యతలు సంక్రమిస్తూంటాయి. మాణిక్యమ్మ సంగీత నృత్యాలను అభ్యసించడం ఐదవ సంవత్సరంలో తన నాన్నమ్మ సరిదె శేషాచలం వద్ద ప్రారంభించారు. అయితే సంప్రదాయికంగా సంగీత నాట్యాలు అభ్యసించి చిన్నతనంలోనే దేవదాసిగా బల్లిపాడు వేణుగోపాలస్వామి ఆలయానికి అంకితమయ్యారు. తర్వాతికాలంలో దేవదాసీలు ఆలయాల్లో నాట్యం చేయడాన్ని, ఆలయమాన్యాన్ని అనుభవించడాన్ని నిషేధిస్తూ వచ్చిన చట్టాల కారణంగా జీవనోపాధి, నృత్యోపాసనకు అవకాశం కోల్పోయారు. 1971లో జరిగిన అభినయ సదస్సులో ఆమె గానం చేస్తూ, అభినయించిన ఆధ్యాత్మ రామాయణ కీర్తనల నృత్యప్రదర్శన చూసిన నటరాజ రామకృష్ణ, అన్నాబత్తుల బులివేంకటమ్మలను ఆ ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. వారి ప్రోత్సాహంతో

మూలాలు[మార్చు]