Jump to content

సరూర్‌నగర్ చెరువు

వికీపీడియా నుండి
సరూర్‌నగర్ చెరువు
స్థానంహైదరాబాద్, తెలంగాణ
నిర్దేశాంకాలు17°21′21″N 78°31′38″E / 17.35584°N 78.52714°E / 17.35584; 78.52714
రకంసహజ చెరువు
పరీవాహక దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం99 ఎకరాలు (40 హెక్టార్లు)
గరిష్ట లోతు6.1 మీటర్లు (20 అడుగులు)
ప్రాంతాలుహైదరాబాద్

సరూర్‌నగర్‌ చెరువు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్‌నగర్‌ సమీపంలోవున్న చెరువు.[1] 16వ శతాబ్దం 1626లో కులీ కుతుబ్‌షా పాలనాకాలంలో తాగునీటి అవసరాలకు, పంటపొలాలకు నీరందించేందుకు సరూర్‌నగర్‌ చెరువు కట్టించబడింది.

చరిత్ర

[మార్చు]

హైదరాబాదులోని ఐదు ప్రధాన జలాశయాలలో ఒకటైన ఈ సరూర్‌నగర్‌ చెరువు 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది 99 ఎకరాల విస్తీర్ణం (40 హెక్టార్లు) లో 6.1 మీటర్లు (20 అడుగులు) గరిష్ఠ లోతు కలిగివుంది.

గణేష్ నిమజ్జనం

[మార్చు]

2001 నుండి ఈ చెరువులో నిమజ్జనానికి శ్రీకారం చుట్టారు. 2004 నుండి కేన్లు అందుబాటులోకి తెవడంతో అప్పటినుండి భారీ విగ్రహాల్ని ఇక్కడే నిమజ్జనం చేయడం మొదలుపెట్టారు.[2]

బోటింగ్

[మార్చు]

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రియదర్శిని పార్కులో ఏర్పాటుచేసిన సరూర్‌ నగర్‌ చెరువు బోటింగ్ కేంద్రాన్ని 2021, డిసెంబరు 23న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు. 4 నూతన బోటులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 17 December 2017.
  2. ↑ ఈనాడు. "నిమజ్జన మహా గణం". Archived from the original on 11 జనవరి 2018. Retrieved 17 December 2017.
  3. ↑ Telugu, Tnews (2021-12-23). "సరూర్‌నగర్‌ చెరువులో బోటింగ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్". TNews Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-28. Retrieved 2022-01-28.