Jump to content

సర్కారు వారి పాట

వికీపీడియా నుండి
సర్కారు వారి పాట
దర్శకత్వంపరశురామ్
రచనపరశురామ్
నిర్మాత
  • నవీన్ యెర్నేని
    వై. రవిశంకర్
    రామ్ ఆచంట
    గోపి ఆచంట
తారాగణంమహేష్ బాబు
కీర్తి సురేష్
ఛాయాగ్రహణంఆర్. మది
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
మైత్రి మూవీ మేకర్స్
జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్
14 రీల్స్ ప్లస్
విడుదల తేదీ
12 మే 2022 (2022-05-12)
దేశం భారతదేశం
భాషతెలుగు

సర్కారు వారి పాట తెలుగులో రూపొందిన వినోదాత్మక చిత్రము .[1][2][3] మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటించారు. ఈ సినిమా 2022 మే 12న విడుదల అయ్యింది.[4]

నటీనటులు

[మార్చు]
  • మహేష్ బాబు
  • కీర్తి సురేష్
  • వెన్నెల కిషోర్
  • సుబ్బరాజు
  • మాధవన్
  • పాటలు
  • కళావతి , సిద్ శ్రీరామ్ , రచన: అనంత శ్రీరామ్
  • సర్కార్ వారి పాట (టైటిల్ సాంగ్ ) నారాయణ్ , రచన: అనంత్ శ్రీరామ్.
  • మ మ మహేశా , శ్రీకృష్ణ, జోనిత గాంధీ , రచన : అనంత శ్రీరామ్.
  • మురార వా , శ్రీకృష్ణ, శ్రుతి , రంజని, గాయత్రి , రచన: అనంత్ శ్రీరామ్ .
  • సర్కార్ వారి పాట,( రాపో సాంగ్) నారాయణ్ మహా, శ్రావణ భార్గవి, మనీషా, ప్రత్యూష , శ్రీ సౌమ్య, శృతి రంజని, రచన: మహా హారిక నారాయణ్.
  • పెన్నే ,నాకేశ్ అజీజ్ , రచన : అనంత శ్రీరామ్.

సాంకేతిక నిపుణులు

[మార్చు]

చిత్రీకరణ వివరాలు

[మార్చు]

'సర్కారు వారి పాట' సినిమా 2020 నవంబరు 21న హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని కాశీ విశ్వనాధ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సీతార క్లాప్ కొట్టగా, నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేసింది. 2021 జనవరి మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.[6][7] ఈ చిత్రం దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది.[8] రెండో షెడ్యూల్ 2021 ఏప్రిల్ 15వ తేదీ నుండి మొదలుపెట్టారు, యూనిట్‌లో ఒకరు కరోనా బారిన పడటంతో వాయిదా పడింది.[9] ఈ షెడ్యూల్ ను 25 రోజుల పాటు చేయాలనుకున్నారు. 2021 జూలై లో చిత్రీకరణ పునఃప్రారంభించబడి, 2022 ఏప్రిల్ పూర్తయింది. గోవా, స్పెయిన్‌లలో చిత్రీకరణ జరిగింది. సినిమాకు సంగీతం ఎస్. థమన్ స్వరపరిచాడు, సినిమాటోగ్రఫీ ఆర్. మధి, ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్ అందించారు. మొదట 2022 జనవరి 13న విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమయి వాయిదా పడింది. 2022 మే 12న థియేటర్లలో విడుదలైంది.

స్పందన

[మార్చు]

ఈ సినిమా రివ్యూలతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు చెందిన నీషితా న్యాయపతి ఈ చిత్రానికి 2.5/5 రేటింగ్ ఇచ్చింది. "సర్కారు వారి పాట కమర్షియల్ డ్రామాగా మిగిలిపోయింది. మహేష్, కీర్తి నటన ఆకట్టుకుంటుంది" అని రాసింది.[10] పింక్‌విల్లాకు చెందిన అరవింద్ ఈ చిత్రానికి 2.5/5 రేటింగ్ ఇచ్చాడు."ఈ చిత్రం చూడదగినది" అని రాశాడు.[11] "మహేష్ బాబు, కీర్తి సురేష్ లు కొత్తగా ఆకట్టుకున్నారు" అని ది హిందుస్థాన్ టైమ్స్‌కి చెందిన హరిచరణ్ పూడిపెద్ది పేర్కొన్నాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. K., Janani (1 March 2022). "Mahesh Babu looks dashing in Maha Shivaratri special poster of Sarkaru Vaari Paata". India Today. Sarkaru Vaari Paata is an action-comedy
  2. "US release of Mahesh Babu-starrer 'Sarkaru Vaari Paata' on May 11". The Siasat Daily. 2022-04-03. Telugu Superstar Mahesh Babu's much-hyped action comedy 'Sarkaru Vaari Paata'
  3. "Sarkaru Vaari Paata trailer out: Mahesh Babu showcases his action-comedy avatar". The New Indian Express. 2022-05-02.
  4. 10TV (29 January 2021). "సర్కారు వారి పాట | Sarkaru Vaari Paata Sankranthi 2022". 10TV (in telugu). Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. "Sarkaru Vaari Paata First Single Promo is Out". Moviezupp. 2022-02-11. Retrieved 2022-02-12.
  6. HMTV (21 November 2020). "మొదలైన మహేష్ బాబు 'సర్కారు వారి పాట'!". www.hmtvlive.com. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  7. Sakshi (22 November 2020). "క్లాప్‌ క్లాప్‌... సితార". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  8. Sakshi (4 February 2021). "ఫొటో వైరల్‌: వాటే డైరెక్టర్‌!". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  9. Namasthe Telangana (19 April 2021). "మొద‌లైన నాలుగు రోజుల‌కే ఆగిన స‌ర్కారు వారి పాట షూటింగ్". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  10. "Sarkaru Vaari Paata Movie Review: Mahesh and Keerthy shine in this half-baked drama". The Times Of India. Retrieved 12 May 2022.
  11. "Sarkaru Vaari Paata Movie Review: Mahesh Babu's entertainment makes up for plain writing". Pinkvilla. Archived from the original on 12 మే 2022. Retrieved 12 May 2022.
  12. "Sarkaru Vaari Paata review: Mahesh Babu's film checks all the boxes of a commercial entertainer". The Hindustan Times. Retrieved 12 May 2022.