సర్గమ్ కౌశల్
మిసెస్ వరల్డ్ సర్గమ్ కౌశల్ | |
---|---|
జననం | |
విద్య | ఆంగ్లంలో మాస్టర్ డిగ్రీ |
విద్యాసంస్థ | జమ్మూ విశ్వవిద్యాలయం |
వృత్తి |
|
జీవిత భాగస్వామి | ఆదిత్య మనోహర్ శర్మ |
తల్లిదండ్రులు |
|
సర్గమ్ కౌశల్ (జననం 1990 సెప్టెంబరు 20) భారతీయ ఉపాధ్యాయురాలు, మోడల్. ఆమె మిసెస్ వరల్డ్ 2022 టైటిల్‌ను గెలుచుకున్న రెండవ భారతీయ మహిళ. దేశానికి 21 సంవత్సరాల తర్వాత ప్రఖ్యాత అందాల కిరీటం తిరిగి తెచ్చిపెట్టినందుకు ఆమె ప్రసిద్ధిచెందింది.[1]
బాల్యం
[మార్చు]సర్గమ్ కౌశల్ 1990 సెప్టెంబరు 20న భారతదేశంలోని జమ్మూకశ్మీర్‌లో రీమా ఖజురియా, జి.ఎస్ కౌశల్ దంపతులకు జన్మించింది. ఆమెకు మంథన్ కౌశల్ అనే తమ్ముడు ఉన్నాడు.
కెరీర్, మిసెస్ వరల్డ్ గా ప్రస్థానం
[మార్చు]జమ్మూ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రభుత్వ కళాశాల నుండి బి.ఇడి పూర్తిచేసిన సర్గమ్ కౌశల్ విశాఖపట్నంలో కొంతకాలం ఉపాధ్యాయురాలుగా పనిచేసింది.[2] ప్రస్తుతం ఆమె ముంబైలో స్థిరపడి క్యాన్సర్ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది.
సర్గమ్ కౌశల్ మిసెస్ ఇండియా వరల్డ్ 2022 అందాల పోటీలో పాల్గొంది. ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ 2022 జూన్ 15న ముంబైలో జరగగా దేశవ్యాప్తంగా మొత్తం 51 మంది పోటీదారులు పాల్గొన్నారు. అనేక రౌండ్‌ల తర్వాత సర్గమ్ కౌశల్ మిసెస్ ఇండియా వరల్డ్ 2022గా నిలిచింది.[3]
ఇక అంతర్జాతీయ అందాల పోటీ విషయానికి వస్తే వివాహిత మహిళల కోసం మిసెస్ వరల్డ్ అందాల పోటీలు 1984 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో మిసెస్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్ అని పేరు ఉండగా ఆ తర్వాత దాన్ని 1988లో మిసెస్ వరల్డ్ గా మార్చారు. 2001లో భారత్‌కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకుంది. కాగా అమెరికాలోని లాస్‌వేగాస్‌లో 2022 డిసెంబరు 17 (భారతకాలమానం ప్రకారం)న జరిగిన మిసెస్ వరల్డ్ 2022 పోటీల్లో విజేతగా నిలిచిన సర్గమ్ కౌశల్ కు 2021లో మిసెస్ వరల్డ్ విజేత అమెరికాకు చెందిన షాయలిన్ ఫోర్డ్ ఈ కిరీటాన్ని అందజేసింది. ఆమె గులాబీ రంగు గౌను, అందమైన క్రిస్టల్ చెవిపోగులు ధరించింది. ఆమె కాస్ట్యూమ్‌ని భావనా రావు డిజైన్ చేశారు. ఈ పోటీల్లో మొత్తం 64 దేశాల నుండి పాల్గొనగా మిసెస్ పాలినేషియా తొలి రన్నరప్‌గా, మిసెస్ కెనడా రెండో రన్నరప్‌గా నిలిచారు.
వ్యక్తిగతం
[మార్చు]సర్గమ్ కౌశల్ ఇండియన్ నేవీ ఆఫీసర్ అయిన ఆదిత్య మనోహర్ శర్మని 2018లో వివాహం చేసుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Mrs World 2022: 'మిసెస్ వరల్డ్ 2022'గా సర్గం కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం | Indian lady Sargam Koushal wins Mrs World 2022 psnr". web.archive.org. 2022-12-19. Archived from the original on 2022-12-19. Retrieved 2022-12-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Vaid, Kritika (2022-12-19). "Meet Sargam Koushal, a Teacher by Profession Who's Now Mrs. World 2022, Know Her Education, Family, Other Deets". Zee Media (in ఇంగ్లీష్). Retrieved 2022-12-19.
- ↑ "Mrs India World 2022, Mrs India World, Mrs India World 2022 News: Sargam Koushal Bags The Title Of Mrs India World 2022". web.archive.org. 2022-12-19. Archived from the original on 2022-12-19. Retrieved 2022-12-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)