సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Banking in the United States

ఎ సర్టిఫికేట్ అఫ్ డిపాజిట్, USA, 1932

సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ లేదా CD అనేది బ్యాంకులు, పొదుపు సంస్థలు మరియు రుణ సంఘము లు, వారి వినియోగదారులకు ఇచ్చేటటువంటి ఒక కాల పరిమితి కలిగిన బంధకము.

CDలు పొదుపు ఖాతాలను పోలియుంటాయి. ఇవి బీమా చేయబడటం వలన ఎటువంటి భయాలూ కలిగియుండవు. ఇవి బ్యాంకులో ఉన్న డబ్బు వంటివే. బ్యాంకులకు FDIC ద్వారా మరియు రుణ సంఘాలకు NCUA ద్వారా బీమా సౌకర్యము అందించబడుతుంది. ఈ CDలకు మరియు పొదుపు ఖాతాలకు భేదము ఉంది. CDలు ఒక నిర్దిష్టమైన కాలపరిమితి (సాధారణముగా మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఒకటి నుండి ఐదు సంవత్సరాలు) మరియు స్థిరమైన వడ్డీ రేటు కలిగియుంటాయి. CDలను వాటి యొక్క కాలపరిమితి ముగిసే వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత ఆ మొత్తము వడ్డీతో సహా వెనక్కు తీసుకొనవచ్చు.

అవసరానికి తీసుకోనగలిగే వీలు ఉన్న పొదుపు ఖాతాలలో ఉంచిన డబ్బుకంటే నిర్ణీత కాల పరిమితి వరకు డబ్బును డిపాజిటుగా ఉంచినందుకుగాను సంస్థలు ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తాయి. అయితే ఈ పరిస్థితి యీల్డ్ కర్వ్ సందర్భంలో ఉండదు. స్థిరమైన రేట్లు సాధారణమే అయినా కొన్ని సంస్థలు CDలకు వివిధ రకములైన చంచల రేట్లు ఇస్తాయి. ఉదాహరణకు మధ్య-2004లో వడ్డీ రేట్లు పెరుగుతాయని ఊహించి బ్యాంకులు మరియు రుణ సంఘాలు CDలను "బంప్-అప్" ప్రత్యేకతలతో అందించాయి. దీనివలన వినియోగదారుడు CD యొక్క కాల పరిమితి ఎంచుకొనేటప్పుడు వడ్డీ రేటును ఒకేసారి సర్దుబాటు చేసుకునే వీలు ఉంటుంది. కొన్నిసార్లు CDలను స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెట్ మరియు ఇతర సూచికలతో ప్రవేశపెడతారు.

వడ్డీ రేట్లకు కొన్ని సాధారణమైన సూచనలు:

 • అధిక మూలధనం పై ఎక్కువ వడ్డీ రావచ్చు. కాని రాకపోనూవచ్చు.
 • ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్ల పై అధిక వడ్డీ వస్తుంది కాని యీల్డ్ కర్వ్ పరిస్థితిలో మాత్రము రాదు (అంటే ఆర్థిక మాంద్యము ముందు తప్ప)
 • పెద్ద సంస్థల కంటే చిన్న సంస్థలు ఎక్కువ వడ్డీని ఇచ్చుటకు ముందుకొస్తాయి.
 • వ్యాపారపరమైన CD ఖాతాలకంటే వ్యక్తిగత CD ఖాతాల పై వడ్డీ ఎక్కువ వస్తుంది.
 • FDIC లేక NCUA నుండి భీమ సౌకర్యం పొందని బ్యాంకులు మరియు రుణ సంస్థలు ఎక్కువ వడ్డీ ఆశచూపుతాయి.

CDలు ఎలా పనిచేస్తాయి.[మార్చు]

CDలకు సాధారణంగా కనీస డిపాజిటు అవసరమౌతుంది. అధిక డిపాజిటుకు అధిక వడ్డీ వస్తుంది. USలో కనీస డిపాజిటు $ 100,000 కలిగుయున్న "జంబో CD" లపై ఉత్తమమైన వడ్డీలు ఇవ్వబడతాయి. దీనికి భిన్నంగా కొన్ని సంస్థలు "జంబో CD" లపై తక్కువ వడ్డీని అందిస్తాయి. CD ను తెరిచిన వినియోగదారునికి పాస్బుక్ కాని కాగితపు ధ్రువపత్రము కాని ఇవ్వబడుతుంది. అయితే ఇప్పుడు CD ఒక పద్దు పుస్తకములో జమగా వ్రాయబడుతోంది. ఇది వినియోగదారుని యొక్క బ్యాంకు స్టేట్మెంట్ లో చూపించబడుతుంది. అంటే "ద్రువపత్రము" అనేది ఉండదు.

వడ్డీ చెల్లింపులు[మార్చు]

చాలా సంస్థలలో CD కొనుగోలుదారుడు వడ్డీని నియమిత కాలంలో చెక్కు రూపంలో అందుకోనుటకు కాని చెకింగ్ మరియు పొదుపు ఖాతాలోనికి జమ అయ్యేటట్టుగా కాని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన వడ్డీతో కలిపి రానందున మొత్తము పైకము తగ్గుతుంది. కొన్ని సంస్థలు ఈ సదుపాయం ఉపయోగించుకొనే అవకాశం CD తెరిచే సమయంలోనే ఇస్తాయి.

CD యొక్క ముగింపు[మార్చు]

నియమిత కాల పరిమితి ముగిసే లోపల పైకమును తీయడం వలన ఎంతో కొంత జరిమానా విధించబడుతుంది. ఐదు-సంవత్సరాల CDకి, ఆరు నెలల వడ్డీ నష్టమౌతుంది. ఈ జరిమానాలు విధించబడటం వలన కాలపరిమితికి ముందే పైకము తీసుకోవడం వినియోగదారుడికి లాభదాయకం కాదు. సాధారణంగా వినియోగదారుడు వేరే పెట్టుబడులలో ఎక్కువ రాబడి ఉన్నట్లయితే కాని పైకము అత్యంత అవసరమైతే కాని కాలపరిమితి ముగియక ముందే పైకమును తీయడు.

CD కాల పరిమితి ముగిసే సమయానికి కొద్ది రోజుల ముందు సంస్థలు వినియోగదారునికి తదుపరి నిర్దేశనల కై నోటీసు పంపుతారు. ఈ నోటీసు సాధారణంగా వినియోగదారునికి మూలధనము మరియు పోగైన వడ్డీని తీసుకొనుటకు లేదా "రోలింగ్ ఇట్ ఓవర్" అంటే దాన్ని కొత్త CDగా డిపాజిట్ చేయుటకు కాని అవకాశము ఇస్తుంది. సాధారణంగా, CD పక్వత సమయం తరువాత ఒక "గవాక్షము" అనుమతిస్తారు. దీని ద్వారా ఖాతాదారుడు CD నుండి జరిమానా లేకుండా పైకము తీసుకొనవచ్చును. ఎటువంటి నిర్దేశనలు లేని పక్షంలో సంస్థలు సాధారణంగా ఆ మొత్తాన్ని మళ్ళీ నియమిత కాలపరిమితికి కొత్త CDగా డిపాజిట్ చేస్తాయి (ఒకవేళ వినియోగదారుడు CD తెరిచే సమయంలో CDని రోల్ చేయొద్దని చెప్పినా కూడా).

CD రీఫైనాన్స్[మార్చు]

US లో, ట్రూత్ ఇన్ సేవింగ్స్ రెగులేషన్స్ DD ఖాతా తెరిచే సమయంలో మరియు జరిమానాతో సహా కాలపరిమితికి ముందే పైకము తీసుకునే సమయంలో బీమా చేయబడ్డ CD లను పేర్కొనవలసి ఉంటుంది. ఈ జరిమానాలు కాలపరిమితి ముందే సంస్థలు సవరించలేవు.[ఉల్లేఖన అవసరం] వినియోగదారులు కాలపరిమితి ముందే ఖాతాదారుడు పైకము తీసుకోనకుండా ఈ జరిమానాలు నివారిస్తాయి. తద్వారా CD యొక్క కాల పరిమితి ముగిసిన తరువాత మొత్తం పైకం తీసుకొని ఖాతాదారుడు లాభాపడతాడు. అయితే పెరుగుతున్న వడ్డీ రేట్లు ఖాతాదారున్ని కాలపరిమితికి ముందే పైకము తీసుకొనడాన్ని నివారించలేకపోతున్నాయి. ఈ జరిమానాలు కట్టి పైకము తీసుకొని ఖాతాదారుడు అధిక వడ్డీ CDలలో మరోసారి పెట్టుబడి పెడుతున్నాడు. ఈ కొత్త అధిక వడ్డీ CD నుండి లభించిన లాభం పరిమితికి ముందే తీసుకోనినందుకు కట్టిన జరిమానా కంటే ఎక్కువ.

నిచ్చెనలు[మార్చు]

ఈ పెరుగుతున్న రేట్ల క్రమములో ఒక వైపు దీర్ఘకాలిక పెట్టుబడులు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంటే మరొకవైపు ఈ దీర్ఘకాలికాలు ఎక్కువ వడ్డీ రేట్లను అందుకునే అవకాశాలను నివారిస్తున్నాయి. ఈ ఆపర్ట్యునిటీ కాస్ట్ ప్రక్రియకు ఉపశమనముగా ఉన్నదే "CD లాడర్" యుక్తి. ఈ లాడర్ యుక్తులలో, పెట్టుబడిదారుడు పైకాన్ని అత్యధిక వడ్డీ వచ్చే విధంగా వివిధ దీర్ఘ కాలిక డిపాజిట్లలో ఉంచి అధిక లాభం పొందే విదంగా చూసుకుంటాడు. అంతే కాకుండా వీటిలో కొంత భాగం ప్రతి ఏడాది పక్వమయ్యేలా చూస్తాడు. ఈ విధంగా చేయడం వలన మదుపుదారుడు దీర్ఘకాలిక లాభాలను పొందడమే కాకుండా పైకాన్ని తక్కువ నిడివిలో వెనక్కి తీసుకుని తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.

ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు 3 సంవత్సరాల స్ట్రాటెజీ మొదలుపెడితే, అతను పైకాన్ని మూడు సమ భాగాలుగా 3 సంవత్సరాల, 2 సంవత్సరాల మరియు 1 సంవత్సర CDలలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనివలన ప్రతి ఏడు ఒక CD పక్వానికి వస్తుంది. దీనిని అతను తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విధంగా రెండు సంవత్సరాల తరువాత, పెట్టుబడిదారుడు తన పైకం మొత్తాన్ని మూడు సంవత్సరాల వడ్డీ రేటుకు డిపాజిట్ చేసి ఉంటాడు. అయినా ప్రతి ఏడాది మూడవ వంతు డిపాజిట్ పక్వానికి వస్తుంది. దీనిని అతను తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు, అభివృద్ధి చేయవచ్చు లేకపోతే వెనక్కి తీసుకోవచ్చు.

ఈ లాడర్ నిర్వహణా బాధ్యత పెట్టుబడిదారుడి పైనే ఉంటుంది. ఆర్థిక సంస్థలకు ఎటువంటి బాధ్యత ఉండదు. ఈ లాడర్ ఆర్థిక సంస్థల పై ఆధారితం కాదు కనుక పెట్టుబడిదారుడు తనకు అనుకూలమైనట్టుగా ఒక బ్యాంకు కంటే ఎక్కువగా తనకు లాభాముండు విధంగా పెట్టుబడులు పెట్టవచ్చు. పెద్ద బ్యాంకులు నిర్వహిస్తున్నట్టుగా చిన్న బ్యాంకులలో దీర్ఘకాలిక పధకాలు ఉండకపోవచ్చు. ఈ లాడరింగ్ విధానము CDలలో ఎక్కువగా ఉన్నప్పటికీ ఒకే రకమైన లక్షణాలు కలిగి కాల పరిమితి కలిగిన ఏ ఖాతాలకైనా ఇది ఉపయోగించవచ్చు.

డిపాజిట్ భీమా[మార్చు]

USలో ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి కాని కుటుంబానికి కాని ఖాతాలు నిర్వహించే విధానం పై బీమా విలువ ఆధారపడియుంటుంది. బీమా పరిధి FDIC మరియు NCUAల నియమావళి ప్రకారము నిర్దేశింపబడుతుంది. ఈ నియమావళి FDIC మరియు NCUA పుస్తక ప్రతులలో కాని ఇంటర్నెట్ లో కాని లభిస్తుంది. బీమా ప్రామాణిక పరిధి ప్రస్తుతము వ్యక్తిగత ఖాతాలైతే ఖాతాదారుడికి లేదా పెట్టుబదిదారుడికి $250,000 మరియు ఉమ్మడి ఖాతాలైతే సహ ఖాతాదారుడికి $250,000.

కొన్ని సంస్థలు ప్రభుత్వ సహాయము కలిగిన FDIC మరియు NCUA డిపాజిట్ బీమా కాకుండా ప్రైవేట్ భీమ సంస్థల ద్వారా బీమా సౌకర్యం కలిగిస్తాయి. కొన్ని సంస్థలు రెండు విధాలుగా బీమా సౌకర్యం కలిగిస్తాయి. వినియోగదారులకు అదనపు ఖర్చు భరించు సమతుల్యమైన నిలువలు కనుక ఉంటే సంస్థలు ప్రైవేట్ సంస్థల ద్వారా బీమా ఉపయోగించుట మానుకుంటాయి.

సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్ రిజిస్ట్రి సర్వీస్ కార్యక్రమము పెట్టుబడి దారులకు $50 మిలియన్ల వరకు పెట్టుబడి CDలలో ఒక బ్యాంకు ద్వారా ఉంచుకొనుటకు పూర్తి FDIC బీమా కల్పిస్తుంది.[1] అయితే రేట్లు అత్యధికంగా ఉండవు.

నియమాలు మరియు నిబంధనలు[మార్చు]

CD లకు సంబంధించి నియమ నిబంధనలలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి.

USలో, CD కొనుగోలు సమయములో ప్రభుత్వపరంగా "ట్రూత్ ఇన్ సేవింగ్స్" పుస్తకప్రతి మరియు CD యొక్క నియమాలను తెలిపే ఇతర దస్తావేజు అందించవలసి ఉంటుంది. సంస్థల యొక్క ఉద్యోగస్తులకు సాధారణంగా ఈ విషయాలు తెలిసి ఉండవు. వ్రాతప్రతి లాంటి దస్తావేజు మాత్రమే న్యాయపరమైన విలువ కలిగి ఉంటుంది. ఒకవేళ అసలు సంస్థ వేరొక సంస్థతో విలీనం అయినా లేదా కొనుగోలుదారుడు CD ని ముందుగానే ముగించినా లేదా మరే ఇతర విషయం కొరకైనా, కొనుగోలుదారుడు నియమ నిబంధనల దస్తావేజును పరిశీలించి పైకము వెనక్కు తీసుకొనుట వోప్పందము యొక్క నియమాల ప్రకారమే జరిగినదని నిర్ధారించుకోవాలి.

 • CD వెనక్కి మళ్ళించవచ్చు. నియమాల ప్రకారము బ్యాంకు కాని రుణ సంఘము కాని CDని పరిమితి ముందే మూసివేయవచ్చు.
 • వడ్డీ చెల్లింపు . వడ్డీని ఎప్పటికప్పుడు చెల్లించవచ్చు లేదా CDలో పోగుచేయవచ్చు.
 • వడ్డీ లెక్కింపు. CD పై వడ్డీ డిపాజిట్ చేయబడిన రోజు నుండి కాని ఆ మరుసటి నెల లేదా త్రైమాసికము నుండి కాని లెక్కించవచ్చు.
 • ఉపసంహరణ ఆలస్యం చేసే హక్కు. బ్యాంక్ రన్ ను ఆపేందుకు సంస్థలకు కొంత నిర్దిష్టమైన సమయం వరకు పైకము యొక్క ఉపసంహరణ ఆలస్యం చేసే హక్కు ఉంటుంది.
 • మూలదనం యొక్క ఉపసంహరణ. ఇది ఆర్థిక సంస్థల యొక్క ఇష్ట ప్రకారము చేయవచ్చు. మూలధనం మొత్తంగా గాని, కొంత భాగము కాని ఉపసంహరించే సమయంలో CD ఖాతాను మొత్తంగా మూసివేయవలసి రావచ్చు. US వ్యక్తిగత రిటైర్మెంట్ ఖాతా CD IRA రిక్వైర్డ్ మినిమం డిస్ట్రిబ్యూషన్స్ ఉపసంహరణను ఎటువంటి జరిమానా లేకుండానే అనుమతించవచ్చు.
 • వడ్డీ ఉపసంహరణ. CD ఖాతా తెరిచిన సమయం నుండి పోగైన వడ్డీని గాని, అప్పటి వడ్డీ చెల్లింపును కాని ఉపసంహరించుటకు అనుమతించవచ్చు. వడ్డీని ఉపసంహరణ తేది వరకు గాని, ఆ నెల లేక త్రైమసికంవరకు కాని గణించవచ్చు.
 • ముందస్తు ఉపసంహరణకు జరిమానా. ఇది, వడ్డీ నెలల ప్రకారము కాని పైకము యథారీతిగా ఉంచుటకుగాను సంస్థ వెచ్చించిన వేల రూపకంగా గాని లేదా వేరే ఎ విధమైన సూత్రము ప్రకారము గాని కొలచవచ్చు. మూలధనాన్ని తగ్గించి కాని తగ్గించకుండా కాని. ఉదాహరణకు ఒకవేళ మూలధనం CD తెరిచిన తరువాత మూడు నెలలకే ఉపసంహరించుకుంటే అప్పుడు ఆరు నెలల జరిమానా విధించవచ్చు.
 • ఫీజు. ఉపసంహరణ కాని CDని మూసివేసే సమయంలో కాని సర్టిఫైడ్ చెక్ ను అందించుటకుగాను ఫీజును నిర్దేశించవచ్చు.
 • స్వయంచాలిత పునఃసృష్టి. CD పక్వానికి వచ్చిన తరువాత స్వయం చాలిత పునఃసృష్టి కై సంస్థ ముందుగా నోటీసు ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. సంస్థ CD పక్వానికి వచ్చిన తరువాత కొత్త CDకి స్వయం చాలిత పునఃసృష్టి కై కొంత సమయం ఇస్తుంది. కొన్ని బ్యాంకులు ఈ పునఃసృష్టి సమయంలో తక్కువ వడ్డీ వచ్చే CDలకు మారుస్తున్నారు. ఈ విషయంలో వినియోగదారుడు జాగ్రత్తగా ఉండాలి.[2]

ఇటువంటి ఇతర ఉత్పత్తులు[మార్చు]

ఈ వ్యాసంలో FDIC నుండి కాని NCUA నుండి కాని భీమ సౌకర్యము కలిగిన CDలను వినియోదారులు నేరుగా బ్యాంకుల నుండి లేదా రుణ సంఘాల నుండి కొనుగోలు చేయడం ప్రస్తావించారు. భీమ సౌకర్యము లేని "సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్"లు కూడా కొన్ని సంస్థలు ఇస్తున్నాయి.

పిలవదగిన CDలు[మార్చు]

పిలవదగిన CD సాంప్రదాయ CD లాగే ఉంటుంది. అయితే బ్యాంకుకు పెట్టుబడిని ఎప్పుడైనా కాల్ చేయగలిగే హక్కు ఉంటుంది. తొలి నాన్-కాలబుల్ సమయం తరువాత బ్యాంకు CDను వెనక్కు కొనుగోలు చేయవచ్చు. పిలవదగిన CDలు ప్రీమియం వడ్డీ రేటుని చెల్లిస్తాయి. బ్యాంకులు పిలవదగిన CD లను అమ్మడం ద్వారా వద్దే రేటు యొక్క నష్టభాయాన్ని నిర్వహించుకోగలవు. కాల్ డేట్ రోజున బ్యాంకులు పెట్టుబడులను అలాగే ఉంచాలా లేక అమ్మాలా అనే విషయంపై నిర్ణయంతీసుకుంటాయి. ఇది తాకట్టు రిఫైనాన్స్ చేయడం లాంటిదే.

మధ్యవర్తిత్వము చేయబడ్డ CDలు[మార్చు]

"డిపాజిట్ బ్రోకర్" లుగా పిలువబడే ఎన్నో మధ్యవర్తి సంస్థలు CDలను అందిస్తాయి. ఈ సంస్థలు అసలు సంస్థకు కొన్ని డిపాజిట్లు తెచ్చే క్రమంలో వినియోగదారునికి CD పై ఎక్కువ వడ్డీ రేటులు ఆశ చూపుతాయి.

సాంప్రదాయకమైన బ్యాంకు CDల మాదిరి కాకుండా ఈ మధ్యవర్తిత్వ CDలు కొన్నిసార్లు సంబంధములేని కొంతమంది పెట్టుబడిదారుల గుంపుచే కొనుగోలు చేయబడతాయి. మొత్తం CDకి కాకుండా ప్రతి పెట్టుబడిదారుడు అందులో ఒక భాగానికి మాత్రమే సొంతదారుడు. ఒకవేళ చాలామంది పెట్టుబడిదారులు ఒక CDని సొంతం చేసుకుంటే, డిపాజిట్ బ్రోకరు CDని ప్రతి వ్యక్తి పేరుమీద వ్రాయడు. అయితే ఖాతా పద్దులలో ఆ బ్రోకరు ఒక ఏజెంటుగా మాత్రమే వ్యవహరిస్తున్నట్టు ఉంటుంది. (ఉదాహరణకు: "XYZ బ్రోకరేజ్ యాస్ కస్టోడియన్ ఫర్ కస్టమర్స్"). దీని వలన CDలోని ప్రతి భాగము $100,000 వరకు FDIC భీమ సౌకర్యమునకు అర్హత కలిగి యుంటుంది.

కొన్ని సందర్భాలలో CDపై ముందస్తు ఉపసంహరణకు ఎటువంటి జరిమానా ఉండదని డిపాజిట్ బ్రోకర్ ప్రకటిస్తాడు. ఇటువంటి సందర్భాలలో ఒకవేళ పెట్టుబడిదారుడు, CD యొక్క పక్వానికి ముందే ఉపసంహరించుకోవాలని అనుకుంటే డిపాజిట్ బ్రోకర్ ఆ CDని మరల అమ్మే ప్రయత్నం చేస్తాడు.. CD కొనుగోలు చేయబడడం వలన వడ్డీ రేట్లు తగ్గిపోతే మరియు దాని గిరాకీ ఎక్కువ ఉన్నట్లయితే ఆమె/అతను CDని లాభానికి అమ్మగలుగుతారు. అయితే వడ్డీ రేట్లు పెరిగితే ఇటువంటి తక్కువ ఆదాయం ఉన్న CDలకు గిరాకి కూడా తగ్గడంతో ఆమె/అతను CDని డిస్కౌంట్ పై అమ్మవలసి వస్తుంది.దీంతో పెట్టుబడిదారుడు అసలు డిపాజిటును కొంత పోగొట్టుకోవలసి వస్తుంది.

డిపాజిట్ బ్రోకర్లు ఎటువంటి లైసెన్సులు కాని సర్టిఫికేషన్ పద్ధతి కాని పాటించనవసరం లేదు. ఏ ప్రభుత్వముగాని ఫెడరల్ ఏజెన్సిగాని వీరికి లైసెన్సులు ఇవ్వదు, ఆమోదించదు.

బ్యాంకు విఫలమైన సందర్భాలలో FDIC బీమా వర్తిస్తుంది కాని వసూలు చేయడం చాలా కష్టం. నేరుగా తీసుకున్న డిపాజిట్ CDలు సాధారణంగా తీసుకున్న బ్యాంకు ద్వారా అసలు రేటుతోనే పక్వానికి వచ్చేలా అనుమతించబడతాయి. కాని మధ్యవర్తిత్వ ఖాతాలకు వడ్డీని వెంటనే నిలిపివేస్తారు. సాధారణంగా మధ్యవర్తి డిపాజిట్ దారులకు సమయానుసారంగా తెలుపబడదు. అందునా నేరుగా వచ్చిన డిపాజిట్ల పై క్లైయిములు FDIC 7-10 రోజులలో ఇస్తుంది. కాని మధ్యవర్తిత్వ CD ల క్లైయిములు మాత్రం 30-60లలో వస్తాయి. దీనితోబాటుగా మధ్యవర్తిత్వ డిపాజిట్ దారులు తాము నేరుగా తీసుకున్న డిపాజిట్లు మరియు మధ్యవర్తిత్వ డిపాజిట్లు రెండు కలిపి ఫ్దిక్ పరిమితి కంటే మించలేదని FDIC ముందు నిరూపించుకోవలసి ఉంటుంది.

బంప్-అప్ CDలు[మార్చు]

CD యొక్క కాల పరిమితిలో ఒక సారి వడ్డీ రేటును పెంచుకునే అవకాశం బంప్ అప్ CD ఖాతాదారునికి ఉంటుంది. అభ్యర్ధన మేరకు బ్యాంకు, వడ్డీ రేటును సర్టిఫికేట్ ఆర్ డిపాజిట్ పై ఆ చద్ పై బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటును అనుసరించి (లేదా టర్మ్ CDతో పోల్చి) పెంచుతుంది. రేటు మార్పు వలన CD పక్వత తేదీలో ఎటువంటి మార్పు ఉండదు.

ద్రవ్య CDలు[మార్చు]

ఈ తరహా CD సాధారణంగా ఒక స్థిర రేటు కలిగిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. ఇందులో అసలు డిపాజిట్ నుండి కొంత భాగాన్ని CD యొక్క కాలపరిమితి లోపలే ఎటువంటి జరిమానా లేకుండా తీసుకునే వీలు ఉంటుంది. CD నుండి పైకము ఎప్పుడు తీసుకోవచ్చు, ఎంత పైకము తీసుకోవచ్చు మరియు ఎన్ని సార్లు తీసుకోవచ్చు అనే విషయాల పై కొన్ని హద్దులు ఉంటాయి.

స్టెప్-అప్ CD లేదా స్టెప్-డౌన్ CDలు[మార్చు]

ఈ CDలను ఫ్లెక్స్ CDలు అని కూడా అనవచ్చు. వీటిని బంప్-అప్ CDలుగా పొరబాటు పడే అవకాశం ఉంది. స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ లక్షణంతో ఉన్న సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు ఒక నిర్ణీత కాల పరిమితికి సాధారణంగా ఒక సంవత్సరమునకు స్థిర వడ్డీ రేటు ఉంటుంది. ఆ పై ముందుగా నిర్ణయించబడిన రేటు ప్రకారము స్వయం చాలితంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

చెంచల-రేటు CDలు[మార్చు]

స్థిరమైన రేటు ప్రకారము వడ్డీ ఇచ్చే సంప్రదాయ CDల మాదిరికాకుండా చెంచల రేటు CD లేదా ఇండెక్స్ ఆధారిత CD మార్కెట్ ఇండెక్స్ కు అనుసంధించబడుతుంది. పక్వత సమయంలో వచ్చే వడ్డీ, తొలి ఇండెక్స్ నుండి చివరి ఇండెక్స్ విలువ యొక్క లాభ శాతము (లేదా నష్ట శాతము) పై ఆధారపడి ఉంటుంది.

ఈ సర్టిఫికేట్ అఫ్ డిపాజిట్ లను ట్రెజరీ బిల్లులు, ప్రైమ్ రేటు లేదా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ల వలె బాండ్, స్టాక్ ఇండెక్స్ లేదా రెఫెరెన్సు రేటుకు అనుసంధానం చేయబడుతుంది.

యాడాన్ CD లు[మార్చు]

ఇవి స్థిరమైన లేక చెంచల రేటు CDలు. వీటికి అదనపు డిపాజిట్లు కలపవచ్చు. ఖాతాలో కనీస డిపాజిట్ గురించి కొన్ని పరిమితులు ఉండవచ్చు.

జీరో-కూపన్ CD[మార్చు]

ఈ సర్టిఫికేట్ అఫ్ డిపాజిట్లు CD యొక్క ముఖవిలువ కంటే కొంత తగ్గింపుతో ఇవ్వబడతాయి. సాధారణంగా కాలపరిమితి సమయము ఎక్కువగా ఉంటుంది (15 నుండి 20 సంవత్సరాలు). దీనివలన తగ్గింపుధర సాధ్యమవుతుంది. ఈ జీరో కూపన్ CDలు పక్వతసమయం వరకు వడ్డీ చెల్లించవు.

విమర్శ[మార్చు]

CD వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణానికి దారి తీస్తాయి.[3] ఉదాహరణకు ఒక పరిస్థితిలో వడ్డీ రేట్లు 15% అయితే ద్రవ్యోల్బణం కూడా 15% ఉంటుంది. వేరొక పరిస్థితిలో వడ్డీ రేట్లు 2% అయితే ద్రవ్యోల్బణం 2% ఉంటుంది. అయితే ఈ కారణాలు త్రోసిపుచ్చవచ్చు. అందుచేత అసలు వడ్డీ రేటు రెండు పరిస్థితులలో ఒకటే.

ఈ పరిస్థితిలో వడ్డీ అంటే పెరిగిన విలువ అని ఒక అపోహ. ఒకే విలువను ఉంచేందుకు ఉపసంహరణ రేటు రేట్ ఆఫ్ రిటర్న్ రెండు సమానంగా ఉండాలి. ఈ విషయంలో అది సున్నా. రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అదే విధంగా ఉన్నప్పుడు అధిక రేటు పరిస్థితే "మంచిదని" ప్రజలు అనుకోవచ్చు.

పైన పేర్కొన్నది ఎటువంటి పన్నులు కలిగియుండదు.[4] పన్నుల విషయానికి వస్తే, పన్నుల మునుపటి వాస్తవిక రిటర్న్ల రేట్లు ఒకటిగానే ఉన్నప్పటికీ తక్కువ (ఎక్కువ వ్యతిరేకత) వాస్తవిక రిటర్న్ కారణంగా అధిక-రేటు పరిస్థితి దీనమైనది. ద్రవ్యోల్బణం తరువాత మరియు పన్నుల తరువాత రిటర్న్ ముఖ్యమైనది.

రిక్ ఎడేల్మన్ వ్రాసిన ప్రకారము, "నీవు బ్యాంకు ఖాతాలో ఎక్కువ డబ్బు సంపాదించలేవు (వాస్తవిక ఆర్ధిక ప్రమాణాల ప్రకారము), ఎందుకంటే నువ్వు సంపాదించకూడదు కాబట్టి".[5] మరోవైపు బ్యాంకు ఖాతాలు మరియు CDలు తక్కువ కాలపరిమితి వరకు డబ్బును ఉంచుటకు అనువైనవి.

అయితే మి.ఎడేల్మన్ అభిప్రాయాలు సగటు CD వడ్డీ రేట్లకు మాత్రమే వర్తిస్తాయి. వాస్తవానికి, కొన్ని బ్యాంకులు సగటు రేట్లకంటే తక్కువ వడ్డీ ఇస్తున్నాయి. మరికొన్ని సగటు కంటే ఎక్కువ వడ్డీ అందిస్తున్నాయి. (వ్యత్యాసాలు 100% ఉండటం సాధారణమే, ఉదాహరణకు: 2.50% వర్సస్ 5.00%).[6] అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఖాతాదారులు FDIC యొక్క అత్యుత్తమ భీమ రేట్లను రిస్క్ లో పెరుగుదల లేకుండానే పొందగలరు.[7] ఇంకా, ఒక దీర్ఘ కాలిక CD అధిక నామినల్ వడ్డీ రేటు ఉన్నప్పటికీ, కొనుగోలు సమయానికి ఉన్న ద్రవ్యోల్బణం కారణంగా తక్కువ వాస్తవిక వడ్డీ రేటు అందించవచ్చు (పైన చెప్పిన విధంగా). అయినప్పటికీ ద్రవ్యోల్బణం రేట్లు మాటి మాటి మార్పు చెందుతూ ఉంటాయి. అంతిమ వాస్తవిక వడ్డీ రేటు రిస్క్ భరితమైన పెట్టుబడుల కంటే అధికంగా ఉండవచ్చు.[8]

అంతిమంగా మి.ఎడేల్మన్ పేర్కొనిన విధంగా, "CD వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణానికి దారి తీస్తాయి" అనేది ప్రతిసారి అన్వయిన్చుకోదగ్గ నిజము కాదు. ఉదాహరణకు, క్రెడిట్ క్రంచ్ సమయంలో బ్యాంకులు నిధుల యొక్క అత్యవాస ఆవశ్యకతలో ఉంటారు. వడ్డీ రేటు పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారి తీయకపోవచ్చు.[9]

సూచనలు[మార్చు]

 1. "CDARS". Cite web requires |website= (help)
 2. మేజర్ బ్యాంక్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ రెనివల్ రేట్ రిప్-ఆఫ్"Rip Off". Cite web requires |website= (help)
 3. రిక్ ఎడేల్మాన్, ది ట్రూత్ అబౌట్ మని , 3వ ed., p.31
 4. రిక్ ఎడేల్మాన్, ది ట్రూత్ అబౌట్ మని , 3వ ed., p.30
 5. రిక్ ఎడేల్మాన్, ది ట్రూత్ అబౌట్ మని , 3వ ed., p.61
 6. ఉదాహరణకు, సాధారణ పెద్ద బ్యాక్ యొక్క ఒక సంవత్సరం కాలపరిమితిగల CD ను,"Wells Fargo". Cite web requires |website= (help) లిస్టు సేవలో ఉన్నవా"BankCD.com". Cite web requires |website= (help)టిల్లో అత్యధిక ఒక సంవత్సర CD ను పోల్చి చూడండి.
 7. "FDIC: Insuring Your Deposits". Cite web requires |website= (help)
 8. ఉదాహరణకు, 1981లో ద్రవ్యోల్బణ రేటు 10.3% గా ఉండేది. CD లు రెండంకెల రేటు ఇస్తుండగా"Federal Reserve's CD rates". Cite web requires |website= (help) ఈ ద్రవ్యోల్బణ తగ్గింది."US Department of Labor's CPI". Cite web requires |website= (help) ఆ సంవత్సరాలలో దీర్ఘకాలిక CD లను ఎవరైతే కొనుగోలుచేసారో, వారు తరువాతి సంవత్సరాలలో అధిక వాస్తవిక వడ్డీ రేట్ల ను పొందారు.
 9. Goldwasser, Joan (September 10, 2008). "Upside of the Credit Crunch". The Washington Post. Retrieved April 28, 2010.

బాహ్య లింకులు[మార్చు]