సర్దారా సింగ్
|
2014 లో భారత జట్టులో సర్దారా సింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | సర్దారా సింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జననం |
1986 జులై 15 సంత్‌నగర్, సిర్సా, హర్యానా, భారతదేశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 1.82 మీ[1] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఆడే స్థానము | హాఫ్‌బ్యాక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| క్రీడా జీవితము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| సంవత్సరాలు | Team | Apps | (Gls) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2005 | చండీగఢ్ డైనమోస్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2006–2008 | హైదరాబాద్ సుల్తాన్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2011 | KHC లూవెన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2013–2015 | ఢిల్లీ వేవ్‌రైడర్స్ | 14 | (0) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2013 | HC బ్లోమెండాల్ | 0 | (0) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2016 | పంజాబ్ వారియర్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2006–2018 | భారత పురుషుల హాకీ జట్టు | 314 | (16) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సాధించిన పతకాలు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సర్దారా సింగ్ (జననం 1986 జూలై 15), భారతీయ ఫీల్డ్ హాకీ కోచ్, మాజీ ఆటగాడు. అతను భారత జాతీయ జట్టుకు కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. [2] సాధారణంగా సెంటర్ హాఫ్ పొజిషన్‌లో ఆడేవాడు. 2008 సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో జట్టుకు నాయకత్వం వహించినప్పుడు సర్దార్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతి పిన్న వయస్కుడయ్యాడు. [3] 2015లో భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకున్నాడు.[4] 2016 జూలై 13న, భారత జట్టు కెప్టెన్ బాధ్యతలను ఆయన నుండి గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్‌కు అప్పగించారు.[5]2018 సెప్టెంబరు 12 న సర్దార్, అంతర్జాతీయ హాకీ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 12 సంవత్సరాల కెరీర్‌లో అతను 314 మ్యాచ్‌లు ఆడాడు.[6]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]సర్దారా హర్యానాలోని సిర్సా జిల్లాలోని సంత్ నగర్ గ్రామంలో [7] RMP వైద్యుడు గుర్నామ్ సింగ్, గృహిణి జస్వీర్ కౌర్ దంపతులకు జన్మించారు. [8]
కెరీర్
[మార్చు]సర్దారా సింగ్ 2003-04 లో పోలాండ్‌లో పర్యటించిన భారత జూనియర్ జట్టులో భారతదేశం తరపున రంగప్రవేశం చేశాడు. 2006 లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ జట్టులో అడుగుపెట్టాడు.[9] హర్యానా రాష్ట్రం తరపున కూడా ఆడుతున్నాడు. అతను హర్యానా పోలీసులలో డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తూ, వారి జట్టు తరపున ఆడుతున్నాడు. [10] 2005లో ప్రీమియర్ హాకీ లీగ్ ప్రారంభ సీజన్‌లో సింగ్, చండీగఢ్ డైనమోస్ తరపున ఆడాడు. 2008 వరకు తదుపరి మూడు సీజన్లలో అతను హైదరాబాద్ సుల్తాన్స్ తరపున ఆడుతూ, ఆ జట్టుకు నాయకత్వం వహించాడు.[11]
అతని సోదరుడు దీదార్ సింగ్, డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్టు. అతను భారత జట్టు, హర్యానా జట్టు, చండీగఢ్ డైనమోస్ జట్ల తరపున కూడా ఆడాడు.
2010 లో సర్దారా 18 మందితో కూడిన FIH ఆల్-స్టార్ జట్టులో చేరాడు.[12] అదే సంవత్సరంలో, బెల్జియన్ క్లబ్ అయిన KHC లూవెన్‌తో ఒప్పందం కుదుర్చుకుని, బెల్జియన్ హాకీ లీగ్‌లో ఆడాడు.[12] 2011 లో అతను మళ్ళీ FIH ఆల్-స్టార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [13] 2013 ఆసియా కప్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన తరువాత, అతను ట్యూన్ డి నూయిజర్ స్థానంలో డచ్ క్లబ్ HC బ్లూమెండాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. [14]
8 సంవత్సరాలు భారత జట్టుకు నాయకత్వం వహించిన తరువాత, 2016 జూలై 13 న కెప్టెన్ బాధ్యతలను సర్దారా నుండి గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ కు అప్పగించారు.
2018 సెప్టెంబరులో అతను క్రీడను విడిచిపెట్టాడు. [15] 2019లో, అతన్ని 13 మంది సభ్యుల హాకీ ఇండియా ఎంపిక కమిటీలోకి తీసుకున్నారు. [16]
హాకీ ఇండియా లీగ్
[మార్చు]ఢిల్లీ ఫ్రాంచైజీ అతన్ని ₹ 42,49,000 కు కొనుగోలు చేయడంతో సర్దార్ సింగ్, హాకీ ఇండియా లీగ్ తొలి వేలంలో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ జట్టుకు ఢిల్లీ వేవ్‌రైడర్స్ అని పేరు పెట్టారు.[17] అతను తన జట్టుకు నాయకత్వం వహించి ప్రారంభ సీజన్‌లో రెండవ స్థానంలో నిలిచాడు. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును అందుకున్నాడు. [18] అతనికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కార్ం లభించిండి.
పంజాబీ సంగీత పరిశ్రమ
[మార్చు]సర్దార్ సింగ్ పంజాబీ సంగీత పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ పంజాబీ గాయకుడు హర్దీప్ సింగ్ రాసిన 'గల్లన్ కర్రైయన్' పాటలో సర్దారా నటించాడు.[19] సుఖా వాడాలి రాసిన ఈ పాటకు జైదేవ్ కుమార్ సంగీతం అందించాడు.
విజయాలు
[మార్చు]
- 2012 సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో 'ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్' అవార్డును అందుకున్నాడు. ఈ పోటీలో భారతదేశం కాంస్య పతకాన్ని గెలుచుకుంది. [20]
- భారతదేశం స్వర్ణ పతకం సాధించిన 2012 సమ్మర్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.
- భారతదేశం స్వర్ణ పతకం సాధించిన 2010 సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.
- 2006 లో మలేషియాలో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో పాల్గొని కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
- 2006 సంవత్సరంలో కొలంబోలో జరిగిన SAF క్రీడలలో పాల్గొన్నాడు. అపుడు జట్టు 2వ స్థానం సాధించింది.
- 2006 లో పోలాండ్‌లో జరిగిన 7వ జూనియర్ ఛాలెంజ్ ఓపెన్ పురుషులలో పాల్గొని 2వ స్థానం సాధించాడు.
- బెల్జియంలో 2007లో జరిగిన పురుషుల హాకీ ఛాంపియన్స్ ఛాలెంజ్‌లో పాల్గొని కాంస్య పతకం గెలుచుకున్నాడు.
- 2006లో మెల్‌బోర్న్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో పాల్గొన్నాడు.
- 2006 INDO-PAK సిరీస్‌లో పాల్గొన్నాడు.
- జర్మనీలో జరిగిన నాలుగు దేశాల అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. ఆ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది.
- అతను లాహోర్‌లో జరిగిన నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌లో కూడా పాల్గొన్నాడు. భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది.
- 2007 లో చెన్నైలో జరిగిన పురుషుల హాకీ ఆసియా కప్‌లో పాల్గొన్నాడు. ఆ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది.
- అతను భారతదేశం తరపున కెనడా జాతీయ ఫీల్డ్ హాకీ జట్టుతో జరిగిన 7 ఆటల టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "CWG Melbourne: Player's Profile".
- ↑ "Sardar Singh to lead India at Sultan Azlan Shah Cup". The Indian Express. 20 February 2018. Retrieved 26 February 2018.
- ↑ "Sardar Singh named captain, Pargat is manager of Indian hockey team". oneindia. 7 May 2008. Archived from the original on 21 అక్టోబర్ 2014. Retrieved 2 జనవరి 2026.
{{cite news}}: Check date values in:|archive-date=(help) - ↑ "Padma Awards 2015". Press Information Bureau. Archived from the original on 28 January 2015. Retrieved 25 January 2015.
- ↑ "Sardar Singh is no longer king of Indian hockey 2016". Indian Express. 13 July 2016. Retrieved 13 July 2016.
- ↑ "Sardar Singh retires". Times of India. 13 September 2018. Retrieved 13 September 2018.
- ↑ "Sardar Singh to lead India at Sultan Azlan Shah Cup". The Indian Express. 20 February 2018. Retrieved 26 February 2018.
- ↑ Sardara Singh strikes form The Hindu, 15 March 2009.
- ↑ "Sardar Singh to lead India at Sultan Azlan Shah Cup". The Indian Express. 20 February 2018. Retrieved 26 February 2018.
- ↑ Sardara Singh strikes form The Hindu, 15 March 2009.
- ↑ "Sardar Singh named captain, Pargat is manager of Indian hockey team". oneindia. 7 May 2008. Archived from the original on 21 అక్టోబర్ 2014. Retrieved 2 జనవరి 2026.
{{cite news}}: Check date values in:|archive-date=(help) - ↑ 12.0 12.1 "Sardara to play in Belgian Hockey League". The Times of India. 27 December 2010. Retrieved 3 September 2013.
{{cite news}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "Sardar Singh to lead India at Sultan Azlan Shah Cup". The Indian Express. 20 February 2018. Retrieved 26 February 2018.
- ↑ Sardara Singh strikes form The Hindu, 15 March 2009.
- ↑ "Sardar Singh to lead India at Sultan Azlan Shah Cup". The Indian Express. 20 February 2018. Retrieved 26 February 2018.
- ↑ Sardara Singh strikes form The Hindu, 15 March 2009.
- ↑ "Sardar Singh to lead India at Sultan Azlan Shah Cup". The Indian Express. 20 February 2018. Retrieved 26 February 2018.
- ↑ Sardara Singh strikes form The Hindu, 15 March 2009.
- ↑ "Sardar Singh to lead India at Sultan Azlan Shah Cup". The Indian Express. 20 February 2018. Retrieved 26 February 2018.
- ↑ "Sardar Singh to lead India at Sultan Azlan Shah Cup". The Indian Express. 20 February 2018. Retrieved 26 February 2018.