సర్దార్ అజిత్ సింగ్
సర్దార్ అజిత్ సింగ్ | |
|---|---|
| జననం | 23 ఫిబ్రవరి 1881 |
| మరణం | 15 ఆగస్ట్ 1947 (వయస్సు 66) డల్హౌస్, ఈస్ట్ పంజాబ్ |
| జాతీయత | భారతీయుడు |
| Notable work | భారత్ మాతా జర్నల్ |
| బంధువులు | భగత్ సింగ్ (మేనల్లుడు) |
సర్దార్ అజిత్ సింగ్ (1881–1947) భారతదేశపు ప్రసిద్ధ దేశభక్తుడు, విప్లవకారుడు. అతను భగత్ సింగ్ మామ. అతను భారతదేశంలో బ్రిటిష్ పాలనను సవాలు చేశాడు. భారతదేశ వలస పాలనను విమర్శించాడు, బహిరంగంగా వ్యతిరేకించాడు. అతన్ని రాజకీయ తిరుగుబాటుదారుడిగా ప్రకటించారు. అతను తన జీవితంలో ఎక్కువ భాగం జైలులోనే గడిపాడు. 1906లో, లాలా లజపతి రాయ్ తో పాటు ఆయనకు కూడా దేశ బహిష్కరణ శిక్ష విధించబడింది.
శ్రీ బాలగంగాధర్ తిలక్ ఒకసారి ఆయన గురించి మాట్లాడుతూ, స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతి కావడానికి ఆయన అర్హుడని అన్నారు. తిలక్ ఇలా చెప్పినప్పుడు, సర్దార్ అజిత్ సింగ్ వయస్సు కేవలం 25 సంవత్సరాలు. 1909లో, సర్దార్ తన ఇంటిని వదిలి దేశానికి సేవ చేయడానికి విదేశాలకు వెళ్లాడు. ఆ సమయంలో అతని వయస్సు 28 సంవత్సరాలు. ఇరాన్ ద్వారా టర్కీ, జర్మనీ, బ్రెజిల్, స్విట్జర్లాండ్, ఇటలీ, జపాన్ మొదలైన దేశాలలో నివసిస్తున్నప్పుడు అతనిలో విప్లవ భావాలకు బీజం పడింది. అప్పుడే ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించాడు.
నేతాజీకి హిట్లర్ ముస్సోలినీ పరిచయాలు ఈయన ద్వారా జరిగాయి. ముస్సోలినీ అజిత్ సింగ్ వ్యక్తిత్వానికి చాలా ప్రభావితుడయ్యాడు. అతను 40 భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన రోమ్ రేడియోకు 'ఆజాద్ హింద్ రేడియో' అనే కొత్త పేరు పెట్టాడు. దాని ద్వారా విప్లవ ప్రచారాన్ని వ్యాప్తి చేశారు. అతను మార్చి 1947లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, అతని భార్య గుర్తింపు కోసం చాలా ప్రశ్నలు అడిగింది, వాటికి సరైన సమాధానాలు వచ్చిన తర్వాత కూడా, అతని భార్య దానిని నమ్మలేదు. సర్దార్ చాలా భాషలలో జ్ఞానవంతుడయ్యాడు, అతన్ని గుర్తించడం చాలా కష్టమైంది.
భారతదేశ విభజనతో ఆయన ఎంతగానో బాధపడ్డారంటే, 1947 ఆగస్టు 15న తెల్లవారుజామున 4 గంటలకు తన కుటుంబ సభ్యులందరినీ నిద్రలేపి జై హింద్ అంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు.