సర్వేరెడ్డిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"సర్వేరెడ్డిపాలెం" ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 272., యస్.ట్.డీ కోడ్=08598.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఒంగోలు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)523 272 Edit this on Wikidata


మండలం పేరు ఒంగోలు మండలం
జిల్లా ప్రకాశం జిల్లా
రాష్ట్రం ఆంధ్రపదేశ్
భాష తెలుగు
ఎత్తు: సముద్రమట్టానికి 12 మీటర్లు
పిన్‌కోడ్ 523 272
తపాలా కార్యాలయం సర్వేరెడ్డి పాలెం

గ్రామ భౌగోళికం[మార్చు]

హైదరాబాదుకు ఇది 268 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండల కేంద్రమైన ఒంగోలుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్వేరెడ్డి పాలెం ఈశాన్యంలో ఒంగోలు, తూర్పున వెంగముక్కల పాలెం, పడమరన మంగమూరు, నైరుతిన కొంజేడు ఉన్నాయి.

సమీప ంలోని గ్రామాలు[మార్చు]

పెళ్ళూరు 4.2 కి.మీ, ఒంగోలు 4.8 కి.మీ, చెరువుకొమ్ముపాలెం 5 కి.మీ, మంగమూరు 5.7 కి.మీ, జయవరం 6.2 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

ఒంగోలు 7 కి.మీ, సంతనూతలపాడు 13.7 కి.మీ, టంగుటూరు 13.9 కి.మీ, జరుగుమల్లి 15.3 కి.మీ.

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- విద్యార్థుల సంఖ్య 3,500. రెండవ ప్రపంచ యుద్ధం జరిగి 69 సంవత్సరాలయిన సందర్భంగా, గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో, 2014, ఆగస్టు-7వ తేదీ నాడు, అమరులైన భారతీయ సైనికులకు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులైన సైనికులకు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు నివాళులర్పించారు. ప్రపంచశాంతి కోరుతూ శాంతి కపోతాలను ఎగురవేసినారు. [1]

సమీప ంలో ఉన్న విద్యాలయాలు[మార్చు]

  • బి.వి.ఆర్ ఉన్నత పాఠశాల కొప్పోలు (గ్రామం)
  • ఎస్.టి థెరసాస్ ఉన్నత పాఠశాల, ఒంగోలు (గ్రామం)
  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ఉలిచి (గ్రామం).

సమీప ంలోని కళాశాలలు[మార్చు]

  • శ్రీ వీరవెంకట సత్యనారాయణ (ఎస్.వి.వి.ఎస్.ఎన్) ఇంజనీరింగ్ కాలేజ్. సంతనూతలపాడు.
  • శ్రీసత్యనారాయణ డిగ్రీ కాలేజ్. మంగమూరు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (P.A.C.S)

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

రామాలయం, వినాయకుని గుడి, బాలాత్రిపుర సుందరి ఆలయం, భ్రహ్మంగారి, బ్రహ్మయ్య స్వామి ఆలయం.

ప్రధాన పంటలు[మార్చు]

పొగాకు, నీలగిరి తైలం చెట్లు, సుభాబులు, శనగ.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ మక్కెన శ్రీనివాసులు, 2016, జనవరి-28న ఒంగోలు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులుగా నియమితులైనారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,181 - పురుషుల సంఖ్య 1,073 - స్త్రీల సంఖ్య 1,108 - గృహాల సంఖ్య 517

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,041.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,008, మహిళల సంఖ్య 1,033, గ్రామంలో నివాస గృహాలు 444 ఉన్నాయి.

  • గ్రామసంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఆగస్టు-8; 2వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2016, జనవరి-29; 11వపేజీ.