సర్వే ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్వే ఆఫ్ ఇండియా
దస్త్రం:Survey of India logo.jpg
Survey and mapping agency అవలోకనం
స్థాపనం 1767; 257 సంవత్సరాల క్రితం (1767)[1]
అధికార పరిధి East India Company (1767–1858)
British Raj (1858–1947)
Government of India (from 1947)
ప్రధాన కార్యాలయం Hathibarkala Estate, New Cantt Road, Dehradun, Uttarakhand, India[2]
Minister responsible Harsh Vardhan, Minister of Science and Technology
Survey and mapping agency కార్యనిర్వాహకుడు/లు Lt. Gen. Girish Kumar, Surveyor General of India
Col. Amardeep Singh, Addl. Surveyor General
మాతృ శాఖ Department of Science and Technology
1870 లో చేసిన గ్రేట్ ట్రిగనామెట్రిక్ సర్వే (1802-1852) లో ఉపయోగించిన త్రిభుజాలు బదిలీలను చూపించే మ్యాప్.
రాధానాథ్ సిక్దర్
రాధానాథ్ సిక్దర్, ఎవరెస్టు పర్వతం ఎత్తును 1852 లో మొదటిసారిగా కొలిచిన గణిత శాస్త్రజ్ఞుడు

సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో సర్వేయింగు, మ్యాపింగు చేసే బాధ్యతలున్న కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ ఏజెన్సీ. [3] బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ భూభాగాలను ధ్రువీకరించుకోడానికి 1767 లో దీన్ని స్థాపించారు. [4] ఇది భారత ప్రభుత్వంలోని అత్యంత పురాతన ఇంజనీరింగ్ విభాగాలలో ఒకటి . దీని ఉద్యోగులు సివిల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా యొక్క సర్వే ఆఫ్ ఇండియా సర్వీస్ కేడర్‌కు చెందినవారు, ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ కు చెందిన ఆర్మీ ఆఫీసర్లు. దీనికి సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నాయకత్వం వహిస్తారు. ప్రస్తుతం, సర్వే ఆఫ్ ఇండియాకు సారథి లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, వి.ఎస్.ఎం.

సర్వే ఆఫ్ ఇండియా (కార్టోగ్రఫీ) అలాగే ASI (పురావస్తు శాస్త్రం), బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (వృక్షశాస్త్రం), ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (అడవులు), ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా (మత్స్య సంపద), భారతీయ భూగర్భ సర్వేక్షణ (భూగర్భ శాస్త్రం), ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇకాలజీ అండ్ ఎంవైరాన్‌మెంట్ (పర్యావరణ శాస్త్రం), నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (సముద్ర శాస్త్రం), రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా (భారత సెన్సస్) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జువాలజీ) భారతదేశంలోని ముఖ్య జాతీయ సర్వే సంస్థలు.

చరిత్ర

[మార్చు]
భారతదేశపు సర్వేయర్-జనరల్ జార్జ్ ఎవరెస్ట్ (b.1790-d.1866). గ్రేట్ ట్రిగ్నామెట్రిక్ సర్వే చేసాడు. ఇతడి గౌరవార్థమే ఎవరెస్ట్ పర్వతానికి ఆ పేరు పెట్టారు

సర్వే ఆఫ్ ఇండియా చరిత్ర 18 వ శతాబ్దం నాటిది. "భారతదేశపు మొట్టమొదటి ఆధునిక శాస్త్రీయ సర్వే" ను 1793 – 96 లో సేలం, బారామహల్‌ల సూపరింటెండెంట్, కల్నల్ అలెగ్జాండర్ రీడ్ ఆదేశాల మేరకు W. మాథర్ చేపట్టాడు. ప్రస్తుత ధర్మపురి జిల్లా, కృష్ణగిరి జిల్లా, పశ్చిమ తమిళనాడులోని ఉత్తర ఆర్కాట్‌ను అప్పుడు బారామహల్ అని పిలిచేవారు. [5]

గ్రేట్ ట్రిగనామెట్రిక్ సర్వే (1802 – 1852) ను బ్రిటిషు సర్వేయర్ కల్నల్ విలియం లాంబ్టన్ 10 ఏప్రిల్ 1802 న ప్రారంభించాడు. చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ నుండి హిమాలయాల పర్వత ప్రాంతాల వరకు ఈ సర్వే చేసారు. 36 అంగుళాల పరిమాణంలో, అర టన్ను బరువున్న భారీ థియోడోలైట్‌ను ఈ సర్వే కోసం ఉపయోగించారు. 12 కిలోమీటర్ల బేస్ లైన్‌ను కొలవడానికి 57 రోజులు పట్టింది. 5 దశాబ్దాల పాటు సాగిన ఈ ప్రాజెక్టు 1852 సంవత్సరంలో, సర్వే జనరల్ లెఫ్టినెంట్ జార్జ్ ఎవరెస్ట్ ఆధ్వర్యంలో పూర్తయింది. గణిత శాస్త్రవేత్త, సర్వేయర్ రాధానాథ్ సిక్దర్ 1852 లో ఎవరెస్ట్ పర్వతాన్ని కొలిచారు. అప్పుడు తేలిన దీని ఎత్తు 29,002 అడుగులు. ఆధునిక కొలతల ప్రకారం దీని ఎత్తు 29,037 అడుగులు. భారతదేశంలో క్రమబద్ధమైన స్థలాకృతి మ్యాపింగులో కొత్త యుగానికి ప్రారంభంగా దీన్ని పరిగణిస్తారు. ప్రపంచంలోని అత్యంత పురాతన సర్వే, మ్యాపింగ్ ఏజెన్సీలలో ఒకదానికి పునాది పడింది.

సంస్థ

[మార్చు]

డెహ్రా డూన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న సర్వే ఆఫ్ ఇండియాలో, సముద్రంలో ఆటుపోట్ల అంచనా నుండి వైమానిక సర్వే వరకు 18 జియో ప్రాదేశిక విభాగాలు ఉన్నాయి. దీనికి భారతదేశ మంతటా 23 జియో-ప్రాదేశిక డేటా కేంద్రాలు ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాల సర్వే వసరాలను తీరుస్తాయి. సర్వే ఆఫ్ ఇండియాకు వెన్నెముక వంటివారు, సర్వేయర్లు. ఇందులోని జూనియర్ టైమ్ స్కేల్ (Dy Supdtg సర్వేయర్) లోని గ్రూప్ 'ఎ' సివిల్ స్ట్రీమ్ పోస్టులకు నియామకాలు, భారతీయ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష ఆధారంగాను, ఆర్మీ ఆఫీసర్స్ డిఫెన్స్ యొక్క శాశ్వత సెకండ్మెంట్ ద్వారానూ చేస్తారు. సర్వే ఆఫ్ ఇండియాలో ముఖ్యమైన పోస్టులు / గ్రేడ్‌లు సీనియారిటీ వారీగా ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి: డ్రాఫ్ట్స్‌మన్, ప్లేన్ టేబులర్, సర్వే అసిస్టెంట్, సర్వేయర్, ఆఫీసర్ సర్వేయర్, డిప్యూటీ సూపరింటెండింగ్ సర్వేయర్, సూపరింటెండింగ్ సర్వేయర్, సూపరింటెండింగ్ సర్వేయర్ (నాన్-ఫంక్షనల్ సెకండ్ గ్రేడ్) / డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ / డిప్యూటీ సర్వేయర్ జనరల్, అదనపు సర్వేయర్ జనరల్, సర్వేయర్ జనరల్.

బాధ్యతలు

[మార్చు]
  • ప్రభుత్వ సలహాదారు: జియోడెసి, ఫోటోగ్రామెట్రీ, మ్యాపింగ్, మ్యాప్ పునరుత్పత్తి వంటి భారతదేశానికి సంబంధించిన అన్ని కార్టోగ్రఫీ కార్యక్రమాలపై సర్వే ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తుంది.
  • జియో పేర్లు: భారతదేశం యొక్క భౌగోళిక లక్షణాల నామకరణ పద్ధతికి, అక్షరక్రమాలకూ సర్వే ఆఫ్ ఇండియా బాధ్యత వహిస్తుంది.
  • ధృవీకరణ, ప్రచురణ: ప్రైవేట్ ప్రచురణకర్తలతో సహా ఇతర ఏజెన్సీలు ప్రచురించిన పటాలపై భారతదేశం సరిహద్దులను, తీరరేఖనూ పరిశీలించడం, ధ్రువీకరించడం. టైడ్ టేబుల్స్‌ను (ఒక సంవత్సరం ముందుగానే), భారతదేశ పటాలనూ ప్రచురించడం.
  • సర్వేలు: జియోడెటిక్ డేటా, జియోడెటిక్ కంట్రోల్ నెట్‌వర్క్, టోపోగ్రాఫికల్ కంట్రోల్, జియోఫిజికల్ సర్వేలు, కాడస్ట్రల్ సర్వేయింగ్, జియోలాజిక్ మ్యాప్‌లతో పాటు, అడవులు, ఆర్మీ కంటోన్మెంట్లు, మహా నగరాలు, గైడ్ మ్యాప్స్, అభివృద్ధి లేదా పరిరక్షణ ప్రాజెక్టులు మొదలైన వాటి ఏరోనాటికల్ చార్టుల తయారీ.
  • జాతీయ సరిహద్దులు: భారతదేశపు బాహ్య సరిహద్దుల గుర్తింపుతో పాటు అంతర్-రాష్ట్ర సరిహద్దులపై సలహా.
  • సాగర తరంగాల అంచనా: 14 విదేశీ రేవులతో సహా 44 రేవులలో ఆటుపోట్ల అంచనా వేయడం .
  • పరిశోధన, అభివృద్ధి: ఫోటోగ్రామెట్రీ, కార్టోగ్రఫీ, జియోడెసి, టోపోగ్రాఫికల్ సర్వేలు, సాంకేతికత స్వదేశీకరణ.
  • శిక్షణ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో పాటు విదేశాల నుంచి శిక్షణ.

మ్యాపులు

[మార్చు]

సర్వే ఆఫ్ ఇండియా పటాలను ప్రచురిస్తుంది. ప్రభుత్వ కట్టడి లేని పటాలను సర్వే ఆఫ్ ఇండియా వారి అనేక జియో-ప్రాదేశిక డేటా కేంద్రాల నుండి చాలా సరసమైన ధరలకు పొందవచ్చు. కట్టడిలో ఉన్న పటాలను పొందాలంటే, ప్రభుత్వ అధికారుల నుండి తగిన అనుమతి అవసరం. సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల అమ్మకం వాడకాలను అనేక ఇతర నియమాలు నియంత్రిస్తాయి. టోపోగ్రాఫిక్ మ్యాప్‌లను భారతీయ పౌరులకు మాత్రమే అమ్ముతారు. వీటిని భారతదేశం నుండి బయటికి ఎగుమతి చేయకూడదు.  

గ్యాలరీ

[మార్చు]
సర్వే ఆఫ్ ఇండియా పాత లోగో
సర్వే ఆఫ్ ఇండియా పాత లోగో 

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "About Us". Survey of India. Retrieved 27 May 2018.
  2. "Contact us". Survey of India. Retrieved 27 May 2018.
  3. On 250th birthday, Survey of India wants to shed its cloak of secrecy, Indian Express.
  4. St. Peter Church Allahabad.
  5. Baramahal records Vol.I P.220, In Letter Dated 04.10.1797 The British Government appreciated Col. Alexander Read.