Jump to content

సర్వ్ మిత్ర సిక్రి

వికీపీడియా నుండి
సర్వ్ మిత్ర సిక్రి
13వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
1971 జనవరి 22 – 1973 ఏప్రిల్ 25
Appointed byవి. వి. గిరి
అంతకు ముందు వారుజయంతిలాల్ ఛోటాలాల్ షా
తరువాత వారుఅజిత్ నాథ్ రే
న్యాయమూర్తి, భారత సుప్రీంకోర్టు
In office
1964 ఫిబ్రవరి 3 – 1973 ఏప్రిల్ 25
వ్యక్తిగత వివరాలు
జననం(1908-04-26)1908 ఏప్రిల్ 26 [1]
కబీర్వాలా, పంజాబ్
మరణం1992 సెప్టెంబరు 24(1992-09-24) (వయసు 84)

సర్వ్ మిత్ర సిక్రి (1908, ఏప్రిల్ 26 - 1992, సెప్టెంబరు 24), భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. 1971 జనవరి 22 నుండి 1973 ఏప్రిల్ 25న పదవీ విరమణ చేసే వరకు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్నారు.[2]

జననం

[మార్చు]

సర్వ్ మిత్ర సిక్రి 1908, ఏప్రిల్ 26న పంజాబ్ రాష్ట్రం, కబీర్వాలాలో జన్మించాడు.

వృత్తి జీవితం

[మార్చు]

1930లో లాహోర్ హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. స్వాతంత్ర్యం తరువాత 1949లో పంజాబ్ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్‌గా నియమించబడ్డాడు. 1951 నుండి 1964 వరకు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశాడు.

1964 ఫిబ్రవరిలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 1971 జనవరిలో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. బార్ నుండి నేరుగా నియమించబడిన సుప్రీంకోర్టు మొదటి న్యాయమూర్తి, బార్ నుండి నేరుగా భారతదేశం మొదటి ప్రధాన న్యాయమూర్తి.[3]

కేశవానంద భారతి విఎస్. కేరళ రాష్ట్రం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ప్రధాన నిర్ణయం జరిగింది. భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని వివరించి ఘనత పొందాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Hon'ble Mr. Justice S.M. Sikri". Supreme Court of India. Retrieved 2022-10-28.
  2. "Sarv Mittra Sikri". Supreme Court of India. Retrieved 2022-10-28.
  3. "CJI NV Ramana recommends Justice UU Lalit's name to Centre as the 49th Chief Justice of India". Firstpost (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
  4. "Kesavananda Bharati ... vs State Of Kerala And Anr on 24 April, 1973". Indian Kanoon. Para 316. Retrieved 2022-10-28.