సవితా రెడ్డి
సవితా రాధాకృష్ణన్ | |
---|---|
జననం | సవితా రాధాకృష్ణన్ |
జాతీయత | ఇండియన్ |
ఇతర పేర్లు | సవిత రెడ్డి |
వృత్తి | వాయిస్ యాక్టర్ / డబ్బింగ్ ఆర్టిస్ట్ |
క్రియాశీల సంవత్సరాలు | 1986 – ప్రస్తుతం |
సవితా రాధాకృష్ణన్ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాయిస్ ఆర్టిస్ట్.
విద్యాభ్యాసం
[మార్చు]అన్నామలై యూనివర్శిటీ నుండి అడ్వర్టైజింగ్‌లో ఎంబిఎ పూర్తిచేసిన ఆమెకు భారతీయ సినిమా దర్శకుడు ఎస్. శంకర్ జీన్స్ (1998)లో అప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కోసం తన గాత్రాన్ని అందించడానికి ఎంపిక చేసాడు.
కెరీర్
[మార్చు]ఆమె రేపటి పౌరులు చిత్రంలో బాలగాత్ర నటిగా అరంగేట్రం చేసింది. ఆ తరువాత తెలుగులోనే కాక తమిళంలో కూడా వాయిస్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాలకు కొనసాగింది. ఆమె యుక్తవయసులో ప్రముఖ దక్షిణాది నటి వినోదిని నటించిన అన్నై వాయల్ (1992) అనే తమిళ చిత్రానికి డబ్బింగ్ చెప్పింది. ఐశ్వర్య రాయ్ పాత్రకు జీన్స్లో తన గాత్రాన్ని అందించడంతో ఆమె ప్రసిద్ధిచెందింది.[1]
ఇక ఆమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇలా దక్షిణాది భాషా చిత్రాలు, వాణిజ్యప్రకటనలకే కాకుండా హిందీలోనూ గాత్రదానం చేసింది. ఆమె ప్రధానంగా అన్నన్ తంబి చిత్రానికి లక్ష్మీ రాయ్, డైమండ్ నెక్లెస్ చిత్రానికి గౌతమి నాయర్‌లకు డబ్బింగ్ చెప్పి మరింత ప్రేక్షకులకు చేరువైంది.
తెలుగులో, ఆమె మొదటిగా గాత్రం అందించిన చిత్రం కలిసుందం రాలో సిమ్రాన్ కోసం కాగా తరువాత కూడా సిమ్రాన్ నటించిన అన్ని చిత్రాలకు డబ్బింగ్ చెప్పింది. నువ్వు నాకు నచ్చావ్లో ఆర్తీ అగర్వాల్ కోసం తన గాత్రాన్ని అందించి ఆమె నంది అవార్డు సాధించింది. అలాగే ఆమె వర్షం చిత్రంలో త్రిష, నువ్వే కావాలి లో రిచా, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిలో అసిన్ ఇలా పలువురు హీరోయిన్ లకు తను గాత్రదానం చేసింది.[2][3][4]
పురస్కారాలు
[మార్చు]Year | Artist & Film | Award | References |
---|---|---|---|
2000 | సిమ్రాన్, ప్రియమానవాలే | ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు | [5] |
2001 | ఆర్తి అగర్వాల్, నువ్వు నాకు నచ్చావ్ | ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు | [6] |
2003 | భూమిక చావ్లా, మిస్సమ్మ | ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు | [6] |
2005 | జ్యోతిక, చంద్రముఖి | ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు | [7] |
2006 | జెనీలియా డిసౌజా, బొమ్మరిల్లు | ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు | [8] |
2008 | జెనీలియా డిసౌజా, సంతోష్ సుబ్రమణ్యం | ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు | |
2010 | నయనతార, బాస్ ఎంగిర భాస్కరన్ | ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు |
మూలాలు
[మార్చు]- ↑ "Dubbing is big business today in Kollywood - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2019. Retrieved 2019-10-07.
- ↑ "Ever Unseen But Never Unheard". The New Indian Express. Archived from the original on 7 October 2019. Retrieved 2019-10-07.
- ↑ "7 POPULAR DUBBING ARTISTS YOU NEED TO KNOW ABOUT". BookMyShow (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-05-03. Archived from the original on 7 October 2019. Retrieved 2019-10-07.
- ↑ Rao, Subha J. (2011-12-17). "Over to the voices…". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 4 June 2021. Retrieved 2019-10-07.
- ↑ "Tamil Nadu announces film awards for three years". IndiaGlitz.com. Archived from the original on 22 March 2016. Retrieved 2009-10-19.
- ↑ 6.0 6.1 "Telugu Cinema Etc - Idlebrain.com". Archived from the original on 15 October 2014. Retrieved 21 June 2020.
- ↑ "Tamil Nadu State Film Awards 2005-Tamil Nadu State Film Awards 2005 Winners List-state award 2005". Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.
- ↑ "Nandi Awards of year 2006". greenmangos.net. Archived from the original on 29 October 2012. Retrieved 8 April 2013.