సహాయం:చిన్న మార్పులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన్న మార్పు అనే చెక్ బాక్సులో టిక్కు పెట్టడం ద్వారా ప్రస్తుతపు కూర్పుకు, గత కూర్పుకు మధ్య ఏవో పైపై మార్పులు మాత్రమే ఉన్నాయని సూచిస్తున్నట్లు: టైపింగు తప్పుల సవరణలు, ఫార్మాటు మార్పులు, వ్యాస​ విషయం మారకుండా వాక్యం అమరికను మార్చడం లాంటివి. సదరు మార్పులను సమీక్షించనవసరం లేనివని, వాటిపై వివాదం రేగే అవకాశమే లేదని ఆ సభ్యుడు/సభ్యురాలు భావించినట్లు.

ఇతర రచయితల సమీక్ష అవసరమైన దిద్దుబాటు ఏదైనా పెద్ద మార్పే. వ్యాసపు అర్థాన్ని మార్చే మార్పు, అది ఎంత చిన్నదైనా సరే, పెద్ద మార్పే.

చిన్న పెద మార్పుల మధ్య ఉన్న అంతరం చాలా ప్రముఖమైనది. వికీపీడియనులు చిన్న మార్పులను పెద్దగా గమనించరు. కొందరు సభ్యులైతే చొఇన్న మార్పులను కనబడకుండా తమ అభిరుచులలో సెట్ చేసుకుంటారు. చిన్న మార్పు కాదేమోనని సందేహంగా అనిపిస్తే దాన్ని చిన్న మార్పుగా గుర్తించకండి.

లాగిన్ కాని సభ్యులు తమ దిద్దుబాట్లను చిన్న మార్పుగా గుర్తించలేరు.

దిద్దుబాటును చిన్నదిగా ఎప్పుడు గుర్తించాలి

[మార్చు]
 • గుణింతాల సవరణలు
 • చిన్న చిన్న ఫార్మాటింగు పనులు (కామాలు పెట్టడం లాంటివి)
 • పేజీ అర్థాన్ని మార్చని ఫార్మాటింగు. (పేరాను విడగొట్టడం వంటివి, వివాదాస్పదం కానంతవరకు)
 • స్పష్టంగా తెలిసిపోయే పొరపాట్లు (1847, ఆగష్టు 15 ను 1947, ఆగష్టు 15 గా మార్చడం వంటివి)
 • లే ఔట్ పొరపాట్లను మార్చడం వంటివి. (ఉదా:పట్టిక తయారీలో దొర్లిన లోపాన్ని సరిదిద్దడం)
 • లింకులు ఇవ్వడం
 • దుశ్చర్య ను తొలగించడం

గుర్తు పెట్టుకోవాల్సినవి

[మార్చు]
 • వ్యాసపు మూలానికి మీరు చేసే ఎంత చిన్న మార్పైనా - ఓ కామా చేర్చినా, తీసేసినా - అది మార్పే.
 • పెద్ద పెద్ద మార్పులు చేసి కూడా, చిన్న మార్పులుగా గుర్తించడాన్ని మంచి సాంప్రదాయంగా భావించరు. మరీ ముఖ్యంగా వ్యాసంలోని కొంత టెక్స్టును తీసెయ్యడం.
 • పేజీని మునుపటి కూర్పుకు తీసుకు పోవడం చిన్న మార్పుగా గుర్తించరాదు. పేజీలో దిద్దుబాటు యుద్ధం జరుగుతూ ఉంటే, ఏ మార్పును కూడా చిన్న మార్పుగా గుర్తించరాదు.
 • పొరపాటున ఓ మార్పును చిన్న మార్పుగా గుర్తించి ఉంటే, ఆ తరువాత ఓ డమ్మీ దిద్దుబాటు చేసి, దాని దిద్దుబాటు సారాంశంలో మునుపటి మార్పు చిన్నది కాదు, పెద్దదే అని రాయండి. డమ్మీ దిద్దుబాటంటే, పేజీని ఎడిట్ పెట్టెలో తెరిచి, ఏదో చిన్న మార్పు చెయ్యడం. ఉదాహరణకు, రెండు పదాల మధ్య ఉండే ఖాళీకి మరో ఖాళీని చేర్చి తిరిగి భద్రపరచడం. అసలే మార్పూ చెయ్యకుండా తిరిగి భద్రపరిస్తే అది దిద్దుబాటుగా గుర్తించబడదు.
 • ఓ సభ్యుడు/సభ్యురాలు చేసిన చిన్న మార్పు విషయంలో మీకు భేదాభిప్రాయం ఉంటే, ఆ సంగతిని మర్యాద పూర్వకంగా చర్చాపేజీలో గానీ, సభ్యుని వ్చర్చాపేజీ లో గానీ రాయండి.

మినహాయింపులు

[మార్చు]

ఓ పేజీలో జరిగిన చిట్ట చివరి దిద్దుబాటును నిర్వాహకుడు సెమీ ఆటోమాటిగ్గా వెనక్కు తీసుకుపోయే వీలు సాఫ్టువేరు కల్పిస్తోంది. వీటిని సాఫ్టువేరు చిన్న మార్పులుగానే గుర్తిస్తుంది. దీనికి కారణం.. ఈ అంశం యొక్క ఉద్దేశ్యం, పేజీలో జరిగిన దుశ్చర్యలను రద్దు చెయ్యడమే.

ఇంకా చూడండి

[మార్చు]