సహాయం:పరిచయం/ఎడిటరును ఎంచుకోండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ పాఠాలు చదివే ముందు మీ అభిరుచుల గురించి కొంత


దిద్దుబాటు అభిరుచులను ఇలా అమర్చుకోవాలి

మీ "అభిరుచులు"లో దిద్దుబాటు ట్యాబులో చేసుకున్ని కొన్ని అమరికలను బట్టి ఈ పాఠాల లోని పాఠ్యం, బొమ్మలు మీరు చూసే వికీ పేజీలకు సరిపోలుతాయి. వికీపీడియా ప్రధానంగా రెండు రకాల ఎడిటర్లను అందిస్తుంది - వికీటెక్స్టు ఎడిటరు, విజువల్ ఎడిటరు. వికీటెక్స్టు ఎడిటరులో మళ్ళీ రెండు రకాల పరికరాల పట్టీలున్నాయి. ఏ ఎడిటరును, ఏ పరికరాల పట్టీని ఎంచుకున్నారనేదాన్ని బట్టి మీ ఎడిటరుకు ఈ పాఠాల్లోని బొమ్మలకు పోలికలుంటాయి.

ఎడిటరును ఎంచుకోండి

కింది విధంగా మీ ఎడిటరును ఎంచుకోండి:

  1. పేజీలో అన్నిటికంటే పైన కుడివైపున ఉండే లింకుల్లోని "అభిరుచులు" నొక్కి, ఆ పేజీకి వెళ్ళండి
  2. అక్కడ "దిద్దుబాట్లు" ట్యాబుకు వెళ్ళండి
  3. అందులో "సవరణ టూల్ బార్ సచేతనం" లో టిక్కు పెట్టండి
  4. "విజువల్ ఎడిటర్ బీటా రూపంలో వున్నప్పుడు తాత్కాలికంగా అచేతనం చేయి." పెట్టెలో టిక్కు పెట్టి ఉంటే దాన్ని తీసెయ్యండి
  5. సవరణ విధం: కు అనుబంధంగా దాని కింద ఉన్న డ్రాప్‌డౌను పెట్టెలో కింది నాలుగు వికల్పాలు కనిపిస్తాయి:
    1. "క్రిందటిసారి వాడిన ఎడిటరును గుర్తుంచుకో" (కిందటిసారి మీరు వాడిన ఎడిటరునే మళ్ళీ చూపిస్తుంది)
    2. "వీలైతే అన్నివేళలా విజువల్ ఎడిటరునే ఇవ్వు" (విజువల్ ఎడిటరుకు అనుకూలంగా ఉన్న పేజీలలో దాన్ని చూపిస్తుంది. మిగతా పేజీల్లో వికీపాఠ్యం ఎడిటరును చూపిస్తుంది)
    3. "ఎల్లప్పుడూ వీకీపాఠ్యం ఎడిటరునే ఇవ్వు" (ఏ పేజీలో నైనా వికీపాఠ్యం ఎడిటరునే చూపిస్తుంది)
    4. "దిద్దుబాటు ట్యాబ్‌లు రెంటినీ చూపించు" (పేజీలో చదువు అనే ట్యాబు పక్కన సవరించు, మూలపాఠ్యం సవరించు అనే ట్యాబులను చూపిస్తుంది.)

సవరించు నొక్కి పేజీని దిద్దుబాటు స్థితిలో తెరిచినపుడు, పైవాటిలో మీరు ఏది ఎంచుకుంటే ఆ ఎడిటరు డిఫాల్టుగా కనిపిస్తుంది, అయితే వెంటనే, అక్కడికక్కడే, రెండో ఎడిటరుకు మారే సౌకర్యం కూడా ఎడిటరు లోనే ఉంటుంది. పక్కనున్న బొమ్మ చూడండి

మా సలహా: కొత్తవారు కాబట్టి, "వీలైతే అన్నివేళలా విజువల్ ఎడిటరునే ఇవ్వు" ను ఎంచుకొమ్మని మేం మీకు సలహా ఇస్తున్నాం. అది ఇంద్రియ సహజంగా ఉంటుంది. అంచేత వాడడం తేలిక.

ఎంచుకోవడం పూర్తయ్యాక, పేజీకి అడుగున ఉన్న "భద్రపరచు" బొత్తాన్ని నొక్కి మీ ఎడిటరు అమరికలను భద్రపరచండి.