సాందీపని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాందీపని భాగవత పురాణం ప్రకారం బలరాముడు, శ్రీ కృష్ణులకు గురువు.[1] అవంతిలో నివసించేవాడు.[2]

శ్రీకృష్ణుడు, సాందీపనికి గురుదక్షిణ చెల్లించుట

పురాణ కథ

[మార్చు]

సాందీపుని దగ్గర ఎంతోమంది శిష్యులు చదువుతుండగా వారిలో ఏకసంథాగ్రాహులైన బలరాముడు, శ్రీకృష్ణుడు మాత్రమే గురువు చెప్పిన విద్యలన్నీ నేర్చుకొని చదువులో ప్రావీణ్యం సంపాదించారు. చదువు పూర్తయిన తరువాత వారు సాందీపునిని గురుదక్షిణ గురించి అడుగగా, ప్రభాస (గుజరాత్ రాష్ట్రం పశ్చిమతీరంలోని సోమనాథ్ ఆలయానికి దగ్గరగా) సముద్రంలో అదృశ్యమైన తన బిడ్డను మళ్ళీ తెచ్చివ్వాలని సాందీపని కోరాడు. కొద్దికాలం క్రితం ఒకరోజు సాందీపుని కుమారుడు ప్రభాస తీర్థంలో స్నానం చేస్తుండగా పంచజనుడనే రాక్షసుడు మింగేశాడు. తమ ఏకైక కుమారుడు సముద్రంలో అదృశ్యమైనందుకు ముని దంపతులు ఎంతగానో వేదన అనుభవిస్తున్నారు.

గురువు కుమారుడిని తెచ్చిస్తామని బలరామకృష్ణులు, సాందీపునికి మాట ఇచ్చారు. వెంటనే ప్రభాస సముద్రం దగ్గరికి వెళ్ళి గురుపుత్రుని కోసం వెతకడం ప్రారంభించారు. వీరిని గమనించిన సముద్రుడు, స్నానం చేయడానికి తన దగ్గరికి వచ్చిన ముని కుమారుడిని పంచజనుడనే రాక్షసుడు మింగేశాడని చెప్పగా, బలరామకృష్ణులు కలిసి పంచజనుడునితో పోరాడి, వాడిని చంపివేశారు. ముని కుమారుడి కోసం కృష్ణుడు యుమలోకానికి వెళ్ళగా,యముడు తన వద్ద భద్రంగా దాచి ఉంచిన సాందీపని కుమారుణ్ణి కృష్ణుడికి ఇచ్చాడు. బలరామకృష్ణులు అతన్ని తీసుకొని వెళ్లి గురుదంపతులకు అప్పగించి తమ గురుదక్షిణ చెల్లించుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. http://vedabase.net/sb/10/45/en1
  2. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (11 June 2017). "బలరామకృష్ణులు". Sakshi. Archived from the original on 18 June 2017. Retrieved 12 July 2020. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 18 జూలై 2017 suggested (help)
"https://te.wikipedia.org/w/index.php?title=సాందీపని&oldid=3638091" నుండి వెలికితీశారు