సాక్షి రంగారావు
సాక్షి రంగారావు | |
---|---|
![]() ఛాయాచిత్రపటం. | |
మాతృభాషలో పేరు | సాక్షి రంగారావు |
జననం | రంగవఝుల రంగారావు సెప్టెంబర్ 15, 1942 |
మరణం | జూన్ 27, 2005 చెన్నై |
మరణానికి కారణం | గుండెపోటు, చక్కెర, మూత్రపిండాల వ్యాధి |
నివాసం | చెన్నై |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల, సినిమా నటుడు |
పిల్లలు | ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. |
తల్లిదండ్రులు | రంగనాయకమ్మ, లక్ష్మినారాయణ |
సాక్షి రంగారావు (సెప్టెంబర్ 15, 1942 - జూన్ 27, 2005) పూర్తి పేరు రంగవఝుల రంగారావు. గుడివాడ వద్ద నున్న కొండిపర్రు గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రులు రంగనాయకమ్మ, లక్ష్మినారాయణ. ఈయన నటించిన మొదటి సినిమా 1967లో విడుదలైన బాపూ-రమణల సాక్షి. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు అయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివ కూడా నటుడే. ఆయన సుమారు 450 సినిమాల్లో నటించాడు.[1]. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేటప్పుడే ఆయన కిష్టమైన నాటకరంగంలో విరివిగా పాల్గొనేవాడు. మొదట్లో ఆర్తితో నిండిన పాత్రల్లో నటించినా, సిరివెన్నెల, స్వర్ణకమలం, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ మొదలైన సినిమాల్లో చేసిన పాత్రలు ఆయన్ను హాస్యనటునిగా ప్రాముఖ్యం కల్పించాయి.
ఆయన నటించిన చివరి సినిమా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వరాభిషేకం. 2005, మే 5 వతేదీన గురజాడ వారి నాటకం కన్యాశుల్కం (నాటకం)లో గిరీశం పాత్రకు ఆయన రిహార్సల్ చేస్తుండగా గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కు తరలించిన తరువాత తుదిశ్వాస విడిచారు. ఆ నాటకంలో ఆయనకది డ్రీమ్ రోల్ అని తరచూ చెబుతూ ఉండేవారు.
చక్కెర వ్యాధి ముదిరి మూత్రపిండాలు పాడయిపోవడంతో చెన్నై వైద్యశాలలో జూన్ 27, 2005 రోజున 63 యేళ్ళ వయసులో మరణించారు.
నటించిన చిత్రాలు[మార్చు]
- చిన్నబ్బాయి (1997)[2]
- లింగబాబు లవ్ స్టోరీ (1995)
- శుభసంకల్పం (1995)
- యమలీల (1994)
- ఆ ఒక్కటీ అడక్కు (1993)
- డిటెక్టివ్ నారద (1993)
- జోకర్ (1993)
- కుంతీ పుత్రుడు (1993)
- స్వాతికిరణం (1992)
- చిట్టెమ్మ మొగుడు (1992)
- నా పెళ్ళాం నా ఇష్టం (1991)
- పెళ్ళి పుస్తకం (1991)
- ఏప్రిల్ 1 విడుదల (1991)
- కర్తవ్యం (1991)
- సూత్రధారులు (1990)
- చెవిలో పువ్వు (1990)
- ఈశ్వర్ (1989)
- స్వర్ణకమలం (1988)
- శ్రుతిలయలు (1987)
- చంటబ్బాయి (1986)
- సిరివెన్నెల (1986)
- శాంతినివాసం (1986)
- చట్టంతో పోరాటం (1985)
- మొగుడు పెళ్ళాలు (1985)
- రెండు రెళ్ళ ఆరు (1985)
- జననీ జన్మభూమి (1984)
- రెండు జెళ్ళ సీత (1983)
- సాగరసంగమం (1983)
- సితార (1983)
- మంచుపల్లకి (1982)
- శుభలేఖ (1982)
- రాధాకళ్యాణం (1981)
- గోపాలరావు గారి అమ్మాయి (1980)
- సప్తపది (1980)
- శుభోదయం (1980)
- శంకరాభరణం (1979)
- ఇద్దరూ అసాధ్యులే (1979)
- సిరి సిరి మువ్వ (1978)
- మనుషులు చేసిన దొంగలు (1977)
- ఈనాటి బంధం ఏనాటిదో (1977)[3]
- శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)
- ముత్యాల ముగ్గు (1975)
- దేవదాసు (1974)
- ఆడదాని అదృష్టం (1974)
- అల్లూరి సీతారామరాజు (1974) - లింగన్న
- దీక్ష (1974)
- అందాల రాముడు (1973)
- కాలం మారింది (1972)
- మట్టిలో మాణిక్యం (1971)
- సాక్షి (1967)
- సుడిగుండాలు (1967)
మూలాలు[మార్చు]
- ↑ http://www.hindu.com/2005/06/28/stories/2005062818720500.htm
- ↑ "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.
- ↑ Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.