సాగర సంగమం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సాగర సంగమం
(1983 తెలుగు సినిమా)
TeluguFilm Saagara Sangamam.jpg
దర్శకత్వం కె.విశ్వనాధ్
నిర్మాణం ఏడిద నాగేశ్వరరావు
రచన కె. విశ్వనాధ్
తారాగణం కమల్ హాసన్,
జయప్రద,
డబ్బింగ్ జానకి,
గీత,
శరత్ బాబు,
ఎస్.పి. శైలజ,
పొట్టి ప్రసాద్
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి,
ఎస్.పి.శైలజ
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
ఛాయాగ్రహణం పి.ఎస్. నివాస్
నిర్మాణ సంస్థ పూర్ణోదయా మూవీ క్రియేషన్స్
నిడివి 160 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సాగరసంగమం, జూన్ 3, 1983 లో విడుదలైన ఒక తెలుగు చిత్రము. అంతకు ముందే విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన శంకరాభరణం చిత్రం విజయనంతమైన నేపథ్యంలో సంగీత, నృత్య కథాత్మక చిత్రాలకు ఆదరణ హెచ్చింది. ప్రతిభ ఉన్నా గాని గుర్తింపు పొందని, ఒక శాస్త్రీయ నర్తకునిగా కమల్ హాసన్ నటించాడు. కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోకమల్ హాసన్ మరియు జయప్రద జంటగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో శరత్ బాబు మరియు ప్రముఖ గాయని శైలజ నటించారు. స్వరకల్పన ఇళయరాజా. ఇది తమిళంలో "సాలంగై ఓలి" అనే పేరుతో అనువదించబడి ఆ భాషలో కూడా విజయవంతంగా నడిచింది.

విశ్వనాధ్ మరియు కమల్ హాసన్‌ల నట జీవితంలో ఈ చిత్రానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. వీరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలలో ఇది ఒకటి. స్వాతిముత్యం మరియు శుభ సంకల్పం తక్కిన రెండు చిత్రాలు.

కథ[మార్చు]

నృత్యంలోనే సుఖాన్ని, దుఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్ధ కళాకారుని కథ ఇది. బాలకృష్ణ (కమల్ హాసన్) అనే పేద యువకుడు స్వయంకృషితో నాట్యం నేర్చుకొంటాడు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ రీతులలో ప్రవీణుడౌతాడు. కాని వాణిజ్యం, విచ్చలవిడితనం పెచ్చుమీరిన సినిమా రంగంలో ఇమడలేకపోతాడు. అతని ప్రతిభను గుర్తించిన మాధవి (జయప్రద) అనే యువతి అతనిని ప్రోత్సహిస్తుంది. ఢిల్లీలో మహామహుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో అతని నాట్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది. కాని చివరిక్షణంలో బాలకృష్ణ తల్లి (డబ్బింగ్ జానకి) చనిపోవడంతో అతడు నాట్య ప్రదర్శన పోటీలో పాల్గొనలేకపోయాడు. అతనికి తోడుగా నిలచిన మాధవిపై అతనికి ప్రేమ మొదలౌతుంది కాని మాధవికి అంతకు మునుపే పెళ్ళవుతుంది. వీరి ప్రేమ గుర్చి తన భర్తకు చెప్పి అతన్ని పిలిపిస్తాడు .అతను సమర్డించినప్పతటికి బాలకృష్ణ మాత్రం వారిరివురు కలసి భార్యభర్తలుగా ఉండాలని కాంక్షించి తన ప్రేమను పక్కకు పేడతాడు. తల్లి మరణం,ప్రేమ వైఫల్యంతో ఆత్మన్యూనతభావంతో బాలకృష్ణ దాదాపు తాగుబోతు అవుతాడు.

తరువాతి భాగంలో మాధవి కూతురు (శైలజ)కు బాలకృష్ణ గురువౌతాడు నాట్య కళ గొప్పతనం గురించి ఆమెకు తెలియజేస్తాడు.ఆపై ఆమె నాట్య ప్రదర్శనలో ఆమె నర్తిస్తుంది. అప్పటికే జనాల చప్పట్లు మరియు తన విద్యను చూసి విపరీతమైన ఆనందం పోంది నాట్య ప్రదర్శన చివర్లో బాలకృష్ణ మరణించడంతో కథ ముగుస్తుంది. చివరిగా కనిపించే మాట NO END FOR ANY ART (ఏ కళకు అంతం లేదు)

తారాగణం[మార్చు]

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1983 కె.విశ్వనాథ్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుని పురస్కారం - తెలుగు విజేత
కమల్ హాసన్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం - తెలుగు విజేత
జయప్రద ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం - తెలుగు విజేత
1984 ఇళయరాజా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు విజేత
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయకుడు విజేత

పాటలు[మార్చు]

ఈ చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: ఇళయరాజా.

పాటలు
సంఖ్య. పాట గానం నిడివి
1. "ఓం నమశ్శివాయ"   ఎస్.జానకి  
2. "తకిట తధిమి తకిట తధిమి తందాన"   బాలసుబ్రహ్మణ్యం  
3. "నాద వినోదము నాట్యవిలాసము"   బాలసుబ్రహ్మణ్యం  
4. "బాలా కనకమయ చేల"   ఎస్.జానకి  
5. "మౌనమేలనోయి ఈ మరపురాని రేయి"   ఎస్.జానకి, బాలసుబ్రహ్మణ్యం  
6. "వేదం అణువణువున నాదం"   బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ  
7. "వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే"   ఎస్.పి.శైలజ  

విశేషాలు[మార్చు]

  • ఈ చిత్రంలో దర్శకుడు నటుల హవభావాల ద్వారా,సన్నివేశమ్లొ చుట్టూ వున్న పరిస్థితుల ద్వారా భావాన్ని వ్యక్తపరిచారు.
  • కమల్ హాసన్ తకిట తదిమ పాట చివరిలో మాధవి నిండు ముత్తైదువుగా వర్షంలో కనపడగానే ఆశ్చర్యపడి వెంటనె వాన నీటికి చెరిగిపోతున్న నొసటబొట్టుకు చెయ్యి అడ్డు పెట్టి ఆమే
  • రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు చిత్రం ఇది.[1]
  • ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటించిన ప్రసిద్ధ గాయని ఎస్.పి. శైలజ తన జీవితానికి ఈ ఒక్క పాత్ర చాలునని మళ్ళీ నటించలేదు.[2]

మూలాలు, వనరులు[మార్చు]

  1. "సాక్షి దిన పత్రిక". ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక: 18. మార్చి 28, 2010.  Check date values in: |date= (help)
  2. "సాక్షి దిన పత్రిక". ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక: 18. మార్చి 28, 2010.  Check date values in: |date= (help)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సాగర_సంగమం&oldid=2319233" నుండి వెలికితీశారు