సాగి కమలాకర శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dr. Sagi Kamalakara Sharma
డాక్టర్ సాగి కమలాకర శర్మ
జననండాక్టర్ సాగి కమలాకర శర్మ
గ్రామం : జువ్విగూడెం, మండలం : నార్కట్ పల్లి, జిల్లా : నల్గొండ
నివాస ప్రాంతంహైదరాబాద్ భారత దేశము భారతదేశం
వృత్తితెలుగు ఆచార్యుడు
ఉద్యోగంఉస్మానియా విశ్వవిద్యాలయము
ప్రసిద్ధికవి, సంపాదకులు, జ్యోతిష్కులు
మతంహిందూ
తండ్రిసాగి జానకి రామశర్మ
తల్లిసాగి స్వరాజ్య లక్ష్మి
వెబ్‌సైటు
http://sksastro.blogspot.in//

డాక్టర్ సాగి కమలాకర శర్మ (Dr. Sagi Kamalakara Sharma) కవి, సంపాదకులు, జ్యోతిష్కులు. ఈయన తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

సాగి కమలాకర శర్మ సాగి జానకి రామశర్మ, స్వరాజ్య లక్ష్మి దంపతులకు నల్గొండ జిల్లాలో జన్మించాడు. మూసీ, జ్యోతిర్వాస్తు విజ్ఞానం, , ఉదయిని మాసపత్రికలకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నాడు .

విద్యాబ్యాసం[మార్చు]

అతను తెలుగు, సంస్కృతం, జ్యోతిష్యం,ఇంగ్లీష్, ఇలా నాలుగు భిన్న మార్గాలలో స్నాతకోత్తర విద్య పూర్తి చేసి, తెలుగులో జ్యోతిర్మయం వాఙ్మయం (ప్రాచీనాంధ్ర సాహిత్యములో జ్యోతిష విజ్ఞానం) అనే అంశంఫై పరిశోధన చేసి 2004లో ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి డాక్టరేట్ పొందాడు[2].

సాహిత్య ప్రస్థానం[మార్చు]

ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త పుస్తకాలు వెలువడ్డాయి. మాస పత్రికలు రంగులు మార్చుకుని, పేజీలు పెంచుకుని నిత్యంకంటే కొత్తగా సాహిత్యం, భాష మూలలను వెలికితీసి ప్రత్యేక సంచికలుగా పరఢవిల్లాయి. వీటిలో తెలంగాణ సాహిత్య అకాడమి సహాయం పొందినవి కొన్ని. అందులో ఒకటి ‘మూసీ’ మాస పత్రిక. ఈ పత్రిక ‘ఆలోకనం’ (31 జిల్లాల సాహిత్యం, చరిత్ర, సంస్కృతీ సమాహారం) పేరుతో బృహత్‌ గ్రంథాన్ని వెలువరించింది. దీనికి సంపాకునిగా సాగి కమలాకర శర్మ ఉన్నాడు. ప్రతి జిల్లా నుండి ఒక రచయితను ఎంచుకుని ‘ఆలోకనం’ కోసం అన్ని అంశాలతో కూడిన ఒక వ్యాసాన్ని రాయించాడు. ఆ 31 వ్యాసాల సమాహారమే ఈ గ్రంథం. ఇందులో అన్ని జిల్లాలకు ‘ఈ పేరెందుకు?’ తో మొదలుపెట్టి జిల్లా పరిధి, వనరులు, నేలలు, అడవులు, నదులు, ప్రాజెక్టులు, జనాభా, అక్షరాస్యత, జిల్లా చరిత్ర, సంస్కృతి, ఆచారాలు, పండగలు, కళలు, జాతరలు, సాహిత్యం, సాహిత్య సంస్థలు, దర్శణీయ ప్రదేశాలు, ముఖ్య దేవాలయాలు మొదలైన అంశాలను సమకూర్చి ఒక గ్రంథంగా వెలువరించింది. ఈ గ్రంథం అంతా ఏకరూపతను సంతరించుకుంది. ఏ జిల్లా వ్యాసాన్ని తీసినా ఒకే రూపంగా కనిపిస్తుంది. రచయితలు అందరు ఒకే విధంగా రాయడం అనేది అసాధ్యం. అంటే సంపాదకుల శ్రమ స్పష్టంగా వ్యక్తమౌతుంది. ప్రతి జిల్లాకు మ్యాపు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, కొంతమంది వ్యక్తుల చిత్రాలు రంగుల కాగితాలతో వేయడం వల్ల ‘ఆలోకనం’ చదువరులను మరింత అలరిస్తుందని అనిపిస్తుంది. సంపాదకుల ముందుమాట ప్రకారం ”జిల్లాల సర్వస్వాలు తయారు చేయడానికి ముందుగా అక్కడ మనకు లభించే సమాచారాన్ని గమనించాలంటే ఒక ముందు చూపు అవసరంగా భావించి తలపెట్టిన గ్రంథము మాత్రమే…” అని రాసారు. అంటే ఇవి పూర్తి సమగ్రమని కాదు. కాని ఈ వ్యాసాల ఆధారంగా ఆయా వ్యాసరచయితల సహాయాలతో 31 జిల్లాల సర్వస్వాలకు, సాహిత్య సంచికలకు శ్రీకారం చుట్టినట్లు ఈ మాటల వల్ల తెలుస్తుంది.

ఆధ్యాత్మిక ప్రస్థానం[మార్చు]

ప్రవచనాల జాబితా[మార్చు]

రచనల జాబితా[మార్చు]

 1. అందరికీ జ్యోతిషం
 2. జ్యోతిష కమలాకారం
 3. జ్యోతిర్మయం వాఙ్మయం
 4. జానపదుల జ్యోతిర్విజ్ఞానం
 5. ఆలోకనం - 31 జిల్లాల సమాచార దీపిక
 6. కదంబం - తెలుగు సాహిత్య ప్రక్రియలు - రూపాలు

అందుకున్న పురస్కారాలు[మార్చు]

 • దైవజ్ఞ రత్న
 • జ్యోతిష్య ప్రవీణ
 • జ్యోతిష్య మనీషి
 • జ్యోతిష్య విశారద
 • జ్యోతిష్య శిరోమణి
 • జ్యోతిష్య మార్తాండ
 • ఆంధ్ర భాష భూషణ
 • జ్యోతిర్ విద్య భూషణ
 • అతీంద్రియ శక్తి సంపన్నులు
 • రామరాజు జానపద విజ్ఞాన పురస్కారం
 • రాష్ట్రీయ వికాస్ శిరోమణి పురస్కార్ - ,

మూలాలు[మార్చు]

 1. "Ask Sagi Kamalakara Sharma, Consultant Astrologer on Clickastro.com". www.clickastro.com. Retrieved 2018-05-19.
 2. "Sagi Kamalakara Sharma". International Astrology Experts. 2015-03-26. Retrieved 2018-05-19.

ఇతర లింకులు[మార్చు]