Jump to content

సాదియా ఖతీబ్

వికీపీడియా నుండి
సాదియా ఖతీబ్
2025లో ఖతీబ్
జననం1997 సెప్టెంబర్ 18
భదేర్వా , జమ్మూ , భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2020-ప్రస్తుతం
తల్లిదండ్రులుఅయిలాస్ ఖతీబ్, షాహిదా ఖతీబ్
బంధువులుఅతిఫ్ ఖతీబ్ (సోదరుడు), రుమిసా ఖతీబ్ ( సోదరి)

సాదియా ఖతీబ్ భారతదేశానికి చెందిన సినిమా నటి . ఆమె విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో 2020లో విడుదలైన "షికారా " సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేషన్‌ను అందుకుంది.[1]

జననం & విద్యాభాస్యం

[మార్చు]

సాదియా ఖతీబ్ 1997 సెప్టెంబర్ 18న భారతదేశంలోని జమ్మూ , కాశ్మీర్‌లోని భదేర్వా నగరంలో అయిలాస్ ఖతీబ్, షాహిదా ఖతీబ్ దంపతులకు జన్మించింది.[2][3] ఆమె ప్రాథమిక విద్యను భదేర్వా పాఠశాలలో పూర్తి చేసి ఆ తరువాత జమ్మూలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (GCET) నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది.

సినీ జీవితం

[మార్చు]

సాదియా ఖతీబ్ 2020లో విడుదలైన "షికారా " సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి సినిమాలో 1990లో కాశ్మీర్‌లో జరిగిన తిరుగుబాటు సమయంలో తన భర్తతో కలిసి తన భూమిని వదిలి పారిపోవాల్సి వచ్చిన కాశ్మీరీ బ్రాహ్మణ మహిళ శాంతి ధర్ పాత్రను పోషించింది.[4] ఆమె ఆ తరువాత 2022లో రక్షా బంధన్ సినిమాలో అక్షయ్ కుమార్ సోదరి గాయత్రీ గాయత్రి అగర్వాల్ మిశ్రా పాత్రలో నటనకుగాను విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.[5] సాదియా 2025లో జాన్ అబ్రహంతో కలిసి ది డిప్లొమాట్‌లో నటించి పాకిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయ మహిళ ఉజ్మా అహ్మద్ పాత్రను పోషించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2020 షికారా శాంతి సప్రూ ధార్ [6]
2022 రక్షా బంధన్ గాయత్రి అగర్వాల్ మిశ్రా [7]
2025 ది డిప్లొమాట్ ఉజ్మా అహ్మద్ [8]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం పేరు విభాగం సినిమా ఫలితం మూ
2020 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ మహిళా అరంగేట్రం షికారా నామినేట్ [9]

మూలాలు

[మార్చు]
  1. "#Goobye2020! Sadia Khateeb: The highest moment was watching my first film 'Shikara' in theatres". The Times of India. 31 December 2020. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
  2. Purkayastha, Pallabi Dey. "'Shikara' actress Sadia Khateeb visits her home in Kashmir, bowls us over with these beautiful pictures!". The Times of India. Retrieved 23 January 2021.
  3. Kulkarni, Onkar. "Shikara actress Sadia Khateeb: This is the first festival I am celebrating away from my parents". The Times of India. Retrieved 10 July 2022.
  4. Purkayastha, Pallabi Dey. "#OneYearofShikara: Sadia Khateeb: Vidhu Vinod Chopra not only taught me the nuances of cinema but also the fundamentals of life". The Times of India.
  5. "Raksha Bandhan Actress Sadia Khateeb: My Brother Is Responsible For My Acting Career" (in ఇంగ్లీష్). Outlook India. 11 July 2022. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
  6. "'Shikara' Stars Sadia Khateeb & Aadil Khan Reveal Their Plans For 2021" (in ఇంగ్లీష్). ABP News. 3 January 2021. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
  7. "Raksha Bandhan actress Sadia Khateeb on criticism that film is regressive: People have perspectives and choices | Exclusive" (in ఇంగ్లీష్). India Today. 12 August 2022. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
  8. "Sadia Khateeb to play leading lady in The Diplomat opposite John Abraham" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 7 February 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
  9. "Nominations For The 66th Vimal Elaichi Filmfare Awards 2021". Filmfare (in ఇంగ్లీష్). 28 March 2021. Retrieved 28 March 2021.

బయటి లింకులు

[మార్చు]