సానియా మీర్జా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Sania Mirza
Sania mirza cincy 2007.JPG
దేశం  భారతదేశం
నివాసం Hyderabad, India
పుట్టిన రోజు (1986-11-15) నవంబరు 15, 1986 (వయస్సు: 29  సంవత్సరాలు)
జన్మ స్థలం hyderabad, తెలంగాణ, India
ఎత్తు 1.73 m (5 ft 8 in)
బరువు 57 కి.g (126 lb; 9.0 st)[1]
Turned Pro 2003
Plays Right (two-handed backhand)
Career Prize Money US$ 1,435,880
Singles
కరియర్ రికార్డ్: 202–105 (64.6%)
Career titles: 1 WTA, 12 ITF
అత్యున్నత ర్యాంకింగ్: No. 27 (August 27, 2007)
గ్రాండ్‌స్లామ్ ఫలితాలు
Australian Open 3r (2005, 2008)
French Open 2r (2007)
Wimbledon 2r (2005, 2007, 2008, 2009)
U.S. Open 4r (2005)
Doubles
Career record: 149–76
Career titles: 8 WTA, 4 ITF
Highest ranking: No. 18 (September 10, 2007)

Infobox last updated on: June 15, 2009.

Medal record
Women's Tennis
Asian Games
Gold 2006 Doha Mixed Doubles
Silver 2006 Doha Singles
Silver 2006 Doha Team

సానియా మీర్జా (హిందీ: सानिया मिर्ज़ा, ఉర్దూ: ثانیہ مرزا) భారతదేశమహిళా టెన్నిస్ క్రీడాకారిణి, ఆమె నవంబరు 15, 1986[1] న జన్మించింది. 2003లో ఆమె అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆమెకు 2004లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు అందజేసింది.

ప్రారంభ జీవితం[మార్చు]

ముంబయిలో వృత్తిరీత్యా క్రీడా విలేకరి అయిన ఇమ్రాన్ మీర్జా, నసీమా దంపతులకు మీర్జా జన్మించింది. హైదరాబాద్‌లోని ఒక ముస్లిం కుటుంబంలో ఆమె పెరిగింది.[2][3] ఆరేళ్ల వయస్సు నుంచే టెన్నిస్ ఆడటం ప్రారంభించిన మీర్జా 2003లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది. తండ్రి వద్ద, అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యుల వద్ద సానియా శిక్షణ పొందింది. హైదరాబాద్‌లోని నాసర్ పాఠాశాలలో చదువుకున్న ఆమె సెయింట్ మేరీ కళాశాల నుంచి పట్టభధ్రురాలైంది.[4][5]

క్రీడా జీవితం[మార్చు]

ఏప్రిల్ 2003లో, మీర్జా భారత ఫెడరేషన్ కప్ జట్టులోకి అడుగుపెట్టింది, ఆడిన మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలు సాధించిపెట్టింది. రష్యాకు చెందిన అలీసా క్లైబానోవాతో కలిసి మీర్జా 2003 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ బాలికల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది.

భారత్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచిన మీర్జా తన క్రీడా జీవితంలో సింగిల్స్‌లో 27వ ర్యాంకు, డబుల్స్‌లో 18వ ర్యాంకు సాధించింది. అంతేకాకుండా గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సీడ్ పొందిన తొలి భారత మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. 2005 U.S. ఓపెన్ సందర్భంగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నాలుగో రౌండుకు చేరుకున్న తొలి భారత మహిళగా ఆమె నిలిచింది. మషోనా వాషింగ్టన్, మరియా ఎలెనా కామెరీన్ మరియు మరియా బర్తోలీలను ఓడించి సానియా ఈ ఘనత సాధించింది. 2004లో, ఆమె ఏషియన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ రన్నరప్‌గా (ద్వితీయ స్థానం) నిలిచింది. మహేష్ భూపతితో కలిసి 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న ఆమె, గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది.

2005లో మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండులోకి అడుగుపెట్టింది, ఈ రౌండులో టైటిల్ విజేత సెరెనా విలియమ్స్ చేతిలో పరాజయం పాలైంది. ఫిబ్రవరి 12, 2005న, WTA సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారత మహిళగా సానియా మరో రికార్డు నెలకొల్పింది, హైదరాబాద్ ఓపెన్ ఫైనల్‌లో ఉక్రేయిన్‌కు చెందిన అల్యోనా బోండరెంకోను ఓడించి ఆమె ఈ ఘనత దక్కించుకుంది. సెప్టెంబరు 2006 నుంచి, మీర్జా ముగ్గురు టాప్- 10 క్రీడాకారిణిలను ఓడించింది; అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణిలు స్వెత్లానా కుజ్నెత్సోవా, నదియా పెట్రోవా, మార్టినా హింగిస్‌లపై ఆమె విజయం సాధించింది. 2006 దోహా ఆసియా క్రీడలు సందర్భంగా, మీర్జా మహిళల సింగిల్స్ విభాగంలో వెండి పతకం, లియాండర్ పేస్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇదే టోర్నీ జట్టు విభాగంలో వెండి పతకాన్ని గెలుచుకున్న భారత మహిళల జట్టులోనూ సానియా సభ్యురాలిగా ఉంది.

2006లో, టెన్నిస్ క్రీడాకారిణిగా సాధించిన విజయాలకు గుర్తుగా మీర్జాకు భారత్‌లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది.[6]

2007 వేసవి హార్డ్‌కోర్ట్ సీజన్‌లో మీర్జా తన క్రీడా జీవితంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించింది, 2007 U.S. ఓపెన్ సిరీస్ ఫలితాల్లో ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచింది. బ్యాంక్ ఆఫ్ ది వెస్ట్ క్లాసిక్ ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు, షహర్ పీర్‌తో కలిసి ఈ టోర్నీ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది మరియు టైర్ 1 అకురా క్లాసిక్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.

2007 U.S. ఓపెన్‌లో మహిళల సింగిల్స్ మూడో రౌండులోకి అడుగుపెట్టిన మీర్జా, ఈ మ్యాచ్‌లో మాత్రం అన్నా చక్వెతడ్జే చేతిలో పరాజయం పాలైంది, ఆ సమయంలో చక్వతడ్జే చేతిలో ఆమె వెంటవెంటనే మూడుసార్లు ఓటమి చవిచూసింది. ఈ టోర్నీ డబుల్స్‌లో మాత్రం ఆమె బాగా రాణించింది. మహేష్ భూపతితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్‌లోకి, రెండో సీడ్ లిసా రేమండ్ మరియు సమంతా స్టోసూర్‌పై విజయంతోపాటు, బెథానీ మాటెక్‌తో కలిసి మీర్జా మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.

బీజింగ్‌లో జరిగిన 2008 వేసవి ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. సింగిల్స్‌లో, చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ఐవెటా బెనసోవాతో జరిగిన 64వ రౌండు మ్యాచ్‌లో 6-1, 2-1తో వెనుకబడిఉన్న సమయంలో ఆమె అర్ధాంతరంగా వైదొలిగింది. డబుల్స్ విభాగంలో ఆమె సునీతా రావుతో జతకట్టింది. 32వ రౌండులో వారికి వాకోవర్ (ఆడాల్సిన అవసరం లేకుండా) లభించింది, అయితే వారికి 16వ రౌండులో రష్యా జోడి స్వెత్లానా కుజ్నెత్సోవా- దినారా సఫీనా చేతిలో 4-6, 4-6,తో పరాజయం ఎదురైంది.

చెన్నైలోని MGR విశ్వవిద్యాలయం నుంచి మీర్జా 2008-12-11న గౌరవ డాక్టరేట్ పొందింది.[7] ఆమె మేనకోడలు సోనియా బైగ్ మీర్జా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకుంది.

2008[మార్చు]

హోబర్ట్‌లో ఆరో సీడ్ క్రీడాకారిణిగా బరిలో దిగిన సానియా క్వార్టర్స్ వరకు చేరుకుంది, ఇక్కడ మాత్రం ఫ్లావియా పెన్నెట్టా చేతిలో మూడు సెట్లలో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 31వ సీడ్‌గా అడుగుపెట్టిన ఆమె మూడో రౌండుకు చేరుకుంది, ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను కైవసం చేసుకున్న తరువాత ఎనిమిదో సీడ్ వీనస్ విలియమ్స్ 3-5 7-6(0) 6-4 చేతిలో ఓటమి చవిచూసింది. మహేష్ భూపతిలో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో సున్ టియాన్టియాన్ మరియు నెనాద్ జిమాంజిక్ 7–6(4), 6–4 స్కోరుతో విజయం సాధించారు.

ఎడమ కండరం నొప్పి కారణంగా పట్టాయా నగరం నుంచి మీర్జా వెనుదిరిగింది.

మీర్జా 21వ సీడ్‌గా ఇండియన్ వెల్స్ నాలుగో రౌండులోకి అడుగుపెట్టింది, ఈ క్రమంలో తొమ్మిదో సీడ్ షహర్ పీర్‌ను కూడా ఓడించిన ఆమె నాలుగో రౌండులో మాత్రం ఐదో సీడ్ డేనియేలా హంతుచోవా చేతిలో పరాజయం పాలైంది.

2008 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్‌లో 32వ సీడ్‌గా బరిలో దిగిన మీర్జా 6-0, 4-6, 9-7 స్కోరుతో క్వాలిఫైయర్ మరియా జోస్ మార్టినెజ్ శాంచెజ్ చేతిలో ఓటమి చవిచూసింది.

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఐవెటా బెనసోవాతో జరుగుతున్న తొలి రౌండు నుంచి కుడి మణికట్టు గాయం కారణంగా మీర్జా అర్ధాంతరంగా తప్పుకుంది. 2008 మొత్తంమీద, మీర్జాకు అనేక మణికట్టు గాయాలు అయ్యాయి, ఈ కారణంగా ఆమె అనేక మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది, రోలాండ్ గారోస్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లకు కూడా ఆమె దూరమైంది.

2009[మార్చు]

2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా ఆమె తన క్రీడా జీవితంలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మహేష్ భూపతితో కలిసి ఆమె మెల్‌బోర్న్‌లో గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. టైటిల్ పోరులో భూపతి- మీర్జా జోడి 6-3, 6-1తో నథాలీ డెచై (ఫ్రాన్స్)- ఆండీ రామ్ (ఇజ్రాయెల్) జోడిని ఓడించింది. ఆ తరువాత బ్యాంకాక్‌లో జరిగిన పట్టాయా ఉమెన్స్ ఓపెన్ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన సానియా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఫైనల్స్‌లో వెరా జ్వోనరెవా చేతిలో 7-5, 6-1తో ఆమె పరాజయం పాలైంది. ఇదే టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకుంది.

సానియా ఆ తరువాత BNP పారిబాస్ ఓపెన్‌లో ఆడింది. ఇక్కడ రెండో రౌండులో ఫ్లావియా పెన్నెట్టా చేతిలో ఆమె కంగుతింది. ఆమె తరువాత మియామీ మాస్టర్స్ బరిలో దిగింది. ఇక్కడ తొలి రౌండులో ఫ్రాన్స్‌కు చెందిన మాథిల్డే జోహాన్సోన్ చేతిలో పరాజయం చవిచూసింది. మీర్జా, ఆమె డబుల్స్ భాగస్వామి చియా-జుంగ్ చువాంగ్ (చైనీస్ తైపీ) ఈ టోర్నమెంట్ డబుల్స్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. MPS గ్రూప్ ఛాంపియన్‌షిప్స్ తొలి రౌండు నుంచే ఇంటిముఖం పట్టిన సానియా, చువాంగ్‌తో కలిసి ఈ టోర్నీ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. కజకిస్థాన్ క్రీడాకారిణి గాలీనా వోస్కోబోవాపై ఓటమితో రోలాండ్ గారోస్ తొలి రౌండు నుంచే ఆమె ఇంటిముఖం పట్టింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ (చువాంగ్‌తో), మిక్స్‌డ్ డబుల్స్ (మహేష్ భూపతితో) రెండో రౌండు మ్యాచ్‌ల్లో ఆమెకు పరాజయాలు ఎదురయ్యాయి. 2009లో ఆమె AEGON క్లాసిక్‌లో పాల్గొని టోర్నీ సెమీఫైనల్స్‌కు చేరుకుంది, ఈ టోర్నీ టైటిల్ విజేతగా నిలిచిన స్లొవేకియా క్రీడాకారిణి మాగ్దాలెనా రైబారికోవాపై మీర్జా సెమీస్‌లో పరాజయం పాలైంది.

2009 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్ తొలి రౌండులో అన్నా-లెనా గ్రోనెఫెల్డ్‌ను మీర్జా ఓడించింది. అనంతరం రెండో రౌండులో 28వ సీడ్ సోరనా సిర్‌స్టెయా చేతిలో ఆమెకు పరాజయం ఎదురైంది. లెగ్జింగ్టన్ ఛాలెంజర్ టోర్నీ ఫైనల్స్‌లో టాప్ సీడ్ ఫ్రాన్స్ క్రీడాకారిణి జూలీ కాయిన్‌ను ఓడించి మీర్జా టైటిల్ గెలుచుకుంది. వాన్‌కోవర్‌లో జరిగిన ITF టోర్నీలో ఆమె ఫైనల్‌లోకి అడుగుపెట్టింది, అయితే ఇక్కడ కెనడా క్రీడాకారిణి స్టెఫానీ డుబోయిస్ చేతిలో పరాజయం పాలైంది. U.S ఓపెన్‌లో, మహిళల సింగిల్స్ తొలి రౌండులో ఆమె ఓల్గా గోవార్ట్‌సోవాను ఓడించింది, తరువాతి రౌండులో పదో సీడ్ ఇటలీ క్రీడాకారిణి ఫ్లావియా పెన్నెట్టా చేతిలో 6-0, 6-0తో మీర్జా పరాజయం చవిచూసింది. ఈ టోర్నీ డబుల్స్ రెండో రౌండులో మీర్జాకు (ఫ్రాన్సెస్కా చియావోన్‌తో కలిసి) షహర్ పీర్- గిసెలా డుల్కో జోడి చేతిలో ఓటమి ఎదురైంది.

టోక్యోలో జరిగిన టొరాయ్ పాన్ ఫసిఫిక్ ఓపెన్‌కు ఎంపికయినప్పటికీ, తొలి రౌండులో జెంగ్ జీ చేతిలో మీర్జా పరాజయం పాలైంది. తొలి సెట్‌ను కైవసం చేసుకున్న మీర్జా ఆ తరువాత ఆధిక్యాన్ని నిలుపుకోవడంలో విఫలమైంది, ఫలితంగా మీర్జా 7-5, 2-6, 3-6తో ఈ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూసింది.

కెరీర్ ఫైనల్స్[మార్చు]

సింగిల్స్[మార్చు]

విజయాలు (1 WTA/12 ITF)[మార్చు]

నాలుగుసార్లు ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది; 2005 హైదరాబాద్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది.

2007 ఆస్ట్రేలియన్ ఓపెన్, మహిళల డబుల్స్ తొలి రౌండు మ్యాచ్ సందర్భంగా సానియా మీర్జా

డబుల్స్[మార్చు]

విజయాలు (12)[మార్చు]

లెజెండ్: 2009కి ముందు లెజెండ్: 2009లో ప్రారంభం
గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లు (0)
WTA ఛాంపియన్‌షిప్‌లు (0)
టైర్ I (0) ప్రీమియర్ మాండేటరీ (0)
టైర్ II (2) ప్రీమియర్ 5 (0)
టైర్ III (3) ప్రీమియర్ (0)
టైర్ IV & V (2) అంతర్జాతీయ (1)
ITF సర్క్యూట్ (4)

ZCVV

నెం. తేదీ టోర్నమెంట్ ఉపరితలం భాగస్వామి ఫైనల్‌లో ప్రత్యర్థులు స్కోరు
1. జనవరి 7, 2002 మనీలా, ఫిలిప్పీన్స్ హార్డ్ కోర్టు భారత దేశం రాధిక తుల్పులే చైనా యాన్-హువా డోంగ్
చైనా యావో జాంగ్
6–4, 6–3
2. మార్చి 3, 2003 బెనిన్ నగరం, నైజీరియా హార్డ్ United Kingdom రెబెక్కా డాండెనియా జర్మనీ ఫ్రాన్జిస్క్ ఎట్జెల్
Austria క్రిస్టినా ఒబెర్మోసెర్
6–3, 6–0
3. ఫిబ్రవరి 22, 2004 హైదరాబాద్, భారత్ హార్డ్ దక్షిణ ఆఫ్రికా లీజెల్ హుబెర్ చైనా టింగ్ లీ
చైనా టియాన్టియాన్ సున్
7–6, 6–4
4. ఆగస్టు 15, 2004 లండన్, గ్రేట్ బ్రిటన్ హార్డ్ భారత దేశం రుష్మీ చక్రవర్తి United Kingdom అన్నా హాకిన్స్
దక్షిణ ఆఫ్రికా నికోలే రెంకెన్
6–3, 6–2
5. అక్టోబరు 10, 2004 లాగోస్, నైజీరియా హార్డ్ New Zealand షెల్లే స్టీఫెన్స్ దక్షిణ ఆఫ్రికా సురీనా డి బీర్
దక్షిణ ఆఫ్రికా ఛానెల్లే షీపెర్స్
6–1, 6–4
6. ఫిబ్రవరి 19, 2006 బెంగళూరు, భారత్ హార్డ్ దక్షిణ ఆఫ్రికా లీజెల్ హుబెర్ Russia అనస్టాసియా రోడియోనోవా
Russia ఎలెనా వెస్నినా
6–3, 6–3
7. సెప్టెంబరు 24, 2006 సన్‌ఫీస్ట్ ఓపెన్, భారత్ కార్పెట్ కోర్టు దక్షిణ ఆఫ్రికా లీజెల్ హుబెర్ Ukraine యులియా బైగెల్జిమెర్
Ukraineయులియానా ఫెడక్
6–4, 6–0
8. మే 14, 2007 ఫెస్, మొరాకో మట్టి కోర్టు అమెరికా సంయుక్త రాష్ట్రాలు వానియా కింగ్ Romania ఆండ్రియా వాన్‌‍సి
Russia అనస్టాసియా రోడియోనోవా
6–1, 6–2
9. జులై 22, 2007 సిన్సినాటి, U.S. హార్డ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు బెథానీ మాటెక్ Russia అలీనా జిడ్కోవా
Belarus టటియానా పౌచెక్
7–6(4), 7–5
10. జులై 29, 2007 స్టాన్‌ఫోర్డ్, U.S. హార్డ్ Israel షహర్ పీర్ Belarus విక్టోరియా అజరెంకా
Russia అన్నా చక్వెతడ్జే
6–4, 7–6(5)
11. ఆగస్టు 25, 2007 న్యూ హెవెన్, U.S. హార్డ్ ఇటలీ మారా శాంటాంగెలో Zimbabwe కారా బ్లాక్
దక్షిణ ఆఫ్రికా లీజెల్ హుబెర్
6–2, 6–2
12. ఏప్రిల్ 12, 2009 పోంటే వెద్రా బీచ్, U.S. మట్టి కోర్టు చైనీస్ తైపీ చువాంగ్ చియా-జుంగ్ Czech Republic క్వెటా పెస్కే
అమెరికా సంయుక్త రాష్ట్రాలు లిసా రేమండ్
6–3, 4–6, [10–7]

మిక్స్‌డ్ డబుల్స్ (1)[మార్చు]

విజయాలు (1)[మార్చు]

సంవత్సరం ఛాంపియన్‌షిప్ భాగస్వామి ఫైనల్‌లో ప్రత్యర్థులు స్కోరు/ఫైనల్
2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ భారత దేశం మహేష్ భూపతి ఫ్రాన్స్ నథాలీ డెచై
Israel ఆండీ రామ్
6–3, 6–1
2007 ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా మీర్జా

కాలక్రమానుసారంగా సింగిల్స్ ప్రదర్శన[మార్చు]

మూస:Performance timeline legend

NM5 అంటే ప్రీమియర్ మాండేటరీ లేదా ప్రీమియర్ 5 టోర్నమెంట్.

అస్పష్టత మరియు రెండుసార్లు లెక్కింపును నివారించేందుకు, టోర్నమెంట్‌కు ఒకసారి లేదా టోర్నమెంట్‌లో క్రీడాకారుల పాత్ర ముగిసిన తరువాత ఈ పట్టికను తాజా పరుస్తారు. ఇక్కడ ఇచ్చిన పట్టిక పారిస్, ఫ్రాన్స్‌లో జూన్ 6న ముగిసిన 2009 ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా చివరిసారి తాజా పరచబడింది.

టోర్నమెంట్ 2004 2005 2006 2007 2008 2009 కెరీర్ స్కోరు కెరీర్
విజయాలు- పరాజయాలు
గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లు
ఆస్ట్రేలియన్ ఓపెన్ A 3వ రౌండు 1వ రౌండు 2వ రౌండు 3వ రౌండు 2వ రౌండు 0 / 4 7–4
ఫ్రెంచ్ ఓపెన్ align="center" style= A A* 1వ రౌండు 2వ రౌండు align="center" style= A 1వ రౌండు 0 / 3 7–3
వింబుల్డన్ align="center" style= A* A 1వ రౌండు A 2వ రౌండు 2వ రౌండు 0 / 3 7–3
U.S. ఓపెన్ A 4వ రౌండు 2వ రౌండు 3వ రౌండు align="center" style= A* 2వ రౌండు 0 / 3 6–3
స్కోరు 0 / 0 0 / 2 0 / 4 0 / 2 0 / 3 0 / 2 0 / 12 N/A
విజయాలు- పరాజయాలు 0–0 2–2 9–4 5–2 4–3 1-1 N/A 21–12
ఒలింపిక్ క్రీడలు
వేసవి ఒలింపిక్స్ A జరగలేదు 1వ రౌండు NH 0 / 1 4–2
ఏడాది- ముగింపు పోటీలు
WTA టూర్ ఛాంపియన్‌షిప్‌లు A A A A align="center" 0 / 0 0–0
WTA ప్రీమియర్ మాండేటరీ టోర్నమెంట్‌లు
ఇండియన్ వెల్స్ A A 4వ రౌండు సెమీ ఫైనల్ A 4వ రౌండు 0 / 2 10–3
మియామీ A A 2వ రౌండు క్వార్టర్ ఫైనల్ A క్వార్టర్ ఫైనల్ 0 / 3 8–3
మాడ్రిడ్ జరగలేదు 2వ రౌండు 0 / 1 1–1
బీజింగ్ టైర్ I కాదు align="center" 0 / 0 0–0
WTA ప్రీమియర్ 5 టోర్నమెంట్‌లు
దుబాయ్ టైర్ I కాదు 1వ రౌండు 0 / 1 0–1
రోమ్ A A A A A* 1వ రౌండు 0 / 1 0–1
సిన్సినాటి టైర్ I కాదు align="center" 0 / 0 0–0
మాంట్రెయల్/టొరంటో A 3వ రౌండు 1వ రౌండు A A align="center" 0 / 2 2–2
టోక్యో A A A 2వ రౌండు 1వ రౌండు align="center" 0 / 2 1–2
గతంలో WTA టైర్ I టోర్నమెంట్‌లు (ప్రస్తుతం ప్రీమియర్ మాండేటరీ లేదా ప్రీమియర్ 5 టోర్నీలు)
కార్లేస్టోన్ A A A 3వ రౌండు A NM5 0 / 1 1–1
మాస్కో A A 1వ రౌండు A 1వ రౌండు 0 / 2 0–2
దోహా1 టైర్ I కాదు సెమీ ఫైనల్ కాదు
జరిగింది
0 / 1 4–1
బెర్లిన్ A A సెమీ ఫైనల్ 2వ రౌండు A 0 / 2 5–2
శాన్‌డియాగో1 A A A A కాదు
జరిగింది
0 / 0 0–0
జ్యూరిచ్1 A A A A కాదు
టైర్ I
0 / 0 0–0
క్రీడా జీవిత గణాంకాలు
గెలిచిన టోర్నమెంట్‌లు 1 1 N/A 2
ద్వితీయ స్థానం 1 1 2 N/A 4
మొత్తం మీద విజయాలు- పరాజయాలు 6–1 23–14 40–21 23–13 29–15 21–10 N/A 127–63 2
ఏడాది ముగింపు ర్యాంకు 80 57 21 29 23 align="center" N/A N/A
 • A = టోర్నమెంట్‌లో పాల్గొనలేదు
 • Q = క్వాలిఫైయింగ్ రౌండులో పరాజయం

పచ్చరంగు బాక్సులు విజయాలను సూచిస్తున్నాయి. పసుపు రంగులోని బాక్సులు టాప్- 8 (క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఫైనల్స్‌కు).

 • 12008 నుంచి, శాన్‌డియాగో మరియు జ్యూరిచ్ స్థానంలో దోహాకు టైర్ I టోర్నమెంట్ అర్హత లభించింది.
 • 2 ITF మహిళల సర్క్యూట్‌లో పాల్గొన్న సందర్భాలను కూడా చేర్చితే, మొత్తంమీద ఆమె విజయాలు- పరాజయాల గణాంకాలు 272-89 వద్ద నిలుస్తాయి.

వివాదం[మార్చు]

ముస్లిం మత గ్రూపులు టెన్నిస్ ఆడే సమయంలో సానియా మీర్జా వస్త్రధారణపై ఆగ్రహం వ్యక్తం చేశాయి, రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు, రంజాన్ సందర్భంగా ఉపవాసాలు చేసే ముస్లిం సమాజంలో భాగమైన ఆమె టెన్నిస్ కోసం దుస్తులు విషయంలో మత పట్టింపులను పక్కనబెట్టడం వివాదాస్పదమైంది.[3] సెప్టెంబరు 8, 2005న ప్రచురితమైన ఒక కథనం ప్రకారం.. గుర్తుతెలియని ముస్లిం మతపెద్ద ఒకరు ఇస్లాంకు మహిళల టెన్నిస్ విరుద్ధమని చెబుతూ ఫత్వా జారీ చేశారు.[8] అయితే ఆల్- ఇండియా షియా ముస్లిం పర్సనల్ లా బోర్డు గుర్తుతెలియని మతపెద్ద(లు) జారీ చేసిన ఈ ఫత్వాను తోసిపుచ్చింది, అంతేకాకుండా క్రీడల్లో అనవసరంగా జోక్యం చేసుకోరాదని వారిని కోరింది.[ఆధారం కోరబడినది]. సానియా క్రీడా జీవితానికి అడ్డంకులు సృష్టిస్తున్నట్లు వచ్చిన పుకార్లను తోసిపుచ్చుతూ జమియాత్-ఉలేమా-ఎ-హింద్ సంస్థ తాము ఎవరినీ క్రీడల్లో పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించమని స్పష్టం చేసింది, అయితే ఆ సంస్థ మహిళా టెన్నిస్ క్రీడాకారుల వస్త్ర నియమావళి అభ్యంతరకరంగా ఉందని పేర్కొంది. అయితే అదే సమయంలో, కలకత్తా పోలీసులు ఆమె రక్షణ కోసం భద్రతను పటిష్టపరిచారు.[9]

నవంబరు 2005లో సురక్షిత శృంగారంపై విలేకరుల సమావేశంలో సానియా మీర్జా మాట్లాడిన తరువాత, కొన్ని గ్రూపులు "ఆమెను ఇస్లాం నుంచి వేరుచేశాయి", ఆమె "యువతను పాడుచేస్తుందంటూ" వ్యాఖ్యానించాయి. తరువాత మీర్జా వివాహానికి ముందు శృంగారానికి తాను కూడా వ్యతిరేకమని స్పష్టమైన వివరణ ఇచ్చింది.[10]

ప్రపంచ టైటిల్[మార్చు]

2006లో, భారత ముస్లిం వర్గం నిరసనలకు భయపడి ఇజ్రాయెల్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి షహర్ పీర్‌తో కలిసి ఆడేందుకు మీర్జా నిరాకరించినట్లు కొన్ని వార్తాపత్రికలు పేర్కొన్నాయి.[10] అయితే ఏడాది తరువాత (అంటే 2007లో), 2007 WTA స్టాన్‌ఫోర్డ్ టూర్, కాలిఫోర్నియా కోసం పీర్‌తో సానియా మళ్లీ జట్టు కట్టింది, ఈ సందర్భంగా ఎటువంటి నిరసనలు జరగలేదు.

2008 హోప్‌మన్ కప్ సందర్భంగా జరిగిన ఒక విలేకరుల సమావేశంలో సానియా మీర్జా ఎదురుగా ఉన్న భారత జాతీయ పతాకంవైపుకు రెండు కాళ్లు చూపిస్తూ కూర్చున్న ఛాయాచిత్రాలు బయటపడ్డాయి.[11] ఒక ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. ఈ వివాదం కారణంగా జాతీయ గౌరవ చిహ్నాలకు అవమానాలు నిరోధించే చట్టం కింద ఆమెకు శిక్ష పడుతుందని ప్రచారం జరిగింది. "నా దేశాన్ని నేను కూడా ప్రేమిస్తున్నాను కాబట్టే హోప్‌మన్ కప్‌లో ఆడుతున్నానని" మీర్జా ఈ వివాదంపై నిరసన వ్యక్తం చేసింది.

ఫిబ్రవరిలో 4, 2008న, మరో నెలలో బెంగళూరు ఓపెన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మీర్జా భారత్‌లో టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడటం మానుకుంటానని ప్రకటించింది. వరుస వివాదాల కారణంగా, తన మేనేజర్ సూచనలపై ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.[12]

వ్యక్తిగత జీవితం[మార్చు]

హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమారుడు, పాఠశాలకు వెళ్లే రోజుల నుంచి తనకు తెలిసిన సోహ్రాబ్ మీర్జాతో సానియా మీర్జాకు నిశ్చితార్థం జరిగింది.కానీ వ్యక్తిగత కారణాలవలన అది రద్దు అయ్యింది. తరువాత ఈమె పాకిస్తాన్ దేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్ ని అనేక వివాదాల నడుమ వివాహం చేసుకుంది.సానియాకు ఇది మొదటి వివాహము కాగా షోయబ్ కి ఇది రెండవ వివాహము.[13][14][15]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 "Sania Mirza profile". Retrieved 2009-06-04. 
 2. సానియా మీర్జా- టెన్నిస్ స్టార్ రహస్యం మరియు మరిన్ని వివరాలు స్పోర్టింగో.
 3. 3.0 3.1 అమేలియా జెంటిల్‌మన్ (5 ఫిబ్రవరి 2006) ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గార్డియన్. 2009-09-30న సేకరించబడింది.
 4. http://www.saniyamirza.org/biography.html
 5. http://www.webindia123.com/personal/sports/sania.htm
 6. "Sania Mirza gets Padma Shri". Rediff. Retrieved March 9, 2009. 
 7. http://www.hindu.com/2008/12/12/stories/2008121255701700.htm
 8. Randeep Ramesh (2005). "Fatwa orders Indian tennis star to cover up". The Guardian. Retrieved April 11 2007.  Unknown parameter |dateformat= ignored (help); Check date values in: |accessdate= (help)
 9. ""Protection for Indian tennis star"". 2005. Retrieved April 27 2007.  Unknown parameter |dateformat= ignored (help); Check date values in: |accessdate= (help)
 10. 10.0 10.1 ""Sania Mirza Indian tennis star refuses to play with Israeli"". 2006. Retrieved April 27 2007.  Unknown parameter |dateformat= ignored (help); Check date values in: |accessdate= (help)
 11. "Sania Mirza 'considered quitting'". BBC. 
 12. "Mirza boycotts Indian tournaments". BBC. Retrieved 2008-04-02. 
 13. "India's Mirza finds her love match". The Guardian. 29 May 2009. Retrieved 2009-05-29. 
 14. "Sania, Sohrab have been friends for long". Times of India. 29 May 2009. Retrieved 2009-05-29. 
 15. "Sania tied in love-all match, getting engaged to Sohrab". IBN Live. 29 May 2009. Retrieved 2009-05-29. 

మూలములు[మార్చు]

 1. ఇండియా టుడే తేదీ. సెప్టెంబరు 19, 2005 - సానియా మీర్జా పేరుతో కవర్ స్టోరీ.
 2. ^ సానియా మీర్జాకు పద్మశ్రీ ,January 26, 2006
 3. అదనపు ఆధారం కోసం సానియా అన్వేషణలు
 4. సానియా మీర్జాకు డాక్టరేట్ ప్రదానం

బాహ్య లింకులు[మార్చు]