సామల రమేశ్ బాబు
సామల రమేశ్ బాబు వృత్తి రీత్యా వైద్యుడు. అతను నేటితరం మాతృభాషకు దూరమవుతున్న పరిస్థితుల్లో మాతృభాష పరిరక్షణ కోసం, పదేళ్ల క్రితమే వైద్యవృత్తిని వదిలేసి, 67 ఏళ్ల వయసులో కూడా నిరంతరం భాషోద్యమంలో పాలుపంచుకుంటున్న వ్యక్తి.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను గుంటూరు లయోలా కళాశాలలో విద్యనభ్యసించాడు. అతను ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న ఈ సమయంలో భాషా అంశాలే ప్రధానంగా వస్తున్న 'నడుస్తున్న చరిత్ర' మాసపత్రికకు సంపాదకుడు.[1] Archived 2013-08-17 at the Wayback Machine అతను తెలుగు భాషోద్యమ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
నడుస్తున్న చరిత్ర (అమ్మనుడి)
[మార్చు]1983 నుండి 2013 వరకు "నడుస్తున్న చరిత్ర" పత్రికను విజయవాడ కేంద్రంగా ప్రచురించాడు[2]. అందులో 2001 నుండి రాజకీయ విశ్లేషణలతోపాటుగా భాషా ఉద్యమాల గురించి వ్యాసాలు రావడం ప్రారంభమై, 2009 నాటికి పూర్తిస్థాయి భాషోద్యమ పత్రికగా రూపాంతరం చెందింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య నిర్మాణంలోను, ఎదుగుదలలోను వెన్నుదన్నుగా నిలిచి ఒక భాషోద్యమ పత్రికగా పేరు గడించింది. ప్రభుత్వాన్నయినా, పెద్దలనయినా తెలుగు జనశ్రేయస్సు కోసం నిలదీసిన చరిత్ర, తెలుగుకు ప్రాచీనభాష హోదా కోసం జరిగిన పోరాటానికి దారిచూపి అండగా నిలిచిన చరిత్ర ‘నడుస్తున్న చరిత్ర’దే. అటువంటి పత్రికకు ఆర్థిక వనరులు అడుగంటడంతో 2013 అక్టోబరు సంచికతో ప్రచురణను ఆపివేయ వలసివచ్చింది. రమేశ్ బాబు అనారోగ్యంతో ఒక ఏడాదికి పైగా విశ్రాంతిగా గడుపవలసి వచ్చింది. తర్వాత ఆరోగ్యాన్ని పుంజుకొని, మళ్ళీ అతను భాషోద్యమ యాత్రను కొనసాగిస్తున్నాడు. తిరిగి 2015 ఉగాదికి (మార్చి) తొలి సంచికతో పేరు మార్చుకొని "అమ్మనుడి" గా వెలువడింది. ‘అమ్మనుడి’ పత్రికకు నడుస్తున్న చరిత్ర చదువరులే తొలి చదువరులు, ప్రోత్సాహకులు. దీని నిర్వహణ కోసం ‘తెలుగుజాతి’ ట్రస్టును మిత్రులతో కలిసి స్థాపించాడు. ఆ ట్రస్టు తరఫున ఈ పత్రిక వెలువడుతున్నది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Jyothy Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra Jyoti, Andhra Jyothi, Telugu Culture and Tradition, IT News, Telugu Matrimonials, Classifieds, etc". web.archive.org. 2013-05-08. Archived from the original on 2013-05-08. Retrieved 2020-06-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "కథానిలయం - View Magazine". kathanilayam.com. Retrieved 2020-06-29.
- ↑ "'నడుస్తున్న చరిత్ర' – "అమ్మనుడి"". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-03-21. Retrieved 2020-06-29.