సామాజిక వ్యవస్థాపకత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సామాజిక వ్యవస్థాపకత అనేది ఒక సామాజిక వ్యవస్థాపకుడు చేసే పని. ఒక సామాజిక సమస్యను గుర్తించి మరియు సామాజిక మార్పు కోసం ఒక వ్యాపారాన్ని వ్యవస్థీకరించేందుకు, సృష్టించేందుకు మరియు నిర్వహించేందుకు వ్యాపార సామర్థ్య సిద్ధాంతాలను (ఒక సామాజిక సంస్థ) ఉపయోగించే వ్యక్తిని సామాజిక వ్యవస్థాపకుడిగా పరిగణిస్తారు. వ్యాపార వ్యవస్థాపకుడు అయితే లాభం మరియు ఆదాయంలో ప్రదర్శనపై దృష్టి పెడతాడు, అదే సామాజిక వ్యవస్థాకుడైతే సామాజిక మూలధనాన్ని సృష్టించడంపై దృష్టి కేంద్రీకరిస్తాడు. అందువలన, సామాజిక మరియు పర్యావరణ లక్ష్యాలను ప్రోత్సహించడం సామాజిక వ్యవస్థాపకుడి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అయితే, సామాజిక వ్యవస్థాపకులు సాధారణంగా స్వచ్ఛంద మరియు లాభాపేక్షేతర రంగాలతో అనుబంధం కలిగివుంటారు [1], అయితే వీరు లాభార్జనకు విరుద్ధంగా ఉండాల్సిన అవసరమేమీ లేదు. వ్యాపార సంస్థాగత సామాజిక వ్యవస్థాపకతను కూడా చూడండి.

చరిత్ర[మార్చు]

సామాజిక వ్యవస్థాపకుడు మరియు సామాజిక వ్యవస్థాపకత అనే పదాలను మొదటిసారి 1960 మరియు 1970వ దశకాల్లో సామాజిక మార్పుపై వచ్చిన సాహిత్యంలో ఉపయోగించారు.[2] 1980 మరియు 1990వ దశకాల్లో ఈ పదాలు విస్తృత వినియోగంలోకి వచ్చాయి, Ashoka: Innovators for the Public స్థాపకుడు బిల్ డ్రైటన్, [3] మరియు ఛార్లస్ లీడ్‌బీటర్ వంటి ఇతరులు వీటి వినియోగాన్ని ప్రోత్సహించారు.[4] 1950వ దశకం నుంచి 1990వ దశకం వరకు మైకెల్ యంగ్ సామాజిక సంస్థ యొక్క ప్రధాన ప్రోత్సాహకుడిగా ఉన్నారు, 1980వ దశకంలో హార్వర్డ్ ప్రొఫెసర్ డేనియల్ బెల్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన సామాజిక సంస్థ వ్యవస్థాపకుడిగా వర్ణించబడ్డారు, UKలో సామాజిక వ్యవస్థాపకులకు పాఠశాలల శ్రేణిని ఏర్పాటు చేయడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా అరవైకిపైగా కొత్త సంస్థలను సృష్టించడంలో ఆయన పోషించిన పాత్రకు ఈ గుర్తింపు లభించింది. మరో బ్రిటీష్ సామాజిక వ్యవస్థాపకుడు లార్డ్ మాసన్ OBE. తన యొక్క పునరుజ్జీవన కృషికి గుర్తుగా ఆండ్ర్యూ మాసన్‌ 2007లో పీర్ అనే పట్టం పొందారు. తూర్పు లండన్‌లో బో సెంటర్ చేత ప్రఖ్యాత బ్రూమ్లేను సృష్టించడం కూడా ఆయన కృషిలో భాగమే. తన పుస్తకం "ది సోషల్ ఎంట్రప్రెన్యూర్: మేకింగ్ కమ్యూనిటీస్ వర్క్"లో ఆయన తన అనుభవాలు పంచుకున్నారు [5] మరియు ప్రస్తుతం తన పునరుజ్జీవన కృషిని ప్రోత్సహించేందుకు సాయం చేయడం కోసం ఆయన ఆండ్ర్యూ మాసన్ పార్టనర్‌షిప్స్‌ను నడుపుతున్నారు.[6]

సామాజిక వ్యవస్థాపకులు మరియు సామాజిక వ్యవస్థాపకత అనే పదాలు కొత్తవైనప్పటికీ, వాటిని చరిత్రవ్యాప్తంగా గుర్తించవచ్చు. సంప్రదాయ "సామాజిక వ్యవస్థాపకత"ను వివరించిన కొద్ది మంది చారిత్రాత్మక ప్రముఖ వ్యక్తుల్లో ఫ్లోరెన్స్ నైటింగేల్ (మొట్టమొదటి నర్సింగ్ పాఠశాల వ్యవస్థాపకుడు మరియు ఆధునిక నర్సింగ్ పద్ధతులను అభివృద్ధి చేసిన వ్యక్తి), రాబర్ట్ ఒవెన్ (సహకార ఉద్యమ సృష్టికర్త), మరియు వినోబా భావే (భారతదేశం యొక్క భూదానోద్యమ సృష్టికర్త) తదితరులు ఉన్నారు. 19 మరియు 20వ శతాబ్దాలు సందర్భంగా అత్యంత విజయవంతమైన సామాజిక వ్యవస్థాపకుల్లో కొంత మంది తమ కార్యకలాపాలను పౌర, ప్రభుత్వ మరియు వ్యాపార ప్రపంచాలకు విజయవంతంగా విస్తరించారు - సంక్షేమ, పాఠశాలలు మరియు ఆరోగ్య రంగాల్లో ప్రధాన స్రవంతికి చెందిన ప్రజా సేవలను స్వీకరించిన ఆలోచనలను ప్రోత్సహించారు.

ప్రస్తుత విధానం[మార్చు]

ప్రఖ్యాత సమకాలీన సామాజిక వ్యవస్థాపకుల్లో ముహమ్మద్ యునస్ ఒకరు, ఆయన గ్రామీణ్ బ్యాంకు మరియు దాని యొక్క వృద్ధి చెందుతున్న సామాజిక సంస్థాగత వ్యాపారాల కుటుంబ వ్యవస్థాపకుడు మరియు నిర్వాహకుడిగా ఉన్నారు, ఆయన 2006లో నోబెల్ బహుమతి పొందారు.[7] యునస్ మరియు గ్రామీణ్ యొక్క కృషి ఆధునిక రోజు సామాజిక వ్యవస్థాపకుల్లో ఒక ఇతివృత్తాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది, సామాజిక సంస్థలతో వ్యాపార సిద్ధాంతాలు ఏకమైనప్పుడు అపార సమన్విత చర్యలు మరియు ప్రయోజనాలు సాధ్యపడతాయని యునస్ మరియు గ్రామీణ్ అనుభవాలు ఉద్ఘాటిస్తున్నాయి.[8] బంగ్లాదేశ్ మరియు కొంత వరకు USAసహా, కొన్ని దేశాల్లో సామాజిక వ్యవస్థాపకులు అతి కొద్ది స్థాయి ఖాళీలను పూరిస్తున్నారు. ఇతర దేశాల్లో - ముఖ్యంగా ఐరోపా మరియు దక్షిణ అమెరికా దేశాల్లో - సామాజిక వ్యవస్థాపకులు జాతీయ మరియు స్థానిక స్థాయిల్లో ప్రభుత్వ సంస్థలతో మరింత దగ్గరి అనుబంధంతో పనిచేస్తున్నారు.

భారతదేశంలో, ఒక సామాజిక సంస్థ యొక్క స్థాపకుడు, సహ-స్థాపకుడు లేదా ఒక ముఖ్య అధికారి (అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) లేదా ఛైర్మన్ ఎవరైనా) గా ఉన్న వ్యక్తి సామాజిక వ్యవస్థాపకుడిగా ఉండవచ్చు, ఈ సామాజిక సంస్థ ప్రధానంగా ఒక NGO (స్వచ్ఛంద సంస్థ) గా ఉంటుంది, ఇది కొన్ని సేవలు (తరచుగా నిధుల సమీకరణ కార్యక్రమాలు మరియు సామాజిక కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా) మరియు అప్పుడప్పుడు ఉత్పత్తుల ద్వారా నిధులు సమీకరిస్తుంది. చైల్డ్ రైట్స్ అండ్ యు యొక్క రిప్పన్ కపూర్ మరియు యూత్ యునైటెడ్ యొక్క జ్యోతీంద్ర నాథ్‌లను సామాజిక వ్యవస్థాపకులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు, ఆయా సంస్థలను వారే స్థాపించారు. Bhookh.com యొక్క జయ వికాస్ సుతరియా అనే ఒక సామాజిక వ్యవస్థాపకుడు భారతదేశంలో ఆకలిపై పోరాడేందుకు ఇంటర్నెట్ శక్తిని ఉపయోగిస్తున్నారు.

భారతదేశంలో లాభాపేక్షలేని సామాజిక సంస్థకు మరో మంచి ఉదాహరణ రంగ్ దే [1]. జనవరి 2008లో దీనిని రామకృష్ణ మరియు స్మితా రామ్ స్థాపించారు, రంగ్ దే అనేది భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ పేదలకు తక్కువ-వ్యయ సూక్ష్మ-రుణాల ప్రాప్తి కలిగించే ఒక పీర్-టు-పీర్ ఆన్‌లైన్ వేదిక. భారతదేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ నేరుగా రుణగ్రహీతలపై పెట్టుబడి పెట్టే వీలుంటుంది, పెట్టుబడులను వారు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే సౌకర్యం ఉండటంతోపాటు, వారు ఏడాదికి 2% టోకెన్ (లాంఛనం) పొందవచ్చు. ROI.

ప్రస్తుతం, లాభాపేక్షలేని సంస్థలు మరియు ప్రభుత్వేతర సంస్థలు, ఫౌండేషన్‌లు, ప్రభుత్వాలలతోపాటు వ్యక్తుల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా సామాజిక వ్యవస్థాపకులు ప్రోత్సాహం, నిధులు మరియు సలహాలు పొందుతున్నారు. కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు సామాజిక వ్యవస్థాపకులను విద్యావంతులు చేయడం మరియు వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రోగ్రామ్‌లు (కోర్సులు) ఏర్పాటు చేస్తున్నాయి.

UKలో 2007లో ఏడు ప్రధాన స్వచ్ఛంద సంస్థలు (లాభాపేక్షలేని సంస్థలు) UnLtd - ది ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంట్రప్రెన్యూర్స్‌ను స్థాపించాయి. UKలో ముఖ్యంగా సామాజిక వ్యవస్థాపకులపై పెట్టుబడి పెట్టేందుకు ఇది £100 మిలియన్ల ధర్మనిధిని కలిగివుంది. UnLtd సామాజిక ప్రాజెక్టుల అభివృద్ధికి సాయం చేసేందుకు వ్యక్తులకు కోచింగ్, ట్రైనింగ్ మరియు నెట్‌వర్కింగ్ అవకాశాలతోపాటు నగదు పురస్కారాలు మరియు ఆచరణ మద్దతును అందిస్తుంది. UnLtd వెంచర్స్ అనేది UnLtd యొక్క ఇన్-హౌస్ కన్సల్టెన్సీ విభాగం, ఇది అనేక మంది ప్రతిభావంతులైన సామాజిక వ్యవస్థాపకులపై దృష్టి పెడుతుంది, వారు పెట్టుబడులు పొందేందుకు లేదా వారి సంస్థలను వృద్ధి చెందేందుకు లేదా పునరుజ్జీవనానికి వారికి సాయం చేయడం మరియు వ్యాపార మద్దతు అందించడం వంటి సేవలు అందిస్తుంది. వారి కార్యకలాపాల్లో మరొకటి, UnLtd రీసెర్చ్, ఇది ప్రపంచంలో సామాజిక వ్యవస్థాపకత ఆలోచనలకు మరియు సాక్ష్యానికి ప్రధాన మూలంగా అవతరిస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం, ప్రజా విధానం మరియు సామాజిక పునరుజ్జీవనంలో సామాజిక వ్యవస్థాపకత పాత్ర గురించి విద్యా చర్చలు, ఉపాధి మరియు అభివృద్ధి వ్యూహాలకు మార్గదర్శకంగా ఉండటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం.

ది జార్జి ఫౌండేషన్ యొక్క మహిళా సాధికారత కార్యక్రమం మహిళలను విద్య, సహకార వ్యవసాయం, వృత్తి శిక్షణ, పొదుపు ప్రణాళిక మరియు వ్యాపార అభివృద్ధితో చైతన్యవంతులను చేస్తుంది. 2006లో సహకార వ్యవసాయ కార్యక్రమమైన బెల్డెవ్ ఫామ్స్ దక్షఇణ భారతదేశంలో రెండో అతిపెద్ద అరటి సాగుదారుగా ఉంది, దీని కింద 250 acres (1.0 kమీ2) భూమి సాగులో ఉంది.[9] ఈ వ్యవసాయంలో వచ్చే లాభాలను కూలీల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు మరియు ఫౌండేషన్ యొక్క ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగించారు.[9]

కొన్ని లాభం కోసం మరియు ఒక భిన్నమైన సంస్థ కోసం సృష్టించబడ్డాయి. దీనికి ఇటీవల ఉదాహరణ విక్రమ్ ఆకుల వ్యవస్థాపక CEOగా ఉన్న SKS మైక్రోఫైనాన్స్, ఈ మెక్‌కిన్సే మాజీ ఉద్యోగి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల్లో సూక్ష్మరుణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ లాభం కోసం ఉద్దేశించినదైనప్పటికీ, గ్రామాల్లోని పేద మహిళల్లో చురుకైన సామాజిక మార్పు కోసం చర్యలు ప్రారంభించింది. దీనికి ఒక మంచి ఉదాహరణ బ్రెంట్ ఫ్రీమాన్ [2], నోర్మా లారోసా [3], మరియు నిక్ రీడెర్ [4] సహ-వ్యవస్థాపకులుగా ఉన్న MARCsMovement.com [5], ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నైతిక మరియు బాధ్యతాయుత కంపెనీల (MARCs- మోరల్ అండ్ రెస్పాన్సిబుల్ కంపెనీస్) కోసం ఏర్పాటైన ఒక కొత్త ఆన్‌లైన్ రీటైల్ వెబ్‌సైట్, ఈ వెబ్‌సైట్ వ్యాపారుల వ్యాపార కార్యకలాపాలను నాలుగు విభాగాల్లో విభజిస్తుంది, వినియోగదారు తన యొక్క మొత్తం కొనుగోలు విలువలో 5% తమ ఇష్టమొచ్చిన స్వచ్ఛంద సంస్థకు విరాళమిచ్చేందుకు వీలు కల్పిస్తుంది. రోజువారీ కొనుగోళ్లు ద్వారా ప్రపంచంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రతిరోజూ ఆన్‌లైన్ వినియోగదారులను చైతన్యపరచడం ఈ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ లక్ష్యంగా పెట్టుకుంది మరియు ప్రతి విక్రయంతో రెండింతల నిర్ణాయాత్మక విలువ అందించేందుకు కట్టుబడివుంది.

సామాజిక వ్యవస్థాపకుడిగా ఎవరిని పరిగణించాలనే దానిపై నిరంతర వాదనలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆర్జించిన ఆదాయంపై, అంటే వినియోగదారులకు చెల్లింపుల నుంచి నేరుగా ఆర్జించిన ఆదాయంపై ఆధారపడే సంస్థల యొక్క వ్యవస్థాపకులకు ఈ పదాన్ని పరిమితం చేయాలని కొందరు ప్రతిపాదించారు. ఇతరులు ప్రభుత్వ యంత్రాంగాల కోసం కాంట్రాక్టు పనులు చేసే సంస్థలను కూడా దీనిలో చేర్చాలని వాదిస్తున్నారు, ఇదిలా ఉంటే ఇంకా కొందరు సాయాలు మరియు విరాళాలపై ఆధారపడే సంస్థలకు కూడా ఈ పదాన్ని వర్తింపజేయడాన్ని సమర్థిస్తున్నారు. ఈ వాదనకు త్వరలో పరిష్కారం లభించే అవకాశం లేదు. ఉదాహరణకు, పీటర్ డ్రకెర్ ఒకప్పుడు ఒక కొత్త విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం కంటే పెద్ద వ్యవస్థాపకత ఏదీ లేదని రాశారు: అయితే అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక సంఖ్యలో విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నుంచి ఎక్కువ భాగం నిధులు అందుతున్నాయి.

Ashoka: Innovators for the Public, స్కోల్ ఫౌండేషన్, ఓమిడ్యార్ నెట్‌వర్క్, స్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, రూట్ కాజ్, కెనడియన్ సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫౌండేషన్, న్యూ ప్రాఫిట్ ఇంక్., మరియు ఎకోయింగ్ గ్రీన్ మరియు ఇతరాలు వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ రహస్య మార్పు-సృష్టికర్తలను తెరపైకి తేవడంపై దృష్టిపెట్టాయి. అశోకా యొక్క చేంజ్ మేకర్స్ "ఓపెన్ సోర్సింగ్ సోషల్ సొల్యూషన్స్" కార్యక్రమం చేంజ్‌‍మేకర్స్ తక్షణ చర్యలు అవసరమైన సమస్యలపై స్పందించేందజుకు సమూహాలను నిర్మించేందుకు సంయుక్త పోటీలకు పిలుపునిచ్చేందుకు ఒక ఆన్‌లైన్ వేదికను ఉపయోగిస్తుంది.

ఉత్తర అమెరికా సంస్థలు ప్రత్యేక నేతలు దృష్టిపెట్టే బలమైన వ్యక్తివాద ధోరణిని కలిగివున్నాయి, ఇదిలా ఉంటే ఆసియా మరియు ఐరోపాలోని ఇతర సంస్థలు మార్పు కోసం బృందాలు, వ్యవస్థలు మరియు ఉద్యమాల్లో సామాజిక వ్యవస్థాపకులు ఏ విధంగా పనిచేస్తారనే దానిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఈబే మొట్టమొదటి అధ్యక్షుడు జెఫ్ స్కోల్ సృష్టించిన స్కోల్ ఫౌండేషన్, ఒక నిర్దిష్ట స్థాయి ప్రభావానికి చేరుకున్న సామాజిక వ్యవస్థాపక సంస్థలకు "సహాయక స్థాయి" నిధులు సృష్టించే సామర్థ్యాన్ని నిర్మిస్తుంది, ఈ సంస్థలను వార్షిక స్కోల్ వరల్డ్ ఫోరమ్ మరియు ఫౌండేషన్ యొక్క ఆన్‌లైన్ సమూహం సోషల్ ఎడ్డ్ ద్వారా కలుపుతుంది, మరియు సుండాన్స్ ఇన్‌స్టిట్యూట్, ఫ్రంట్‌లైన్ వరల్డ్, న్యూస్‌అవర్ విత్ జిమ్ లెహ్రెర్, మరియు ఇతర చిత్ర మరియు ప్రసార కేంద్రాలతో భాగస్వామ్యాల ద్వారా తమ కార్యకలాపాలను ప్రచారం చేస్తుంది. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీలోని సెయడ్ బిజినెస్ స్కూల్‌లో ఉన్న స్కోల్ సెంటర్ ఫర్ సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు నిధులు అందించడం వంటి కార్యకలాపాలు ద్వారా, సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ రంగానికి స్కోల్ మద్దతు ఇస్తుంది.

యువజన సామాజిక వ్యవస్థాపకత అనేది సామాజిక సమస్యలను పరిష్కరించడంలో యువత భాగస్వామ్యాన్ని చేర్చేందుకు ఉద్దేశించిన ఒక సాధారణ విధానం. యువజన సంస్థలు మరియు కార్యక్రమాలు యువ పౌరులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నాయి.[10] ఇటువంటి ఒక కార్యక్రమానికి ఉదాహరణ యంగ్ సోషల్ పయనీర్స్, ఇది ఆస్ట్రేలియా యువ నేతల యొక్క శక్తి మరియు ఆశపై పెట్టుబడి పెడుతుంది. ది ఫౌండేషన్ ఫర్ యంగ్ ఆస్ట్రేలియన్స్ చేపట్టిన ఈ కార్యక్రమం యువకులు తమ సమూహాల్లో సానుకూల మార్పు సృష్టించడంలో వారి పాత్రను బలపరచడం, మద్దతు ఇవ్వడం మరియు నెరవేర్చడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఎబౌట్ ఫేస్ ఇంటర్నేషనల్ [6] వడ్డీ-లేని రుణాలు, సాయాలు మరియు సలహాదారు హోదా ఇవ్వడం ద్వారా మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల్లో యువజన సామాజిక వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలల్లో పాఠశాల క్లబ్‌ల తరువాత యువజన సామాజిక వ్యవస్థాపకతను ఏర్పాటు చేసేందుకు కూడా వారు సాయం చేస్తున్నారు. రేపటి తరం అభ్యుదయ భావాలు గల నేతలను తయారు చేసేందుకు, సామాజిక బాధ్యతగల వ్యాపారాల యొక్క సిద్ధాంతాలపై ఈరోజు యువతకు అవగాహన కల్పించడంలో సాయం చేయాలనే సంకల్పంతో MARCsMovement [7] వ్యాపార నమూనా "పేయింగ్ ఇట్ ఫార్వర్డ్" ద్వారా ఇటువంటి ఒక పద్ధతిని అనుసరిస్తుంది.

ఇస్తాంబుల్ బిల్గీ యూనివర్శిటీ మే 2010న టర్కీలో యువ సామాజిక వ్యవస్థాపకులను గుర్తించేందుకు, విద్యావంతులను చేసేందుకు మరియు వారికి ఆర్థిక మద్దతు అందించేందుకు బిల్గీ యంగ్ సోషల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డుల ప్రాజెక్టు ప్రారంభించింది. ఇంటర్నేషనల్ యూత్ ఫౌండేషన్, సైల్వాన్/ల్యూరేట్ ఫౌండేషన్ మరియు TEGV సహకారంతో, ఈ సమగ్ర వ్యూహం ద్వారా, ఇస్తాంబుల్ బిల్గీ యూనివర్శిటీ తమ సమూహాల్లో మార్పుకు నేతృత్వం వహించే కొత్త తరం బాధ్యతాయుతమైన పౌరులను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంది. మీరు దరఖాస్తు చేసేందుకు www.bilgiggo.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

టర్కీలో ఉన్న మరో యువజన సామాజిక వ్యవస్థాపకత సంస్థ పేరు SOGLA [8] (ది అకాడమీ ఆఫ్ యంగ్ సోషల్ ఎంట్రప్రెన్యూర్స్). SOGLA యువ వ్యవస్థాపకత అభ్యర్థులకు (వీరిని SOGLA పయనీర్స్ అనే పేరుతో పిలుస్తారు) నాణ్యమైన విద్యను అందిస్తుంది, ఈ ప్రతిభావంతులైన యువకులు వ్యవస్థాపకత ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు, ప్రారంభించేందుకు మరియు ఈ ప్రాజెక్టులు నిలదొక్కుకునేందుకు ఇది మద్దతు ఇస్తుంది.

ఫాస్ట్ కంపెనీ మేగజైన్ ఏడాదికొకసారి ఇరవై-ఐదు అత్యంత విజయవంతమైన సామాజిక వ్యవస్థాపకుల జాబితాను ప్రచురిస్తుంది, ఈ మేగజైన్ వీరిని సామాజిక సమస్యలను అధిగమించేందుకు కార్పొరేట్ ప్రపంచం యొక్క క్రమశిక్షణలను ఉపయోగించే 'సంస్థలు'గా నిర్వచిస్తుంది.[11] 2009లో, బిజినెస్‌వీక్ అమెరికాలోని అత్యంత విజయవంతమైన ఇరవై-ఐదు మంది సామాజిక వ్యవస్థాపకుల సమీక్షను ప్రచురించింది, సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు వ్యాపార పద్ధతులను వర్తింపజేసిన వ్యవస్థాపకత వ్యక్తులుగా వీరిని వర్ణించింది.[12]

ఇంటర్నెట్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లు అనేక మంది సామాజిక వ్యవస్థాపకుల విజయం మరియు భాగస్వామ్యానికి కీలకమైన వనరులుగా ఉన్నాయి, ఇవి విస్తృత స్థాయిలో సభ్యులు ఆలోచనలను వినేందుకు, అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థలు మరియు పెట్టుబడిదారులు అభివృద్ధి చెందేందుకు మరియు అతికొద్ది లేదా అసలు ఎటువంటి ప్రారంభ మూలధనం లేకుండా అన్ని సాధనలను సాధ్యపరిచేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు, ఎటువంటి మూలధనం లేకుండా మరియు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముగ్గురు ఆస్ట్రేలియా విద్యార్థులు (లెగ్1వరల్డ్) ఒక గ్రుడ్డుతో ప్రారంభమైన స్వచ్ఛంద సంస్థకు AUS$1 మిలియన్ నిధులను సమీకరించే ప్రక్రియలో ఉన్నారు, మంచి ఆలోచనలు కలిగివున్న వ్యక్తులకు ఇంటర్నెట్ అందించే విశాల అవకాశాలకు ఇది ఒక అద్భుత ఉదాహరణ.[13]

ఇవి కూడా చూడండి[మార్చు]

మరింత చదవడానికి[మార్చు]

 • డేవిడ్ బోర్న్‌స్టెయిన్, హౌ టు చేంజ్ ది వరల్డ్: సోషల్ ఎంట్రప్రెన్యూర్స్ అండ్ ది పవర్ ఆఫ్ న్యూ ఐడియాస్, ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (మరియు ఇతరులు) ISBN 0-19-513805-8
 • ఛార్లస్ లీడ్‌బీటెర్, ది రైజ్ ఆఫ్ ది సోషల్ ఎంట్రప్రెన్సూర్, డెమోస్, 1996
 • జోన్నా మెయిర్, జెఫ్రే రాబిన్‍సన్, మరియు కై హాకెర్ట్స్, సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, పాల్‌గ్రేవ్, 2006. ISBN 0262081504
 • పెరెడో, A. M., & మెక్‌లీన్, M. 2006. సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్: ఎ క్రిటికల్ రివ్యూ ఆఫ్ ది కాన్సెప్ట్. జర్నల్ ఆఫ్ వరల్డ్ బిజినెస్, 41 (1) : 56-65.
 • జాన్ ఎల్‌కింగ్‌టన్ మరియు పమెలా హార్టిగాన్, ది పవర్ ఆఫ్ అన్‌రీజనబుల్ పీపుల్: హౌ ఎంట్రప్రెన్యూర్స్ క్రియేట్స్ మార్కెట్స్ టు చేంజ్ ది వరల్డ్, హార్వర్డ్ బిజినెస్ ప్రెస్, 2008
 • రాబర్ట్ గన్ మరియు క్రిస్టోఫర్ డుర్కిన్, సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్: ఎ స్కిల్స్ అప్రోచ్, పాలసీ ప్రెస్, 2010
 • మార్క్ B. డురియక్స్ మరియు రాబర్ట్ ఎ. స్టెబిన్స్, సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫర్ డమ్మీస్, వీలే, 2010.

సూచనలు[మార్చు]

 1. థాంమ్సన్, J.L., ది వరల్డ్ ఆఫ్ ది సోషల్ ఎంట్రప్రెన్యూర్, ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ మేనేజ్‌మెంట్, 15(4/5), 2002, పేజి 413
 2. ఉదాహరణకు, J బ్యాంక్స్, ది సోషియాలజీ ఆఫ్ సోషల్ మూమెంట్స్‌ లో ఈ పదాన్ని రాబర్ట్ ఒవెన్ యొక్క వర్ణనగా ఉపయోగించారు, లండన్, మాక్‌మిలన్, 1972
 3. "The Social Entrepreneur Bill Drayton". US News & World Report. 2005-10-31. Retrieved 2006-11-03.
 4. 'ది రైజ్ ఆఫ్ సోషల్ ఎంట్రప్రెన్యూర్, డెమోస్, లండన్, 1996
 5. http://www.amazon.co.uk/Social-Entrepreneur-Making-Communities-Work/dp/1843546612
 6. http://amawsonpartnerships.com/cms/
 7. "The Nobel Peace Prize 2006". Nobel Foundation. 2006. Retrieved 2006-11-02.
 8. "Business-Social Ventures Reaching for Major Impact". Changemakers. 11-2003. Retrieved 2006-11-03. Check date values in: |date= (help)
 9. 9.0 9.1 మేరీయన్నే బ్రాయ్, ఫర్ రూరర్ వుమెన్, ల్యాండ్ మీన్స్ హోప్, CNN.com, 2005-10-03. 2007-02-15న సేకరించబడింది.
 10. షీలా కింకాడే, క్రిస్టినా మేసీ, అవుర్ టైమ్ ఈజ్ నౌ: యంగ్ పీపుల్ చేంజింగ్ ది వరల్డ్ , ISBN 0977231909
 11. "25 Entrepreneurs who are changing the world". Retrieved 2006-10-15.
 12. అమెరికాస్ మోస్ట్ ప్రామిసింగ్ సోషల్ ఎంట్రప్రెన్యూర్స్
 13. http://www.smh.com.au/technology/enterprise/egg-comes-first-in-charity-game-20100308-psue.html

బాహ్య లింకులు[మార్చు]

 • టామ్స్ షూష్ కొనుగోలు చేసిన ప్రతి జత బూట్లకు, టామ్స్ అవి అవసరమైన ఒక బాలుడికి ఒక జత బూట్లు విరాళంగా ఇస్తుంది.
 • లెగ్1వరల్డ్ ఒక గ్రుడ్డుతో ప్రారంభించిన నిధుల సమీకరణ కార్యక్రమం ఇది, దీని ద్వారా $1 మిలియన్ నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 • ట్రిపుల్‌పండిట్- సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సామాజిక వ్యవస్థాపకతపై వార్తలు.
 • ది పుల్సెరా ప్రాజెక్ట్ ఇది నికారుగ్వాలో వీధి బాలలు తయారు చేసే బ్రాస్‌లెట్‌లను విక్రయించే USకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ, దీనిపై వచ్చే లాభాలన్నీ బాలలకు చేరతాయి.
 • ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో MA కోర్సు [9]