సామిక్ లాహిరి
| సామిక్ లాహిరి | |||
| పదవీ కాలం 1996 – 2009 | |||
| ముందు | అమల్ దత్తా | ||
|---|---|---|---|
| తరువాత | సోమేంద్ర నాథ్ మిత్రా | ||
| నియోజకవర్గం | డైమండ్ హార్బర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1967 January 27 పూర్నియా , బీహార్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | ||
| నివాసం | కోల్‌కతా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సమిక్ లాహిరి (జననం 27 జనవరి 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]సామిక్ లాహిరి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అమ్జద్ అలీ సర్దార్ పై 22,526 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కాకోలి ఘోష్ దస్తీదార్ పై 60,956 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
సామిక్ లాహిరి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సర్దార్ అమ్జద్ అలీపై 71,163 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సౌగత రాయ్ పై 153784 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Diamond harbour Lok Sabha Election till 2024" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 2024. Archived from the original on 13 July 2025. Retrieved 13 July 2025.
- ↑ "CPM in tatters in Bengal, its newly crowned state secy faces an uphill task" (in ఇంగ్లీష్). The Indian Express. 21 March 2022. Archived from the original on 13 July 2025. Retrieved 13 July 2025.