సామెతలు - అ
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ ఘ |
చ ఛ జ ఝ |
ట ఠ డ ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
"అ" నుండి "క్ష" వరకు |
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]
ఇక్కడ "అ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.
రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.
విషయ సూచిక
- 1 అంకపొంకాలు లేనిది శివలింగం
- 2 అంకెకు రాని ఆలి - కీలెడలిన కాలు
- 3 అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు
- 4 అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు
- 5 అంగట్లో అరువు - తల మీద బరువు
- 6 అంగట్లో అష్ట భాగ్యం - అల్లుని నోట్లో అష్ట దరిద్రం
- 7 అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది
- 8 అంగిట బెల్లం - ఆత్మలో విషం
- 9 అంగిట విషం - మున్నాలిక తియ్యదనం
- 10 అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు
- 11 అంగడి బియ్యం - తంగేటి కట్టెలు
- 12 అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి
- 13 అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
- 14 అంచు డాబె గాని కోక డాబు లేదు
- 15 అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు
- 16 అంటే ఆరడి - అనకుంటే అలుసు
- 17 అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట
- 18 అంటే ఆరడి - అనకుంటే అలుసు
- 19 అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు
- 20 అండలుంటే కొండలు దాటవచ్చు
- 21 అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు
- 22 అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసేదన్నట్టు
- 23 అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా
- 24 అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు
- 25 అందని పండ్లకు అర్రులు చాచినట్లు
- 26 అందని ద్రాక్షలు పుల్లన
- 27 అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
- 28 అందితే జుట్టు అందక పోతె కాళ్లు
- 29 అండ వున్నవానిదే అందలం
- 30 అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత
- 31 అంత నీతే వుంటే ఇంత సంతెందుకు?
- 32 అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా?
- 33 అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు
- 34 అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు?
- 35 అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు
- 36 అందం చందం నావంతు - ముద్దూ మురిపెం నీవంతు అన్నదట
- 37 అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు
- 38 అందముంటే సరా! అదృష్టముండొద్దూ!
- 39 అందని మ్రానిపండ్లకు అఱ్ఱులు చాచినట్లు
- 40 అందరి కాళ్ళకు మ్రొక్కినా అత్తగారింటికి పోకతప్పదు
- 41 అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు
- 42 అందరికీ అన్నం పెట్టే వాడు రైతే
- 43 అందరినీ మెప్పించడం అలవి గాని పని
- 44 అందరూ అందలమెక్కితే మోసేవారెవ్వరు?
- 45 అందరూ ఒక ఎత్తు - అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు
- 46 అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది
- 47 అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు
- 48 అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట
- 49 అందాలు నావి - సంబరాలు నీవి అందిట
- 50 అందితే సిగ అందకపోతే కాళ్ళు
- 51 అందితే తియ్యన అందకుంటే పుల్లన
- 52 అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు
- 53 అంధుడికి అద్దం చూపించినట్లు
- 54 అంధుడికి అద్దం చూపించినట్లు
- 55 అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు
- 56 అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు
- 57 అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు
- 58 అంబరాన బిడ్డ పుడితే ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట
- 59 అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు
- 60 "అ - ఆ" లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట
- 61 "అ - ఆ" లు రావు గానీ అమరం చదువుతాడట
- 62 అకట వికటపు రాజుకు అవివేకపు ప్రధాని, చాదస్తపు పరివారము
- 63 అక్క ఆరాటమే గానీ బావ బ్రతకడన్నట్లు
- 64 అక్క కాపురం అడగక్కర లేదు - చెల్లెలి కాపురం చెప్పక్కర లేదు
- 65 అక్క పగ, బావ మంచి
- 66 అక్క మనదైతే బావ మన వాడవుతాడా?
- 67 అక్క మొగుడు కుక్క
- 68 అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ - అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ
- 69 అక్కరకురాని చుట్ట మెందుకు?
- 70 అక్కరకు వచ్చినవాడే మనవాడు
- 71 అక్కర తీరితే అల్లుడు అశుద్ధంతో సమానమన్నట్లు
- 72 అక్కరకు రానిది అవనిలో లేదు
- 73 అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?
- 74 అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
- 75 అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం
- 76 అగసాలిని, వెలయాలిని నమ్మరాదు
- 77 అగసాలి పొందు, వెలమల చెలిమి నమ్మరాదు
- 78 అగ్గి చూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది
- 79 అగ్గిమీద గుగ్గిలం లాగా
- 80 అగ్నిచెంత వెన్న ఎంత తడవాగో ఆడవారి కోపము అంత తడవాగు
- 81 అగ్నిదేవుడు చలికాలంలో చిన్నవాడు ఎండాకాలంలో ఎదిగినవాడు
- 82 అగ్నిలో ఆజ్యం పోసినట్లు
- 83 అగ్నిలో మిడత పడ్డట్లు
- 84 అగ్నిశేషం, ఋణశేషం, శత్రుశేషం ఉంచరాదు
- 85 అగ్గిపక్కన వెన్న ఆడవారి కోపం ఒకటే
- 86 అగ్నికి వాయువు తోడైనట్లు
- 87 అగ్గువ అయితే అంగడికి వస్తుంది అన్నాడట
- 88 అగ్రహారం పోతే పోయింది గానీ చట్టం మొత్తం తెలిసింది
- 89 అచ్చట్లు - ముచ్చట్లు - ఎదనిండా వెన్నెల్లు అన్నట్టు
- 90 అచ్చట్లు, ముచ్చట్లు దుప్పట్ల ముసుగులో అన్నదట
- 91 అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం అన్నట్లు
- 92 అచ్చివచ్చిన భూమి అడుగైనా చాలు
- 93 అచ్చివచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు పుడతాడట
- 94 అచ్చు పోసిన ఆబోతువలె
- 95 అజీర్ణానికి లంఖణం మందు
- 96 అటునుండి నరుక్కు రా
- 97 అటైతే కందిపప్పు - యిటైతే పెసరపప్పు
- 98 అటైతే వైద్యకట్నం - యిటైతే వైతరిణీ గోదానం
- 99 అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనబడతారు
- 100 అట్లు వండినమ్మకు ఆరుగురు అమర్చాలి
- 101 అట్లు వండే అత్తకు అరవైఆరు ఎత్తులు పెట్టినట్లు
- 102 అడక్కుండా చెప్పులిచ్చాడు అడిగితే గుర్రం యిస్తాడేమో అన్నట్లు
- 103 అడక్కుంటే జోలె అడుక్కుపోతోంది
- 104 అడవి పత్రి - వాన నీరు
- 105 అడవిలో తిని ఆకుతో తుడుచుకున్నట్లు
- 106 అడిగిందే పాపం - అనుగ్రహించటం తన స్వభావం అన్నట్లు
- 107 అడిగింది రొట్టె - యిచ్చింది రాయి
- 108 అడిగితే చిరాకు - అడగకపోతే పరాకు
- 109 అడిగేటంత అన్యాయానికి లోబడతానా?
- 110 అడవిలో పడ్డట్లుగా
- 111 అడుసు త్రొక్కనేల కాలు కడగనేల
- 112 అడకత్తెరలో పోకచెక్క
- 113 అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
- 114 అడవిలో కాచిన వెన్నెల.... ముదిమిన చేసిన పెళ్ళి రెండు ఒకటే
- 115 అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
- 116 అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
- 117 అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
- 118 అడుక్కుతినేవాడికి అరవై వూళ్ళు
- 119 అడుక్కుతినేవాడికి ఆలయ్యేకంటే ధనవంతుడికి దాసి అయ్యేది మేలు
- 120 అడుక్కోవటానికి ఈ గడప కాకపోతే యింకో గడప
- 121 అడుసు తొక్కనేల కాలు కడగనేల
- 122 అడుగు తప్పితే పిడుగు తప్పుతుంది
- 123 అడుగు దాటితే అక్కర దాటుతుంది
- 124 అడుగు పెట్టగానే పిడుగు పడ్డట్లు
- 125 అడ్డ జామీనులకు పోతే తెడ్డు దెబ్బలు తప్పవు
- 126 అడ్డం దిడ్డం తిరిగే తెడ్డుకు రుచేం తెలుసు?
- 127 అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
- 128 అడ్డెడు తినేవాడికి ఆలెందుకు? యిద్దుము మోసేవానికి ఎద్దెందుకు
- 129 అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు గొడ్డు తినిపోయిందిట
- 130 అతడెంత ఘనుడైనా అడుగక తప్పదు
- 131 అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న
- 132 అతిచేస్తే మతి చెడుతుందన్నట్టు
- 133 అతికించిన కోరమీసం ఎంతసేపు నిలుస్తుంది?
- 134 అతి వినయం ధూర్త లక్షణం
- 135 అతితెలివికి ఆకలెక్కువ
- 136 అతివృష్టయినా అనావృష్టయినా ఆకలిబాధ తప్పదు
- 137 అతిరహస్యం బట్టబయలు
- 138 అతి సుకుమారం - కటిక దరిద్రం
- 139 అత్త అడుక్కొని తింటుంటే అల్లునికి మనుగుడుపా?
- 140 అత్త అప్పుతీరే - అల్లునికి భ్రమతీరే
- 141 అత్త కాలము కొన్నాళ్ళు - కోడలి కాలము కొన్నాళ్ళు
- 142 అత్తకు అల్లుడాశ - అల్లుడికి అత్తాశ
- 143 అత్తకు మంచి లేదు - చింతకు పచ్చి లేదు
- 144 అత్తకు లేక చస్తుంటే అల్లుడు వచ్చి దీపావళి పండగన్నాడట
- 145 అత్త కొట్టిన కుండ అడుగోటికుండ, కోడలు కొట్టిన కుండ క్రొత్తకుండ
- 146 అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు
- 147 అత్తను ఉంచుకున్నవాడు దరిద్రుడు
- 148 అత్తను కొట్టి అటకెక్కింది - మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది
- 149 అత్త పెట్టే ఆరళ్ళు కనబడతాయిగానీ, కోడలి కొంటె పనులు కనబడవు
- 150 అత్త పేరు పెట్టి కూతుర్ని కొట్టినట్లు
- 151 అత్త మంచీలేదు - వేప తీపీలేదు
- 152 అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు
- 153 అత్తముండ కన్న ఉత్తముండ మేలు
- 154 అత్త మెత్తన, కత్తి మెత్తన ఉండవు
- 155 అత్త రంకుకు పోతూ కోడలికి బుద్ధి చెప్పిందట
- 156 అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
- 157 అత్తవల్ల దొంగతనము, మొగుడి వల్ల రంకుతనం నేర్చుకున్నట్లు
- 158 అత్తవారింటి అల్లుణ్ణీ ఆముదాల చేలో ఆబోతునూ చూడాలి
- 159 అత్తవారింటి ఐశ్వర్యంకన్న పుట్టింటి గంజి మేలు
- 160 అత్తవారింటి లేమి అల్లుడెరుగు
- 161 అత్తవారింటి సుఖం మోచేతి దెబ్బ వంటిది
- 162 అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు
- 163 అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
- 164 అత్తా! నీ కొంగు తొలిగిందన్నా తప్పే, లేదన్నా తప్పే
- 165 అత్తింటి కాపురం కత్తి మీద సాములాంటిది
- 166 అతి తెలివి అరవై రకాలు
- 167 అతిథి కోసమే తిథులు వున్నట్లు
- 168 అదును లేని పైరు - ముదిమిలోని బిడ్డ ఒక్కటే
- 169 అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
- 170 అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
- 171 అత్త ఒకింటి కోడలె
- 172 అతుకుల కాపురం - చితుకుల మంట
- 173 అతుకుల బొంత - గతుకుల బాట
- 174 అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
- 175 అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
- 176 అదిగో అంటే ఆరునెల్లు
- 177 అద్దం అబద్ధం ఆడుతుందా !
- 178 అద్దెకు తెచ్చిన గుర్రం అగడ్త దాటుతుందా
- 179 అదే పతకవైతే అమ్ముకు తిననా?
- 180 అనగా అనగా రాగం తినగా తినగా రోగం
- 181 అని అనిపించుకోవలెనా అత్తగారూ!
- 182 అన్నం పెట్టిన చెయ్యిని నరికినట్లు
- 183 అన్నం అడిగిన వాడికి సున్నం పెట్టినట్లు
- 184 అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అప్పచెల్లెళ్ళ పొత్తు పెద్దప్పుడు
- 185 అన్నదీక్షే కానీ అక్షర దీక్ష లేదు
- 186 అన్నం పెట్టిన చెయ్యిని నరికినట్లు
- 187 అన్న ద్వేషం, బ్రహ్మ ద్వేషం పనికిరావు
- 188 అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
- 189 అన్నవారూ, పడినవారూ బాగున్నారు, మధ్యవారు పడిచచ్చారు
- 190 అన్యాయపు వూరిలో ఆలూ మగలకే రంకు
- 191 అన్యాయపు సంపాదన ఆవిరై పోతుంది
- 192 అన్నివేసి చూడు .... నన్ను వేయకుండా చూడు... అన్నదట ఉప్పు
- 193 అన్ని సాగితె రోగమంత భోగం లేదు
- 194 అన్ని కార్తెలు తప్పినా హస్త కార్తె తప్పదు
- 195 అన్ని దానాలలో అన్నదానం మిన్న
- 196 అన్ని పైర్లకూ ఆషాఢం
- 197 అన్ని రోగాలకు వాతలు పెట్టే వైద్యుణ్ణి దూరంగావుంచాలి
- 198 అన్నీ అమర్చిన తర్వాత అత్తగారు వేలు పెట్టినట్లు
- 199 అన్నీ అయిన తర్వాత అగ్ని వైద్యం
- 200 అన్నిదానాల్లోకి నిదానమే గొప్పదన్నాడట
- 201 అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
- 202 అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
- 203 అన్నం తిన్నవాడు తన్నులు తిన్నవాడు మరచిపోడు
- 204 అన్నిదానాల్లోకి నిదానమే గొప్పదన్నాడట
- 205 అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
- 206 అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు చస్తే ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందన్నట్టు
- 207 అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు
- 208 అన్నీవున్నాయి కాని అల్లుడి నోట్లో శని వున్నది
- 209 అనుమానం పెనుభూతం
- 210 అనుకున్న పని అంగవస్త్రంలో అయినట్లు
- 211 అనుమానం ముందుపుట్టి ఆడది తర్వాత పుట్టింది
- 212 అనుభవం ఒకరిది - ఆర్భాటం, ఆయాసం ఇంకొకరివంతు
- 213 అనూరాధ కార్తెలో అనాధ కర్రయినా ఈనుతుంది
- 214 అనూరాధకు తడిస్తే మనోరోగాలు పోతాయి
- 215 అనూరాధలో అడిగినంత పంట
- 216 అనూరాధలో తడిస్తే ఆడది మగాడౌతుంది
- 217 అన్నం అరిగిపోతుంది - ఆదరణ శాశ్వతంగా వుంటుంది
- 218 అన్నం కన్నా ఆదరణ ముఖ్యం
- 219 అన్నం వుడికిందో లేదో చూడాలంటే అంతా పట్టి చూడక్కరలేదు
- 220 అన్నం కోసం వచ్చి కంచం కోసం పోట్లాడుకున్నట్లు
- 221 అన్నం వండని ఆడదీ, మంచం నేయని మగవాడూ వుండడు
- 222 అపనింద అవతలకిపోతే, నింద వచ్చి తలమీద పడిదట
- 223 అపుత్రుడికి గతి లేదు
- 224 అప్పచెల్లెలు బ్రతక గోరితే తోడికోడలు చావు కోరుతుంది
- 225 అప్ప సిరి చూసుకుని చెల్లెలు మడమలు విరగ త్రొక్కుకుందట
- 226 అప్పటి కోపం అన్యాయ మెరుగదు
- 227 అప్ప సంపాదించిన ఆస్తి మనుమడితో మట్టిపాలు
- 228 అప్పిచ్చే నాకొడుకుంటే దొంగతనం ఎందుకు?
- 229 అప్పు అదనుకు, ఆకటికీ రాదు
- 230 అప్పు ఆదా కాదు - వాపు బలుపూ కాదు
- 231 అప్పు ఆరు తెన్నులు - ముప్పు మూడు తెన్నులు
- 232 అప్పు యిచ్చి చూడు - పిల్ల నిచ్చి చూడు
- 233 అప్పు ఇచ్చినవాడు బాగు కోరితే తీసుకున్నవాడు చెడు కోరతాడు
- 234 అప్పు చేసి కొప్పు తీర్చినట్లు
- 235 అప్పుచేసి పప్పు కూడు
- 236 అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు
- 237 అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?
- 238 అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
- 239 అప్పనుచూడబోతే రెప్పలు పోయినై
- 240 అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది
- 241 అప్పిచ్చువాడు వైద్యుడు
- 242 అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు
- 243 అప్పు నిప్పులాంటిది...
- 244 అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?
- 245 అప్పు చేసి కొప్పు తీర్చిందట
- 246 అప్పుచేసి పప్పు కూడు తినడం
- 247 అప్పు తీసుకుంటే చెప్పు చేతలలో ఉండాలి
- 248 అప్పులేని వాడే అధిక సంపన్నుడు
- 249 అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు
- 250 అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
- 251 అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
- 252 అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే దిబ్బడి నెత్తి సుబ్బడు కొట్టాడన్నట్లు
- 253 అభిరుచులా మస్తు - అంగస్తంభన నాస్తి
- 254 అభ్యాసం కూసువిద్య
- 255 అమరితే ఆడది - అమరకుంటే గాడిద
- 256 అమావాస్యకు అట్లు - పున్నానికి బూరెలు
- 257 అమ్మ కడుపు చూస్తుంది - భార్య జేబు చూస్తుంది
- 258 అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది
- 259 అమ్మకు నోటి వాడి - అయ్యకు చెయ్యి వాడి
- 260 అమ్మ గూటికి - అయ్య కాటికి
- 261 అమ్మ గృహ ప్రవేశం - అయ్య అగ్ని ప్రవేశం
- 262 అభ్యాసము కూసువిద్య
- 263 అమ్మ పుట్టిల్లు ఘనత మేనమామకు తెలియదా?
- 264 అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
- 265 అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
- 266 అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
- 267 అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
- 268 అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
- 269 అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
- 270 అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
- 271 అయ్యకు రెండు గుణాలే తక్కువ - తనకు తోచదు, చెబితే వినడు
- 272 అయ్యకు వణుకు ప్రాయం - అమ్మకు కులుకు ప్రాయం
- 273 అయ్యగారికి ఆరు ఎడ్లు, మూడు దొడ్లు
- 274 అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా?
- 275 అయ్య దాసర్లకు పెడితే అమ్మ జంగాలకు పెట్టిందట
- 276 అయ్య దేశ సంచారం - అమ్మ గ్రామ సంచారం
- 277 అయ్య వాత పెట్టనూ బర్రె బ్రతుకనూనా?
- 278 అయ్యవా రంతంత - అయ్యవారి పెళ్ళాం ముంతంత
- 279 అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
- 280 అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
- 281 అయ్యవారు వచ్చునంతవరకు అమావాస్య అగదు
- 282 అయ్యవారులకు ఐదు వరహాలు వారి పిల్లలకు పప్పుబెల్లాలు
- 283 అయినవాడని ఇంటికి రానిస్తే ఇంటి దానికి కన్ను కొట్టాడట
- 284 అయినవారు లోపలకు తోస్తే కానివారు బయటకు తోస్తారు
- 285 అయినవాళ్ళకు ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ
- 286 అయోమయం అడవి మొద్దు
- 287 అయ్యోపాపం అంటే ఆరు నెలల పాపం పైన పడ్తుంది
- 288 అరకాసు పనికి ముప్పాతిక బాడుగ ఖర్చు
- 289 అరగదీస్తే గంధపు చెక్కకు వాసన పోతుందా?
- 290 అరగని కూడు - జరగని మాట
- 291 అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం
- 292 అరచేతిలో వైకుంఠం చూపినట్లు
- 293 అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...
- 294 అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు
- 295 అరసుడిని నమ్మి పురుషుణ్ణి పోగొట్టుకున్నట్టుంది
- 296 అరిచే కుక్క కరవదు
- 297 ఆరగించగా లేనిది అడిగితే వచ్చిందా!
- 298 ఆరాటపు పెళ్ళి కొడుకు పేరంటాళ్ళ వెంట పడ్డాడట
- 299 ఆరాటమేగానీ పసలేదన్నట్లు
- 300 ఆరాటాల పెళ్ళాం - ఆయాసాల మొగుడు
- 301 ఆరికకు చిత్త గండం - ఆడదానికి పిల్ల గండం
- 302 ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
- 303 ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె
- 304 ఆరుద్ర కార్తె విత్తనానికీ - అన్నం పెట్టిన యింటికీ చెరుపు లేదు
- 305 ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయి
- 306 ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు
- 307 ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు
- 308 ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడతాయి
- 309 ఆరుద్రతో అదను సరి
- 310 ఆరుద్రలో అడ్డెడు చల్లితే, సులువుగా పుట్టెడు పండుతుంది
- 311 ఆరుద్ర వాన అదను వాన
- 312 ఆరుద్రకు ఆమ్లాలు కూడా పండుతాయి
- 313 ఆరు నెలలకు చచ్చేవాడికి అరుంధతి కనపడదు
- 314 ఆరునెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు
- 315 ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మతో యుద్ధం చేసినట్లు
- 316 ఆరు రాజ్యాలను జయించవచ్చు కానీ అల్లుడిని జయించలేం
- 317 ఆర్భాటపు ఆడదానికి ఆరుగురు మొగుళ్ళు
- 318 ఆర్చేవారే గానీ తీర్చేవారే లేరు
- 319 ఆలిఅలుక అరవైఏండ్లు, మగనిఅలుక ముప్పై ఏండ్లు, బాలప్రాయం పదేళ్ళు
- 320 ఆలికి అదుపు - ఇంటికి పొదుపు
- 321 అర్జీలకు పనులు కావు
- 322 అర్దరాత్రి మద్దెల దరువు
- 323 అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...
- 324 అలంకారం కంటే అయిదవతనం మేలు
- 325 అలకపాన్పు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారు పడినట్లు
- 326 అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనునికి దక్కేదేమీ వుండదు
- 327 అలలు నిల్చేదెప్పుడు? స్నానం చేసేదెప్పుడు?
- 328 అలక మీరితే అమృతమైనా విషమే
- 329 అలికిన యింట ఒలికినా అందమే
- 330 అలిగే బిడ్డతోనూ - పొడిచే గొడ్డుతోనూ కష్టం
- 331 అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
- 332 అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
- 333 అవ్వాకావలెను బువ్వా కావలెను
- 334 అయ్యే మంటే ఆరు నెలల పాపం తగులు కొందట
- 335 అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు
- 336 అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
- 337 అలెగే బిడ్డ చెలిగే గొడ్డు ఒకటే
- 338 ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
- 339 ఆస్తికొక కొడుకు - ప్రేమకొక కూతురు
- 340 ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొగమాటం పనికిరాదు
- 341 అంకపొంకాలు లేనిది శివలింగం
- 342 అంకెకు రాని ఆలి - కీలెడలిన కాలు
- 343 అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు
- 344 అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు
- 345 అంగట్లో అరువు - తల మీద బరువు
- 346 అంగట్లో అష్ట భాగ్యం - అల్లుని నోట్లో అష్ట దరిద్రం
- 347 అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది
- 348 అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు
- 349 అంగడి బియ్యం - తంగేటి కట్టెలు
- 350 అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి
- 351 అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
- 352 అంచు డాబె గాని కోక డాబు లేదు
- 353 అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు
- 354 అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు
- 355 అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసేదన్నట్టు
- 356 అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా
- 357 అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు
- 358 అందని పండ్లకు అర్రులు చాచినట్లు
- 359 అందని ద్రాక్షలు పుల్లన
- 360 అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
- 361 అందితే జుట్టు అందక పోతె కాళ్లు
- 362 అంగిట బెల్లం - ఆత్మలో విషం
- 363 అంగిట విషం - మున్నాలిక తియ్యదనం
- 364 అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు
- 365 అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట
- 366 అంటే ఆరడి - అనకుంటే అలుసు
- 367 అండలుంటే కొండలు దాటవచ్చు
- 368 అండలేని వూళ్ళో వుండ దోషం - ఆశలేని పుట్టింట అడగ దోషం
- 369 అండ వున్నవానిదే అందలం
- 370 అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత
- 371 అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు
- 372 అంత నీతే వుంటే ఇంత సంతెందుకు?
- 373 అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా?
- 374 అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు
- 375 అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు?
- 376 అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు
- 377 అందం చందం నావంతు - ముద్దూ మురిపెం నీవంతు అన్నదట
- 378 అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు
- 379 అందముంటే సరా! అదృష్టముండొద్దూ!
- 380 అందని మ్రానిపండ్లకు అఱ్ఱులు చాచినట్లు
- 381 అందరి కాళ్ళకు మ్రొక్కినా అత్తగారింటికి పోకతప్పదు
- 382 అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు
- 383 అందరికీ అన్నం పెట్టే వాడు రైతే
- 384 అందరినీ మెప్పించడం అలవి గాని పని
- 385 అందరూ అందలమెక్కితే మోసేవారెవ్వరు?
- 386 అందరూ ఒక ఎత్తు - అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు
- 387 అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది
- 388 అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు
- 389 అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట
- 390 అందాలు నావి - సంబరాలు నీవి అందిట
- 391 అందితే సిగ అందకపోతే కాళ్ళు
- 392 అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు
- 393 అంధుడికి అద్దం చూపించినట్లు
- 394 అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు
- 395 అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు
- 396 అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు
- 397 అంబరాన బిడ్డ పుడితే ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట
- 398 అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు
- 399 వనరులు
అంకపొంకాలు లేనిది శివలింగం[మార్చు]
అంకెకు రాని ఆలి - కీలెడలిన కాలు[మార్చు]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు[మార్చు]
- అర్ధం
సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు. ఈ జాతీయానికి సరైన అర్ధం మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా ఏ అవకాశం అందని పరిస్థితి. అంగడి అంటే సరుకులు అమ్మే చోటు. కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి వచ్చినపుడు మర్యాదలు సహజం. కొన్నాళ్ళకు పాతబడ్డ ఆ అల్లుడు అత్తవారి ఇంట్లోనే తిష్ట వేస్తే ఆ మర్యాదలు పెద్దగా జరగవు. అప్పుడు అంగట్లొ అన్నీ ఉంటాయి కాని అత్త వారింట్లో ఎవరూ వాటిని కొనరు. అల్లుడికి పెట్టరు. అలా రూపొందినదే ఈ సామెత. ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు.
- వాడుక
మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది
అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు[మార్చు]
అంగట్లో అరువు - తల మీద బరువు[మార్చు]
అరవు అనగా అప్పు అని అర్థము అంగట్లో అప్పువుంటే తలమీద బరువు వున్నట్లే అని అర్థము
అంగట్లో అష్ట భాగ్యం - అల్లుని నోట్లో అష్ట దరిద్రం[మార్చు]
అన్నీ వున్నాయి కాని అల్లుని నోట్లో శని వున్నది అనే సమానార్థంతో ఈ సామెతను వాడుతారు.
అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది[మార్చు]
ఏదైనా సరకులు అవసరానికి వాటిని కొనేవారికన్న తక్కువైతే ఆ వస్తువుకొరకు అందరు ఎగబడి అంగడికి ఎగబడతారు.... అప్పుడు దాని ధర కూడా అమాంతం పెరిగి పోతుంది. అవే వస్తువులు అవసరానికన్నా ఎక్కువయితే అవే వస్తువులు అనేక రాయితీలతో మన ఇంటిముంగిటకే వస్తాయనే అర్థంలో ఈ సామెతను వాడుతారు.
అంగిట బెల్లం - ఆత్మలో విషం[మార్చు]
పయోముఖ విష కుంభం అనే సంస్కృత సామెత లాంటిదే ఇది కూడాను. నోటితో తియ్యని మాటలు మాట్లాడుతున్నా.... మనసులో మాత్రంచాల చెడు భావన వున్నదని అర్థం.
అంగిట విషం - మున్నాలిక తియ్యదనం[మార్చు]
ఇది కూడా పై సామెత లాంటి అర్థాన్నే ఇస్తుంది. పైపైన మంచిగా మాట్లాడుతు లోన చెడు భావన కలిగి వున్న వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు.
అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు[మార్చు]
అంగడి బియ్యం - తంగేటి కట్టెలు[మార్చు]
అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి[మార్చు]
స్వంతంగా ఎంత బలం వున్నా..... ఎన్ని వున్నా దైవ బలం కూడా వుండాలని దీని అర్థం.
అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే[మార్చు]
ఉల్లిపాయ
అంచు డాబె గాని కోక డాబు లేదు[మార్చు]
కోక అనగా చీర అని అర్థం. దానికున్న అంచు మాత్రం మహా బాగావుండి అసలు చీరలో పస లేదు అని అర్థం. ఇలాంటి సమానర్థంలో మరొక సామెత కూడా ఉంది. పైన పఠారం లోన లొఠారం
అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు[మార్చు]
అంటే ఆరడి - అనకుంటే అలుసు[మార్చు]
అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట[మార్చు]
ఇదే అర్థంలో మరొక సామెత వుంది: అది: మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె
అంటే ఆరడి - అనకుంటే అలుసు[మార్చు]
అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు[మార్చు]
ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో పనులను చక్కగా అవుతాయి ఆదుకొనేవారుంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చెయొచ్చని ఈసామెత అర్థం. దీనికి సమానర్థంతో ఐకమత్యమే మహా భలము అనే సామెతకూడ ఉంది.
అండలుంటే కొండలు దాటవచ్చు[మార్చు]
సహాయంగా ఎవరైనా వుంటే ఎంతపనైనా చేయ వచ్చు అనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. ఐక మత్యమే మహాబలము అని దీకిని గూడార్థము.
అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు[మార్చు]
సాధారణంగా ఏటువంటి అలంకారాలు చేసుకోనివారు ఏమైనా ఉత్సవాలు, ఊరేగింపులు, పదిమందిలో కలిసే పెళ్ళిళ్ళలో మాత్రం విశేషంగా అలంకారాలు చేసుకొని అందరిలోకి ప్రత్యేకంగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు.ఒకామె చిన్నప్పుడుగానీ, మరీ వయస్సులో ఉన్నప్పుడుగానీ, మరి ఏ ఇతర సందర్భాలలోగానీ పెద్ద కొప్పు పెట్టి, అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయలేదట. ఆ ఊరిలో సంత జరుగుతుందని తెలిసి ఆ సంతలో ఎంతోమంది కొత్తకొత్త వారు వస్తారని వారందరి చూపు తనపైన పడాలని అందంగా పెద్దగా ఉండే కొప్పు పెట్టుకొని వెళ్ళిందట. సందర్భానుసారంగా మాత్రమే అలంకరించుకోవాలని ఈ సామెత
అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసేదన్నట్టు[మార్చు]
అమితంగా వాగ్దానాలు చేసి చాలా స్వల్పంగా దానాలు చేసేవారిని గురించి, ఎంతెంతో పనిచేస్తామని చెప్పి చాలాకొద్దిగా పనిచేసేవారిని గురించి, ఎక్కువగా హెచ్చులు చెప్పి తక్కువ పని చేసే పద్ధతి సందర్భంగా వాడె సామెత ఇది. ఇలాంటిదే మరొక సామెత: ఇంత ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు
అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా[మార్చు]
లావుగా వున్నంత మాత్రాన అన్ని విద్యలు తెలిసివుండవు. ఒక అమాయకుడు లావుగా వున్నతన్ని చూసి ఇతడు అంత లావున్నాడు కనుక అన్ని విద్యలు తెలిసి వుంటాయని భావించి తనకు తేలు కుట్టింది మంత్రం వేయమని అడిగాడట. ఆ లావుటతను తనకు తెలియదనగా "అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా" అని వెళ్లి పోయాడట అమాయకంగా.
అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు[మార్చు]
ఒక పనిని మొదలుపెట్టే ముందు దాని పర్యవసానాలు బాగా ఆలోచించి, ముందుగానే ఊహించి, సంబంధిత వ్యక్తులతో దానిని గురించి చర్చించి మొదలుపెట్టమని చెప్పేందుకు ఉద్దేశించినదే ఈ సామెత. కీడెంచి మేలెంచమనే సామెతకు ఇది కాస్త దగ్గరగా ఉంటుంది.
అందని పండ్లకు అర్రులు చాచినట్లు[మార్చు]
మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం.
అందని ద్రాక్షలు పుల్లన[మార్చు]
ఒక నక్క ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది.అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి.ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు, నోరు ఊరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే ఆనక్కకు పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి ఆ పళ్ళను అందుకోబోయింది. కానీ, పాపం దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్ష పళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక యెగరలేక విసిగి, "ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?" అని గొణుక్కుంటూ వెళ్ళిపొయింది. అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి అది దొరకక పోతే, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశామో అది ఎంత చెత్తదో, ఎంత పనికిరాదో చెప్పటం మొదలుపెడతాము. అప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు.
అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం[మార్చు]
తాము శ్రీవైష్ణవులము, మాంసాహారం తినము అని చెప్పుకుంటూ బుట్టలో చేపలన్నీ ఖాళీ చేసారు అని అర్ధం. అందరూ గొప్పవాళ్ళే కాని చేసేవన్ని తప్పుడు పనులే. ఎవరికి వారే తమకి తాము గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు కాని ఎవరి తప్పులు వారికే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సామెత వాడుతార
అందితే జుట్టు అందక పోతె కాళ్లు[మార్చు]
అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు. ఈ సామెత ఒక అవకాశవాది తత్వాన్ని తెలియచేస్తోంది.
అండ వున్నవానిదే అందలం[మార్చు]
ఐకమత్యమే మహా భలము అని దీనికి అర్థము.
అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత[మార్చు]
అంత నీతే వుంటే ఇంత సంతెందుకు?[మార్చు]
అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా?[మార్చు]
ఇదే అర్థంలో మరొక సామెత వున్నది: అది. ఇంతలావున్నావు తేలు మంత్రం తెలియదా?
అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు[మార్చు]
మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసిన వాడున్నూ, ఏవిషయము కొంతైనా తెలియని వాడున్నూ లేడని దీని అర్థము.
అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు?[మార్చు]
దీనికి సమానమైన అర్థంలో మరొక సామెత ఉంది. అందరూ వైష్ణవులే .......... బుట్టలో రొయ్యలు మాయం అయ్యాయి బాపన వాళ్లైనా చాటు మాటుగా మాంసం తింటారని దీనికి గూఢార్థము.
అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు[మార్చు]
[చూపులకు చుట్టాలు రమ్మంటే కోపాలు ] అనే సామెత లాంటిదే ఈదీను.
అందం చందం నావంతు - ముద్దూ మురిపెం నీవంతు అన్నదట[మార్చు]
అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు[మార్చు]
అకార పుష్టి నైవేద్య నష్ఠి అనే సామెత లాంటిదే ఇదీను.
అందముంటే సరా! అదృష్టముండొద్దూ![మార్చు]
అందని మ్రానిపండ్లకు అఱ్ఱులు చాచినట్లు[మార్చు]
మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం.
అందరి కాళ్ళకు మ్రొక్కినా అత్తగారింటికి పోకతప్పదు[మార్చు]
పెళ్ళికూతురు పెళ్ళైయ్యాక అత్తావారింటికి వెళుతూ అందరి కాళ్ళకు మొక్కుతుంది. కాని చివరకు అత్తవారింటికి వెళ్ళక తప్పదు.......
అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు[మార్చు]
అందరికి రాబోవు కష్టాలను చెప్పేవారు తమకు రాబోవు కష్టాలను ఎరుగరు అని దీని అర్థము. అనగా ఈ శకునాలు వట్టి భూటకమని అర్థము.
అందరికీ అన్నం పెట్టే వాడు రైతే[మార్చు]
అందరినీ మెప్పించడం అలవి గాని పని[మార్చు]
అందరినీ మెప్పించడము ఎంతమాత్రము వీలుకాదని దీని అర్థము. ఎంత మంచి విషయమైనా దాన్ని కూడా వ్వతిరేకించే వాడొకడుంటాడని దీని భావము.
అందరూ అందలమెక్కితే మోసేవారెవ్వరు?[మార్చు]
అందరూ ఒక ఎత్తు - అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు[మార్చు]
అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది[మార్చు]
అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు[మార్చు]
అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట[మార్చు]
అందాలు నావి - సంబరాలు నీవి అందిట[మార్చు]
అందితే సిగ అందకపోతే కాళ్ళు[మార్చు]
అవకాశాన్ని బట్టి ఎదిరించడమో, కాళ్ల బేరానికి రావడమో చేసె వారిగురించిన సామెత ఇది. ఇదే సమానార్థంలో మరొక సామెత.... ఏ ఎండకాగొడుగు పట్టినట్టు. అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి/ ఏ ఎండకు ఆ గొడుగు పట్టి నట్టు సమానర్థంలో మరొక సామెత
అందితే తియ్యన అందకుంటే పుల్లన[మార్చు]
[అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ] అనే సామెతకు సమానర్థంలో ఈ సామెతను వాడుతారు. ఎంత ప్రయత్నించినా ద్రాక్ష పళ్ళు అందక పోతే..... తన ప్రయత్నము విపలమైనదని ఒప్పుకోక ఆ ద్రాక్ష పళ్ళు పుల్లనివి అని తన ఓటమిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం ఇది.
అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు[మార్చు]
అంధుడికి అద్దం చూపించినట్లు[మార్చు]
కొంతమంది ఎంత వివరంగా విషయాన్నంతా చెప్పినా గ్రహించలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచించడానికి ఈ సామెత ఉపకరిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత శ్రమపడినా శ్రమను ఎదుటివారు గుర్తించక నిర్లిప్తంగా, నిరాసక్తంగా తోసివేసినప్పుడు కూడా ఈ సామెతను సందర్భానుసారం చెప్పటానికి ఉపయోగపడుతుంది. అంధుడికి ఎంత మాత్రమూ ఎదుటి వస్తువులు కనిపించక పోవటం సర్వసాధారణం. అటువంటిది అందాన్ని ఒకటికి పది సార్లు చూసుకోడానికి నేత్ర దృష్టి బాగా ఉన్నవారు ఉపయోగించే అద్దాన్ని అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన.
అంధుడికి అద్దం చూపించినట్లు[మార్చు]
అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన..
అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు[మార్చు]
తాను తాగే అంబలిలో ఉప్పు తక్కువైనందున అందులో ఉప్పు కూడా తెచ్చి వేసుకోలేని వాడు పిండి వంటలు కోరుకున్నట్లు...... అని దీనికి అర్థము.
అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు[మార్చు]
అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు[మార్చు]
గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు వంటిదే ఈ సామెత. తన స్థాయికి మించి పనులు చేసే వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు.
అంబరాన బిడ్డ పుడితే ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట[మార్చు]
లేక లేక పుట్టిన పిల్లలను గారాబంగా పెంచినప్పుడు ఈ సామెత వాడతారు
అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు[మార్చు]
"అ - ఆ" లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట[మార్చు]
అనర్హులు కూడా అందలం ఎక్కాలనే ప్రయత్నం చేయడాన్ని ఈ సామెత తెలియ జేస్తుంది.
"అ - ఆ" లు రావు గానీ అమరం చదువుతాడట[మార్చు]
అకట వికటపు రాజుకు అవివేకపు ప్రధాని, చాదస్తపు పరివారము[మార్చు]
అక్క ఆరాటమే గానీ బావ బ్రతకడన్నట్లు[మార్చు]
అక్క కాపురం అడగక్కర లేదు - చెల్లెలి కాపురం చెప్పక్కర లేదు[మార్చు]
==అక్కచెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు సొంత వాళ్లకు, అయిన వాళ్లకు పెట్టిన ఖర్చును కూడా లెక్కగడితే.. ఇలాంటి సామెతలు వాడతారు.
అక్క పగ, బావ మంచి[మార్చు]
అక్క మనదైతే బావ మన వాడవుతాడా?[మార్చు]
అక్క మొగుడు కుక్క[మార్చు]
అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ - అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ[మార్చు]
దీనికి సమానర్థంలో మరికొన్ని సామెతలు: 1. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. 2. ఏరు దాటునంత వరకు ఓడ మల్లయ్య గారు..... ఏరు దాటాక బోడి మల్లయ్య.
అక్కరకురాని చుట్ట మెందుకు?[మార్చు]
ఇది సుమతీ శతక పద్యంలోని భాగము..... అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీయని వేల్పు, యుద్ధమునందు పారిపోయిన గుర్రము మొదలగు వాటిని వదిలి పెట్టాలని దీని అర్థము.
అక్కరకు వచ్చినవాడే మనవాడు[మార్చు]
అక్కర తీరితే అల్లుడు అశుద్ధంతో సమానమన్నట్లు[మార్చు]
అక్కరకు రానిది అవనిలో లేదు[మార్చు]
ప్రతి వస్తువు కూడా పనివచ్చేదే అనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. (శ్రీ శ్రీ కవితలోని కొన్ని మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు: అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకనర్హం.... .....
అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?[మార్చు]
అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం[మార్చు]
అగడ్త అనేది పూర్వం కోటల పరిరక్షణకు ప్రహారి చట్టూ తీసిన గొయ్యి లాంటిది. అగడ్తలు చాలా లోతుగా ఉంటాయి. అగడ్తలో పడ్డ పిల్లి అదే సర్వసం అనుకుంటుంది. ఇదే అర్థములో మరొక సామెత ఉంది. అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం
అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం[మార్చు]
అగసాలిని, వెలయాలిని నమ్మరాదు[మార్చు]
సమాజంలో ఉన్న కులాలకు సంబంధించినది ఈ సామెత/ అగసాలి అనగా బంగారపు పని చేసే కంసాలి అని, వెలయాలు అనగా వేశ్య అని అర్థము.
అగసాలి పొందు, వెలమల చెలిమి నమ్మరాదు[మార్చు]
ఇది సమాజములోని కొన్ని కులాలకు చెందిన సామెత: అగసాలి అనగా బంగారపు పని చేసే కంసాలి. వెలమ అనగా సమాజములో ఒక ఉన్నత కులము.
అగ్గి చూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది[మార్చు]
అగ్గిమీద గుగ్గిలం లాగా[మార్చు]
అగ్నిచెంత వెన్న ఎంత తడవాగో ఆడవారి కోపము అంత తడవాగు[మార్చు]
అగ్ని చెంతే వెన్న వెంటనే కరిగి పోతుంది. అదే విధముగా ఆడవారి కోపము కూడా అతి స్వల్ప కాలమే అని ఈ సామెతకు అర్థము.
అగ్నిదేవుడు చలికాలంలో చిన్నవాడు ఎండాకాలంలో ఎదిగినవాడు[మార్చు]
అగ్నిలో ఆజ్యం పోసినట్లు[మార్చు]
[ అగ్నికి వాయువు తోడైనట్లు] అనే సామెత లాంటితే ఈ సామెత కూడాను.
అగ్నిలో మిడత పడ్డట్లు[మార్చు]
అగ్నిశేషం, ఋణశేషం, శత్రుశేషం ఉంచరాదు[మార్చు]
అగ్గిపక్కన వెన్న ఆడవారి కోపం ఒకటే[మార్చు]
పురుషుడికి కోపం వస్తే ప్రతీకారం తీర్చుకొనేదాకా వూరుకోడు. కానీ స్త్రీల కోపము తాత్కాలికమే వేడి తగిలిన వెన్నలాగా స్త్రీ మనస్సు కరిగిపోతుంది అని ఈ సామెతకు అర్థము.
అగ్నికి వాయువు తోడైనట్లు[మార్చు]
అగ్నిని ఎవరైన చల్లార్చడానికే ప్రయత్నిస్తారు. అలాంటి అగ్నికి వాయువు తోడైతే చల్లార్చడం చాలా కష్టం. మన కోపాన్ని అగ్నితో పోలుస్తారు. ఎవరైనా ఎవరి మీదైనా అగ్నిలాంటి కోపంతో ప్రజ్వరిల్లుతూ ఉన్నప్పుడు పక్కన ఉండే వాళ్ళు కావలసినవాళ్ళైతే ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు కాని మధ్యన ఉండేవాళ్ళు కానివాళ్ళు ఐతే ఆ కోపాన్ని ఉన్నవీ లేనివి చెప్పి పెంచడానికి చూస్తారు. ఇలాంటి సమయంలో ఈసామెతని వాడుతారు. అగ్నిలో ఆజ్యం పోసినట్లు అనే సామెతను కూడా ఇలాంటి సందర్భంలో వాడుతారు.
అగ్గువ అయితే అంగడికి వస్తుంది అన్నాడట[మార్చు]
అగ్రహారం పోతే పోయింది గానీ చట్టం మొత్తం తెలిసింది[మార్చు]
అచ్చట్లు - ముచ్చట్లు - ఎదనిండా వెన్నెల్లు అన్నట్టు[మార్చు]
అచ్చట్లు, ముచ్చట్లు దుప్పట్ల ముసుగులో అన్నదట[మార్చు]
అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం అన్నట్లు[మార్చు]
అచ్చివచ్చిన భూమి అడుగైనా చాలు[మార్చు]
గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అన్న సామెత లాంటిదే ఇదీను.
అచ్చివచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు పుడతాడట[మార్చు]
అచ్చు పోసిన ఆబోతువలె[మార్చు]
గతంలో కొన్ని పల్లెల్లో ఒక కోడెను ఇది ఆబోతు అని పేరు పెట్టి వూరి మీదకు వదిలి పెడతారు. అది అందరిదీను. అది ఎక్కడ తిరిగినా..... ఎవరింటికి వెళ్ళినా దానిని ఏమీ అనరు. ఇది ఆనాటి ఆచారము. ఏపనీ లేకుండా ఊరు మీద పడి తిరిగే వారిని ఈ సామెతతో పోల్చి చెపుతుంటారు.
అజీర్ణానికి లంఖణం మందు[మార్చు]
అజీర్ణము అనగా తిన్నది అరగక పోవడము. దానికి మందు ఏమిటంటే...... ఉపవాసముండడమే అని అర్థము.
అటునుండి నరుక్కు రా[మార్చు]
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతిని పాలించే కాలంలో దోపిడీ దొంగల బెడద ఎక్కువగా ఉండేది. వారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు ఆయన ఆ దోపిడీ దొంగలను పట్టి, బంధించి, వారందరినీ వరసగా నిలబెట్టి తలలు నరకమని తలారులను ఆజ్ఞాపించాడు. ప్రాణాలు కాపాడుకునే దారి లేక ఆ దొంగలు 'అటు నుండి నరుక్కు రా' అంటే 'కాదు అటు నుండే రా' అని ఆ తలారిని ప్రాధేయ పడ్డారట. కొంత మందిని నరికిన తరువాతైనా ప్రభువుకు జాలి కలిగి మిగిలిన వాళ్ళను క్షమించక పోతాడా, ఆ విధంగా ప్రాణాలు దక్కక పోతాయా అని వారి ఆశ అన్నమాట. ఆ విధంగా ఈ సామెత పుట్టింది. (ఈ విషయమై వివరాలకు మంగళగిరి పేజీ చూడండి.) ఒక పనిని ఒక పద్ధతిలో చెయ్యడం కుదరకపోతే వేరే విధంగా చెయ్యమని చెప్పే సందర్భంలో ఈ సామెతను ప్రస్తుతం వాడుతున్నారు.
అటైతే కందిపప్పు - యిటైతే పెసరపప్పు[మార్చు]
అటైతే వైద్యకట్నం - యిటైతే వైతరిణీ గోదానం[మార్చు]
అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనబడతారు[మార్చు]
అట్లు వండినమ్మకు ఆరుగురు అమర్చాలి[మార్చు]
అట్లు వండే అత్తకు అరవైఆరు ఎత్తులు పెట్టినట్లు[మార్చు]
అడక్కుండా చెప్పులిచ్చాడు అడిగితే గుర్రం యిస్తాడేమో అన్నట్లు[మార్చు]
అడక్కుంటే జోలె అడుక్కుపోతోంది[మార్చు]
అడవి పత్రి - వాన నీరు[మార్చు]
అడవిలో తిని ఆకుతో తుడుచుకున్నట్లు[మార్చు]
అడిగిందే పాపం - అనుగ్రహించటం తన స్వభావం అన్నట్లు[మార్చు]
అడిగింది రొట్టె - యిచ్చింది రాయి[మార్చు]
అడిగితే చిరాకు - అడగకపోతే పరాకు[మార్చు]
అడిగేటంత అన్యాయానికి లోబడతానా?[మార్చు]
అడవిలో పడ్డట్లుగా[మార్చు]
అడుసు త్రొక్కనేల కాలు కడగనేల[మార్చు]
కావాలని కష్టాలు తెచ్చుకోనేల? ఆ తర్వాత బాధ పడనేల?... అని అర్థం.
అడకత్తెరలో పోకచెక్క[మార్చు]
అడకత్తెరలో చిక్కిన పోకచెక్కకి వత్తిడి రెండు వైపుల ఉండి తప్పించుకోలేని పరిస్థితి కలుగుతుంది. అలాగే జీవితంలో బాగా కావలసిన ఇద్దరు వ్యక్తుల కలతల మధ్య చిక్కుకొని ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఈ సామెత వాడుతుంటారు.
అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు[మార్చు]
ఆకలి తెలుసుకొని అన్నం పెట్టేదే అమ్మ.కాని అమ్మ ఐనా కొన్ని సందర్భాలలో ఆకలి తీర్చడం మరచి పోవచ్చు.మొగమాటంతో అమ్మ పెడ్తుందిలే అని ఊరుకుంటే ఆకలి తీరేదెలా.అమ్మ దగ్గర మొగమాట పడేవాళ్ళు ఎవరి దగ్గరా చొరవగా ఉండలేరు.చొరవ తీసుకుని అడగక పోతే ఏ పని జరగదు.అన్నిటికీ మొగమాట పడేవారిని చూసి చెప్పే సామెత ఇది.
అడవిలో కాచిన వెన్నెల.... ముదిమిన చేసిన పెళ్ళి రెండు ఒకటే[మార్చు]
అడవిలో కాచిన వెన్నెల ఉపయోగం లేనట్లే ముసలి వానికి పెళ్ళి చేస్తే ఫలితం ఉండని దీని అర్థం. ఏదైనా నిరుపయోగము అని చెప్ప దలిస్తే ఈ సామెతను వాడుతారు. అడవిలో కాచిన వెన్నెల మానవులకు ఉపయోగము కాదు..... వయస్సు మీరిన తర్వాత చేసిన పెళ్ళి కూడా అక్కరకు రాదు అని దీని అర్థము.
అడిగేవాడికి చేప్పేవాడు లోకువ[మార్చు]
ఎవరైనా ఎవరిని అయినా ఎదైనా అడిగితే వారు చెప్పేటప్పుడు వీడు నాకు చెప్పేదేంటి అనే భావన ఉంటుంది. అందుకే అడిగేవాడికి చెప్పే వాడు లోకువ అంటారు.
అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు[మార్చు]
ఇంట్లో వంట చేసుకునే వారికి ఒకటి లేదా రెండు కూరలూ... అదే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అని అర్థం. ఇలాంటిదే మరొక సామెత: అద్దెకుండే వానికి అరవై ఇండ్లు, స్వంతగానికి ఒకటే ఇల్లు.
అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు[మార్చు]
ఆకులు నాకే వాడి దగ్గర మూతులు నాకే వాడు
అడుక్కుతినేవాడికి అరవై వూళ్ళు[మార్చు]
ఇదే అర్థము మరొక సామెత వున్నది: అది: అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు ఇంట్లో వంట చేసుకునే వారికి ఒకటి లేదా రెండు కూరలూ... అదే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అని అర్థం. ఇలాంటిదే మరొక సామెత: అద్దెకుండే వానికి అరవై ఇండ్లు, స్వంతగానికి ఒకటే ఇల్లు.
అడుక్కుతినేవాడికి ఆలయ్యేకంటే ధనవంతుడికి దాసి అయ్యేది మేలు[మార్చు]
అడుక్కోవటానికి ఈ గడప కాకపోతే యింకో గడప[మార్చు]
అడుసు తొక్కనేల కాలు కడగనేల[మార్చు]
అడుసు అంటే బురద (బాడి). బురదను ముట్టుకుంటే అంటుకుంటుంది. ఈ విషయం తెలిసీ దాన్ని తొక్కటం ఎందుకు, తర్వాత అంటుకుంది అని బాధపడి కడుక్కోవటం ఎందుకు అని పూర్తి అర్ధం. అంటే, తెలిసి తప్పు చేయటం ఎందుకు తర్వాత బాధపడటం ఎందుకు అనే అర్ధం కోసం వాడతారు.
- పంకప్రక్షాళనన్యాయము
అడుగు తప్పితే పిడుగు తప్పుతుంది[మార్చు]
అడుగు దాటితే అక్కర దాటుతుంది[మార్చు]
అడుగు పెట్టగానే పిడుగు పడ్డట్లు[మార్చు]
అడ్డ జామీనులకు పోతే తెడ్డు దెబ్బలు తప్పవు[మార్చు]
అడ్డం దిడ్డం తిరిగే తెడ్డుకు రుచేం తెలుసు?[మార్చు]
కూరలలో తిప్పే గరిటెను తెడ్డు అని అంటారు. అది కూరలలో తిరుగుతున్నా.... ఆ కూర రుచి దానికి తెలియదు అని అర్థము.
అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు[మార్చు]
ఉయ్యాలలో ఉన్నప్పుడైతే మాట వింటారు గానీ, గడ్డాలు, మీసాలు వచ్చిన తరువాత వింటారా? అని మొక్కై వంగనిది మానై వంగునా
అడ్డెడు తినేవాడికి ఆలెందుకు? యిద్దుము మోసేవానికి ఎద్దెందుకు[మార్చు]
అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు గొడ్డు తినిపోయిందిట[మార్చు]
అతడెంత ఘనుడైనా అడుగక తప్పదు[మార్చు]
అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న[మార్చు]
ఎవరికి వారు తామె గొప్పవారమని విర్ర వీగుతుంటారు. ఒకరికి మించిన వారు మరొకరు వుంటారని వారు ఎరుగరు. అలా విర్ర వీగే వారి గురించి ఈ సామెత వాడతారు. అలాంటిదే మరో సామెత ఉంది. అది. తాడిని తన్నే వాడుంటే..... వాడి తలను తన్నే వాడు మరొకడుంటాడు.
అతిచేస్తే మతి చెడుతుందన్నట్టు[మార్చు]
ఏ పనైనా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. హద్దులను పాటించాలి. అలా కాకపోతే అన్నీ అనర్థాలే
అతికించిన కోరమీసం ఎంతసేపు నిలుస్తుంది?[మార్చు]
అతి వినయం ధూర్త లక్షణం[మార్చు]
అవసరం అయిన దానికన్నా అధికంగా వినయాన్ని చూపేవారి గురించి ఈ సామెత వాడతారు. ఇలా అతి వినయం చూపుట దుష్టుల యొక్క లక్షణం అని అర్ధం. హృదయంలో లేని గౌరవాన్ని ప్రవర్తనలో చూపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో కూడా వాడతారు. నక్క వినయం అనే జాతీయం దీనికి దగ్గరగా ఉంటుంది.
అతితెలివికి ఆకలెక్కువ[మార్చు]
అతివృష్టయినా అనావృష్టయినా ఆకలిబాధ తప్పదు[మార్చు]
వర్షము ఎక్కువైనా........ అసలు వర్షము లేకపోయినా కరువు తప్పదని దీని అర్థము.
అతిరహస్యం బట్టబయలు[మార్చు]
ఏదైనా విషయం రహస్యంగా ఉంచే ప్రయత్నంలో అతిగా ప్రయాసపడి, అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే, ఆ రహస్యం కాస్తా బట్టబయలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించటానికి ఈ సామెతను వాడుతారు.
అతి సుకుమారం - కటిక దరిద్రం[మార్చు]
అత్త అడుక్కొని తింటుంటే అల్లునికి మనుగుడుపా?[మార్చు]
అత్త అప్పుతీరే - అల్లునికి భ్రమతీరే[మార్చు]
అత్త కాలము కొన్నాళ్ళు - కోడలి కాలము కొన్నాళ్ళు[మార్చు]
అత్తకు అల్లుడాశ - అల్లుడికి అత్తాశ[మార్చు]
అత్తకు మంచి లేదు - చింతకు పచ్చి లేదు[మార్చు]
అత్తకు లేక చస్తుంటే అల్లుడు వచ్చి దీపావళి పండగన్నాడట[మార్చు]
అత్త కొట్టిన కుండ అడుగోటికుండ, కోడలు కొట్టిన కుండ క్రొత్తకుండ[మార్చు]
ఇదే అర్థాన్నిచ్చె మరొక సామెత ఉంది. అది. ఉంటే లిక్కి...... పోతే కొడవలి అత్త పగలగొట్టిన కుండ ఓటుది అని..... కోడలు పగల గొట్టిన కుండ..... ఓటుదైనా అది కొత్త కుండ అని అత్తగారు కోడలిని దెప్పి పొడుస్తుందని భావము.
అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు[మార్చు]
అత్తను ఉంచుకున్నవాడు దరిద్రుడు[మార్చు]
ఇది ప్రాసకొరకు వున్న సామెత మాత్రమే...................... కాని అర్థవంతమైనది కాదు.
అత్తను కొట్టి అటకెక్కింది - మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది[మార్చు]
అత్త పెట్టే ఆరళ్ళు కనబడతాయిగానీ, కోడలి కొంటె పనులు కనబడవు[మార్చు]
అత్త పేరు పెట్టి కూతుర్ని కొట్టినట్లు[మార్చు]
అత్త మంచీలేదు - వేప తీపీలేదు[మార్చు]
ఆత్తలందరూ చెడ్డవారని ఈ సామెతకు అర్థము.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు[మార్చు]
ఒకరి మీద కోపమొస్తే చేతిలోని వస్తువులను విసిరికొట్టడము మానవ సహజము. అదే విధంగా ఒక కోడలు తన అత్తమీద కోపంతో చేతిలోనున్న దుత్తను పగలగొట్టిందట. దుత్త అనగా ఒక మట్టి కుండ.
అత్తముండ కన్న ఉత్తముండ మేలు[మార్చు]
అత్త మెత్తన, కత్తి మెత్తన ఉండవు[మార్చు]
అత్త మంచీలేదు - వేప తీపీలేదు అనే సామెత లాగే ఈ సామెతకు ఆత్తలందరూ చెడ్డవారని ఈ సామెతకు అర్థము.
అత్త రంకుకు పోతూ కోడలికి బుద్ధి చెప్పిందట[మార్చు]
[ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులున్నాయి] అనే సామెత అర్థము దీనికి వర్తిస్తుంది. అత్త చెడు పనులు చేస్తూ తన కోడలికి చెడు పనులు చేయకు అని చెప్పి నట్లు.
అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.[మార్చు]
దుత్త అంటే మట్టితో చేసిన చిన్న కుండ. మజ్జిగ వంటి వాటిని నిలవ ఉంచేందుకు వాడుతారు. కోడలికి అత్త మీద కోపం వచ్చిందంట, కానీ ఏమి చేస్తుంది పాపం అత్తేమో పెద్దావిడ, ఏమన్నా అందామా అంటే మొగుడు ఊరుకోడు అందుకని ఆ కోపాన్ని చేతిలో ఉన్న దుత్త మీద చూపుతూ విసిరి పగలకొట్టిందట. అందుకనే సాధారణంగా ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించినప్పుడు అంటారు, "అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు" అని. ఉదాహరణకు ఆఫీసులో బాసు తిట్టాడని ఇంట్లో భార్యని విసుక్కునేవారు.
అత్తవల్ల దొంగతనము, మొగుడి వల్ల రంకుతనం నేర్చుకున్నట్లు[మార్చు]
అత్తవారింటి అల్లుణ్ణీ ఆముదాల చేలో ఆబోతునూ చూడాలి[మార్చు]
అత్తవారింటి ఐశ్వర్యంకన్న పుట్టింటి గంజి మేలు[మార్చు]
అత్తవారింటి లేమి అల్లుడెరుగు[మార్చు]
అత్తవారింటి సుఖం మోచేతి దెబ్బ వంటిది[మార్చు]
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు[మార్చు]
తనది కాని సొమ్మును దానమిచ్చు వారిని ఉద్దేశించి ఈ సామెత చెప్పబడింది. ముడ్డి తనది కాకపోతే గోదావరి దాక దేక మన్నాడట అనే సామెత దీనికి సమానార్థము.
- ఒకరి సొమ్ముని వేరొకరు ఖర్చు పెట్టినా, ఒకరి సొమ్ముని వేరొకరు ఇంకొకరికి దానంగా ఇచ్చినా ఈ సామెతనుపయోగించి ఎక్కిరించడం అలవాటు, బహుశా ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళ గురించి మొదట ఈ సామెత మొదలయి ఉండవచ్చు!
అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు[మార్చు]
మొగలి పూల సువాసనలు గుబాళింపులు అత్తరు పన్నీరుల గుబాళింపుల లాగానే ఉంటాయి. అయితే ఆ మొగలి పూల పొద దగ్గరకు వెళ్లాలంటేనే ముందు భయం వేస్తుంది. ధైర్యం చేసి మొగలి పూవును ఎలాగో ఒకలాగా తెచ్చుకున్నా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మొగలిపూవుకు ఉండే ముళ్లలాంటివి గుచ్చుకుని లబలబలాడాల్సి వస్తుంది.
అత్తా! నీ కొంగు తొలిగిందన్నా తప్పే, లేదన్నా తప్పే[మార్చు]
అత్తింటి కాపురం కత్తి మీద సాములాంటిది[మార్చు]
అతి తెలివి అరవై రకాలు[మార్చు]
అతిథి కోసమే తిథులు వున్నట్లు[మార్చు]
అదును లేని పైరు - ముదిమిలోని బిడ్డ ఒక్కటే[మార్చు]
అదనుకు అనగా సమయానికి పైరు వేయక పేతే సరైన ఫలితమివ్వదు. అలాగే ముసలి వయస్సులో పిల్లలు పుడుతే వారు తల్లి దండ్రులకు సేవ చేసే వయసులో వుండరు అని ఈ సామెతకు అర్థం.
అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు[మార్చు]
కోడలు ఎంత ఉత్తమురాలైనా అత్త మెప్పు పొందడం అరుదు. అదే అత్త లేని ఇంట్లో కోడలిదే పెత్తనం కాబట్టి ఇక ఆమెకు ఎదురేముంటుంది? ఇక ఆమె ఏం చేసిన గొప్పే! అత్త లేని ఇంట మంచి పేరు తెచ్చుకోవడం కోడలికి బహు సులువు. అదే విదంగా కోడలిని ఆరళ్ళు పెట్టని అత్తలూ అరుదే. కోడలు కాపురానికి రానంతవరకూ అత్తలందరూ గుణవంతులే.. కోడలు వస్తే గానీ అత్తల గుణం బయట పడదు. అత్తలేని కోడల్ని, కోడలులేని అత్తని ఎవరైనా మెచ్చుకుంటే ఆ అదృష్టానికి నోచుకోని కొందరు అక్కసు వెళ్ళబుచ్చుతూ ఈ సామెతని వాడతారు. ఒక జానపద గేయం ఈ సామెతతో మొదలవుతుంది. దంపుడు పాటగా బాగా ప్రసిద్ధి చెందింది. ఘంటసాల గానం చేసిన రికార్డు బాగా జనాదరణ పొందింది.
- ఆహూ ఊహూ ... అత్త లేని కోడలుత్తమురాలూ కోడల్లేనత్త గుణవంతురాలూ .. ఆహూ ఊహూ..
- కోడాల కోడాల కొడుకు పెళ్ళామా
- పచ్చిపాలమీద మీగడేమాయె కోడలా
- వేడిపాలమీద వెన్న ఏమాయే కోడలా
- అత్తమ్మ ఊరకే ఆరళ్ళు గానీ
- పచ్చిపాలమీద మీగడుంటుందా
- వేడిపాలమీద వెన్న ఉంటుందా
- ఉట్టీ మీదున్న సున్నుండలేమాయె కోడలా
- ఇంటికి పెద్దయిన గండుపిల్లుండగా
- ఇంకెవరు వస్తారె అత్తమ్మా
గయ్యాళి అత్త పాత్ర తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ, ప్రత్యేకించి జానపద సాహిత్యంలో అతి సాధారణం.
అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు[మార్చు]
ఇతరుల సొమ్మును తన సొమ్ముగా తలచి విచ్చలవిడిగా దానము చెయ్యటం/ తనది కాని సొమ్మును దానమిచ్చు వారిని ఉద్దేశించి ఈ సామెత చెప్పబడింది. ముడ్డి తనది కాకపోతే గోదావరి దాక దేక మన్నాడట అనే సామెత దీనికి సమానార్థము.
అత్త ఒకింటి కోడలె[మార్చు]
ప్రస్తుతము అత్తగా వున్న అకామె గతంలో ఒక ఇంటి కోడలే అనే విషయం మరచిపోయి ప్రవర్తించడాన్ని ఈ సామెత తెలియ జేస్తుంది.
అతుకుల కాపురం - చితుకుల మంట[మార్చు]
అతుకుల బొంత - గతుకుల బాట[మార్చు]
అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు[మార్చు]
అసలు అక్కడ జరిగేది ఏమి లేకుండానే, ఏదో ఉందని చెప్పే వారి పక్కన దానికి మరో నాలుగు కలిపి చెప్పే వాళ్ళు ఉంటారు. అదిగో తెల్లకాకి అంటే ఇదిగో దానికి పుట్టిన పిల్ల కాకి అని, ముందు చెప్పినదే పెద్ద తప్పు దాన్ని సమర్థిస్తూ చెప్పేది ఇంకాపెద్ద తప్పు చెప్పే వారు కూడా ఉంటారు.
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు[మార్చు]
ఒక అసత్యం గురించి, లేని విషయం గురించి ఒకరు చెప్పే విషయాన్ని మరొకరు గుడ్డిగా నమ్మి అది నిజమేననేందుకు ఋజువులు వెదకడం, లేక దొరికే ప్రతిదాన్నీ ఋజువుగా భావించే సందర్భంలో ఇలా అంటారు. అబద్ధం వ్యాప్తి జరిగే విధానం ఇది. అయితే ఇందులో అమాయకత్వం, తెలియనితనం కనిపిస్తాయే గానీ కావాలని ఇతరులను వంచించే ప్రయత్నం కాదు. తాము విన్నదీ, కన్నదీ అబద్ధమని తరువాత తెలుసుకున్నపుడు అనుకుంటారు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లయిందని కావాలని అబద్ధాన్ని నిజంగా చూపే ప్రయత్నాన్ని వర్ణించడానికి ఒక సామెత ఉంది: ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
అదిగో అంటే ఆరునెల్లు[మార్చు]
అతి నిదానంగా పని చేసె వారిని గురించి ఈ సామెత వాడతారు. అలాంటి వారు ఇప్పుడే వస్తా నని మరలా రారు. అలాంటి వారి గురించి ఈ సామెత వాడతారు.
అద్దం అబద్ధం ఆడుతుందా ![మార్చు]
అద్దంలో చూస్తే చూచిన వారి ముఖం ఎలా వుందో అదేవిధంగా కనబడుతుంది కాని... అంతకన్నా అందంగానో.... లేదా అంద విహీనంగానో కనబడదు. అందుచేత అద్దం అబద్ధం చెప్పదంటారు.
అద్దెకు తెచ్చిన గుర్రం అగడ్త దాటుతుందా[మార్చు]
అద్దెకు గాని, అరువుకు గాని ఉచితంగా గాని పనులకు తెచ్చుకొన్న వస్తువులు పెద్ద పెద్ద పనులకు ఉపయోగించవని ఈ సామెతకు అర్థం>
అదే పతకవైతే అమ్ముకు తిననా?[మార్చు]
ఒక వస్తువును ఉపయోగించడానికి వీలులేకపోతే ఎంత విలువైనదైనా ఏం ప్రయోజనం? ఏమీలేదు; అనే అర్థంలో వాడతారు. ఆడాళ్లు ఈ సామెత ఉపయోగిస్తే విపరీతమైన అర్థం స్ఫురిస్తుంది.
అనగా అనగా రాగం తినగా తినగా రోగం[మార్చు]
సాధనతొ ఏదైనా సాధ్యమే అని దీని భావం. పాడగా పాడగా సంగీతం / రాగం వస్తుంది. అలాగే అతిగా తింటూ కూర్చుంటే రోగాలు వస్తాయని అర్ధం.
ఈ అర్థానికి దగ్గరగా వేమన పద్యం ఒకటి ఉంది:
అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగతినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ
అని అనిపించుకోవలెనా అత్తగారూ![మార్చు]
ఒకరిని ఒక అనరాని మాట అని వారిచే నాలుగు మాటలు అనిపించుకోవడమనే తెలివి తక్కువ పని తెలియ జేస్తుంది ఈ సామెత.
అన్నం పెట్టిన చెయ్యిని నరికినట్లు[మార్చు]
ఉపకారికి అపకారము చేసినట్టి సందర్భంలో ఈ సామెతను చెబుతారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు అనే మరొక సామెత ఇలాంటిదే.
అన్నం అడిగిన వాడికి సున్నం పెట్టినట్లు[మార్చు]
నిరంతరం ద్రోహచింతనతో ఉండేవారి గురించి.ఉపకారం చేయమని అడగటానికి వెళ్ళిన వ్యక్తికి ఉపకారం చేయకపోగా చేస్తున్నట్లు నటించి అపకారం చేసి అవమానించటం.అందని పూలు దేవుడికి అర్పణం అన్నట్టు. స్వార్థపరులు, అవకాశవాదుల మనస్తత్వం .
అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అప్పచెల్లెళ్ళ పొత్తు పెద్దప్పుడు[మార్చు]
అన్నదీక్షే కానీ అక్షర దీక్ష లేదు[మార్చు]
అన్నం పెట్టిన చెయ్యిని నరికినట్లు[మార్చు]
అన్న ద్వేషం, బ్రహ్మ ద్వేషం పనికిరావు[మార్చు]
అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట[మార్చు]
లేని దానికోసం కక్కుర్తి పడటం ఒక జంట పక్క ఊరు వెళ్ళేందుకు బట్టలు సర్దుకొని ప్రయాణము అవుతారు. దారిలో మరొక జంట వీరిని కలిసి, ఇప్పుడే వస్తాము మా సామాను చూస్తూ ఉండమని చెప్పి పాత బట్టలు ధరించి కొత్త బట్టలను మూట గట్టి ఆ మూటను చూస్తూ వుండమని చెప్పి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు కొత్త బట్టలు తీసుకొని వస్తారు! ఇది చూసి ఆశ్చర్యపోయిన మన పాత జంట "ఏమిటి విషయము" అని అడిగితే.., ఫలానా జమిందారు పేదవారికి అన్న వస్త్రాలు దానం చేస్తున్నాడు అని చెప్పి, అందుకనే మేము పేదవారిలాగా వెళ్ళి అతను ఇచ్చిన కొత్త బట్టలు తెచ్చుకున్నాము అని చెప్తారు. దీనితో మన జంటకి కూడా ఆశ పుట్టి బట్టలన్నీ మూట కట్టి వారికి అప్పగించి పాత దుస్తులు ధరించి వెళ్తారు. వెళ్తే ఏముంది.., జమీందారూ లేడు.. కొత్త బట్టలూ లేవు. ఈసురోమంటూ వెనక్కి వచ్చి చూస్తే.. వాళ్ళ దుస్తులు తీసుకుని కొత్త జంట ఎప్పుడో ఉడాయించారట. మేలు జరుగుతుందని ఆశపడివెళితే అనుకున్న మేలు జరగకపోగా మరికొంత కీడు వచ్చిపడటం. ఓ వ్యక్తి దరిద్రంతో బాధపడుతూ తనకు కావలసిన అన్నం, వస్త్రాలు ఎవరో దానం చేస్తానంటే వెళ్ళాడట. కానీ అక్కడి పరిస్థితి మారిపోయి ఆ ప్రదేశంలో ఎదురైన కొంతమంది ఉన్న వస్త్రాన్ని కూడా లాక్కున్నారట. లాభం వస్తుందనుకున్నప్పుడు ఆశించిన లాభం రాకపోగా అనుకోని నష్టం ప్రాప్తించటం.
అన్నవారూ, పడినవారూ బాగున్నారు, మధ్యవారు పడిచచ్చారు[మార్చు]
ఇరు వర్గాల మధ్య పోట్లాట జరిగితే............ తీర్పు చెప్పడానికి మద్యలోకి వెళితే వారికి జరిగే అపనింద గురించి ఈ సామెత పుట్టింది. మాటలు అన్నవారుగాని, పడిన వారుగాని బాగుంటారు............. మద్యలో వెళ్ళినవారు నింద మోయాల్చొస్తుందని దీని అర్థం. కోడెల పోట్లాటలో దూడలు నలిగినట్లు అనే సామెతతో దీనికి పోలిక ఉంది.
- ఎవరైనా వేరే వాళ్ళని తిడితే, అలా తిట్టాకూడదని సర్దిచెప్పే వారు మధ్యలో తిట్లుతింటారు. అటు అన్న వాళ్ళని ఎవరూ ఏమి అనరు ఇటు తిన్న వాళ్ళని ఎవరు ఏమి అనరు కాని మధ్యలో తగువు తీర్చటానికి వచ్చిన వాళ్ళు మాత్రం మాటలు పడతారు. దానివలన మధ్యలో వెళ్ళిన వ్వక్తి ఆ ఇద్దరికి శత్రువౌతాడు. ఈ సామెత అర్థం అదె.
అన్యాయపు వూరిలో ఆలూ మగలకే రంకు[మార్చు]
అన్యాయపు సంపాదన ఆవిరై పోతుంది[మార్చు]
అన్యాయంగా సంపాదించిన సొమ్ము అక్కర తీర్చదని దీని అర్థము. ధన సంపాదనకు అన్యాయ మార్గాన్ని ఎంచుకోరాదని ఇందులోని గూడార్థం.
అన్నివేసి చూడు .... నన్ను వేయకుండా చూడు... అన్నదట ఉప్పు[మార్చు]
అన్ని దినుసులు వేసినా ఉప్పు వేయక పోతే వంటలకు రుచి రాదు అనే అర్థంలో ఈ సామెతను వాడుతారు.
అన్ని సాగితె రోగమంత భోగం లేదు[మార్చు]
రోగికి అన్ని సపర్యలు సక్రమంగా సాగి పోతుంటే..... రోగమె మంచిదని ఈ సామెత అర్థం.
అన్ని కార్తెలు తప్పినా హస్త కార్తె తప్పదు[మార్చు]
అన్ని దానాలలో అన్నదానం మిన్న[మార్చు]
అన్ని పైర్లకూ ఆషాఢం[మార్చు]
అన్ని రోగాలకు వాతలు పెట్టే వైద్యుణ్ణి దూరంగావుంచాలి[మార్చు]
అన్నీ అమర్చిన తర్వాత అత్తగారు వేలు పెట్టినట్లు[మార్చు]
అన్నీ అయిన తర్వాత అగ్ని వైద్యం[మార్చు]
అన్నిదానాల్లోకి నిదానమే గొప్పదన్నాడట[మార్చు]
కొంతమంది బద్ధకస్తులు తాము చేసిన పనులను సమర్ధించుకుంటూ ఎదుటి వారెవరైనా ఈ పని చెయ్యటంలో ఆలస్యం ఎందుకయిందని ప్రశ్నించినప్పుడు నిదానమే ప్రధానమని దబాయిస్తుంటారు.
అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు[మార్చు]
పని ఇఛిన వాణ్ణి దగ్గరగా ఉంచు, భజనపరులను దూరంగా ఉంచు అన్న మాటను ఈ సామెత తెలియచేస్తుంది.
అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు[మార్చు]
తినే తిండి మీద ఉన్న యావ లేక శ్రద్ధ చదవాల్సిన చదువు మీద లేదు అని ఈ మాటకు అర్థం.
అన్నం తిన్నవాడు తన్నులు తిన్నవాడు మరచిపోడు[మార్చు]
ఉపకారం పొందినా అపకారం పొందినా మరచిపోవటం సాధ్యం కాదని
అన్నిదానాల్లోకి నిదానమే గొప్పదన్నాడట[మార్చు]
కొంతమంది బద్ధకస్తులు తాము చేసిన పనులను సమర్ధించుకుంటూ ఎదుటి వారెవరైనా ఈ పని చెయ్యటంలో ఆలస్యం ఎందుకయిందని ప్రశ్నించినప్పుడు నిదానమే ప్రధానమని దబాయిస్తుంటారు.
అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది[మార్చు]
కొందరు తమకు ఏమీ తెలియకపోయినా అన్నీ తమకే తెలుసునన్నట్లుగా ఏకథాటిగా మాట్లాడుతూ ఊదరగొడుతూ ఉంటారు. వారిని గురించి ఈ సామెత వాడతారు. కొందరు తమకు అన్నీ తెలిసినా మౌనంగా ఏమీ తెలియనట్లుగా ఉంటారు.
అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు చస్తే ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందన్నట్టు[మార్చు]
చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు అమావాస్య మంచిదికాదని ఆ రోజున మరణించటం మంచిది కాదని భావిస్తారు.ఏకాదశి మాత్రం ఉత్తమమైన తిథి, శుభకరమైనది ఆ రోజున మరణిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుందంటారు. ఇన్నీ తెలిసినామె అమావాస్యనాడే పోతే ఈ విషయాలేవీ తెలియని ఆమె మాత్రం ఏకాదశినాడే ప్రాణం విడిచిందట. అన్నీ తెలిసినవారు చేయకూడని తప్పు చేస్తారని, ఏమీ తెలియని వారు మాత్రం మంచే చేస్తుంటారని.బాగా చదువుకున్న వాళ్లు లేదా అన్ని విషయాలు బాగా తెలుసనుకున్నవారు తప్పు చేసినట్లు.
అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు[మార్చు]
ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వారి అవసరాలని కనిపెట్టుకుని చూసేవారుంటే, రోగంతో బాధపడుతున్నప్పటికీ రోజులు మాత్రం సుఖంగా గడిచిపోతాయని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.
అన్నీవున్నాయి కాని అల్లుడి నోట్లో శని వున్నది[మార్చు]
అనుమానం పెనుభూతం[మార్చు]
అన్నింటిని అనుమానించే వాడు ఏ పని చేయలేడు. అనుమానమే వాడిని కుంగ దీస్తుంది. అదెంత మాత్రము పనికిరాదని దీనర్థం.
అనుకున్న పని అంగవస్త్రంలో అయినట్లు[మార్చు]
అనుమానం ముందుపుట్టి ఆడది తర్వాత పుట్టింది[మార్చు]
ఆడడి అన్ని విషయాలను అనుమానిస్తుందని ఈ సామెత అర్థం.
అనుభవం ఒకరిది - ఆర్భాటం, ఆయాసం ఇంకొకరివంతు[మార్చు]
అనూరాధ కార్తెలో అనాధ కర్రయినా ఈనుతుంది[మార్చు]
అనూరాధకు తడిస్తే మనోరోగాలు పోతాయి[మార్చు]
అనూరాధలో అడిగినంత పంట[మార్చు]
అనూరాధ కార్తెలో పంట వేస్తే పుష్కలంగా పండుతుందని రైతుల నానుడి.
అనూరాధలో తడిస్తే ఆడది మగాడౌతుంది[మార్చు]
అనూరాధ కార్తెలో పడిన వర్షంలో తడిస్తే పౌరుషం పెరుగుతుందని దీని అర్థం.
అన్నం అరిగిపోతుంది - ఆదరణ శాశ్వతంగా వుంటుంది[మార్చు]
అన్నదానం చాల ఉత్తమ మైనదని అంటారు గాని తిన్న ఆ అన్నం ఒక పూటలో అరిగిపోతుంది. తిరిగి రెండో పూటకు ఆకలౌతుంది. కాని ఆపదలో వున్నవాడిని ఆదరిస్తే అతడు ఆ ఆదరణను తన జీవితాంతం గుర్తుంచుకుంటాడు.
అన్నం కన్నా ఆదరణ ముఖ్యం[మార్చు]
అన్నం అరిగిపోతుంది - ఆదరణ శాశ్వతంగా వుంటుంది. అన్నదానం చాల ఉత్తమ మైనదని అంటారు గాని తిన్న ఆ అన్నం ఒక పూటలో అరిగిపోతుంది. తిరిగి రెండో పూటకు ఆకలౌతుంది. కాని ఆపదలో వున్నవాడిని ఆదరిస్తే అతడు ఆ ఆదరణను తన జీవితాంతం గుర్తుంచుకుంటాడు.
అన్నం వుడికిందో లేదో చూడాలంటే అంతా పట్టి చూడక్కరలేదు[మార్చు]
అన్నం కోసం వచ్చి కంచం కోసం పోట్లాడుకున్నట్లు[మార్చు]
అన్నం వండని ఆడదీ, మంచం నేయని మగవాడూ వుండడు[మార్చు]
అపనింద అవతలకిపోతే, నింద వచ్చి తలమీద పడిదట[మార్చు]
అపుత్రుడికి గతి లేదు[మార్చు]
అప్పచెల్లెలు బ్రతక గోరితే తోడికోడలు చావు కోరుతుంది[మార్చు]
అప్ప సిరి చూసుకుని చెల్లెలు మడమలు విరగ త్రొక్కుకుందట[మార్చు]
అప్పటి కోపం అన్యాయ మెరుగదు[మార్చు]
అప్ప సంపాదించిన ఆస్తి మనుమడితో మట్టిపాలు[మార్చు]
అప్పిచ్చే నాకొడుకుంటే దొంగతనం ఎందుకు?[మార్చు]
అప్పు అదనుకు, ఆకటికీ రాదు[మార్చు]
అప్పు ఆదా కాదు - వాపు బలుపూ కాదు[మార్చు]
అప్పు ఆరు తెన్నులు - ముప్పు మూడు తెన్నులు[మార్చు]
అప్పు యిచ్చి చూడు - పిల్ల నిచ్చి చూడు[మార్చు]
అప్పు గాని, పిల్లను గాని మరొకరికిస్తే అవి తిరిగి రావనే అర్థంలో ఈ సామెతను వాడుతారు
అప్పు ఇచ్చినవాడు బాగు కోరితే తీసుకున్నవాడు చెడు కోరతాడు[మార్చు]
అప్పు చేసి కొప్పు తీర్చినట్లు[మార్చు]
అప్పుచేసి పప్పు కూడు[మార్చు]
అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు[మార్చు]
ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వారి అవసరాలని కనిపెట్టుకుని చూసేవారుంటే, రోగంతో బాధపడుతున్నప్పటికీ రోజులు మాత్రం సుఖంగా గడిచిపోతాయని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.
అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?[మార్చు]
అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?[మార్చు]
ఏదో చలికి బాధ పడుతున్నాడని దుప్పటి ఇచ్చారు. దానిని ఆసరాగా చేసుకొని ఇంకా కొన్ని సౌకర్యాలు కావాలని కోరే వారి గురించి ఈ సామెత వాడతారు.
అప్పనుచూడబోతే రెప్పలు పోయినై[మార్చు]
అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది[మార్చు]
అప్పిచ్చువాడు వైద్యుడు[మార్చు]
సుమతీశతకం సృష్టించిన జాతీయాలు, సామెతల్లో ఇది ఒకటి. శతకం చెప్పిన రూపం మారిపోయి దీనికి మరో అర్థం తోడవుతున్న సమయమిది. పద్యమిలా ఉంది.
- అప్పిచ్చువాడు వైద్యుడు
- ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్
- చొప్పడిన యూరనుండుము
- చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ
పై పద్యానికి అర్థం తెలిసిపోతూనే ఉంది. అప్పిచ్చేవాడు, వైద్యుడు, సమృద్ధిగా నీరు, బ్రాహ్మణుడు మొదలైనవి దొరికే ఊళ్ళోనే ఉండాలి. అవి లేని ఊళ్ళో ఉండరాదు. అయితే, ప్రస్తుతం మొదటి పాదానికి అర్థం మారిపోతూంది. వైద్యుడంటే అప్పిచ్చేవాడనే అర్థంలో కొందరు వాడుతున్నారు. పద్యం తెలిసినవారు శ్లేషార్థంలో వాడుతుంటే.., పూర్తి పద్యం తెలియనివారు వైద్యుడికి అప్పిచ్చే బాధ్యత కూడా ఉంది కామోసనీ, అప్పిచ్చేవాడు వైద్యుడితో సమానం కాబోలనీ, వైద్యుడికి అప్పిచ్చే బాధ్యతను ఎందుకు పెట్టారబ్బా మనవాళ్ళు..? అనీ అనుకుంటూ ఉంటారు.
అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు[మార్చు]
అప్పు నిప్పులాంటిది...[మార్చు]
నిప్పు ఎలా అయితే ముట్టుకుంటే కాలుతుందో అలాగే అప్పు కూడా. నిప్పుని ముట్టుకోకుండా ఉండడం లాటిదే అప్పు చెయ్యకుండా ఉండడం కుడా.
అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?[మార్చు]
అప్పు ఇచ్చేటప్పుడు ప్రోనోటు లాంటి వ్రాత పూర్వక రుజువు వుండాలని చేప్పేదే ఈ సామెత.
అప్పు చేసి కొప్పు తీర్చిందట[మార్చు]
అప్పు చేసి సంబరాలు చేసుకోకూడదని ఈ సామెతకు అర్థం.
అప్పుచేసి పప్పు కూడు తినడం[మార్చు]
ఆడంబరంగా జీవించడం వివేకమైన విషయం కాదు. ఆడంబరం అనేది వ్యసనం లాంటిది దానికి అలవాటు పడిన వాళ్ళు సంపదను శీఘ్రంగానే కోల్పోతారు. స్వంత ధనంతో ఆడంబరంగా ఉన్నని రోజులు అంతగా పట్టించుకోరు కాని అప్పు చేసి ఆడంబరంగా జీవించేవారిని సమాజం గౌరవించదు.
అప్పు తీసుకుంటే చెప్పు చేతలలో ఉండాలి[మార్చు]
అనవసరంగా అప్పులు చేయవద్దని హెచ్చరిక.అప్పు నిప్పు.అప్పుంటే ముప్పు . ఆర్థికపరంగా జాగ్రత్తపడమని, అనవసరమైన ఖర్చులు చేసి అప్పులపాలు కావద్దని, అప్పు తీసుకుంటే ఆత్మాభిమానాన్ని వదులుకొని చెప్పిందే చేయాల్సి వస్తుందని
అప్పులేని వాడే అధిక సంపన్నుడు[మార్చు]
అప్పులేని వాడు సుఖంగా ఉన్నది తిని సుఖంగా నిద్ర పోతారు. కాని అప్పు వున్నవాడికి నిద్రలోకూడ అప్పు సంగతి గుర్తుకు వచ్చి సరిగా నిద్ర పట్టదు. ఆ విషయం చెప్పేదే ఈ సామెత.
అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు[మార్చు]
అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు[మార్చు]
బాగా అప్పులు చేసే వాడికి, అప్పు ఇచ్చి తీర్చ మనేవాడు కనిపిస్తే తప్పుకోవటం కోసం ముళ్ళున్నా నడిచి వెళ్ళాతాడు. అలాగే చెప్పులున్నవాడు కూడా ముళ్ళున్నా నడిచి వెళ్ళాతాడు. కనుక వీళ్ళతో నడవొద్దు
అబద్ధము ఆడితే అతికినట్లుండాలి[మార్చు]
అబద్ధము ఆడుచున్నట్లు ఇతరులు గ్రహించిన సందర్భము
అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే దిబ్బడి నెత్తి సుబ్బడు కొట్టాడన్నట్లు[మార్చు]
తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఎవరూ ఎవరికంటే అధికులు కారని, తామే గొప్ప అని ఎవరూ ఎప్పుడూ గర్వాహంకారాలకు పోకూడదని ఈ సామెతకు అర్థం.
అభిరుచులా మస్తు - అంగస్తంభన నాస్తి[మార్చు]
అభ్యాసం కూసువిద్య[మార్చు]
తప్తపరశుగ్రహణన్యాయము=క్రమక్రమముగ వేడివస్తువులను పట్టుకొనుట అలవాటు చేసిన చివఱకు కాలుచూఉన్న ఇనుపగొడ్డలిని కూడా పట్టు కొనవచ్చును
అమరితే ఆడది - అమరకుంటే గాడిద[మార్చు]
అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే సామెతకు సమానార్థం ఈ సమెతకు ఉంది.
అమావాస్యకు అట్లు - పున్నానికి బూరెలు[మార్చు]
అమ్మ కడుపు చూస్తుంది - భార్య జేబు చూస్తుంది[మార్చు]
తల్లి తన కొడుకు వచ్చాడంటే ఎప్పుడు తిన్నాడో, ఏం తిన్నాడో నని అతని కడుపుని, అనగా ఆకలిని గమనిస్తుంది. కాని అతని భార్య...... ఇంటికొచ్చిన భర్థను ఎంత డబ్బు తెచ్చాడని అతని జేబును చూస్తుంది అని అర్థము.
అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది[మార్చు]
అమ్మకు నోటి వాడి - అయ్యకు చెయ్యి వాడి[మార్చు]
అమ్మ గూటికి - అయ్య కాటికి[మార్చు]
అమ్మ గృహ ప్రవేశం - అయ్య అగ్ని ప్రవేశం[మార్చు]
అభ్యాసము కూసువిద్య[మార్చు]
నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరును అని ఈ సామెత అర్థము. ఈ సామెతను వివరించే పద్యం వేమన శతకంలో ఒకటి ఉన్నది - అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన
అమ్మ పుట్టిల్లు ఘనత మేనమామకు తెలియదా?[మార్చు]
అమ్మ పుట్టింల్లు మేనమామ ఇల్లే కనుకు అమ్మ పుట్టింటి గురించి మేనమామ దగ్గర గొప్పలు చెబితే ఎలా ఉంటుందో మన గురించి అన్ని తెలిసిన పాత పరిచయస్తులకు కల్పించి లేనిపోని గొప్పలు చెప్పినప్పుడు అలానే ఉంటుంది. అలాటి సమయంలో ఈసామెతను వాడుతూ ఉంటారు.
అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు[మార్చు]
కొందరు మనకు సహాయం చెయ్యకపోగా, వేరే మార్గాల ద్వారా కూడా సహాయం పొందనీయరు. ఈ సందర్భాలలో ఈ సామెతను ఉపయోగిస్తారు. తానూ చేయక, ఇతరులనూ చెయ్యనివ్వక అడ్డుపడే వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు.
అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు[మార్చు]
ఆచరించవలసిన ధర్మం నిర్వర్తించకుండా అన్య ధర్మాలు పాటించేవాళ్ళనుద్దేశించిన సామెత ఇది. మన తల్లికి కనీసావసరమైన తిండి ఇవ్వడం మన కనీస కర్తవ్యం. మన పెద్దమ్మ (అమ్మకి అక్క) బాగోగులు మన ప్రాథమిక కర్తవ్యం కాదు. మనమీద ఆధారపడిన వాళ్ళ సంగతి చూసాక చేయవలసిన పని. కాని, తల్లికి కూడు పెట్టకుండా, పెద్దమ్మకి బట్టలు కొనడం ఎంత ఉచితం? ఈ సామెతకి ఇంకో రూపాంతరం ఉంది. అది: అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతాడా? అసలు ధర్మమే నిర్వర్తించని వాడి నుండి వేరేమి ఆశించగలం అని భావం.
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి[మార్చు]
ఇది రైతులకుసంబందించిన సామెత. తాము ఉత్పత్తి చేసిన సరుకులు అనగా కూరగాయలు, ధాన్యం మొదలగు వాటిని అమ్మబోతె సరకు నాణ్యత లేదని, ఇప్పుడు ధరలు లేవని ఎన్నో సాకులు చెప్పి వ్వాపారస్తులు వాటికి అతి తక్కవ ధరకు కొంటారు. కాని రైతులు తమకు కావలసిన వస్తువులు కొనబోతె, ఆ వస్తువుల గొప్పదనాన్ని, వాటి రూపు రేఖలను వర్ణించి చెప్పి అమాయకులైన రైతులను నమ్మించి అధికరకు విక్రయిస్తారు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.
అయితే అంగలూరు కాకపోతే సింగలూరు[మార్చు]
అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది[మార్చు]
కంచంలో ఉన్న అన్నాన్ని చేతికున్న అయిదువేళ్ళు కలిసి ముద్దచేసి నోట్లోపెడితే నోట్లో ఉన్న ముఫ్పై రెండుపళ్ళు ఆ అన్నం ముద్దను బాగా రుబ్బితే ఆ రుబ్బిన ముద్దను నాలుక లోపలికి తోస్తుంది. అప్పుడు అన్నంముద్ద అగ్నిగుండంలాంటి పొట్టలోపడుతుంది.
అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?[మార్చు]
అయిదోతనం అంటే భర్తను కలిగి ఉండటం. భార్య అందచందాలు భర్తకు మోదం కలిగించేందుకే. ఐదోతనమే లేనప్పుడు అంటే భర్తే లేనప్పుడు ఇంక ఆ అందం ఉండీ ప్రయోజనం లేదు అని ఈ సామెత భావం. ఏ లక్ష్యం కోసం ఓ పనిచేస్తున్నామో ఆ లక్ష్యం ఉనికిలోనే లేనపుడు ఆ పని నిరర్థకం అని చెప్పదలచిన సందర్భంలో ఈ సామెతను వాడతారు.
అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో[మార్చు]
ఐనోళ్లకి అన్నమ్, కానోళ్లకి కన్నమ్
అయ్యకు రెండు గుణాలే తక్కువ - తనకు తోచదు, చెబితే వినడు[మార్చు]
అయ్యవారు ఎందుకు కొరగాడని అర్థంలో ఈ సామెతను వాడుతారు.
అయ్యకు వణుకు ప్రాయం - అమ్మకు కులుకు ప్రాయం[మార్చు]
అయ్యగారికి ఆరు ఎడ్లు, మూడు దొడ్లు[మార్చు]
అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా?[మార్చు]
ఒకరికొరకు సమయము ఆగదు అనే అర్థం ఈ సామెతలో ఉంది. పూజలకొరకు పంతులుగారిని పిలిస్తే అయ్యవారు తీరుబడిగా వస్తే అంతవరకు అమావస్య ఆగదు గదా.....
అయ్య దాసర్లకు పెడితే అమ్మ జంగాలకు పెట్టిందట[మార్చు]
అయ్య దేశ సంచారం - అమ్మ గ్రామ సంచారం[మార్చు]
అయ్య వాత పెట్టనూ బర్రె బ్రతుకనూనా?[మార్చు]
అయ్యవా రంతంత - అయ్యవారి పెళ్ళాం ముంతంత[మార్చు]
అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు[మార్చు]
అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు[మార్చు]
అయ్యవారు అంటే ఉపాధ్యాయుడు అని అర్థం. ఇతరుల తప్పులు దిద్దవలసిన వ్యక్తి తాను చేసిన తప్పులను తానే దిద్దుకొనే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆతనిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు.
అయ్యవారు వచ్చునంతవరకు అమావాస్య అగదు[మార్చు]
వారు ఎంతటి వారైనా కాలము వారిగురించి ఆగదు అని చెప్పడాని ఈ సామెత వాడతారు.
అయ్యవారులకు ఐదు వరహాలు వారి పిల్లలకు పప్పుబెల్లాలు[మార్చు]
దసరా సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. విద్యార్థులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు.
అయినవాడని ఇంటికి రానిస్తే ఇంటి దానికి కన్ను కొట్టాడట[మార్చు]
అయినవారు లోపలకు తోస్తే కానివారు బయటకు తోస్తారు[మార్చు]
అయినవాళ్ళకు ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ[మార్చు]
అయోమయం అడవి మొద్దు[మార్చు]
అయ్యోపాపం అంటే ఆరు నెలల పాపం పైన పడ్తుంది[మార్చు]
ఎదుటి వాడిపై జాలి తలిస్తే............... వాడే తనకు నష్టం కలిగిస్తాడని ఈ సామెత అర్థము.
అరకాసు పనికి ముప్పాతిక బాడుగ ఖర్చు[మార్చు]
ఆవు పాతిక బందె ముప్పాతిక, అనే సామెతకిచ్చే అర్థమే ఈ సామెతకు కూడా వర్తిస్తుంది.
అరగదీస్తే గంధపు చెక్కకు వాసన పోతుందా?[మార్చు]
అరగని కూడు - జరగని మాట[మార్చు]
అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం[మార్చు]
వేశ్యాలోలుడు అరగడి సుఖం కొరకు వెళ్ళి రోగం తెచ్చుకొని జీవిత మంతా బాదపడుతారని హెచ్చరించే సామెత ఇది.
అరచేతిలో వైకుంఠం చూపినట్లు[మార్చు]
మోసగాళ్ళు మాట్లాడే మాటలను ఈ విధంగా ఈ సామెతను వర్తింప జేస్తూ అంటుంటారు.
అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...[మార్చు]
మతిమరుపు మనుషుల నుద్దేశించి ఈ సామెతను వాడుతారు. ఇదే అర్థంలో మరో సామెత: సంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు.
అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు[మార్చు]
అరటిపండు తినాలనుకుంటే ఎవరైనా తొక్క వలుచుకుని తినాల్సిందే. కానీ ఎవరైనా తొక్క వలిచి మన చేతిలో పెడితే ఆ పాటి శ్రమ కూడా తప్పుతుంది. అదే విధంగా మనం చేయవలసిన పనులను ఎవరైనా మనకు బాగా సులభతరం చేసినప్పుడు ఆ ప్రక్రియ అరటిపండు వలిచి చేతిలో పెట్టడం వంటిదని అని చెబుతూ ఈ సామెతను వాడుతారు. అవసరమైన వస్తువు మన దగ్గరె ఉన్నప్పటికి గాభరా పడి, అయోమయ పడి, అంతటా వెదికి చివరగా "అయ్యో మన దగ్గరె ఉంది కదా!" అని తెలుసుకొవటానికి ఈ సామెత వాడుతారు. కళ్ళజోడు, పెన్ను, టెలివిజన్ రిమోట్ వంటి వస్తువులను వెతికేవారికి ఈ అనుభవం తరచు ఎదురవుతుంటుంది. ఇలాంటిదే మరొక సామెత: 'చంకలో బిడ్డ నుంచుకుని, ఊరంతా వెతికినట్లు
అరసుడిని నమ్మి పురుషుణ్ణి పోగొట్టుకున్నట్టుంది[మార్చు]
అరసుడు అంటే వుంచుకున్నవాడు, పురుషుడు అనగా భర్త అని అర్థము: వుంచుకున్నవాడిని నమ్మి అసలు భర్తను పోగొట్టుకున్నదట. తెలివి తక్కువ పని అర్థము.
అరిచే కుక్క కరవదు[మార్చు]
కొన్ని కుక్కలు మనుషులు కనపడగనే తీవ్రంగా అరుస్తాయి, దగ్గరికి వెళ్తే కరుస్తాయి అని భయం వేస్తుంది. తీరా దగ్గరకు వెళితే పారిపొతాయి. అలాగే కొంతమంది ఏదైన విషయంలొ కొపం వస్తే వాడిని కొడతాను, వీడిని తిడతాను, రక్తం కళ్ళచూస్తాను అని అరుస్తారు. తీరా సందర్భం వచ్చినపుడు ఏమీ మాట్లాడరు. ఇటువంటివారిని అరిచే కుక్కలతొ పోలుస్తూ ఈ సామెత వాడతారు
ఆరగించగా లేనిది అడిగితే వచ్చిందా![మార్చు]
ఆరాటపు పెళ్ళి కొడుకు పేరంటాళ్ళ వెంట పడ్డాడట[మార్చు]
ఆరాటమేగానీ పసలేదన్నట్లు[మార్చు]
ఆరాటాల పెళ్ళాం - ఆయాసాల మొగుడు[మార్చు]
ఆరికకు చిత్త గండం - ఆడదానికి పిల్ల గండం[మార్చు]
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ[మార్చు]
ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె[మార్చు]
అన్ని కార్తెలకన్నా ఆరుద్ర కార్తె రైతులకు/పంటలకు చాల మంచిదని దీనర్థం.
ఆరుద్ర కార్తె విత్తనానికీ - అన్నం పెట్టిన యింటికీ చెరుపు లేదు[మార్చు]
ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయి[మార్చు]
ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు[మార్చు]
ఇది వ్యవసాయ దారుల సామెత. ఆరుద్ర కార్తెలో వర్షం కురిస్తే పంపటలు బాగ పండతాయని అర్థం.
ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు[మార్చు]
ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడతాయి[మార్చు]
ఆరుద్రతో అదను సరి[మార్చు]
ఆరుద్రలో అడ్డెడు చల్లితే, సులువుగా పుట్టెడు పండుతుంది[మార్చు]
పంటలు బాగా పండాలంటే ఆరుద్ర కార్తే చాల మంచిదని ఈ సామెతకు అర్థం.
ఆరుద్ర వాన అదను వాన[మార్చు]
ఆరుద్ర కార్తెలొ కురిసిన వర్షం రైతులకు/పంటలకు చాల మంచిదని దీనర్థం.
ఆరుద్రకు ఆమ్లాలు కూడా పండుతాయి[మార్చు]
ఆరు నెలలకు చచ్చేవాడికి అరుంధతి కనపడదు[మార్చు]
ఆరునెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు[మార్చు]
ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మతో యుద్ధం చేసినట్లు[మార్చు]
ఆరు రాజ్యాలను జయించవచ్చు కానీ అల్లుడిని జయించలేం[మార్చు]
ఆర్భాటపు ఆడదానికి ఆరుగురు మొగుళ్ళు[మార్చు]
ఆర్చేవారే గానీ తీర్చేవారే లేరు[మార్చు]
ఆలిఅలుక అరవైఏండ్లు, మగనిఅలుక ముప్పై ఏండ్లు, బాలప్రాయం పదేళ్ళు[మార్చు]
ఆలికి అదుపు - ఇంటికి పొదుపు[మార్చు]
అర్జీలకు పనులు కావు[మార్చు]
ఏదైన ఒక పని కొరకు ప్రభుత్వ కార్యాలల్లో అర్జీ పెట్టుకుంటారు. ఆ అర్జీని పరిశీలించి తగిన సహాయము చేయాలి ప్రభుత్వ అధికారులు. ఇది పద్దది. కాని ఈ కాలంలో అర్జీ పెట్టుకున్నంత మాత్రానా పనులు కావు..... దాని వెంబడి పడి అధికారులకు లంచ మిచ్చి పని చేయించు కొంటేనే గాని పనులు కావని ఈ కాలపు పరిస్థితిని తెలియ జెప్పే సామెత ఇది.
అర్దరాత్రి మద్దెల దరువు[మార్చు]
అర్ధరాత్రి అందరూ ఆదమరచి నిద్రపోవలసిన సమయం. ఆసమయంలో ఎవరైనా అనవసర విషయాలకు హడావిడి చేస్తుంటే ఇలా ఈ సామెతను కొంచెం విసుగ్గాను చిరాకుగాను చెప్తారు.
అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...[మార్చు]
ధనానికి అధిపతి అయిన కుబేరుడు అలకాపురి నగరానికి రాజు. ఎంతటి ధనవంతుడయిననూ అవసరమును మించి ధనమును ఖర్చు చేయకూడదు అన్న నీతిని అడ్డూఅదుపూ లేకుండా ధనమును విచ్చలవిడిగా ఖర్చు చేసే ఓ డబ్బుగల వానిని ఉద్ధేశించి ఈ సామెతను వాడుట ద్వారా మన పూర్వులు తెలియజేసినారు.
అలంకారం కంటే అయిదవతనం మేలు[మార్చు]
అలకపాన్పు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారు పడినట్లు[మార్చు]
అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనునికి దక్కేదేమీ వుండదు[మార్చు]
అలలు నిల్చేదెప్పుడు? స్నానం చేసేదెప్పుడు?[మార్చు]
అలక మీరితే అమృతమైనా విషమే[మార్చు]
అలికిన యింట ఒలికినా అందమే[మార్చు]
అలిగే బిడ్డతోనూ - పొడిచే గొడ్డుతోనూ కష్టం[మార్చు]
అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం[మార్చు]
పదే పదే సమస్యలు సృష్టించే వారిని ఉద్ధేశించి ఈ సామెతను వాడతారు. అలిగే బిడ్డ మరియు చెలరేగే గొడ్డు ఈ కోవలోకి వస్తారు. అందుకే ఈ సామెతలో వాటిని ప్రస్తావించారు.
అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట[మార్చు]
ఇది అజ్ఞానానికీ, అతి తెలివికీ పరాకాష్టగా చెప్పే సామెత. తెలియక పోయినా తెలిసినట్లు నటించేవారి అంటించే చురక. అల్లం కారంగా, ఘాటుగా ఉంటుంది; బెల్లం తీయగా ఉంటుంది. ఇక పుల్లగా ఉండేవి వేరే పదార్ధాలున్నాయి. అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటది అని ఎవరైనా అంటే వారికి అల్లం రుచి తెలియదు. బెల్లం రుచి తెలియదు. పుల్లగా ఉండేదేమిటో తెలియదు. కనుక ఒకటి అడిగితే మూడు విషయాలు తెలియవని చెప్పుకున్నారు. కనీసం తన తెలియనితనాన్ని దాచుకోవాలన్న జ్ఞానం కూడా వారికి లేదన్న మాట. ఇదే అర్ధంలో చెప్పే మరొక సామెత: పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు.
అవ్వాకావలెను బువ్వా కావలెను[మార్చు]
అవసరానికి ఏదో ఒకటి సర్థగలరు పుణ్యానికి.. కాని అన్నీవ్వలేరు గదా.... ఆ విషయాన్ని చెప్పేదే ఈ సామెత.
అయ్యే మంటే ఆరు నెలల పాపం తగులు కొందట[మార్చు]
ఒకడు కష్టాలలో వున్నాడని సాయం చేయబోతె వాడి కష్టాలు వీడికి తగిలించాడట. అది దీనర్థం.
అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు[మార్చు]
మామూలుగానే కోతి ఒక అతి చంచలమయిన జంతువు. ఇక అటుపై అది కల్లు (తాడి చెట్టు నుండి లభించు ఒక మత్తును కలిగించు ద్రవ పదార్థము) త్రాగినచో, దాని ప్రవర్తన అత్యంత విచిత్రముగా, విధ్వంసకరముగా ఉండును. ఇదే విధమయిన లక్షణములు గల వ్యక్తిని ఉద్ధేశించి ఈ సామెతను వాడెదరు. కోతికి అసలే చిలిపి చేష్టలు ఎక్కువ. కల్లు తాగిన తరువాత ఆ మత్తులో అది చేసే చిలిపి పనులు ఇంకా ఎక్కువ అని అర్థము. ముఖ్యంగా చిన్నపిల్లల అల్లరిని ఉద్దేశించి ఈ సామెత వాడడం జరుగుతుంది.
- వాడుక
- ఈ సామెత లోని అర్థానికి మరింత గాఢతనిస్తూ ఇలా కూడా చెప్తారు - అసలే కోతి, పైగా పిచ్చెక్కింది, ఆపై కల్లు తాగింది, ఆపై నిప్పు తొక్కింది.
- ఒకో మారు ఆఫీసులో బాసు ప్రవర్తన (మరీ రెచ్చిపోయినట్లు ఉంటే) కూడా ఈ సామెత వాడుతారు.
- ఎక్కువగా వాడుకలో అసలే కోతి అని చెప్పి ఆపేస్తారు. తక్కిన భాగం అర్ధం చేసుకోవాలన్నమాట. (కొందరు సందర్బాను సారంగా సామెతలను ఉటంకిస్తూ.... సగం సామెతనే చెప్పి ఆపేస్తారు. మిగతా సామెతను ఊహించు కోవలసినదే...... ఈ పద్దతి..... మొత్తం సామెత చెప్పిన దానికన్న చాల గొప్పగా వుంటుంది)
అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట[మార్చు]
తన యొక్క వాస్తవ పరిస్థితితో నిమిత్తం లేకుండా, గొంతెమ్మ కోర్కెలు కోరే వాణ్ణి ఉద్ధేశించి పలికే సామెత ఇది. ==అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వున్నట్లు. చేతిలో ధనం వున్నా ... కొనాలన్న ఆలోచన లేని వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది.
అలెగే బిడ్డ చెలిగే గొడ్డు ఒకటే[మార్చు]
ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం[మార్చు]
{{ఒకడు తనకు ఇంకా వివాహం కాకముందే వివాహం అయినట్లు, తన భార్య గర్భం దాల్చినట్లు, ఆమెకు సుఖ ప్రసవమై ఒక బాలుడు జన్మించినట్లు, ఆ బాలుడికి సోమలింగం అని పేరు పెట్టినట్లు కలలుకంటూ కల్లలైన ఆ ఆలోచనలను నిజమైనవిగా ప్రచారం చేసుకుంటూ గడపడటం. ఈ కథలోని వ్యక్తిలాగే వ్యర్థంగా మాటలు చెబుతూ కాలం గడిపే వారిని వ్యంగ్యధోరణిలో విమర్శిస్తున్నట్లు ఈ సామెత కనిపిస్తుంది}}
ఆస్తికొక కొడుకు - ప్రేమకొక కూతురు[మార్చు]
ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొగమాటం పనికిరాదు[మార్చు]
అంకపొంకాలు లేనిది శివలింగం[మార్చు]
అంకెకు రాని ఆలి - కీలెడలిన కాలు[మార్చు]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు[మార్చు]
అర్ధం సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు. ఈ జాతీయానికి సరైన అర్ధం మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా ఏ అవకాశం అందని పరిస్థితి. అంగడి అంటే సరుకులు అమ్మే చోటు. కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి వచ్చినపుడు మర్యాదలు సహజం. కొన్నాళ్ళకు పాతబడ్డ ఆ అల్లుడు అత్తవారి ఇంట్లోనే తిష్ట వేస్తే ఆ మర్యాదలు పెద్దగా జరగవు. అప్పుడు అంగట్లొ అన్నీ ఉంటాయి కాని అత్త వారింట్లో ఎవరూ వాటిని కొనరు. అల్లుడికి పెట్టరు. అలా రూపొందినదే ఈ సామెత. ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు.
వాడుక
మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది
అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు[మార్చు]
అంగట్లో అరువు - తల మీద బరువు[మార్చు]
అరవు అనగా అప్పు అని అర్థము అంగట్లో అప్పువుంటే తలమీద బరువు వున్నట్లే అని అర్థము
అంగట్లో అష్ట భాగ్యం - అల్లుని నోట్లో అష్ట దరిద్రం[మార్చు]
అన్నీ వున్నాయి కాని అల్లుని నోట్లో శని వున్నది అనే సమానార్థంతో ఈ సామెతను వాడుతారు.
అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది[మార్చు]
ఏదైనా సరకులు అవసరానికి వాటిని కొనేవారికన్న తక్కువైతే ఆ వస్తువుకొరకు అందరు ఎగబడి అంగడికి ఎగబడతారు.... అప్పుడు దాని ధర కూడా అమాంతం పెరిగి పోతుంది. అవే వస్తువులు అవసరానికన్నా ఎక్కువయితే అవే వస్తువులు అనేక రాయితీలతో మన ఇంటిముంగిటకే వస్తాయనే అర్థంలో ఈ సామెతను వాడుతారు.
అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు[మార్చు]
అంగడి బియ్యం - తంగేటి కట్టెలు[మార్చు]
366 అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే ఉల్లిపాయ
అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి[మార్చు]
స్వంతంగా ఎంత బలం వున్నా..... ఎన్ని వున్నా దైవ బలం కూడా వుండాలని దీని అర్థం.
అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే[మార్చు]
ఉల్లిపాయ
అంచు డాబె గాని కోక డాబు లేదు[మార్చు]
కోక అనగా చీర అని అర్థం. దానికున్న అంచు మాత్రం మహా బాగావుండి అసలు చీరలో పస లేదు అని అర్థం. ఇలాంటి సమానర్థంలో మరొక సామెత కూడా ఉంది. పైన పఠారం లోన లొఠారం
అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు[మార్చు]
ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో పనులను చక్కగా అవుతాయి ఆదుకొనేవారుంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చెయొచ్చని ఈసామెత అర్థం. దీనికి సమానర్థంతో ఐకమత్యమే మహా భలము అనే సామెతకూడ ఉంది.
అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు[మార్చు]
సాధారణంగా ఏటువంటి అలంకారాలు చేసుకోనివారు ఏమైనా ఉత్సవాలు, ఊరేగింపులు, పదిమందిలో కలిసే పెళ్ళిళ్ళలో మాత్రం విశేషంగా అలంకారాలు చేసుకొని అందరిలోకి ప్రత్యేకంగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు.ఒకామె చిన్నప్పుడుగానీ, మరీ వయస్సులో ఉన్నప్పుడుగానీ, మరి ఏ ఇతర సందర్భాలలోగానీ పెద్ద కొప్పు పెట్టి, అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయలేదట. ఆ ఊరిలో సంత జరుగుతుందని తెలిసి ఆ సంతలో ఎంతోమంది కొత్తకొత్త వారు వస్తారని వారందరి చూపు తనపైన పడాలని అందంగా పెద్దగా ఉండే కొప్పు పెట్టుకొని వెళ్ళిందట. సందర్భానుసారంగా మాత్రమే అలంకరించుకోవాలని ఈ సామెత
అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసేదన్నట్టు[మార్చు]
అమితంగా వాగ్దానాలు చేసి చాలా స్వల్పంగా దానాలు చేసేవారిని గురించి, ఎంతెంతో పనిచేస్తామని చెప్పి చాలాకొద్దిగా పనిచేసేవారిని గురించి, ఎక్కువగా హెచ్చులు చెప్పి తక్కువ పని చేసే పద్ధతి సందర్భంగా వాడె సామెత ఇది. ఇలాంటిదే మరొక సామెత: ఇంత ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు
అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా[మార్చు]
లావుగా వున్నంత మాత్రాన అన్ని విద్యలు తెలిసివుండవు. ఒక అమాయకుడు లావుగా వున్నతన్ని చూసి ఇతడు అంత లావున్నాడు కనుక అన్ని విద్యలు తెలిసి వుంటాయని భావించి తనకు తేలు కుట్టింది మంత్రం వేయమని అడిగాడట. ఆ లావుటతను తనకు తెలియదనగా "అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా" అని వెళ్లి పోయాడట అమాయకంగా.
అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు[మార్చు]
ఒక పనిని మొదలుపెట్టే ముందు దాని పర్యవసానాలు బాగా ఆలోచించి, ముందుగానే ఊహించి, సంబంధిత వ్యక్తులతో దానిని గురించి చర్చించి మొదలుపెట్టమని చెప్పేందుకు ఉద్దేశించినదే ఈ సామెత. కీడెంచి మేలెంచమనే సామెతకు ఇది కాస్త దగ్గరగా ఉంటుంది.
అందని పండ్లకు అర్రులు చాచినట్లు[మార్చు]
మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం.
అందని ద్రాక్షలు పుల్లన[మార్చు]
ఒక నక్క ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది.అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి.ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు, నోరు ఊరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే ఆనక్కకు పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి ఆ పళ్ళను అందుకోబోయింది. కానీ, పాపం దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్ష పళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక యెగరలేక విసిగి, "ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?" అని గొణుక్కుంటూ వెళ్ళిపొయింది. అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి అది దొరకక పోతే, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశామో అది ఎంత చెత్తదో, ఎంత పనికిరాదో చెప్పటం మొదలుపెడతాము. అప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు.
అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం[మార్చు]
తాము శ్రీవైష్ణవులము, మాంసాహారం తినము అని చెప్పుకుంటూ బుట్టలో చేపలన్నీ ఖాళీ చేసారు అని అర్ధం. అందరూ గొప్పవాళ్ళే కాని చేసేవన్ని తప్పుడు పనులే. ఎవరికి వారే తమకి తాము గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు కాని ఎవరి తప్పులు వారికే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సామెత వాడుతార
అందితే జుట్టు అందక పోతె కాళ్లు[మార్చు]
అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు. ఈ సామెత ఒక అవకాశవాది తత్వాన్ని తెలియచేస్తోంది.
అంగిట బెల్లం - ఆత్మలో విషం[మార్చు]
పయోముఖ విష కుంభం అనే సంస్కృత సామెత లాంటిదే ఇది కూడాను. నోటితో తియ్యని మాటలు మాట్లాడుతున్నా.... మనసులో మాత్రంచాల చెడు భావన వున్నదని అర్థం.
అంగిట విషం - మున్నాలిక తియ్యదనం[మార్చు]
ఇది కూడా పై సామెత లాంటి అర్థాన్నే ఇస్తుంది. పైపైన మంచిగా మాట్లాడుతు లోన చెడు భావన కలిగి వున్న వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు.
అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు[మార్చు]
అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట[మార్చు]
ఇదే అర్థంలో మరొక సామెత వుంది: అది: మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె
అంటే ఆరడి - అనకుంటే అలుసు[మార్చు]
అండలుంటే కొండలు దాటవచ్చు[మార్చు]
సహాయంగా ఎవరైనా వుంటే ఎంతపనైనా చేయ వచ్చు అనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. ఐక మత్యమే మహాబలము అని దీకిని గూడార్థము.
అండలేని వూళ్ళో వుండ దోషం - ఆశలేని పుట్టింట అడగ దోషం[మార్చు]
అండ వున్నవానిదే అందలం[మార్చు]
ఐకమత్యమే మహా భలము అని దీనికి అర్థము.
అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత[మార్చు]
అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు[మార్చు]
అంత నీతే వుంటే ఇంత సంతెందుకు?[మార్చు]
అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా?[మార్చు]
ఇదే అర్థంలో మరొక సామెత వున్నది: అది. ఇంతలావున్నావు తేలు మంత్రం తెలియదా?
అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు[మార్చు]
మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసిన వాడున్నూ, ఏవిషయము కొంతైనా తెలియని వాడున్నూ లేడని దీని అర్థము.
అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు?[మార్చు]
దీనికి సమానమైన అర్థంలో మరొక సామెత ఉంది. అందరూ వైష్ణవులే .......... బుట్టలో రొయ్యలు మాయం అయ్యాయి బాపన వాళ్లైనా చాటు మాటుగా మాంసం తింటారని దీనికి గూఢార్థము.
అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు[మార్చు]
[చూపులకు చుట్టాలు రమ్మంటే కోపాలు ] అనే సామెత లాంటిదే ఈదీను.
అందం చందం నావంతు - ముద్దూ మురిపెం నీవంతు అన్నదట[మార్చు]
అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు[మార్చు]
అకార పుష్టి నైవేద్య నష్ఠి అనే సామెత లాంటిదే ఇదీను.
అందముంటే సరా! అదృష్టముండొద్దూ![మార్చు]
అందని మ్రానిపండ్లకు అఱ్ఱులు చాచినట్లు[మార్చు]
మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం.
అందరి కాళ్ళకు మ్రొక్కినా అత్తగారింటికి పోకతప్పదు[మార్చు]
పెళ్ళికూతురు పెళ్ళైయ్యాక అత్తావారింటికి వెళుతూ అందరి కాళ్ళకు మొక్కుతుంది. కాని చివరకు అత్తవారింటికి వెళ్ళక తప్పదు.......
అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు[మార్చు]
అందరికి రాబోవు కష్టాలను చెప్పేవారు తమకు రాబోవు కష్టాలను ఎరుగరు అని దీని అర్థము. అనగా ఈ శకునాలు వట్టి భూటకమని అర్థము.
అందరికీ అన్నం పెట్టే వాడు రైతే[మార్చు]
అందరినీ మెప్పించడం అలవి గాని పని[మార్చు]
అందరినీ మెప్పించడము ఎంతమాత్రము వీలుకాదని దీని అర్థము. ఎంత మంచి విషయమైనా దాన్ని కూడా వ్వతిరేకించే వాడొకడుంటాడని దీని భావము.
అందరూ అందలమెక్కితే మోసేవారెవ్వరు?[మార్చు]
అందరూ ఒక ఎత్తు - అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు[మార్చు]
అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది[మార్చు]
అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు[మార్చు]
అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట[మార్చు]
అందాలు నావి - సంబరాలు నీవి అందిట[మార్చు]
అందితే సిగ అందకపోతే కాళ్ళు[మార్చు]
అవకాశాన్ని బట్టి ఎదిరించడమో, కాళ్ల బేరానికి రావడమో చేసె వారిగురించిన సామెత ఇది. ఇదే సమానార్థంలో మరొక సామెత.... ఏ ఎండకాగొడుగు పట్టినట్టు. అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి/ ఏ ఎండకు ఆ గొడుగు పట్టి నట్టు సమానర్థంలో మరొక సామెత 53 అందితే తియ్యన అందకుంటే పుల్లన
[అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ] అనే సామెతకు సమానర్థంలో ఈ సామెతను వాడుతారు. ఎంత ప్రయత్నించినా ద్రాక్ష పళ్ళు అందక పోతే..... తన ప్రయత్నము విపలమైనదని ఒప్పుకోక ఆ ద్రాక్ష పళ్ళు పుల్లనివి అని తన ఓటమిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం ఇది.
అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు[మార్చు]
అంధుడికి అద్దం చూపించినట్లు[మార్చు]
కొంతమంది ఎంత వివరంగా విషయాన్నంతా చెప్పినా గ్రహించలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచించడానికి ఈ సామెత ఉపకరిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత శ్రమపడినా శ్రమను ఎదుటివారు గుర్తించక నిర్లిప్తంగా, నిరాసక్తంగా తోసివేసినప్పుడు కూడా ఈ సామెతను సందర్భానుసారం చెప్పటానికి ఉపయోగపడుతుంది. అంధుడికి ఎంత మాత్రమూ ఎదుటి వస్తువులు కనిపించక పోవటం సర్వసాధారణం. అటువంటిది అందాన్ని ఒకటికి పది సార్లు చూసుకోడానికి నేత్ర దృష్టి బాగా ఉన్నవారు ఉపయోగించే అద్దాన్ని అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన. 56 అంధుడికి అద్దం చూపించినట్లు
అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన..
అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు[మార్చు]
తాను తాగే అంబలిలో ఉప్పు తక్కువైనందున అందులో ఉప్పు కూడా తెచ్చి వేసుకోలేని వాడు పిండి వంటలు కోరుకున్నట్లు...... అని దీనికి అర్థము.
అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు[మార్చు]
అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు[మార్చు]
గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు వంటిదే ఈ సామెత. తన స్థాయికి మించి పనులు చేసే వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు.
అంబరాన బిడ్డ పుడితే ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట[మార్చు]
లేక లేక పుట్టిన పిల్లలను గారాబంగా పెంచినప్పుడు ఈ సామెత వాడతారు
అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు[మార్చు]
వనరులు[మార్చు]
- లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (సుమారు 3400 సామెతలు) - సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- సాటి సామెతలు (తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సమానార్ధకాళున్న 420 సామెతలు) - సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కె. నాయర్ ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం