అక్షాంశ రేఖాంశాలు: 17°22′4.3″N 78°31′38.2″E / 17.367861°N 78.527278°E / 17.367861; 78.527278

సాయిబాబా దేవాలయం (దిల్‍సుఖ్‍నగర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాయిబాబా దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:రంగారెడ్డి
ప్రదేశం:దిల్‍సుఖ్‍నగర్, హైదరాబాదు
భౌగోళికాంశాలు:17°22′4.3″N 78°31′38.2″E / 17.367861°N 78.527278°E / 17.367861; 78.527278

సాయిబాబా దేవాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‍సుఖ్‍నగర్ లో ఉన్న దేవాలయం.[1] నిర్మాణంలో షిర్డీలోని సాయిబాబా దేవాలయంలా ఉన్న ఈ దేవాలయం, హైదరాబాదులోని అత్యంత పేరొందిన దేవాలయాలలో ఒకటి. హైదరాబాదులో ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన మొదటి దేవాలయంగా రికార్డు కూడా సృష్టించింది.[2]

చరిత్ర

[మార్చు]

ఈ దేవాలయంలో 1980లో నిర్మించబడింది. భక్తులు ఈ దేవాలయాన్ని దక్షిణ షిరిడీగా పిలుస్తుంటారు. పాలకమండలి ఆధ్వర్యంలో 1989లో దేవాలయంలోని సాయిబాబా పాలరాతి విగ్రహాం ప్రతిష్ఠించబడింది. అంతకు ముందున్న పాత విగ్రహాన్ని ఆలయం ఎడమవైపు దర్శనార్థం ఉంచారు. 1990ల నుండి బాగా ప్రాచూర్యం పొందింది. ముఖ్యంగా గురువారం నాడు అనేకమంది భక్తులు వస్తారు. 1991లో మొదటి అంతస్తు నిర్మించి ధ్యాన మందిరం, 1993లో దేవాలయ ప్రధాన మందిరం నిర్మించగా, 1994లో సాయిబాబాకి స్వర్ణ కిరీటం అలంకరించారు. 1996లో దేవాలయం రెండో అంతస్తు నిర్మించబడింది.[2]

దిల్‌సుఖ్‌నగర్‌లోని షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భక్తులకు మెరుగైన వసతుల కల్పన, ప్రసాదాల్లో నాణ్యతకు సంబధించి ప్రతిష్టాత్మక ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్‌ను అందుకుంది.

పూజలు - ఉత్సవాలు

[మార్చు]

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో మరాఠీ పూజ, హారతి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిఏటా గురుపౌర్ణమి, శ్రీరామనవమి పండుగల సందర్భంగా ఈ దేవాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఉగ్రవాద బాంబు దాడులు

[మార్చు]

2002, నవంబరు నెలలో ఆలయంలో మొదటి బాంబు దాడి జరిగింది.[3] ఆ దాడిలో ఏడుగురు గాయపడ్డారు.[4] 2013లో హైదరాబాదులో జరిగిన పేలుళ్లలో మొదటి లక్ష్యంగా ఈ ఆలయం ఉండగా, ఆలయం వద్ద ఉన్న భద్రత కారణంగా దాడిని ఉపసంహరించుకున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-14. Retrieved 2021-02-25.
  2. 2.0 2.1 టివి9 తెలుగు, ఆధ్యాత్మికం (10 December 2020). "దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి అరుదైన గుర్తింపు.. అంతర్జాతీయ స్థాయికి ఆలయ కీర్తి ప్రతిష్టలు." శివ ప్రజాపతి. Archived from the original on 25 February 2021. Retrieved 25 February 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2004-01-29. Retrieved 2021-02-25.
  4. http://expressindia.indianexpress.com/news/fullstory.php?newsid=17026