సాయి కుమార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సాయి కుమార్
జన్మ నామం పూడిపెద్ది సాయి కుమార్
జననం (1960-07-27) జూలై 27, 1960 (వయస్సు: 55  సంవత్సరాలు)
భారతదేశం కర్నాటక, భారత్
ఇతర పేరు(లు) డైలాగ్ కింగ్
క్రియాశీలక సంవత్సరాలు 1976 - ఇప్పటివరకు
ప్రముఖ పాత్రలు పోలీస్ స్టోరీ

సాయి కుమార్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు డబ్బింగ్ కళాకారుడు. ఇతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు కూడా.

బాల్యం[మార్చు]

ఇతను ప్రముఖ నటుడు పి.జె.శర్మ కుమారుడు. స్వస్థలం కర్నాటక రాష్ట్రంలోని బాగేపల్లి. తండ్రి కూడా డబ్బింగ్ కళాకారుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే ఆ వృత్తిలో ప్రవేశించాడు. కథానాయకులు సుమన్, రాజశేఖర్ ల సినిమాలకు మొదట్లో డబ్బింగ్ చెప్పాడు. కంఠస్వరం, తెలుగు ఉచ్ఛారణ బాగుండటంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో నటుడిగా కూడా అవకాశాలు లభించాయి. ఆయన కుమారుడు ఆది సినీ కథానాయకుడు. సోదరుడు రవి శంకర్ డబ్బింగ్ కళాకారుడు.

నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

  1. శ్రీరామరాజ్యం (2011)
  2. ప్రస్థానం
  3. విజయదశమి
  4. పోలీస్ స్టోరీ
  5. కర్తవ్యం
  6. భగవాన్ (అనువాద చిత్రం)
  7. అబ్దుల్లా (అనువాద చిత్రం)

పురస్కారాలు[మార్చు]

నంది పురస్కారాలు

టీవీ కార్యక్రమాలు[మార్చు]

ఈటీవీ లో ప్రసారమైన వావ్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]