సారా అలీ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సారా అలీ ఖాన్
2018లో సారా అలీ ఖాన్
జననం
సారా అలీ ఖాన్ పటౌడీ

(1995-08-12) 1995 ఆగస్టు 12 (వయసు 28)[1]
విద్యాసంస్థకొలంబియా విశ్వవిద్యాలయం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
తల్లిదండ్రులుసైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్

సారా అలీ ఖాన్ (ఆంగ్లం: Sara Ali Khan) భారతీయ నటి.

కెరీర్[మార్చు]

1995 ఆగష్టు 12న ముంబైలో పటౌడీ కుటుంబంలో సారా అలీ ఖాన్ జన్మించింది. ఆమె హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు సైఫ్ అలీ ఖాన్, అతని మొదటి భార్య అమృతా సింగ్ కుమార్తె. రుక్సానా సుల్తానా, శివిందర్ సింగ్ విర్క్‌ల మనుమరాలు కూడా. సారా అలీ ఖాన్ 2016లో కొలంబియా యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఆమె తన నటనా జీవితాన్ని 2018లో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన కేదార్‌నాథ్ చిత్రంతో ప్రారంభించింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా పెద్ద విజయాన్నిచ్చింది. పైగా ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది.[2] అలాగే సారా అలీ ఖాన్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు(IIFA) కూడా కైవసం చేసుకుంది.

సారా అలీ ఖాన్ తన రెండవ చిత్రం రోహిత్ శెట్టి యాక్షన్-కామెడీ సింబా (2018), ఇది కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది, ఇందులో ఆమె సరసన రణ్‌వీర్ సింగ్ నటించారు. 2020లో ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ 1లో ఆమె కార్తిక్ ఆర్యన్ సరసన నటించింది. 2021లో వచ్చిన అత్రాంగి రేలో ఆమె నటనతో ప్రేక్షకులను అలరించింది. ఇక సారా అలీ ఖాన్ వరస సినిమాలతో బిజీగా అయింది. విక్కీ కౌశల్‌ హీరోగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తున్న ఒక సినిమా నిర్మాణంలో ఉంది. పవన్‌ కృపాలానీ దర్శకత్వంలో గ్యాస్‌లైట్‌ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రంలో చిద్రాంగద సింగ్‌, విక్రాంత్‌ మస్సే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. Sara Ali Khan Answers The Most Googled Questions On Her. Daily News and Analysis. Event occurs at 1:18. Retrieved 11 December 2018.
  2. "Sara Ali Khan Awards: List of awards and nominations received by Sara Ali Khan | Times of India Entertainment". web.archive.org. 2022-05-27. Archived from the original on 2022-05-27. Retrieved 2022-05-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Sara Alikhan: రాజ్‌కోట్‌కు పయనం". web.archive.org. 2022-05-27. Archived from the original on 2022-05-27. Retrieved 2022-05-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)