సార్కోమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సార్కోమా (Sarcoma)
Classification and external resources
ICD-O:మూస:ICDO
MeSHD012509

సార్కోమా (Sarcoma) అనేది (గ్రీకు భాషలో 'సార్క్స్' కి అర్ధం "కండ") రూపాంతరం చెందిన సంధాయక కణజాల కణాల నుండి ప్రభవించే ఒక కాన్సర్.[1][clarification needed] ఈ కణాలు అంతఃచర్మానికి మరియు బాహ్య చర్మానికి మధ్యనున్న పొర లేదా మధ్య పొర[2] అభివృద్ధి చెందే తొలిదశలో ఉత్పన్నమవుతాయి. ఎముక, మృదులాస్థి, మరియు కొవ్వు కణజాలమును ఏర్పరుస్తాయి.

ఇది ఎపిథీలియం (దేహం అంతటా ఉన్న నిర్మాణాల పై పొరలను మరియు కుహరాలను కలిపే కణాలతో అల్లుకొని ఉండే ఒక కణజాలం) లో ఉత్పన్నమయ్యే కార్సినోమా (తీవ్ర స్థాయిలో ఉండే కణితి)లకి పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. ఎపిథీలియం దేహం అంతటా ఉన్న నిర్మాణాల పైపొరలను కప్పి ఉంచుతుంది, మరియు వక్షోజం, పెద్ద పేగు, క్లోమములలో వచ్చే కాన్సర్ కి మూలం.

అయినప్పటికీ, కణజాల మూలంను అర్ధం చేసుకొను పరిణామములో, "సార్కోమా" అను పదమును కొన్ని సమయాలలో కణితుల గురించి చెప్పే సమయంలో ఉపయోగిస్తారు ఇప్పుడు ఎపిథిలియల్ (శరీరంలోని అన్ని అవయవాలను కలిపే కణాలు) కణజాలం నుండి ఉత్పన్నమవుతున్నాయి అని తెలుపుతారు.[3] మృదు కణజాల సార్కోమా [4]అనే పదము మృదు కణజాలం యొక్క కణితిలను వర్ణించుటకు ఉపయోగిస్తారు, కాని దీని నుండి ఉత్పన్నం చేసినవి కాకుండా (కండరాలు మరియు రక్త నాళముల వంటివి) సంధాయక కణజాలములో ఉండే మూలకాలను కూడా వర్ణిస్తుంది.

వర్గీకరణ[మార్చు]

ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫి (OCT) ఒక సార్కోమా చిత్రం

కణజాలం[మార్చు]

ఏ కణజాలము నుండి ఉత్పన్నమవుతున్నాయి అనే విషయం ఆధారంగా సార్కోమాలకు అనేక నామములు ఇవ్వబడినాయి. ఉదాహరణకు, ఎముకలో ప్రభవించే ఆస్టియోసార్కోమా, మృదులాస్థిలో ప్రభవించే కాండ్రోసార్కోమా, మరియు లియోమ్యోసార్కోమా మృదు కండరాలు నుండి ఉత్పన్నం అవుతాయి. సార్కోమాలు వేగంగా వ్యాప్తి చెందుతాయి ఎందువలన అనగా వాటి యొక్క వ్యతిరేక DNA అంశం ఆరోగ్యమైన కణజాలం కన్నా అత్యధిక pH విలువను కలిగి ఉంటుంది.

స్థాయి[మార్చు]

కాన్సర్ సంబంధ జీవ ప్రవర్తనతో ఉన్న కొన్ని ప్రత్యేక కణజాల మరియు ఉప కణజాలాలలో ఉన్న లక్షణాల పౌనఃపున్యం ఆధారంగా కణజాలం యొక్క మూలం ఆధారంగా దాని నామముని ఇవ్వటంతో పాటు సార్కోమాలకు ఒక స్థాయిని కూడా నిర్ణయిస్తారు (అత్యల్పం, మధ్యస్థం, లేదా అత్యధికం). తక్కువ స్థాయి సార్కొమాలకు సాధారణంగా శస్త్రచికిత్సతో చికిత్స చేస్తారు, కొన్ని సమయాలలో రేడియేషన్ థెరపి లేదా కెమోథెరపిలను కూడా ఉపయోగిస్తారు. మధ్యస్థ మరియు అత్యధిక స్థాయి సార్కోమాలకు తరచుగా శస్త్రచికిత్స, కెమోథెరపి మరియు/లేదా రేడియేషన్ థెరపిల మిశ్రమ చికిత్స చేస్తారు.[5] అధిక తీవ్రత కలిగిన కణితిలు మెటాస్టేసిస్ (రోగ ప్రభావిత కణాల నుండి దాని ప్రక్కనే ఉన్న కణాలకు కాకుండా ఇతర కణాలకు లేదా భాగాలకు వ్యాప్తి చెందుట) వలె ఉంటాయి, వీటికి వేగవంతంగా చికిత్స చేయాలి. చాలా రకాల సార్కోమాలు కెమోథెరపికీ స్పందిస్తున్నాయి అని గుర్తించిన తరువాత రోగుల యొక్క జీవన కాలము నాటకీయముగా పురోభివృద్ధి చెందినది. ఉదాహరణకు, కెమోథెరపి లేని కాలములో, ఆస్టియోసార్కోమా ఉన్న రోగుల యొక్క దీర్ఘ కాల జీవనం కేవలం 20% మాత్రమే ఉండేది కాని ఇప్పుడు అది 60-70% కి పెరిగింది.[6]

రకాలు[మార్చు]

(అందుబాటులో ఉన్న ICD-O కోడ్లు అందించారు.)

కాపోసిస్ సార్కోమా ఇది ఎపిథిలియాల్ కణాల నుండి వలన ఇది ఒక నిజమైన సార్కోమా కాదు అని గమనించాలి

చికిత్స[మార్చు]

 • లిపోసార్కోమా చికిత్స శస్త్రచికిత్స ద్వారా రోగ కణాలను నాశనం చేసే విధానమును కలిగి ఉంటుంది, ప్రయోగాత్మకంగా పరీక్ష జరుపకుండా కెమోథెరపిని ఉపయోగించరు. లిపోసార్కోమాను శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేసాక అడ్జువెంట్ రేడియోథెరపిని కూడా ఉపయోగించవచ్చు.[7]
 • రాబ్డోమ్యోసార్కోమాకి శస్త్రచికిత్స, రేడియోథెరపి, మరియు/లేదా కెమోథెరపి ద్వారా చికిత్స చేస్తారు.[8] ఐదు-సంవత్సరాల పోరాటం చేస్తే 50% వరకు రాబ్డోమ్యో సార్కోమా రోగులకు నయమవుతుంది.[9]
 • ఎక్కువగా నియోఅడ్జువెంట్ కెమోథెరపి ద్వారా శస్త్ర చికిత్సతో వీలైనంతగా కాన్సర్ కణాలను తొలగించి ఆస్టియోసార్కోమాకు చికిత్స చేస్తారు.[10] రేడియోథెరపి అనేది రెండవ ప్రత్యామ్నాయం కాని అంతగా విజయవంతం కాలేదు.

సాంక్రమిక రోగ విజ్ఞానం[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సంవత్సరానికి 15,000 క్రొత్త కేసులతో సార్కోమాలు అరుదుగా నమోదు అవుతున్నాయి.[11] అందువలన దేశంలో ప్రతి సంవత్సరం సార్కోమాలు 1.5 మిలియన్ల క్రొత్త కాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షలలో కేవలం ఒక శాతం మాత్రమే కనిపిస్తున్నాయి,[12] మరియు US యొక్క అత్యల్ప జనాభాకు సంక్రమిస్తున్న వ్యాధి 200,000 హద్దుకు ఇంకా క్రిందనే ఉన్నాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దాదాపు సంవత్సరానికి 3,000-3,500 కేసులతో నమోదు అవుతున్న గాస్ట్రో ఇంటెస్టినల్ స్ట్రోమల్ ట్యూమర్ (GIST) అనేది సార్కోమా యొక్క అతి సాధారణ రూపం.[13]

సార్కోమాలు అన్ని వయసుల వారికి సంక్రమిస్తాయి. 35 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉండే వారిలో దాదాపు 50% ఎముక సార్కోమాలు మరియు 20% మృదు కణజాల సార్కోమాలను నిర్ధారణ అవుతున్నాయి.[14] లియోమ్యోసార్కోమా, కాండ్రోసార్కోమా, మరియు గాస్ట్రో ఇంటెస్టినల్ స్ట్రోమల్ కణితి (GIST) వంటి కొన్ని సార్కోమాలు పిల్లల కన్నా పెద్దవారిలో ఎక్కువగా వస్తాయి. ఎవింగ్స్ సార్కోమా మరియు ఆస్టియోసార్కోమా వంటి అధిక-తీవ్రత ఎముక సార్కోమాలు పిల్లలలో మరియు యుక్త వయస్కులలో అతి సాధారణం.

సూచనలు[మార్చు]

 1. |2,100
 2. Sarcoma at the US National Library of Medicine Medical Subject Headings (MeSH)
 3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 4. "Soft Tissue Sarcoma Home Page - National Cancer Institute".
 5. Buecker, P (2005). "Sarcoma: A Diagnosis of Patience". ESUN. 2 (5). Retrieved 2009-04-15.
 6. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 7. http://emedicine.medscape.com/article/1102007-treatment
 8. http://www.childrenshospital.org/az/Site1068/mainpageS1068P0.html
 9. http://www.acor.org/ped-onc/diseases/rhabdo.html
 10. http://emedicine.medscape.com/article/1256857-treatment
 11. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 12. http://www.cancer.org/docroot/STT/content/STT_1x_Cancer_Facts__Figures_2009.asp?from=fast
 13. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 14. Darling, J (2007). "A Different View of Sarcoma Statistics". ESUN. 4 (6). Retrieved 2009-04-15.

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సార్కోమా&oldid=1218514" నుండి వెలికితీశారు