సార్పట్ట పరంపర
సార్పట్ట పరంపర | |
---|---|
దర్శకత్వం | పా. రంజిత్ |
రచన | పా. రంజిత్ తమిళ్ ప్రభ |
నిర్మాత | షణ్ముగమ్ దక్షణ్‌రాజ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మురళి.జి |
కూర్పు | సెల్వ ఆర్.కె |
సంగీతం | సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థలు | నీలం ప్రొడక్షన్స్, కే9 స్టూడియోస్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 22 జూలై 2021 |
సినిమా నిడివి | 174 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సార్పట్ట పరంపర తమిళంలో 2021లో విడుదలై.. అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదలైన సినిమా. ఆర్య, దుషారా విజయన్, పశుపతి, అనుపమ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పా.రంజిత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 22 జులై 2021న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో విడుదలయింది
కథ
[మార్చు]సమర అలియాస్ సామ్రాజ్యం (ఆర్య) కు చిన్నప్పటి నుంచీ బాక్సింగ్ అంటే ప్రాణం. క్లాసులు ఎగ్గొట్టి మరీ బాక్సింగ్ చూడటానికి వెళ్లేవాడు. కానీ అతని తల్లి భాగ్యం(అనుపమ కుమార్) కి అది ఇష్టం లేకపోవటంతో దూరంగా ఉంటూ, .ఉత్తర చెన్నైలోని ఓ హార్బర్‌లో హమాలి కూలిగా పనిచేస్తుంటాడు. ఈ బృందాన్ని నడిపించే తాను అమితంగా ఇష్టపడే గురువు మాజీ బాక్సర్ రంగయ్య (పశుపతి)కి అవమానం జరుగుతుంది.
తనను సవాల్ చేసిన ప్రత్యర్థి బృందం బాక్సర్ వేటపులి (జాన్ కొక్కెన్) మీదికి బాక్సరే అయిన తన కొడుకును కూడా కాదని రాముడు అనే మరో బాక్సర్ను నిలబెడతాడు. కానీ అతను అడ్డం తిరిగి రంగయ్యను అవమానిస్తాడు. దీంతో రంగయ్యను ఎంతో గౌరవించే సమర సార్పట్ట తరపున బాక్సింగ్ చేసి గెలుస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. మరి ఈ పోరులో సమర గెలిచాడా ?? లేదా? అనేది మిగిలిన కథ.[1][2]
నటీనటులు
[మార్చు]- ఆర్య
- దుషారా విజయన్
- పశుపతి
- అనుపమ కుమార్
- సంచన నటరాజన్
- జాన్ కొక్కెన్
- కలైయరసన్
- ప్రియదర్శిని రాజ్ కుమార్
- సంతోష్ ప్రతాప్
- జాన్ విజయ్
- షబీర్ కల్లరక్కల్
- కిషోర్
- మారన్
- కాళీ వెంకట్
- వెట్టై ముత్తుకుమార్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: నీలం ప్రొడక్షన్స్, కే9 స్టూడియోస్
- నిర్మాత: షణ్ముగమ్ దక్షణ్‌రాజ్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పా. రంజిత్
- సంగీతం: సంతోష్ నారాయణన్
- సినిమాటోగ్రఫీ:మురళి.జి
- ఎడిటింగ్: సెల్వ ఆర్.కె.
- స్టంట్స్: అన్బరివ్
- ఆర్ట్: టి.రామలింగం
మూలాలు
[మార్చు]- ↑ EENADU. "రివ్యూ: సార్పట్ట". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
- ↑ Sakshi (22 July 2021). "'సార్పట్ట' మూవీ రివ్యూ". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.