సాలమండర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాలమండర్లు
Temporal range: Jurassic–present
SpottedSalamander.jpg
Spotted Salamander, Ambystoma maculatum
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: ఉభయచరాలు
ఉప తరగతి: Lissamphibia
క్రమం: Caudata
Scopoli, 1777
Suborders

Cryptobranchoidea
Salamandroidea
Sirenoidea

Native distribution of salamanders (in green)

సాలమండర్ (Salamander) అనేది ఉభయ చరాలకు చెందినటువంటి దాదాపు 500 జాతులు యొక్క సాధారణ నామధేయం. సన్నని శరీరాలు, పొట్టి ముక్కులు మరియు పొడుగాటి తోకలు వాటి ప్రత్యేకతలు. ఒక్కోసారి అంతరించిపోయిన జాతులను ఒక దగ్గరగా చేర్చి యూరోడేలా అనే పేరుతో పిలిచినప్పటికి మనకు తెలిసిన అన్ని శిలాజాలు, అంతరించిపోయిన జాతులు కాడేట అనే ఒక ఆర్డర్ కు చెందుతాయి.[1] సాలమండర్లలో అనేక జీవులు ముందరి కాళ్ళకి నాలుగు వేళ్ళు, వెనుక కాళ్ళకి ఐదు వేళ్ళు కలిగి ఉంటాయి. వాటి తడి చర్మం వాటిని సాధారణంగా నీటిలో లేక నీటి చుట్టు ప్రక్కల నివాస స్థలాలలో లేదా తరచుగా తడి భూమిలో ఉన్న ఏదైనా సురక్షిత స్థానం (ఉదా.,తడి మట్టి) పై ఆధారపడేలా చేస్తుంది. సాలమండర్లకు చెందిన కొన్ని జాతులు ఆజన్మాంతం పూర్తిగా జలచరాలుగానే ఉంటాయి, కొన్ని అప్పుడప్పుడూ నీటిలోకి వెళ్ళడం చేస్తాయి, యుక్త వయస్సుకు చేరుకున్నవి పూర్తిగా భూమి పైనే నివసిస్తాయి. కోల్పోయిన తమ కాళ్ళు, ఇతర శరీర భాగాలను పునరుత్పత్తి చేసుకోగలిగిన సామర్థ్యం కారణంగా ఇవి వెన్నెముక గల జంతువులలోవిలక్షణమైనవి.

లక్షణాలు[మార్చు]

సాధారణంగా, యుక్త వయస్సుకు చేరుకున్న సాలమండర్లు సన్నని శరీరాలు, పొడుగాటి తోకలు మరియు నాలుగు కాళ్ళతో బల్లులు వలెనే అతి ప్రాచీనం అయిన చతుష్పాద శరీరాకృతిని కలిగి ఉంటాయి. అయినప్పటికీ, కొన్ని బల్లుల వలె, సాలమండర్లలో అనేక జాతులలో కాళ్ళు లేకపోవడము లేదా బాగా చిన్నవైన కాళ్ళు కలిగి ఉండడము అన్న కారణాలు వాటిని కొంత వరకు ఈల్ వంటి శరీరాకృతిని చూపిస్తాయి. అనేక స్పీసీలు ముందరి కాళ్ళకు నాలుగు వేళ్ళు, వెనుకనున్న కాళ్ళకు ఐదు వేళ్ళు కలిగి ఉన్నప్పటికీ వాటికి పంజాలనేవి ఉండవు. సాధారణంగా, ఆడ, మగ రెండు జాతులకూ చెందిన సాలమండర్లు ఏడాది పొడుగునా కానీ లేక ప్రత్యేకించి పునరుత్పత్తి ఋతువులో అయితే కేవలం మగవి మాత్రం ప్రకాశవంతమైన రంగుల్లో ఉంటాయి. అయినప్పటికీ, పూర్తిగా భూగర్భంలో నివసించే జాతులు చర్మంలో పిగ్మెంట్ లోపించి తరచుగా తెలుపు లేదా గులాబీ వర్ణంలో ఉంటాయి.[2]

సాలమండర్లలో అనేకం ఇతర వాటితో పోల్చి చూస్తే చిన్నవిగా ఉన్నా కొన్ని నిశ్చితమైన మినహాయింపులు ఉన్నాయి. పరిమాణంలో అవి తోకతో సహా మొత్తం పొడుగు |2.7 cm|in}} ఉండే అతి సూక్ష్మ సాలమండర్లు నుండి దాదాపు .8|m|ft}} వరకు పొడుగు పెరిగి 65 kg|abbr=on}} వరకు తూగే చైనీస్ జైంట్ సాలమండర్ వరకు ఉంటాయి. అయినప్పటికీ ఎక్కువగా అవి 0cmin}} నుండి 20cmin}} మధ్య పొడుగును కలిగి ఉంటాయి. సాలమండర్లు వయసులో ఎదుగుతూ ఉండగా క్రమ పద్ధతిలో చర్మం పై పొర (ఎపిడెర్మిస్) రాల్చడం, ఆ తర్వాత రాలిన పొట్టును తినెయ్యడం చేస్తాయి.[2][3][4]

గ్రీస్ లోని మౌంట్ ఒలింపస్ నేషనల్ పార్క్ లోని ఒక సాలమండర్.

వివిధ జాతులకు చెందిన సాలమండర్లలో శ్వాసక్రియ కూడా భిన్నంగానే ఉంటుంది. ఊపిరితిత్తులు లేని స్పీసీలు మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఆంఫీయుమాలు శరీరం లోపల మొప్పలు, మొప్పలకు బీటలు కలిగి ఉన్నప్పటికీ చాలా సందర్భాలలో తలకు ఇరువైపులా కుచ్చుల్లా కనిపించే బాహ్య మొప్పలు ఉంటాయి. భూమి పై నివసించే కొన్ని సాలమండర్లు శ్వాసక్రియకు క్షీరదాలలో కానవచ్చే అతి సంక్లిష్టమైన ఊపిరితిత్తుల వంటివి కాక కేవలం తిత్తి వంటి సాధారణమైన ఊపిరి తిత్తులు కలిగి ఉంటాయి. ఒం వంటి అనేక జాతులు, యుక్త వయస్సులో ఊపిరి తిత్తులు, మొప్పలు రెండింటినీ కలిగి ఉంటాయి.[2]

భూమిపై మాత్రమే నివసించే కొన్ని జాతులు ఊపిరి తిత్తులు, మొప్పలు రెండూ లేక వలెరియన్ శ్వాసక్రియ అనే ప్రక్రియ ద్వారా చర్మం గుండా వాయువులు మార్చుకోవడం చేస్తాయి. ఈ శ్వాసక్రియలో ఎపిడెర్మిస్ అంతటా మరియు నోటి లోపల కేపిల్లరి బెడ్స్ విస్తరించి ఉంటాయి. ఊపిరితిత్తులు కలిగిన కొన్ని జాతులు కూడా ఈ విధంగా చర్మం గుండా శ్వాసక్రియ జరుపుకోగలవు.

సాలమండర్లలో వాటి చర్మం తెమడ స్రవింపజేస్తుంది, ఇది జీవి నీటిలో ఈదే సమయంలో జారవిడిచే పదార్ధాన్ని అందజేయ్యడమే కాక భూమి పై ఉన్నప్పుడు జీవి తేమగా ఉండేలా చూస్తుంది, నీటిలో ఉన్నప్పుడు లవణాల మధ్య సమతులన నిలిచి ఉండేలా చూస్తుంది. సాలమండర్లు చర్మంలో గల గ్రంథుల నుండి విషం కూడా వెలువరించడం చేస్తాయి, కానీ మరికొన్ని అయితే కోర్ట్ షిప్ ఫెరోమోన్స్ స్రవింపజేసే చర్మ గ్రంథులను అదనంగా కలిగి ఉంటాయి.[2]

వేటాడడం సాలమండర్ల మరో ప్రత్యేకత. ఊపిరితిత్తులు లేని సాలమండర్లలో హయా ఇడ్ ఎముకను చుట్టి ఉండే కండరాలు ఒత్తిడి సృష్టించేందుకు సంకోచించి వాస్తవానికి హయా ఇడ్ ఎముకను నాలుకతో సహా అకస్మాత్తుగా, వేగంగా బయటకు దూసుకువచ్చేలా చేస్తాయి. నాలుక చివరి భాగం తెమడతో ఏర్పడి జిగురు కొన సృష్టిస్తుంది, దీనికి ఎర పట్టుబడుతుంది. పెల్విక్ ప్రదేశంలోని కండరాలు హయా ఇడ్ ఎముక మరియు నాలుకలను చుట్టి యదాస్థానంలో ప్రవేశపెట్టేందుకు ఉపకరిస్తాయి.

హెచ్చుగా జలచరాలైన జాతులలో అనేకం నాలుకలో కండరాలు లేనివీ, నాలుకను ఎరను పట్టుకునేందుకు ఉపయోగించనివీ అయిన అనేక ఇతర జాతులు హయా ఇడ్ ఎముకకు సరిపడనివే అయినప్పటికీ ఒక కదిలే నాలుకను కలిగి ఉంటాయి. సాలమండర్లలో అనేక జాతులు పై మరియు క్రింది దవడలలో కూడా చిన్న పళ్ళు కలిగి ఉంటాయి. కప్పల్లో వలె కాక, సాలమండర్లలో లార్వాలు కూడా ఈ పళ్ళను కలిగి ఉంటాయి. కప్పలు వలె కాక, సాలమండర్లలో లార్వాలు కూడా ఈ పళ్ళను కలిగి ఉంటాయి.[2]

తమ ఎర కనుగొనేందుకు సాలమండర్లు 450 nm, 500 nm మరియు 570 nm ల వద్ద అత్యధికంగా ప్రభావితమయ్యే రెండు రకాల ఫోటో రిసెప్టార్లు పైన ఆధారపడిన అతి నీలలోహిత శ్రేణిలోని ట్రైక్రోమాటిక్ కలర్ విజన్ ఉపయోగించడం జరుగుతుంది.[5] శాశ్వతంగా భూమి లోపల నివసించే సాలమండర్లు పరిమాణంలో బాగా తగ్గిన కళ్ళు, అవి చర్మంతో కప్పబడి కూడా ఉండవచ్చు, కలిగి ఉంటాయి. హెచ్చు జలచరాలు అయిన కొన్ని జాతులలో లార్వాలు మరియు యుక్త వయస్సులో ఉన్నవి చేపలలో మాదిరిగా శరీరం పక్క భాగంలో నీటి వత్తిడిలో మార్పులను గ్రహించే అంగాన్ని కలిగి ఉంటాయి. సాలమండర్లలో బాహ్య చెవి ఉండదు, సంపూర్ణంగా పెరుగుదల లేని ఒక మధ్య చెవి మాత్రం ఉంటుంది.[2]

తమను వేటాడ వచ్చే శత్రువుల నుండి సాలమండర్లు స్వయం ఛేదక శక్తితో తోకను విడిచి తప్పించుకునిపోతాయి. వాటి తోక రాలి పడి అలాగే అటూ ఇటూ కదులుతూ ఉండగా, సాలమండర్లు అయితే పారిపోవడమో లేక దృష్టి మరలిన శత్రువు తమను గమనించకుండా ఉండేందుకు నిశ్చలంగా ఉండిపోవడమో చేస్తాయి. సాలమండర్లు నిత్యకృత్యంగా సంక్లిష్ట కణజాలాలను పునరుత్పత్తి చేసుకుంటూ ఉంటాయి. కాలిలోని ఒక తునకను కోల్పోయిన కొద్ది వారాల వ్యవధిలోనే సాలమండర్లు కోల్పోయిన ఆకారాన్ని పరిపూర్ణంగా సృష్టించుకోవడం జరుగుతుంది.[6]

పంపిణీ[మార్చు]

మధ్య పెర్మియన్ నుండి చివరి పెర్మియన్ మధ్యలో సాలమండర్లు ఇతర ఉభయచరాల నుండి వేరుపడ్డాయి, కానీ ప్రారంభంలో అవి క్రిప్టో బ్రాన్కోఇడియాకు చెందిన ఆధునిక సభ్యులను పోలి ఉండేవి. అవి బల్లులను పోలి ఉండడానికి కారణాలు సింపుల్ సియోమోర్ ఫీ, వాటి ప్రాచీన చతుష్పాద శరీర నమూనా అలాగే నిలచి ఉండడం, చెప్పాలంటే అవి ఇక బల్లులతోగానీ, క్షీరదాలతోగానీ లేదా పక్షులతోగానీ ఏ మాత్రం దగ్గర సంబంధాన్ని కలిగి లేవు. బాట్ రేఖియా పరిధిలోని కప్పలు మరియు గోదురు కప్పలు వాటి సమీప బంధువులు.

ఆస్ట్ర్రేలియా, అంటార్కటికా మరియు ఆఫ్రికాలలో అధిక ప్రాంతం మినహా ఇతర అన్ని ఖండాల పై కాడేట్స్ లభిస్తాయి. సాలమండర్ జాతులలో ఒకింట మూడవ వంతు జాతులు కేవలం ఉత్తర అమెరికాలోనే లభించడం జరుగుతుంది. అప్పలాచియన్ పర్వతాలు గల ప్రదేశంలో ఇవి అత్యధిక సంఖ్యలో లభిస్తాయి. సాలమండర్ లలో అసంఖ్యాకమైన జాతులు ఉన్నాయి, ఇవి ఉత్తర భూభాగంలోని తేమ మరియు పొడి నివాస స్థలాలలో అత్యధిక సంఖ్యలో లభిస్తాయి. ఏరులు, కయ్యలు, కొలనులు మరియు ఇతర చెమ్మ స్థలాలలోనో లేక వాటి చుట్టు ప్రక్కల స్థలాలలోనో ఇవి సాధారణంగా నివసిస్తాయి.

అభివృద్ధి[మార్చు]

సాలమండర్ల జీవిత చరిత్ర కప్పలు మరియు గోదురు కప్పలు వంటి ఉభయచరాల జీవిత చరిత్రను పోలి ఉంటుంది. సాధారణంగా అధిక జాతులలో మగవి ఆడవాటి క్లోఏకాలో శుక్ర కణాల తిత్తిని ప్రవేశపెట్టడం జరుగుతుంది, తద్వారా అవి శరీరం లోపలే అండాలను ఫలదీకరించడం చేస్తాయి. క్రిప్టో బ్రాంకోఇడియాలో చేర్చిన అత్యంత ప్రాచీనమైన సాలమండర్లు మాత్రం బాహ్య ఫలదీకరణను కనపరచడం జరుగుతుంది. గుడ్లను సాధారణంగా కొలనులో, అప్పుడప్పుడూ తడి మట్టి లేక బ్రోమి లియడ్స్ వంటి తేమ నిండిన వాతావరణంలో పెట్టడం జరుగుతుంది. కొన్ని జాతులు ఓవోవివీపేరస్ కు చెందినవి అయి ఉంటాయి, ఫలితంగా గుడ్లు పొదిగే వరకు ఆడవి వాటిని తమ శరీరం లోపలే ఉంచుకోవడం జరుగుతుంది.[2]

ఆ తర్వాతది లార్వ దశ, ఇందులో జీవి మొప్పలు కలిగి ఉండి పూర్తిగా నీటిలోనో లేదా భూమిపైనో ఉంటుంది. లార్వా దశ కాళ్ళు కలిగి ఉంటుందా లేదా అనే విషయం ఆ జాతులు పై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా, లార్వా దశ కూడా అది చెందిన జాతులు పైనే ఆధారపడి కొద్ది రోజుల నుండి కొన్ని సంవత్సరాల వరకు సాగవచ్చు. డన్స్ సాలమండర్ వంటి కొన్ని జాతులు లార్వా దశను ఏ మాత్రం కనపరచవు, నేరుగా పొదగబడిన చిన్న జీవి పెద్ద జీవి యొక్క ప్రతిరూపంలా ఉంటుంది.

సాలమండర్ ఫ్యామిలీలు అన్నింటిలోనూ నియోటెని గమనించవచ్చు, ఇందులో జీవి లైంగిక పరిపక్వత సాధించినప్పటికీ మొప్పలను ఇంకా కలిగే ఉండవచ్చు. సాలమండర్ జాతులు అన్నింటిలోనూ ఇది సర్వ సామాన్యం కూడా కావచ్చు.[7] కానీ, అంతకంటే సామాన్యంగా మొప్పలు కోల్పోవడం, కాళ్ళు పెరగడం (లేదా పరిమాణంలో పెద్దవి కావడం), జీవి భూమి పై నివసించగలగడం వంటివి జరుగుతూ రూపాంతరం కొనసాగుతుంది.

క్షీణిస్తున్న జనాభా[మార్చు]

సాధారణంగా జీవించి ఉన్న ఉభయచర జాతులు క్షీణతకు కారణం అయిన ఖిట్రిడియోమైకోసిస్ ఫంగల్ వ్యాధి సాలమండర్ల పై కూడా అత్యంత ప్రభావం కనపరిచింది. ఒక వైపు, ఫంగస్ కూ, జనాభా క్షీణించడానికీ మధ్య సరాసరి సంబంధం అంటూ ఏదీ కనుక్కోలేకపోయినా పరిశోధకులు ఫంగస్ ఒక పాత్ర అంటూ పోషించిందని మాత్రం నమ్ముతున్నారు. అడవుల నరికివేత, వాతావరణంలో మార్పు కూడా కారణాలు కావచ్చు అని పరిశోధకులు ఉదహరిస్తారు. 1970లలోనే కాక ఇటీవల కూడా గ్వాటిమాలాలో నిర్వహించిన సర్వేలు దీనికి ఆధారం. 1970లలో విస్తారంగా లభించే సుడోయురిసియా బ్రన్నేట మరియు సుడోయురిసియా గోబెలి ప్రముఖంగా ప్రభావితం అయినవి.[8]

వర్గీకరణ[మార్చు]

కాడేటా ఆర్డర్ కు సంబంధించి మూడు సబ్ ఆర్డర్లుగా విభజించబడిన కుటుంబాలు పది ఉన్నాయి.[1] క్రిప్టోబ్రాంఖోఇడియా మరియు సాల్మండ్రోఇడియా లను వేరు చేసేందుకు తరచుగా నియోకాడేటా అనే క్లాడ్ ను ఉపయోగించడం జరుగుతుంది.

కోల్స్పాన్ ="100%" అలైన్="సెంటర్" మూస:Bgcolor-blue క్రిప్టోబ్రోన్ఖోఇడియా ( జైంట్ సాలమండర్లు)
కుటుంబము సాధారణ నామములు జాతులు ఉదాహరణలు

ఉదాహరణ ఫోటో |- క్రిప్టోబ్రోన్ఖోఇడియా జైంట్ సాలమండర్లు హెల్బెండర్ (క్రిప్టో బ్రాన్ఖస్ అల్లిగానిఎన్సిస్ Cryptobranchus alleganiensis.jpg |- హైనోబిడే ఆసియాటిక్ సాలమండర్లు హిడా సాలమండర్ హైనోబిఅస్ కిమురే Hynobius kimurae (cropped) edit.jpg |- |కోల్స్పాన్ ="100%"అలైన్ ="సెంటర్ " మూస:Bgcolor-blue|సాలమండ్రోఇడియా (అభివృద్ధి చెందిన సాలమండర్లు) |- |ఎంబిస్టోమటిడే ||మచ్చల సాలమండర్లు ||మార్బల్డ్ సాలమండర్ (ఎమ్బిస్టోమ ఒపేకం )||Ambystoma opacumPCSLXYB.jpg |- |ఎంఫియుమిడే ||ఎంఫియుమస్ లేక కాంగో ఈల్స్ ||రెండు- కాలి వేళ్ళ ఎంఫియుమ (' )|ఎంఫియుమ అంటే |Amphiuma means.jpg |- |డికాంప్టో డాన్టిడే ||పసిఫిక్ జైంట్ సాలమండర్లు ||పసిఫిక్ జైంట్ సాలమండర్ (డికాంప్టోడాన్ టెనిబ్రోసస్ )||Coastal Giant Salamander, Dicamptodon tenebrosus.jpg |- |ప్లెతోడాన్టిడే ||ఊపిరి తిత్తులు లేని సాలమండర్లు ||ఎరుపు నలుపు సాలమండర్ (ప్లేతోడాన్ సినిరెయస్ )|| |- | ప్రోటోఇడే||మడ్ పప్పీస్ మరియు ఒమ్స్ ||ఒం (ప్రో టియస్ అంగ్వినస్ )||Proteus anguinus Postojnska Jama Slovenija.jpg |- |ర్యాకోట్రిటోనిడే ||టోరెంట్ సాలమండర్లు ||సదరన్ టోరెంట్ సాలమండర్ (ర్యాకోట్రిటాన్ వెరైగేటస్ )||Rhyacotriton variegatus.jpg |- |సాలమండ్రిడే ||న్యూట్స్ మరియు ట్రూ సాలమండర్లు ||అల్ ఫైన్ న్యూట్ ( ట్రిటురస్ ఆల్ప్ఎస్ట్ రిస్ )||Mesotriton aplestris dorsal view chrischan.jpeg |- |కోల్స్పాన్ ="100%" అలైన్ ="సెంటర్ " మూస:Bgcolor-blue| సైరెన్ఆయిడియా (సిరెన్స్) |- |సైరెనిడే ||సైరెన్లు||గ్రేటర్ సైరెన్ (సైరెన్ లాసర్టినా )||Sirenlacertina.jpg |- |}

పురాణ శాస్త్రము మరియు జనసమ్మతమైన సంస్కృతి[మార్చు]

మంటల్లో హానికి గురి కాని ఒక సాలమండర్

శతాబ్దాలుగా సాలమండర్ల చుట్టూ అనేక కథలు, ఎక్కువగా నిప్పుకు సంబంధించి విస్తరించడం జరిగింది. కుళ్ళిన దుంగలలో నివసించే సాలమండర్ల వైఖరి ఈ సంబంధం ఏర్పడడానికి కారణం కావచ్చు. దుంగను మంటలో ఉంచినప్పుడు, సాలమండర్లు దుంగ వెలుపలికి వచ్చి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నమే సాలమండర్లు మంటల నుండి సృష్టించబడ్డాయి అన్న నమ్మకానికి కారణం - ఆ నమ్మకమే వాటి పేరుకు ఆధారం.[9]

మంటలతో సాలమండర్ల సహవాసం గురించి అరిస్టోటల్, ప్లిని, తాల్మడ్, కోన్రాడ్ లైకోస్థనస్, బెన్వెనుటో సెల్లిని, రే బ్రాడ్బరి, డేవిడ్ వెబర్, పేరాసెల్సస్ మరియు లియానార్డో డావిన్సి రచనలలో కనపడుతుంది.

మానవుల ఉపయోగములో అంగాల పునరుత్పత్తిలోని అంతరార్ధము[మార్చు]

సాలమండర్ల అంగాల పునరుత్పత్తి శాస్త్రజ్ఞులలో ఆసక్తికి ముఖ్య కేంద్రము అయ్యింది. మనుషులలో పునరుత్పత్తిని మూల కణాలు ఉపయోగించి కృత్రిమంగా సృష్టించవచ్చు అనే ఒక సిద్ధాంతం శాస్త్రజ్ఞుల సంఘంలో ప్రబలి ఉంది. పరిశోధనల కోసం ఎక్సోలోటల్స్ కు ప్రాధాన్యత ఇవ్వబడింది.[10]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 Larson, A. and W. Dimmick (1993). "Phylogenetic relationships of the salamander families: an analysis of the congruence among morphological and molecular characters". Herpetological Monographs (published c1993). 7 (7): 77–93. doi:10.2307/1466953. Check date values in: |publication-date= (help)
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 Lanza, B., Vanni, S., & Nistri, A. (1998). Cogger, H.G. & Zweifel, R.G. (ed.). Encyclopedia of Reptiles and Amphibians. San Diego: Academic Press. pp. 60–68. ISBN 0-12-178560-2.CS1 maint: Multiple names: authors list (link)
 3. "Digitally tagging and releasing". line feed character in |title= at position 18 (help)
 4. "International Giant Salamander Protection Site".
 5. "Trichromatic color vision in the salamander (Salamandra salamandra)".
 6. జేమ్స్ ఆర్ మోనాఘన్లెట్ ఆల్ మైక్రోఆర్రె అండ్ సి డిఎన్ఏ సీక్వెన్స్ అనలిసిస్ అఫ్ ట్రాన్స్ క్రిప్షన్ డ్యురింగ్ నెర్వ్-డిపెండెంట్ లింబ్ రిజెనరేషన్. బి ఎమ్ సి బయోలోజి 2009, 7:1 డిఓఐ : 1186 / 1741 - 7007 - 7 - 1
 7. "Salamander Neoteny".
 8. హెన్రి ఫౌంటైన్ , అనదర్ అమ్ఫిబియన్ అట్ రిస్క్ : సాలమండర్స్, ది న్యూ యార్క్ టైమ్స్, ఫిబ్రవరి 16 , 2009.
 9. Ashcroft, Frances (2002). Life at the Extremes: The Science of Survival. Berkeley, CA: University of California Press. p. 112. ISBN 978-0520234207 Check |isbn= value: checksum (help).
 10. Keim, Brandon (July 1, 2009). "Salamander Discovery Could Lead to Human Limb Regeneration". Wired. Retrieved May 7, 2010.
 • Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 • San Mauro, Diego (2010). "A multilocus timescale for the origin of extant amphibians". Molecular Phylogenetics and Evolution. 56 (2): 554–561. doi:10.1016/j.ympev.2010.04.019. PMID 20399871.

బాహ్య లింకులు[మార్చు]

ప్రాంతీయ జాబితాలు[మార్చు]

ప్రసార సాధనాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సాలమండర్&oldid=2008271" నుండి వెలికితీశారు