సాలెంపాలెం
సాలెంపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి వడుగు స్వాతి |
జనాభా (2011) | |
- మొత్తం | 2,569 |
- పురుషులు | 1,279 |
- స్త్రీలు | 1,290 |
- గృహాల సంఖ్య | 774 |
పిన్ కోడ్ | 521121 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
సాలెంపాలెం, కృష్ణా జిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 121., ఎస్.టి.డి.కోడ్ = 08671.
విషయ సూచిక
- 1 గ్రామ చరిత్ర
- 2 గ్రామం పేరు వెనుక చరిత్ర
- 3 గ్రామ భౌగోళికం
- 4 గ్రామానికి రవాణా సౌకర్యాలు
- 5 గ్రామంలో విద్యా సౌకర్యాలు
- 6 గ్రామములోని మౌలిక సదుపాయాలు
- 7 గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
- 8 గ్రామ పంచాయతీ
- 9 గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
- 10 గ్రామములోని ప్రధాన పంటలు
- 11 గ్రామములోని ప్రధాన వృత్తులు
- 12 గ్రామ ప్రముఖులు
- 13 గ్రామ విశేషాలు
- 14 గణాంకాలు
- 15 మూలాలు
- 16 వెలుపలి లంకెలు
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
ఈ గ్రామానికి సమీపంలో పెదయాదర, పిట్టల్లంక, పెదకళ్ళేపల్లి, ఉల్లిపాలెం గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు[మార్చు]
అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
కొత్త మాజేరు, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 72 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
- ఈ పాఠశాల 5వ వార్షికోత్సవం 2014, ఫిబ్రవరి-20న జరిగింది. ఈ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు గత రెండేళ్ళుగా 100% ఉత్తీర్ణ శాతం సాధించుచున్నారు. [3]
- గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రప్రభుత్వం అందించే రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారానికి, ఈ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ పోతన వెంకటేశ్వరరావు ఎంపికైనారు. 2014, సెప్టెంబరు-5న గుంటూరులో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్రమంత్రుల చేతులమీదుగా వీరీ పురస్కారాన్ని అందుకుంటారు. ఘంటసాలకు చెందిన ఈయన 1985లో ఉపాధ్యాయ వృత్తిలో చేరినారు. 2009లో ప్రధానోపాధ్యాయులుగా సాలెంపాలెం గ్రామానికి బదిలీపై వచ్చిన ఈయన, పాఠశాల పూర్వవిద్యార్థులు, గ్రామస్తుల సహకారంతో మూడు లక్షల రూపాయల విరాళం సేకరించి పాఠశాల చుట్టూ ప్రహరీ, ఆవరణలో వేదిక, సైకిలుస్టాండు వగైరా అభివృద్ద్ధిపనులు చేయించి తనదైన ముద్ర వేసినారు. ప్రతి సంవత్సరం ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయుచున్నారు. ఈ రకంగా అందరి సహకారంతో ముందుకు వెళ్ళుచున్నారు. [4]
- ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న లంకె లావణ్య అను విద్యార్థిని, జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనది. ఈమె ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడాపోటీలలో, బాలికల అండర్-17 విభాగంలో, కృష్ణాజిల్లా జట్టు కెప్టెనుగా రాణించి, జట్టుని తృతీయస్థానంలో నిలబడటానికి కీలకభూమిక పోషించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. [5]
- ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన గుండుమిల్లి హేమంత్ కుమార్, 9.8 గ్రేడ్ మార్కులు సాధించాడు. నడకుదుటి ప్రత్యూష 9.7 మార్కులు సాధించింది. వీరిద్దరూ ఐ.ఐ.ఐ.టి.లో సీట్లు పొందినారు. [6]
- ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న రామాను నాగలక్ష్మి అను విద్యార్థిని, 2016, అక్టోబరు-22 నుండి 24 వరకు అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో, అండర్-14 విభాగంలో, కృష్ణా జిల్లా జట్టు తరఫున పాల్గొని, తన ప్రతిభతో, జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడానికి ఎంపికైనది. ఈమె డిసెంబరు-2016లో ఢిల్లీలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [7]
- 2017,సెప్టెంబరు-1,2,3 తేదీలలో ఒంగోలులో నిర్వహించు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలలో పాల్గొనుటకు, ఈ పాఠశాలలో చదువుచున్న ఆర్.నాగలక్ష్మి, కె.నళిని, కె.కనకదుర్గ, లిఖిత, తనూజ అను విద్యార్ధినులు ఎంపికైనారు. [8]
గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]
హోమియో వైద్యశాల.
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం[మార్చు]
ఈ గ్రామానికి ఈ కేంద్రం పిట్టల్లంక గ్రామంలో ఉంది.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి వడుగు స్వాతి సర్పంచిగా ఎన్నికైనారు.[2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,569 - పురుషుల సంఖ్య 1,279 - స్త్రీల సంఖ్య 1,290 - గృహాల సంఖ్య 774
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3128.[3] ఇందులో పురుషుల సంఖ్య 1570, స్త్రీల సంఖ్య 1558, గ్రామంలో నివాస గృహాలు 815 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2208 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Koduru/Salempalem". Retrieved 27 June 2016. Cite web requires
|website=
(help); External link in|title=
(help) - ↑ ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; జనవరి-7,2014; 1వ పేజీ.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లంకెలు[మార్చు]
[3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-20; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,సెప్టెంబరు-3; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-2; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూలై-3; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,అక్టోబరు-28; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఆగష్టు-24; 1వపేజీ.