సాహితీ సోపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కరీంనగర్ జిల్లా ప్రముఖ సాహితీ సంస్థలలో ఇది ఒకటి. బహుభాషావేత్త డా.నలిమెల భాస్కర్, పాత్రికేయ కవి నగునూరి శేఖర్, కవి అన్నవరం దేవేందర్‌ , గాయకులు గాజోజు నాగభూషణం, అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్ల వేంకటేశ్వర్లు, కట్టెపల్క కవి కందుకూరి అంజయ్యలు సాహితీ సోపతిని స్థాపించారు. వీరు ప్రధాన బాధ్యులుగా వ్యవహరిస్తుండగా, జూకంటి జగన్నాధం, పి.ఎస్. రవీంద్ర, మల్లోజుల నారాయణ శర్మ, కూకట్ల తిరుపతి, విలాసాగరం రవీందర్, సి.వి.కుమార్, పెనుగొండ బసవేశ్వర్, తప్పెట ఓదయ్య, మమత వేణు, పెనుగొండ సరసిజ, సదాశ్రీ, డా.వాసాల వర ప్రసాద్ తదితరులు సమన్వయ కర్తలుగా కొనసాగుతున్నారు. ఈ సంస్థకు కార్యవర్గము ఉండదు. సభ్యులందరూ సమానమే. సభ్యుల అభిప్రాయం మేరకు నిర్ణయాలుంటాయి. ఒక్కరున్నా.. అందరుగా భావించడం, అందరూ ఒక్కటిగా పని చేయడంతో విజయవంతంగా కార్యమాలు నిర్వహిస్తున్నారు.[1]

ఆవిర్భావం[మార్చు]

తెలంగాణ భాషా, సాహిత్య, చరిత్ర, సంస్కృతుల పునర్వికాసమే ధ్యేయంగా పురుడు పోసుకున్నది. 2010లో ఆవిర్భవించిన ఈ సంస్థ వల్లుబండ అనే తెలంగాణ ఉద్యమ కవిత్వ సంకలనాన్ని కరీంనగర్ కవుల భాగస్వామ్యంచే వెలువరించింది. ఫిబ్రవరి 2015లో ఐదేళ్ల సంబరాలు నిర్వహించుకుంది. ఇందులో రవ్వశ్రీహరి లాంటి ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొనడం విశేషం. దళిత, బహుజన, స్త్రీ, మైనారిటీ వాదాలు భూమికగా సంస్థ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఉద్దేశం[మార్చు]

కొత్త కలాలకు ఊతమివ్వడం. పుస్తక ప్రచురణలను చేపట్టడం. సాహితీ సదస్సులను జరుపడం. ఆత్మగౌరవం, అస్తిత్వవాద సాహిత్యాన్ని ప్రోత్సహించడం. మే 15,16, 2015 లో కొత్త కాలాల కోసం కవిత్వ కార్యశాలను పాల్కురికి సోమన ప్రాంగణం, కరీంనగర్ లో నిర్వహిండం జరిగింది. శిక్షకులుగా డా. కాశీం, డా. కోయి కోటేశ్వర్ రావు, డా. పెన్నా శివ రామ కృష్ణ, డా, తులసీరాం, కవి యాకూబ్, శిలాలోలిత మొదలగు లబ్ధ ప్రతిష్టులు వ్యవహరించారు.


ప్రచురణలు[మార్చు]

 1. వల్లుబండ తెలంగాణ, ఉద్యమ కవిత్వం-2010.
 2. అస్తిత్వ పుష్పాలు నానీలు ఎం.నారాయణ శర్మ -2011.
 3. పొద్దు పొడుపు, కవిత్వం, అన్నవరం దేవేందర్ -2011.
 4. కరీంనగర్ ఖాన్ దాన్, ప్రాచీన చారిత్రక వ్యాసాలు-2012.
 5. కరీంనగర్ కవిత-2011, .కరీంనగర్ జిల్లా కవుల ఉద్యమ కవిత్వం -2012.
 6. పెన్ కౌంటర్, పాత్రికేయ కవితా సంపుటి, నగునూరి శేఖర్
 7. కట్టె పలక, కవిత్వం, కందుకూరి అంజయ్య -2013.
 8. కరీంనగర్ కవిత -2012, కరీంనగర్ జిల్లా కవుల సంకలనం - 2013.
 9. ఆకలి కథలు, పెరుక రాజు -2013.
 10. అంతర, కవిత్వం, రామా చంద్రమౌళి -2013.
 11. వస్త్ర గాలం, అన్నవరం దేవేందర్ కవిత్వంపై వివేచన వ్యాసాలు-2013.
 12. నవనీతం, డాక్టర్ నలిమెల భాస్కర్ కవిత్వంపై విశ్లేషణ వ్యాసాలు -2013.
 13. పెద్ద కచ్చురం కవిత్వం, బూర్ల వేంకటేశ్వర్లు -2013.
 14. జీవన నానీలు, బండారి అంకయ్య -2013.-
 15. ఊరవిశ్కల పోరు కథలు, వీరగోని పెంటయ్య -2014.
 16. పొక్కిలి వాకిళ్ల పులకరింత, కవిత్వం, బూర్ల వేంకటేశ్వర్లు 2014
 17. వాన చినుకులు కవిత్వం, కొత్త అనిల్ కుమార్ -2014.'
 18. మూడడుగుల యుద్ధం, కవిత్వం, మచ్చ ప్రభాకర్ -2015.
 19. బాయిగిర్క మీది ఊరవిశ్క కవిత్వం, బూర్ల వేంకటేశ్వర్లు -2015
 20. ఎర్రగాలు కవిత్వం, కూకట్ల తిరుపతి -2015.
 21. ఆరుద్ర పురుగు, కవిత్వం, కూకట్ల తిరుపతి -2015.
 22. మొగ్గపూసలు కవిత్వం, తప్పెట ఓదయ్య -2016.
 23. నది పలికిన వాక్యం, కవిత్వం, విలాసాగరం రవీందర్ -2016
 24. బువ్వ కుండ, దీర్ఘ కవిత్వం, అన్నవరం దేవేందర్ -2016.
 25. మనసు పొరల్లోంచి కవిత్వం, రామానుజం సుజాత-2016.
 26. సొంటి కొమ్ములు, నానీలు, వడ్నాల కిషన్ - 2016.
 27. ఇంటి దీపం, కవిత్వం, అన్నవరం దేవేందర్ - 2016.
 28. రెండు పక్షులూ... ఒక జీవితం, బూర్ల వేంకటేశ్వర్లు - 2017.
 29. సారలమ్మ పదాలు, గేయ కవిత్వం, దామరకుంట శంకరయ్య - 2017.
 30. మల్లె చెట్టు చౌరస్తా, కవిత్వం, మమత వేణు - 2017.
 31. ఒక చినుకు కోసం, కవిత్వం, తోట నిర్మలారాణి - 2017.
 32. జీవన ప్రయాణం, కవిత్వం, మెరుగు ప్రవీణ్ - 2017.
 33. తెలంగాణ భాష దేశ్యపదాలు, వ్యాసాలు, డా. నలిమెల భాస్కర్ - 2017.
 34. నానీల నిప్కలు, నానీలు, విలాసాగరం రవీందర్ - 2017.
 35. ఆనవాళ్ళు, కవిత్వం, దామరకుంట శంకరయ్య - 2018.
 36. కాలం గీసిన రేఖలు, కవిత్వం, [[మహమ్మద్ నసీరుద్దీన్ - 2018.
 37. నల్లాలమ్ పూలు, పిల్లల కవిత్వం, సంపాదకత్వం కూకట్ల తిరుపతి - 2018.
 38. దూద్ బాయి, నానీలు, కనకం శ్రీనివాస్ - 2018.
 39. సోపతి బులిటెన్, సంపాదకత్వం, 2018.
 40. వరి గొలుసులు, కవిత్వం, అన్నవరం దేవేందర్ - 2018.
 41. గోగిపూలు, కవిత్వం, దరిపల్లి స్వరూప - 2018.
 42. మొలక బియ్యం, కవిత్వం, చెన్నమనేని ప్రేమ్ సాగర్ - 2018,
 43. రెండు తలల పాము, కథలు, వైరాగ్యం ప్రభాకర్ - 2018.
 44. ఆకాశమంత పావురం, కవిత్వం, పెనుగొండ బసవేశ్వర్ - 2018,
 45. కాగితాన్ని ముద్దడిన కల, కవిత్వం, పెనుగొండ సరసిజ - 2018
 46. నడిచి వచ్చిన సూర్యుడు, కవిత్వం, మహమ్మద్ నసీరుద్దీన్ - 2019.
 47. విద్యార్థి కలం, విధ్యార్థుల కవిత్వం - 2019.
 48. తెలంగాణ భాష - సంస్కృత పదాలు, భాషా వ్యాసాలు, డాక్టర్ నలిమెల భాస్కర్
 49. ఎన్నీలముచ్చట్లు1-86. ఎన్నీల కవితాగాన సంకలనాలు 1-40 -2013-2020.
 50. తెలంగాణ భాష తమిళ పదాలు, భాషా వ్యాసాలు, డాక్టర్ నలిమెల భాస్కర్ - 2020.
 51. ఊరి దస్తూరి, కాలమ్స్, అన్నవరం దేవేందర్ - 2020.

ఇతర లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. నవ తెలంగాణ. "సాహితీ సోపతి". Retrieved 3 October 2016.