సాహి రామ్
| సాహి రామ్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2015 | |||
| ముందు | రమేష్ బిధూరి | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | తుగ్లకాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1959 అక్టోబరు 10 ఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | బహుజన్ సమాజ్ పార్టీ | ||
| జీవిత భాగస్వామి | దివంగత బాలేష్ | ||
| సంతానం | 3 కుమారులు | ||
| నివాసం | 321, చూరియా మొహల్లా, తెఖండ్ గ్రామం, న్యూ ఢిల్లీ 110020, భారతదేశం | ||
| పూర్వ విద్యార్థి | గవర్నమెంట్ బాయ్స్ సీనియర్ సెకండరీ స్కూల్, బాదర్పూర్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సాహి రామ్ పెహల్వాన్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు తుగ్లకాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సాహి రామ్ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2007, 2012లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్‌గా ఎన్నికై 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2015 శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విక్రమ్ బిధురిపై 33,701 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
సాహి రామ్ 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విక్రమ్ బిధురిపై 13,757 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంవీర్ సింగ్ బిధూరి చేతిలో ఓడిపోయాడు.[4][5][6]
సాహి రామ్ 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రోహతాష్ కుమార్‌పై 14711 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Tughlakabad Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. the original నుండి 20 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 March 2025.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.
- ↑ Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 15 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
- ↑ "AAP fields Delhi MLAs from LS seats, no repeat of 2019 names: Ex-minister to Sisodia aide to Gujjar face" (in ఇంగ్లీష్). The Indian Express. 8 April 2024. the original నుండి 20 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 March 2025.
- ↑ "South Delhi lok sabha election results 2024" (in ఇంగ్లీష్). India Today. 4 June 2024. the original నుండి 20 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 March 2025.
- ↑ "2024 Loksabha Elections Results - South Delhi" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. the original నుండి 20 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 March 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Tughlakabad" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. the original నుండి 20 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 March 2025.
- ↑ "Tughlakabad Assembly Seat 2025: AAP's Incumbent MLA Sahi Ram Wins" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 February 2025. the original నుండి 20 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 March 2025.