సింగర కొండ

వికీపీడియా నుండి
(సింగరకొండ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సింగర కొండ ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలంలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రఖ్యాతి గాంచినవి. అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో, 670 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనాసి చెరువు వొడ్డున ఉంది.

మొదట్లో సింగన కొండ అని పిలవబడ్డ నరసింహ క్షేత్రం, అయిననూ ఆంజనేయ స్వామి క్షేత్రం గానే ప్రఖ్యాతి గాంచెను. ఆలయంలో కల గరుడ స్తంభంపై గల శాసనం ప్రకారం ఈ ఆలయ పొషకుడుగా 14 వ శతాబ్దంలో దేవరాయలు అనే రాజు కలడు.

స్థల పురాణము[మార్చు]

సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపధం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని ఒక నమ్మకం. అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతారు. అద్దంకి తాతాచార్యులు అని గొప్ప భక్తుడు సింగర కొండలో కొండపై గల నరసింహ స్వామి గుడియంది ధ్వజారొహణ చేయుచుండగా, కొండ క్రింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహమునకు హారతి ఇచ్చుచూ కనబడెను. పరుగు పరుగున క్రిందకు వెళ్ళిన తాతాచార్యుల వారికి పురుషుడు మాయమై, దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది.

పూజలు[మార్చు]

సింగర కొండలో ప్రతి మంగళ వారం, శని వారం విశేష పూజలు జరుగును. అటులనే, ముఖ్య పండుగలు అయిన ఉగాది, శ్రీరామ నవమి, హనుమ జ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, బ్రహ్మోత్సవాల తిరునాల్లు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజుల యందు లక్షల కొద్దీ భక్తులు వచ్చి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీశ్శులు పొందెదరు. స్వామివారి 59వ వార్షిక తిరునాళ్ళు, 14, మార్చి-2014 నుండి ప్రారంభమగును. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష తమలపాకుల పూజ, కోటి తమలపాకుల పూజ చూడుటకు రెండు కళ్ళూ చాలవు.

నిత్యాన్నదాన పథకం[మార్చు]

స్వామివారిని దర్శించుకొనడానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాట్లు, 2001-మేనెలలో, 17వతేదీ నాడు, హనుమజ్జయంతి సందర్భంగా మొదలు పెట్టినారు. ప్రతి మంగళవారం, శనివారం 150 మంది భక్తులకు, మిగతా రోజులలో 50 మంది భక్తులకు, అన్నప్రసాదవితరణ జరుగుచున్నది. [2]

మార్గము[మార్చు]

  • దగ్గరలో కల రైల్వే స్టేషను ఒంగోలు. బస్సు స్టాండు అద్దంకి.
  • ఒంగోలు నుంచి: బస్సు ప్రయాణీకులు అద్దంకి వెల్లు బస్సు ఎక్కవలెను. అద్దంకి నుంచి సింగర కొండకు ప్రతి 30 నిముషములకి బస్సులు ఉన్నాయి. కారు ద్వారా వెళ్ళు యాత్రీకులు అద్దంకి నుంచి సింగర కొండ మార్గంలో వెళ్లవలెను.

సమీప దర్శనీయ ఆలయాలు[మార్చు]

  1. అయ్యప్పస్వామివారి ఆలయం
  2. షిర్డీ సాయిబాబావారి ఆలయం
  3. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం
  4. శ్రీ గాయత్రీమాత ఆలయం
  5. కొండపైనెలకొనియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం
  6. శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం:- శింగరకొండ సమీపంలోని అయ్యప్ప ఆలయం వద్ద, నార్కేటుపల్లి రాష్ట్రీయ రహదారికి దగ్గరిలో, కె.ఆర్.కె.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా, రెండున్నర సంవత్సరాల క్రితం, రు. 3 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన, 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామి విగ్రహం నిర్మాణం పూర్తి అయినది. 2014, మే నెల, 19న విగ్రహావిష్కరణ చేసారు. ఇక్కడ 18 నుండి 23 వరకు హనుమజ్జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ 30,000 మందికి అన్నదానం నిర్వహించారు. [1]&[2]
  7. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి చతుర్ధ వార్షికోత్సవ పట్టాభిషేకం, 2015, ఆగస్టు-21వతేదీ శుక్రవారంనాడు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో ఆరోజున ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు సుప్రభాతం, 10 గంటలకు పట్టభిషేకం నిర్వహించెదరు. మహానైవేద్యం, మంగళహారతి, అన్నప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలను గూడా ఏర్పాటు చేసారు. [3]

ఎస్.కె.జె.జె.ఎస్.ఎస్.వృద్ధుల ఆశ్రమం[మార్చు]

ఈ ఆశ్రమం కొండపై నృసింహస్వామివారి ఆలయానికి వెళ్ళే మెట్ల దారిలో ఉంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014, మార్చి-5; 7వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, మే-20; 16వపేజీ. [3] నాడు ప్రకాశం/అద్దంకి; 2015, ఆగస్టు-21; 3వపేజీ.