సింగాపూర్ (నస్పూర్)
సింగాపూర్ | |
---|---|
Coordinates: 18°51′50″N 79°29′31″E / 18.86391°N 79.49183°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల జిల్లా |
• Rank | 11.42 |
Elevation | 576 మీ (1,890 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 20,061 |
భాష | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 504302 |
Vehicle registration | టిఎస్ |
సింగాపూర్, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్ మండలం లోకి చేర్చారు.[2] ఈ పట్టణం నస్పూర్ పురపాలక సంఘంలో భాగంగా ఉంది.[1]
భౌగోళికం
[మార్చు]సింగపూర్ పట్టణం 18°51′50″N 79°29′31″E / 18.86391°N 79.49183°E అక్షాంశరేఖాంశాల మధ్యలో ఉంది.[3]
సమీప ప్రాంతాలు
[మార్చు]రామారావుపేట (1 కి.మీ.), సీతారాంపల్లి (3 కి.మీ.), ఇందారం (3 కి.మీ.), శ్రీరాంపూర్ (4 కి.మీ.), నస్పూర్ (4 కి.మీ.) మొదలైన గ్రామాలు సింగపూర్‌కు సమీపంలో ఉన్నాయి.[4]
జనాభా గణాంకాలు
[మార్చు]2001 నాటికి భారతదేశ జనాభా లెక్కల ప్రకారం,[5] సింగాపూర్ పట్టణంలో 23,458 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 51% మంది కాగా, స్త్రీలు 49% మంది ఉన్నారు. సింగాపూర్ సగటు అక్షరాస్యత రేటు 55% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 62% కాగా, స్త్రీల అక్షరాస్యత 48%గా ఉంది. సింగపూర్‌లోని జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగలవారు ఉన్నారు.
రవాణా
[మార్చు]ఇక్కడికి సమీపంలోని మంచిర్యాల, రవీంద్రఖని, పెద్దంపేట్ ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మంచిర్యాల నుండి తాళ్ళపల్లికి రోడ్డు కనెక్టివిటీ ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 13, 30. Retrieved 10 June 2016.
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Singapur Pin Code, Singapur , Adilabad Map , Latitude and Longitude , Andhra Pradesh". indiamapia.com. Retrieved 2021-10-28.
- ↑ "Singapur Village , Mancherial Mandal , Adilabad District". www.onefivenine.com. Retrieved 2021-10-28.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.