సింగ్రౌలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింగ్రౌలి

ఊర్జాంచల్ / ఊర్జాధాని
పట్టణం
ముద్దుపేరు(ర్లు): 
భారత శక్తి క్షేత్రం
సింగ్రౌలి is located in Madhya Pradesh
సింగ్రౌలి
సింగ్రౌలి
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
నిర్దేశాంకాలు: 24°12′07″N 82°39′58″E / 24.202°N 82.666°E / 24.202; 82.666Coordinates: 24°12′07″N 82°39′58″E / 24.202°N 82.666°E / 24.202; 82.666
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాసింగ్రౌలి
డివిజనురీవా
విస్తీర్ణం
 • మొత్తం2,200 కి.మీ2 (800 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం226,786
భాషలు
 • అధికారికహిందీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
486886
టెలిఫోన్ కీడ్07805
వాహనాల నమోదు కోడ్MP-66
జాలస్థలిwww.singrauli.nic.in

సింగ్రౌలి మధ్యప్రదేశ్ రాష్ట్రం, సింగ్రౌలి జిల్లా లోని పట్టణం. వైధన్, సింగ్రౌలి జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్తణం రీవా కమిషనరేటు పరిషి లోకి వస్తుంది.

జనాభా వివరాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం సింగ్రౌలి జనాభాలో 19.25% మంది జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 2,26,786 మంది నివసిస్తూండగా, ఇందులో పురుషులు 1,20,313 మంది, స్త్రీలు 1,06,473 మంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సింగ్రౌలి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 885/1000

రవాణా[మార్చు]

సింగ్రౌలి-మోర్వా రైల్వే స్టేషన్ నుండి సింగ్రౌలి పట్టణం సుమారు 30  కి.మీ. దూరంలో ఉంది. ఈ స్టేషన్నుండి ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, జబల్పూర్, భోపాల్, లక్నో, వారణాసి, పాట్నా, జంషెడ్‌పూర్, ఝాన్సీ, ఉజ్జయిని, ప్రయాగ్రాజ్, మీర్జాపూర్, కట్ని, బరేలీ వంటి ప్రధాన నగరాలకు రైళ్ళున్నాయి.. అయితే, సింగ్రౌలికి రోడ్డు సౌకర్యం ఒక సమస్యగానే ఉంది. జాతీయ రహదారిపై ఉన్నప్పటికీ, రోడ్డు ద్వారా సింగ్రౌలికి రావడం కష్టం. సింగ్రౌలీకి వెళ్ళేందుకు ప్రజలు రైళ్లను ఉపయోగించటానికే ఎక్కువ ఇష్టపడతారు.

పరిశ్రమలు[మార్చు]

సింగ్రౌలిలో పనిచేస్తున్న ప్రధాన సంస్థలు దాదాపుగా అన్నీ ఇంధన పరిశ్రమకు చెందినవే. కంపెనీల కార్యకలాపాలలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తికి, బొగ్గు తవ్వకానికీ సంబంధించినవే. ఈమధ్య కాలంలో, అనేక ప్రైవేటు సంస్థలు సింగ్రౌలిలో పనులు మొదలుపెట్టాయి. 2017 నాటికి ఒక్క సింగ్రౌలి మాత్రమే భారత విద్యుత్తు గ్రిడ్‌కు 21,270 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని అందిస్తోంది.[1]

సింగ్రౌలిలో పనిచేస్తున్న లేదా రాబోయే ప్రధాన కంపెనీలు:

1. ఎన్‌టిపిసి లిమిటెడ్ (9,760 మెగావాట్ల సంయుక్త ఉత్పాదక సామర్థ్యంతో 3 విద్యుత్కేంద్రాలు)

2. అన్‌పారా తాప విద్యుత్కేంద్రం (2,630 మెగావాట్ల సామర్థ్యం)

2. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ నార్తరన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 8 కోట్ల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో)

3. రిలయన్స్ పవర్ లిమిటెడ్ (3,960 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం)

4. ఎస్సార్ పవర్ లిమిటెడ్ (1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం)

5. డిబి పవర్ లిమిటెడ్ (1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం)

కాలుష్యం[మార్చు]

సింగ్రౌలి ప్రాంతం సంకటస్థాయిలో కలుషితమైన ప్రాంతంగా (సిపిఎ) కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న బొగ్గు త్రవ్వకం కార్యకలాపాలు, బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాల వేగవంతమైన అభివృద్ధి ఫలితంగా తీవ్రమైన గాలి కాలుష్యం, నీటి కాలుష్యం ఏర్పడ్డాయి. ఇవి ఈ ప్రాంత వాసులలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసాయి. వీటిని ప్రభుత్వాలు గట్టిగా పట్టించుకోలేదు. [2] ఇంకా మరెన్నో విద్యుత్ కంపెనీలు రానుండడంతో సమస్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్లు న్యూరోటాక్సిన్ అనే పాదరసాన్ని విడుదల చేసి గాలిని నీటినీ విషపూరితం చేస్తున్నాయి. బొగ్గు యొక్క సహజమైన, బహుశా చాలా హానికరమైన అంగాలలో పాదరసం ఒకటి. 1,100 °C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బొగ్గు మండే సమయంలో, ఇది ఆవిరైపోతుంది. థర్మల్ ప్లాంట్లలో పెద్ద మొత్తంలో బొగ్గును కాల్చినప్పుడు, గణనీయమైన పాదరసం వాతావరణంలోకి విడుదల అవుతుంది. బాయిలర్ గుండాను, వాయు కాలుష్య నియంత్రణ వ్యవస్థ గుండానూ వెళుతున్నప్పుడు అవి కొంత చల్లబడి, నేల ద్వారా, నీటి ద్వారా పర్యావరణంలోకి ప్రవేశిస్తాయి. బొగ్గు గనుల నుండి వెలువడే నీటి ద్వారా కూడా ఇది పర్యావరణంలోకి ప్రవేశిస్తుంది.

మానవులలో పాదరసం అనేక దీర్ఘకాలిక వ్యాధులకు, మరణానికీ కారణమవుతుంది. 1998 లో లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రధాన ప్రభుత్వ శాస్త్రీయ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (ఐఐటిఆర్), సింగ్రౌలి ప్రాంతం నుండి 1,200 మందికి పైగా ప్రజలను పాదరసం విషం కోసం పరీక్షించింది. మానవులలోను, పర్యావరణంలోనూ అధిక స్థాయిలో పాదరసం ఉందని ఇందులో తేలింది. [3] కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సింగ్రౌలి నుండి తీసిన 11 బొగ్గు నమూనాలను విశ్లేషించింది. బొగ్గులో పాదరసం సాంద్రత మిలియన్‌కు 0.09 భాగాలు (పిపిఎం) - 0.487 పిపిఎంల మధ్య ఉన్నట్లు కనుగొన్నారు. 2011 లో ఢిల్లీకి చెందిన లాభాపేక్షలేని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ సోన్భద్రలోని అన్పారా గ్రామంలో బొగ్గులో 0.15 పిపిఎమ్ పాదరసం ఉన్నట్లు కనుగొంది. 1,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రం, సింగ్రౌలిలో ఏటా కనీసం 500 కిలోల పాదరసాన్ని విడుదల చేస్తుందని అంచనా వేసారు. సింగ్రౌలి భారతదేశంలో కెల్లా అతిపెద్ద స్థాయిలో సల్ఫర్ డయాక్సైడు వాయువును విడుదల చేస్తుంది. గ్రీన్‌పీస్ నివేదిక ప్రకారం ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద SO2 వాయువును విడుదల చేసే ప్రదేశం. [4]

మూలాలు[మార్చు]

  1. "Power plants in Singrauli-Sonebhadra region fail to manage ash: Analysis". www.downtoearth.org.in (in ఇంగ్లీష్). Retrieved 2021-01-08.
  2. [1], Down to earth.
  3. [2], Down to earth.
  4. https://www.greenpeace.org/india/en/press/3489/india-release_latest-air-pollution-data-ranks-worlds-cities-worst-to-best/