సిందూరం (1997 సినిమా)
స్వరూపం
| సింధూరం (1997 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కృష్ణ వంశీ |
| తారాగణం | బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి |
| సంగీతం | శ్రీ |
| నిర్మాణ సంస్థ | ఆంధ్రా టాకీస్ |
| భాష | తెలుగు |
సింధూరం 1997 లో కృష్ణవంశీ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో వచ్చిన చిత్రం. ఇందులో రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి ముఖ్యపాత్రలు పోషించారు.
తారాగణం
[మార్చు]- చంటి గా రవితేజ
- బుల్లిరాజు గా బ్రహ్మాజీ
- బేబీ గా సంఘవి
- గోపాల్ రెడ్డి గా నరసింహ రాజు, మాజీ నక్సలైట్ లీడర్
- ట్రైనింగ్ ఆఫీసర్ గా భానుచందర్
- మంత్రి గా చలపతి రావు
- బైరాగి గా పరుచూరి వెంకటేశ్వరరావు
- నక్సలైట్ గా పృథ్వీ రాజ్
- పోలీస్ కానిస్టేబుల్ గా శివాజీ రాజా
- చంద్ర గా సూర్య, నక్సలైట్
- బుల్లిరాజు తల్లిగా అన్నపూర్ణ
- రాజబాబు
- నక్సలైట్ గాఅచ్యుత రామారావు
- ఆహుతి ప్రసాద్
- బండ్ల గణేష్ .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కృష్ణవంశీ
- కథ, చిత్రానువాదం: కృష్ణవంశీ
- సంగీతం: శ్రీ
- సంభాషణలు: కె.ఎన్.వై.పతంజలి
- గీత రచయితలు: సిరివెన్నెల (చెంబోలు )సీతారామశాస్త్రి, చంద్రబోస్
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కృష్ణంరాజు, శ్రీ, మాధవపెద్ది సత్యం, మలేషియా వాసుదేవన్, సురేష్ పీటర్స్, ప్రదీప్, మోహన్ దాస్ , శ్రీనివాస చక్రవర్తి, కె.ఎస్.చిత్ర
- ఛాయా గ్రహణం: ఎస్.కె.ఎ.భూపతి
- కూర్పు: శంకర్
- నిర్మాత: ముళ్ళపూడి మోహన్
- నిర్మాణ సంస్థ: ఆంధ్రా టాకీస్
- విడుదల:12:09:1997.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించాడు.[1]
- అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా - రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- ఏడు మల్లెలెత్తు సుకుమారికి - రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి;గానం : కృష్ణంరాజు, ప్రదీప్, మాధవపెద్ది సత్యం
- హై రే హై - రచన: చంద్రబోస్; గానం : శ్రీ
- ఓ చెలీ అనార్కలి - రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి; గానం : సురేష్ పీటర్స్
- ఓ లేలె - రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి; గానం : మలేసియా వాసుదేవన్, మోహన్ దాస్, శ్రీనివాస్ చక్రవర్తి
- ఊరికే ఉండదే -రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం : కె. ఎస్. చిత్ర
అవార్డులు
[మార్చు]- ఈ చిత్రంలోని అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా (పాట) కి ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి నంది పురస్కారం లభించింది.[2]
- ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజిత నంది అవార్డు కు ఎంపిక.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. the original నుండి 2 August 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 August 2020.
- ↑ హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (24 November 2018). "ప్రజాస్వామ్య పండుగ, కొన్ని ప్రశ్నల పండగా..వచ్చిన పాట". the original నుండి 22 December 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2020.
