సింహగిరి వచనములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింహగిరి వచనములు (పుస్తకం)

సింహగిరి వచనములు లేదా సింహగిరి నరహరి వచనములు కృష్ణమాచార్యులు రచించిన వచన రచనములు. ఇవి సింహగిరి అనగా సింహాచలంలోని వరాహ నారసింహస్వామి గురించి విశేష గుణగణాలని కీర్తిస్తూంటాయి.

ఇందులోని ప్రతి వచనం ‘దేవా!’ అనే సంబోధనతో మొదలై ‘సింహగిరి నరహరి నమోనమో దయానిధీ’ అనే మకుటంతో ముగుస్తుంది. రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు. కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు.

శ్రీకాంత కృష్ణమాచారి 13వ శతాబ్దానికి చెందిన వాగ్గేయకారుడు. వీరిగురించి మొట్టమొదటిసారిగా నిడుదవోలు వేంకటరావు పేర్కొన్నారు. ఆరుద్ర తన సమగ్ర ఆంధ్రసాహిత్య చరిత్ర పద్మనాయక యుగ సంపుటంలో క్లుప్తంగా ప్రస్తావించారు. అగ్రరచయితల సంఘం తరపున డా. కులశేఖరరావు గారు సింహగిరి వచనములను సేకరించి మొదటిసారిగా ప్రచురించారు. వీరందరు కృష్ణమాచార్యులను "తొలి తెలుగు వచన కవి"గా గుర్తించారు (అన్నమాచార్యుల కంటే ముందుగానే).

ఈ సింహగిరి నరహరి వచనములను బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంగా భక్తి రంజని కార్యక్రమంలో గానంచేశారు.[1]

ఈ సింహగిరి వచనములను సింహాచలం దేవస్థానం 1988 సంవత్సరం ముద్రించింది.[2]

మూలాలు[మార్చు]

  1. బాలాంత్రపు రజనీకాంతరావు. "భక్తి రంజని". www.youtube.com. ఆకాశవాణి. Retrieved 14 January 2021.
  2. కృష్ణమాచార్యులు (1988). సింహగిరి వచనములు. విశాఖపట్నం: శ్రీ సింహాచల దేవస్థానము. Retrieved 14 January 2021.