సిక్కు గురువులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Sikhi

1700 ప్రారంభ నాటి పది సిక్కు గురువుల వర్ణన

గురునానక్‌ (గురుముఖి: ਗੁਰੂ ਨਾਨਕ) (1469 ఏప్రిల్ 15 - సోమవారం 1539 సెప్టెంబరు 22) సిక్కు మత స్థాపకుడు మరియు సిక్కుల పదిమంది గురువులలో మొదటివాడు. ఆయన తల్వండి అనే గ్రామంలో జన్మించారు. దీనినే రాయ్‌భోయ్‌కి తల్వాండి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు నన్కానా సాహిబ్ అని పిలుస్తున్నారు. ఇది ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌కు సమీపంలో ఉంది. పురాతన సిక్కు ఆధారాల ప్రకారం 1469లో బైశాఖ మాసం (ఏప్రిల్‌-మే) లో మూడోరోజున తెల్లవారుజామున గురునానక్‌ జన్మించారు. దీనిని 1469 ఏప్రిల్‌ 15, శనివారంగా నమ్ముతారు. ఏదేమైనా సిక్కులు మాత్రం ఈ ఆనందకరమైన కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం నవంబరు 24న జరుపుకుంటారు.

గురునానక్‌ దేవ్‌జీ 1539 వరకు జీవించారు. ఆ సమయంలో ఆయన పేరు భారతదేశం నలుమూలలా వ్యాపించింది. అరేబియా, మొసపటోమియా (ఇరాక్‌), సిలోన్‌ (శ్రీలంక), ఆప్ఘనిస్తాన్‌, టర్కీ, బర్మా, టిబెట్ ప్రాంతాల్లోనూ ఆయన పేరు ప్రఖ్యాతలు వ్యాపించాయి. ఆయన జన్మదినోత్సవం లూనార్‌తో సంబంధం కలిగి ఉంటుంది. నవంబరులో వచ్చే పౌర్ణమినాడు ఈ వేడుకను జరుపుకుంటారు. 2005లో నవంబరు 15న దీనిని జరుపుకున్నారు. 2006లో 2007 నవంబరు 5లో 2008 నవంబరు 24లో 2009 నవంబరు 13లో 2010 నవంబరు 2లో నవంబరు 21న జరుపుకుంటారు. 2011లో 2012 నవంబరు 10లో 2013 నవంబరు 28లో 2014 నవంబరు 17లో 2015 నవంబరు 6లో 2016 నవంబరు 25లో 2017 నవంబరు 14లో 2018 నవంబరు 4లో 2019 నవంబరు 23లో 2020 నవంబరు 12లో నవంబరు 30న దీనిని జరుపుతారు.

సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్‌లో పవిత్ర వాక్యాలు రాసిన వాళ్లంతా "నానక్‌" అన్న పేరునే ఉపయోగించారు. సిక్కుల రెండో గురువు, గురు అంగద్‌ జీని కూడా "సెకండ్‌ నానక్‌" లేదా "నానక్‌ II" అని పిలుస్తారు. గురునానక్‌ ఉపదేశించిన సందేశాన్నే తరువాతి గురువులంతా ప్రచారం చేశారని సిక్కులు నమ్ముతారు. అందుకే వాళ్ల సొంత పేర్లకు బదులుగా పవిత్ర వాక్యాల్లో నానక్ అన్న పేరునే ఉపయోగించారు. వాళ్లందరినీ లైట్ ఆఫ్ నానక్‌గానే భావిస్తారు.

1469 నుంచి 1708 మధ్యకాలంలో గురునానక్ మరియు ఇతర తొమ్మిది మంది సిక్కు గురువులు సిక్కు మతాన్ని ఏర్పాటు చేశారు. గురునానక్‌ మొదటి గురువు. మరియు గురు గోవింద సింగ్పదవ (ఆఖరి) గురువు. గురుగోవింద సింగ్ తాను చనిపోవడానికి ముందు, సిక్కుల పవిత్రగ్రంథం గురు గ్రంథ సాహిబ్‌ను సిక్కుమతానికి ఆఖరి గురువుగా ప్రకటించారు. సిక్కులంతా తమ గురువుల యొక్క బోధనలను అనుసరించాల్సిన అవసరముంది, ఆ తరువాత చేసే ధ్యానం ముక్తికి దారి తీస్తుంది.

అర్థం[మార్చు]

ది షిరోమని గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ వెబ్‌సైట్ స్టేట్స్‌:

Sikhism has a very specific definition of the word 'Guru'. It means the descent of divine guidance to mankind provided through ten Enlightened Masters. This honour of being called a Sikh Guru applies only to the ten Gurus who founded the religion starting with Guru Nanak in 1469 and ending with Guru Gobind Singh in 1708; thereafter it refers to the Sikh Holy Scriptures the Guru Granth Sahib.[1]

సిక్కు గురువుల జాబితా[1][మార్చు]

# పేరు పుట్టిన తేదీ గురువుగా స్వీకారం స్వర్గస్థులైన తేదీ వయస్సు
1 గురునానక్ 15 ఏప్రిల్ 1469 20 ఆగష్టు 1507 22 సెప్టెంబర్ 1539 69
2 గురు అంగద్ 31 మార్చి 1504 7 సెప్టెంబర్ 1539 29 మార్చి 1552 48
3 గురు అమర్ దాస్ 5 మే 1479 26 మార్చి 1552 1 సెప్టెంబర్ 1574 95
4 గురు రామదాస్ 24 సెప్టెంబర్ 1534 1 సెప్టెంబర్ 1574 1 సెప్టెంబర్ 1581 46
5 గురు అర్జన్ 15 ఏప్రిల్ 1563 1 సెప్టెంబర్ 1581 30 మే 1606 43
6 గురు హరగోవింద్ 19 జూన్ 1595 25 మే 1606 28 ఫిబ్రవరి 1644 48
7 గురు హరరాయ్ 16 జనవరి 1630 3 మార్చి 1644 6 అక్టోబర్ 1661 31
8 గురు హరక్రిష్ణ 7 జులై 1656 6 అక్టోబర్ 1661 30 మార్చి 1664 7
9 గురు టెగ్ బహాదూర్ 1 ఏప్రిల్ 1621 20 మార్చి 1665 11 నవంబర్ 1675 54
10 గురు గోవింద సింగ్ 22 డిసెంబర్ 1666 11 నవంబర్ 1675 7 అక్టోబర్ 1708 41
11 గురు గ్రంధ సాహిబ్ తెలియదు 7 అక్టోబర్ 1708 తెలియదు తెలియదు

వీటిని కూడా చూడండి[మార్చు]

  • సిక్కు తత్వ చరిత్ర

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 Shiromani Gurdwara Prabandhak Committee. "Ten Gurus"

మూస:Sikhism