సిద్ధం లిపి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్ధం
𑖭𑖰𑖟𑖿𑖠𑖽
సిద్ధం లిపిలో "సిద్ధం" అనే పదం
Languagesసంస్కృతం
Time periodసా.శ. 600- 1200 భారతదేశం, ప్రస్తుతం తూర్పు ఆసియా
Note: This page may contain IPA phonetic symbols.

సిద్ధం లిపి [𑖭𑖰𑖟𑖿𑖠𑖽] సా.శ. 600 - 1200 మధ్యలో సంస్కృత రచనలకు వాడబడిన లిపి. ఇది బ్రాహ్మీ లిపి కుటుంబంలోని గుప్త లిపి నుండి ఉద్భవించింది. గుప్తుల కాలంనాటిని లిపిని అభివృద్ధి పరచగా, ఇది ఏర్పడిందని భావిస్తున్నారు. బెంగాలీ లిపి, అస్సామీయ లిపి, టిబెట్ లిపులు ఈ లిపినుండి ఉద్భవించాయి.

చరిత్ర[మార్చు]

ప్రజ్ఞాపారమితా హృదయం (హృదయ సూత్రం) యొక్క సిద్ధం ప్రతి. ఫ్రాన్స్ జాతీయ గ్రంథాలయం
సా.శ. 609 నాటి ప్రజ్ఞాపారమితా హృదయం, ఉష్ణీష విజయ ధారణీ సూత్రం, సిద్ధం అక్షరాలు.
సా.శ. 927, టాంగ్ సామ్రాజ్యానంతర కాలపు చైనీయ సిద్ధం లిపిలో ప్రతిసార మంత్రం

పట్టు దారి ద్వారా చైనాకు తీసుకుపోబడిన ఎన్నో సంస్కృత గ్రంథాలు సిద్ధం లిపి లోనే వ్రాయబడి ఉన్నాయి. సంస్కృత శబ్దాలకు తగిన అక్షరాలు చైనీయ లిపిలో లేకపోవడం వల్ల సిద్ధం లిపిలోనే వ్రాసేవారు. అందువల్ల సిద్ధం లిపి తూర్పు ఆసియాలో నిలిచి ఉంది. ఇప్పటికీ చైనీయ బౌద్ధులు సిద్ధం లిపిని వాడుతున్నారు.

సా.శ. 806లో కుకాయ్ ఈ లిపిని జపాన్‌కు పరిచయం చేసాడు. అయితే, కుకాయ్, ఇతరులు ఈ లిపిని నేర్చుకొనే సమయానికి పట్టు దారి మహమ్మదీయ సామ్రాజ్యాలవల్ల మూసివేయబడడంతో భారతదేశంతో సంబంధాలు తెగిపోయాయి.

ప్రస్తుతం[మార్చు]

జపానుదేశపు షింగాన్, తెండాయ్ వంటి వజ్రాయన బౌద్ధ పాఠశాలల్లోనూ, షుగెండో వంటి తెగలలోనూ మంత్రాలూ, సూత్రాలూ వ్రాయడానికి సిద్ధం లిపినే వాడుతున్నారు. ఈ అక్షరాలను షిట్టాన్ లేదా బొంజి అని పిలుస్తారు. చైనీయ త్రిపీఠకాల తైషో ప్రతిలో చాలా మంత్రాలకు సిద్ధం అక్షరాలనే వాడుతున్నారు. కొరియా బౌద్ధులు సిద్ధం నుండి కొద్దిగా మారి ఉన్న బీజాక్షరాలను వాడుతున్నారు. జపానులో బొంజి అక్షరాలతోకూడిన నినాదాలు ప్రస్తుత ఫ్యాషన్. అయితే జపనీయ సిద్ధం లిపికీ, పురాతన సిద్ధం లిపికీ చాలా తేడా ఉంది.

అక్షరాలు[మార్చు]

అచ్చులు[మార్చు]

స్వతంత్ర రూపం తెలుగులో తో స్వతంత్ర రూపం తెలుగులో తో
అం అః
స్వతంత్ర రూపం తెలుగులో తో స్వతంత్ర రూపం తెలుగులో తో
ఇతర రూపాలు
అం

హల్లులు[మార్చు]

Stop Approximant Fricative
Tenuis Aspirated Voiced Breathy voiced Nasal
Glottal
Velar
Palatal
Retroflex
Dental
Bilabial
Labiodental
సంయుక్తాక్షరాలు
క్ష ల్లం
ఇతర రూపాలు