సిద్ధికుల్లా చౌధురి
సిద్ధికుల్లా చౌధురి সিদ্দিকুল্লাহ চৌধুরী | |
|---|---|
సిద్ధికుల్లా చౌధురి | |
| కేబినెట్ మంత్రి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం | |
| Assumed office 10 మే 2021 | |
| గవర్నర్ | సి.వి. ఆనంద బోస్ |
| ముఖ్యమంత్రి | మమతా బెనర్జీ |
| శాఖలు |
|
| పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడు | |
| Assumed office 2 మే 2021 | |
| అంతకు ముందు వారు | సైకత్ పంజా |
| నియోజకవర్గం | మోంటేశ్వర్ |
| In office 16 మే 2016 – 2 మే 2021 | |
| అంతకు ముందు వారు | సజాహాన్ చౌధురి |
| తరువాత వారు | అపూర్బ చౌధురి |
| నియోజకవర్గం | మంగళ్‌కోట్ |
| రాష్ట్ర మంత్రి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం | |
| In office 20 మే 2016 – 3 మే 2021 | |
| గవర్నర్ | ఎం. కె. నారాయణన్ డి. వై. పాటిల్ కేశరి నాథ్ త్రిపాఠి జగదీప్ ధన్కర్ |
| ముఖ్యమంత్రి | మమతా బెనర్జీ |
| శాఖలు |
|
| అంతకు ముందు వారు | తపన్ రాయ్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1949 జనవరి 10 |
| రాజకీయ పార్టీ | |
| కళాశాల | దారుల్ ఉలూమ్ దియోబంద్[1] |
| వృత్తి | రాజకీయ నాయకుడు |
సిద్ధికుల్లా చౌధురి (బెంగాలీ: সিদ্দিকুল্লাহ চৌধুরী) భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC) పార్టీ తరఫున మోంటేశ్వర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడు. అలాగే ఆయన జమియత్ ఉలేమా-ఇ-హింద్ పశ్చిమ బెంగాల్ శాఖ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]చౌధురి 1984[2], 1989[3] లోక్‌సభ ఎన్నికల్లో కత్వా నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు.
నందిగ్రామ్ ఉద్యమం సమయంలో చౌధురి రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు.[4][5]
అతను 2014 లోక్‌సభ ఎన్నికల్లో బసిర్‌హాట్ నియోజకవర్గం నుండి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశాడు.[6]
2016 జనవరిలో, 2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు కోసం తన జమియత్ ఉలేమా-ఇ-హింద్ పార్టీ ఎన్నికల కూటమిలో చేరే అవకాశాన్ని చౌధురి సూచించాడు.[7]
2016 మార్చిలో, చౌధురి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మంగళ్‌కోట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ప్రకటించారు.[1]
ఆ ఎన్నికల్లో ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అభ్యర్థి సహజహాన్ చౌధురిని దాదాపు పన్నెండు వేల ఓట్ల తేడాతో ఓడించాడు.[8][9]
తర్వాత ఆయనకు సామూహిక విద్య, గ్రంథాలయాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలతో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.[10]
విమర్శలు
[మార్చు]వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించినందుకు చౌధురిపై విమర్శలు వచ్చాయి. ఆందోళనల సమయంలో హింసకు ప్రేరేపించారని ఆరోపణలు వచ్చాయి.[11]
అభిప్రాయాలు
[మార్చు]భారతీయ ముస్లింలపై
[మార్చు]చౌధురి అభిప్రాయం ప్రకారం, ముస్లింలు దేశభక్తిని ఇతర పౌరుల నుంచి లేదా ప్రభుత్వంనుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.[12]
ట్రిపుల్ తలాక్
[మార్చు]2017లో భారత సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధించిన తర్వాత, చౌధురి ఆ తీర్పును విమర్శించాడు. ఆయన ప్రకారం ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో అంతర్భాగమని పేర్కొన్నాడు.[13]
వివాదాలు
[మార్చు]2017లో భారత ప్రభుత్వం ఎర్ర బీకన్ లైట్ల వినియోగాన్ని నిషేధించినప్పటికీ, చౌధురి తన వాహనంపై ఎర్ర బీకన్ ఉపయోగించాడని వార్తలు వచ్చాయి.[14]
ఇవి కూడా చూడండి
[మార్చు]- దియోబందీలు జాబితా
మూలాలు
[మార్చు]- 1 2 "Jamiat Ulema-e-Hind leader fighting on TMC ticket is crorepati". The Deccan Chronicle. Retrieved 5 జూన్ 2017.
- ↑ "General (8th Lok Sabha) Election Results India". Retrieved 14 జూలై 2017.
- ↑ "General (9th Lok Sabha) Election Results India". Retrieved 14 జూలై 2017.
- ↑ "আনন্দবাজার পত্রিকা – রাজ্য". archives.Anandabazar.com. Archived from the original on 2 అక్టోబర్ 2017. Retrieved 1 October 2017.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "মন্ত্রী হচ্ছেন রেজ্জাক-সিদ্দিকুল্লা, দল পাল্টেও মন্দ বরাত উদয়নের – Eisamay". IndiaTimes.com. 27 May 2016. Archived from the original on 2 అక్టోబర్ 2017. Retrieved 1 October 2017.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "AIUDF announces list of 8, Siddiqullah claims Mollah 'ready to cooperate'". Indian Express. 13 మార్చి 2014. Retrieved 6 జూన్ 2017.
- ↑ "Not all have been achieved for minorities, but Mamata Banerjee is a strong force, says Siddiqullah Chowdhury". Indian Express. 21 ఏప్రిల్ 2016. Retrieved 5 జూన్ 2017.
- ↑ "Mangalkot (West Bengal) Election Results 2016". Retrieved 14 జూలై 2017.
- ↑ "LIST: 59 Muslim MLA elected in West Bengal assembly elections". The Siasat Daily. 19 మే 2016. Retrieved 5 జూన్ 2017.
- ↑ "Bengal portfolios: Mamata keeps home, retains Mitra as finance minister". First Post. 27 మే 2016. Retrieved 5 జూన్ 2017.
- ↑ Singh, Moyurie Som & Shiv Sahay (12 ఏప్రిల్ 2025). "Waqf act protests: Three killed in fresh violence reported from West Bengal's Murshidabad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 13 ఏప్రిల్ 2025.
- ↑ ""হিন্দু রাষ্ট্র করার চেষ্টা হলে ভারত টুকরো টুকরো হবে"". Daily Naya Diganta. Archived from the original on 16 ఏప్రిల్ 2016. Retrieved 5 జూన్ 2017.
- ↑ "Supreme Court judges have no right to interfere in Islamic customs: Trinamool minister on triple talaq". India Today. Retrieved 13 సెప్టెంబరు 2017.
- ↑ "India bans use of red beacon lights on cars". BBC News. 20 ఏప్రిల్ 2017. Retrieved 14 జూలై 2017.
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- November 2020 నుండి dmy మూస వాడుచున్న పేజీలు
- October 2018 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- జీవించి ఉన్నవారు
- బెంగాలీ ముస్లింలు
- కొల్‌కతాకు చెందిన రాజకీయ నాయకులు
- పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యులు 2016–2021
- పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ నాయకులు
- పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యులు 2021–2026
- భారతీయ ముస్లింలు
- పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కేబినెట్ మంత్రులు
- దియోబందీలు
- 1949 జననాలు