సిద్ధిపేట జిల్లా
సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[1] సిద్ధిపేట పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.
అక్టోబరు 11, 2016న నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, నిర్జన గ్రామాలు (6)తో కలుపుకుని 381 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
జిల్లాలోని 22 మండలాలలో (పాతవి 17 + కొత్తవి 5) పూర్వపు మెదక్ జిల్లాలోనివి పాతవి 13 మండలాలు, పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచి 3 మండలాలు, పూర్వపు వరంగల్ జిల్లా నుండి ఒక మండలం మొత్తం 17 పాత మండలాలు కాగా, కొత్తగా ఏర్పడిన మండలాలు పూర్వపు మెదక్ జిల్లా గ్రామాల నుండి 4, పూర్వపు కరీంనగర్ జిల్లా గ్రామాల నుండి ఒక కొత్త మండలంతో కలుపుకొని 5 కొత్త మండలాలతో కొత్త జిల్లాగా అవతరించింది.
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 499 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]
జిల్లాలోని రెవిన్యూ మండలాలు[మార్చు]
- పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట 2016 ఈ జిల్లా 22 మండలాలుతో ఏర్పడింది.[1]
- ఆ తరువాత సిద్ధిపేట రెవెన్యూ డివిజను పరిధిలోని, సిద్ధిపేట గామీణ మండలానికి చెందిన నారాయణరావుపేట మండలాన్ని ఐదు రెవెన్యూ గ్రామాలతో ఆ మండలం కొత్తగా ఏర్పడింది.[4]
- సిద్దిపేట గ్రామీణ మండలం *
- సిద్దిపేట పట్టణ మండలం
- నంగునూరు మండలం
- చిన్నకోడూర్ మండలం
- తొగుట మండలం
- దౌలతాబాద్ మండలం
- మిరుదొడ్డి మండలం
- దుబ్బాక మండలం
- చేర్యాల మండలం
- కొమురవెల్లి మంండలం *
- గజ్వేల్ మండలం
- జగ్దేవ్పూర్ మండలం
- కొండపాక మండలం
- ములుగు మండలం
- మర్కూక్ మండలం *
- వర్గల్ మండలం
- రాయపోల్ మండలం *
- హుస్నాబాద్ మండలం
- అక్కన్నపేట మండలం *
- కోహెడ మండలం
- బెజ్జంకి మండలం
- మద్దూరు మండలం
- నారాయణరావుపేట మండలం *
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (5)
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/240.Siddipet-240-pdf[permanent dead link]
- ↑ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF)Department,Dt: 11-10-2016
- ↑ "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2018-09-30.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 28, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019