Jump to content

సిద్ధి కుమారి

వికీపీడియా నుండి
సిద్ధి కుమారి
రాజస్థాన్ శాసనసభ సభ్యురాలు
Assumed office
2008
నియోజకవర్గంబికనీర్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1973-10-06) 1973 అక్టోబర్ 6 (వయసు: 52)
బికనీర్, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ

సిద్ధి కుమారి (జననం 1973 అక్టోబరు 6) రాజస్థాన్ కు చెందిన భారతీయ రాజకీయవేత్త. ఆమె నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. బికనీర్ తూర్పు నియోజకవర్గం నుండి 16వ రాజస్థాన్ శాసనసభకు సభ్యురాలిగా పనిచేస్తున్నది.[1] 2008లో డీలిమిటేషన్ తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఆమె ఎమ్మెల్యేగా పనిచేస్తున్నది. వరుసగా ఆమె 2008, 2013, 2018, 2023 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బికనీర్ తూర్పు నియోజకవర్గం నుండి గెలిచింది.[2][3]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె 1973లో బికనీర్ రాజ కుటుంబంలో జన్మించింది. ఆమె నరేంద్ర సింగ్ బహదూర్ కుమార్తె, బికనీర్ కు చెందిన కర్ణి సింగ్ బహదూరు మనవరాలు. ఆమె ఎంఏ వరకు చదువుకుంది. లాల్‌ఘర్ ప్యాలెస్ మ్యూజియం డైరెక్టర్ గా ఆమె వ్యవహరిస్తోంది.[4]

25 సంవత్సరాల వయస్సులో, ఆమె తన తల్లి, అమ్మమ్మలకు సంబంధించిన వస్తువులను ప్రదర్శించడానికి ఒక మ్యూజియాన్ని స్థాపించింది. ఆమెను బికనీర్ లో ప్రేమగా బాయి సా అని పిలుస్తారు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

సిద్ధి కుమారి 2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ బికనీర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించింది. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన యశ్‌పాల్ గెహ్లాట్ ను 19,303 ఓట్ల తేడాతో ఓడించింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Bikaner East, Rajasthan Assembly Election Results 2023 Highlights: Bikaner East में BJP ने INC कोहराया". आज तक (in హిందీ). Retrieved 2023-12-07.
  2. "Bikaner East Election Result 2018". business standard. Retrieved 28 December 2018.
  3. "Siddhi Kumari Wins from Bikaner East: पूर्व विधानसभा से सिद्धि कुमारी की हैट्रिक". Rajasthan Patrika (in hindi). 11 Dec 2018. Retrieved 28 December 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  4. "Rajasthan election: A tapestry of royalty, caste and communism". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-11-23. Retrieved 2023-12-07.
  5. "BJP की यह MLA ना विधानसभा में दिखती हैं, ना पार्टी कार्यक्रमों में, फिर भी टिकट कटना मुश्‍किल". Jansatta (in హిందీ). Retrieved 2022-02-19.
  6. "Election Commission of India". results.eci.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2023-12-12. Retrieved 2025-01-10.