సిధ్ధార్థి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
సిద్ధార్థి తెలుగు సంవత్సరం. అరవై సంవత్సరాల హిందూ చక్రంలో యాభై మూడవ సంవత్సరం పేరు. ఇది ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మరియు ఇది సా.శ. 1919-1920లో, 1979-1980లో, మరియు 2039-2040లో వస్తుంది. సిద్ధార్థి అంటే కోరికలు సిద్ధించినది అని అర్థం. ఈ చక్రం ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమవుతుంది.
1979 : సిద్ధార్థి నామ సంవత్సరం 28 మార్చి 1979 బుధవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 17 మార్చి 1980 సోమవారం రౌద్రి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు వారికీ కొత్త సంవత్సరం వసంత ఋతువు, చైత్ర మాసం లోని పాడ్యమి రోజునుంచి ప్రారంభమవుతుంది. ఈరోజుని ఉగాది పర్వదినంగా హిందువులు జరుపుకుంటారు. చైత్ర శుక్ల పాడ్యమి రోజున అనగా ఉగాది రోజున సృష్టి ప్రారంభించాడని పురాణాల కథనం. అందుకనే అందుకే చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఉగస్య ఆదిః ఉగాదిః అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. తెలుగు సంవత్సరాలు 60. అందులో 53వ సంవత్సరం "సిద్ధార్థి"[1]
కొన్ని సిద్ధార్థి నామ సంవత్సరాలు
[మార్చు]| సిద్ధార్థి నామ సంవత్సరాలు | ||
| 1019-1020 | 1619-1620 | 2219-2220 |
| 1079-1080 | 1679-1680 | 2279-2280 |
| 1139-1140 | 1739-1740 | 2339-2340 |
| 1199-1200 | 1799-1800 | 2399-2400 |
| 1259-1260 | 1859-1860 | 2459-2460 |
| 1319-1320 | 1919-1920 | 2519-2520 |
| 1379-1380 | 1979-1980 | 2579-2580 |
| 1439-1440 | 2039-2040 | 2639-2640 |
| 1499-1500 | 2099-2100 | 2699-2700 |
| 1559-1560 | 2159-2160 | 2759-2760 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- ఆశ్వయుజ శుద్ధ అష్టమి: ముదలాళ్వారులు ద్వాపర యుగమున 8,60,900వ సంవత్సరమగు జయవారము శ్రవణ నక్షత్రమున కాంచీ నగరములో తామర పుష్పమున అవతరించాడు.
- 1859 మార్గశిర శుద్ధ త్రయోదశి :రాకమచర్ల వేంకట దాసు తెలంగాణా ప్రాంతానికి చెందిన వాగ్గేయకారుడు. (జ.1808)
- 1919 శ్రావణ బహుళ ద్వాదశి: పుల్లాపంతుల వేంకటరామశర్మ - రాయలసీమ అవధాని, కవి, గ్రంథరచయిత. (మ.1975) [2]
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Telugu, TV9 (2022-04-01). "Ugadi 2022: తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్ధం.. 60 ఏళ్లకు ఉన్న ప్రాముఖ్యత.. మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో తెలుసుకోండి". TV9 Telugu. Retrieved 2025-09-23.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 300.