సిమ్రన్‌జిత్ కౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిమ్రన్‌జిత్ కౌర్
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుసిమ్రన్‌జిత్ కౌర్ బాథ్
పౌరసత్వంభారతీయురాలు
జననం10 జూలై 1995
బరువులైట్ వెల్టర్ వెయిట్


64 కిలోలు / 60 కిలోలు
క్రీడ
క్రీడమహిళల  అమెచ్యూర్ బాక్సింగ్
సాధించినవి, పతకాలు
ప్రపంచస్థాయి ఫైనళ్ళుప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు

2018 న్యూ New దిల్లీలో కాంస్యం ఏసియా ఛాంపియన్‌షిప్‌లు

2019 బ్యాంకాక్‌లో రజతం

సిమ్రన్‌జిత్ కౌర్ ( జ: 1995 జూలై 10) పంజాబ్‌కి చెందిన ఇండియన్ అమెచ్యూర్ బాక్సర్.  2011 నుంచి భారత్‌కు ఆమె ప్రాతినిద్యం వహించింది . 2018 AIBA విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిమ్రన్‌జిత్ కాంస్య పతకం సాధించింది . భారతీయ మహిళల బాక్సింగ్ బృందంలో ఉంటూ 64 కిలోల విభాగంలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన.అహ్మెత్ కొమెర్ట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించింది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో 60 కిలోల విభాగంలో ఆమె పాల్గొన్నది.[1] [1]

వ్యక్తిగత జీవితం, నేపథ్యం[మార్చు]

సిమ్రన్‌జిత్ పంజాబ్‌లోని, చకర్ గ్రామంలో , ఓ నిరు పేద  కుటుంబంలో జన్మించింది . ఆమె తల్లి జీవనోపాధి కోసం ఇరుగుపొరుగు ఇళ్లలో పని చేసేది . తండ్రి  మద్యం దుకాణంలో చిన్న ఉద్యోగం చేసేవాడు .  బాక్సింగ్ పట్ల వారి కుటుంబానికి అభిరుచి ఉండేది. అందువల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తన తోబుట్టువుల అడుగుజాడలను అనుసరించి బాక్సింగ్‌ను కొనసాగించమని సిమ్రన్‌జిత్ తల్లి ఆమెను ప్రోత్సహించేది .  సిమ్రన్‌జిత్ అక్క, ఇద్దరు తమ్ముళ్ళు – బాక్సర్లు అయినప్పటికీ వారిలో ఎవరూ ఆమె స్థాయికి చేరలేకపోయారు [3]

నిజానికి ఉపాధ్యాయురాలు కావాలన్నది సిమ్రన్‌జిత్ కల. కానీ సిమ్రన్‌జిత్ తల్లి మాత్రం పట్టుబట్టి  మరీ వారి గ్రామంలో ఉన్న షేర్-ఎ-పంజాబ్ బాక్సింగ్ అకాడమీకి తీసుకువెళ్లి, ఆ క్రీడ గురించి ఆమెకు చెప్పి , ఆమెలో ప్రేరణ కల్గించేది. చివరకు తల్లి మాట విని బాక్సింగ్ నేర్చుకునేందుకు సిమ్రన్‌జిత్ అంగీకరించింది . [2]

జూలై 2018 లో సిమ్రన్‌జిత్ తన తండ్రిని కోల్పోవడం ఆమె జీవితంలో కోలుకోలేని దెబ్బ. [3]ఆమె తల్లి మాత్రం సిమ్రన్‌జిత్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేది . పేదరికం నుంచి బయట పడి  విజయవంతమైన జీవితాన్ని గడపడానికి క్రీడలే ఉత్తమ మార్గం అని సిమ్రన్‌జిత్ తల్లి నమ్మేది .

వృత్తిపరమైన జీవితం[మార్చు]

  • 2011లో, పాటియాలాలో జరిగిన 6వ జూనియర్ విమెన్ నేషనల్ బాక్సింగ్ఛాంపియన్‌షిప్‌లో సిమ్రన్‌జిత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది . ఆ తర్వాత 2013లో 8 వ జూనియర్ విమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది .
  • మొదట 48 కిలోల విభాగంలో బాక్సింగ్ కెరియర్‌ను ప్రారంభించింది సిమ్రన్‌జిత్ . కాని ఆ తరువాత అధిక బరువు విభాగాలకు మారింది .
  • 2013లో జరిగిన యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో  60 కిలోల విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించింది.
  • 2015 లో, గువాహటిలోని  (గౌహతి) న్యూ బొంగాగావ్‌లో జరిగిన 16 వ సీనియర్ (ఎలైట్) విమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది సిమ్రన్‌జిత్ .
  • హరిద్వార్‌లో జరిగిన 2016 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో  బంగారు పతకం సాధించి ఉత్తమ బాక్సర్‌గా ఎంపికయ్యింది . సీనియర్ నేషనల్‌లో రజతం, ఓపెన్ నేషనల్‌లో కాంస్యం గెలుచుకుంది .  తరువాత 2017 లో కజాఖస్థాన్‌లో జరిగిన సీనియర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో మరో రెండు కాంస్య పతకాలు సాధించింది .
  • 2018 లో తన తండ్రిని కోల్పోయిన తరువాత, సిమ్రన్‌జిత్ .. టర్కీలో జరిగిన 32 వ అహ్మద్ కమెర్ట్ బాక్సింగ్ టోర్నమెంట్లో 64 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి, పతకాన్ని తన తండ్రికి అంకితం చేసింది. [3]
  • 2018 లో జరిగిన ఏఐబిఏ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌లో బారతదేశం నుంచి పాల్గొన్న పదిమంది జట్టులో సిమ్రన్‌జిత్ ఒకరు. ఈ ఛాంపియన్ షిప్‌లో ఆమె కాంస్య పతకం కైవసం చేసుకుంది . [4]
  • 2019 లో, ఇండోనేషియాలోని లాబున్ బాజులో జరిగిన 23 వ ప్రెసిడెంట్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆమె బంగారు పతకం సాధించింది[1]
  • మార్చి 2020 లో,  టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది . పంజాబ్ ప్రభుత్వం ఆమెకు నగదు బహుమతి ప్రకటించడంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. తన ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ తనకు సహయపడుతుందని సిమ్రన్‌జిత్ ఆశాభావం వ్యక్తం  చేసింది. [5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Kaur, Simranjit; Arun, Priti; Singh, Sukhwinder; Kaur, Damanjeet (Dec 2018). "EEG Based Decision Support System to Diagnose Adults with ADHD". 2018 IEEE Applied Signal Processing Conference (ASPCON). IEEE. doi:10.1109/aspcon.2018.8748412. ISBN 978-1-5386-6686-9.
  2. Chaudhary, Amit. "Simranjit Kaur wanted to be a teacher but her mother nudged her towards boxing". The Economic Times. Retrieved 2021-02-18.
  3. 3.0 3.1 Siwach, Vinay. "Pushed into boxing by her mother, Simranjit Kaur packs a punch on world championship debut". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. Sep 1, IANS /; 2020; Ist, 18:41. "Boxer Simranjit Kaur finally gets her due reward from Punjab govt | Boxing News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)

బాహ్య లంకెలు[మార్చు]