సియాంగ్ జిల్లా
సియాంగ్ జిల్లా | |
---|---|
అరుణాచల్ ప్రదేశ్ జిల్లా | |
![]() అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా స్థానం | |
Country | ![]() |
State | అరుణాచల్ ప్రదేశ్ |
Headquarters | బోలెంగ్ |
విస్తీర్ణం | |
• Total | 2,919 km2 (1,127 sq mi) |
జనాభా వివరాలు (2011) | |
• Total | 31,920 |
• సాంద్రత | 11/km2 (28/sq mi) |
కాలమానం | UTC+05:30 (IST) |
సియాంగ్ జిల్లా భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 21 వ జిల్లా.32-రుమ్‌గాంగ్,35-పాంగిన్ నియోజకవర్గాలతో కూడిన అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్, తూర్పు సియాంగ్ జిల్లాలను విభజించడంద్వారా ఈజిల్లా సృష్టించబడింది.ఈ జిల్లాను 27 నవంబరు 2015న ముఖ్యమంత్రి నాబమ్ తుకి ప్రారంభించారు.[1]
ఈ జిల్లాలో ప్రవహించే సియాంగ్ నదినుండి ఈజిల్లా పేరు వచ్చింది.సియాంగ్ అనే పదం ఆంగ్సీ హిమానీనదం ("ఆసి"అంటే ఆది మాండలికాలలో నీరు అని ఉద్భవించింది"సి"అంటే"ఇది"అని అర్ధం, రెండోది ఆంగ్సీ అనే పదంనుండి తీసుకోబడింది) టిబెట్‌లోని బురాంగ్ ప్రాంతం లోని హిమాలయాల ఉత్తరభాగంలో యార్లుంగ్-త్సాంగ్పో నది,బ్రహ్మపుత్ర పారుదల ప్రధాన ఉపనది.ఈప్రాంతంలో ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఆది తెగ నివసిస్తుంది.
స్థానం[మార్చు]
భౌగోళికంగా,సియాంగ్ జిల్లా అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ ప్రదేశం మధ్యలో ఉంది.బోలెంగ్ సుమారు పసిఘాట్ నుండి 100 కి.మీ,అలోంగ్ నుండి 45 కి.మీ,పాంగిన్ నుండి 22 కి.మీ దూరంలో ఉంది.
చరిత్ర[మార్చు]
సియాంగ్ జిల్లా ఏర్పాటుకు 21 మార్చి 2013 న నాబమ్ తుకి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.[2] పద్దెనిమిది నెలల జరిగిన వాదనలు మధ్య పంగిన్ పట్టణం,జిల్లా తాత్కాలిక ప్రధాన కార్యాలయంగా ప్రకటించారు.బోలెంగ్ పట్టణాన్ని జిల్లా ప్రధాన కార్యాలయంగా చేస్తామని ముఖ్యలు హామీ ఇచ్చారు.[3]
పాంగిన్లో మాట్లాడుతూ,సియాంగ్ జిల్లాను 27 నవంబరు 2015 న నబమ్ తుకి అరుణాచల్ ప్రదేశ్ లోని 21 వ జిల్లాగా ప్రకటించారు.పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండేలా కొత్త జిల్లాను రూపొందించారు. పాఠశాల,ఆసుపత్రి,భవనాలు,వంతెనలు, రహదారులు నిర్మాణం,ఇతర పరిణామాలకోసం పాంగిన్లోని పెరామ్ వద్ద జిల్లా సచివాలయం,పాంగిన్లోని ఇతర కార్యాలయాలు ఒక చిన్నస్టేడియం నిర్మాణానికి ఆ సమయంలో నిధులుమంజూరుకు వాగ్దానాలు చేయబడ్డాయి.[1]
భాషలు[మార్చు]
ఆది,సినో-టిబెటన్ భాష,ఈజిల్లా ప్రజలు మాట్లాడే భాష.
పరిపాలన[మార్చు]
జిల్లా పరిధిలోకి వచ్చే ప్రధాన పరిపాలనా కేంద్రాలు రుమ్‌గాంగ్,కైయింగ్.ఇవి అదనపు ఉప అధికారి పర్వేక్షణలో ఉంటాయి.(ఎడిసి) జిల్లాలో కొత్త జిల్లాగా ఏర్పడేనాటికి 9 జిల్లా పరిషత్ సభ్యులు ఉన్నారు.అవి జోమ్లో మొబుక్,రుమ్‌గాంగ్,కైయింగ్,పేయమ్, బోలెంగ్,రెబొ-పెర్గింగ్,సలీన్,కెబాంగ్.[3]
విభాగాలు[మార్చు]
జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి
- బోలెంగ్ ఉప విభాగం:బోలెంగ్,రిగా,రెబో-పెర్గింగ్ ప్రాంతాలు
- పాంగిన్ ఉప విభాగం : పాంగిన్,కెబాంగ్ ప్రాంతాలు
- రమ్‌గాంగ్ ఉప విభాగం: జోమ్లో మొబుక్, రుమ్‌గాంగ్ ప్రాంతాలు కైయింగ్ ఉప విభాగం: కైయింగ్,పేయం ప్రాంతాలు
అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]
ఈ జిల్లాలో 2 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి:
- రుమ్‌గాంగ్ (32)-అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం
- పాంగిన్ (35)-అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం
ప్రస్తావనలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Siang becomes 21st district of Arunachal". The Arunachal Times. 28 November 2015.
- ↑ "Arunachal clears bill for four new districts". The Times of India. 22 March 2013.
- ↑ 3.0 3.1 Amar, Sangno (1 December 2014). "Tension over district headquarters simmers at Pangin-Boleng". The Arunachal Times.