సిరాజుద్దీన్ అజ్మల్
| సిరాజుద్దీన్ అజ్మల్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2021 మే 2 | |||
| ముందు | అబ్దుర్ రహీం అజ్మల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | జమునముఖ్ | ||
| పదవీ కాలం 2014 మే 16 – 2019 మే 23 | |||
| ముందు | ఇస్మాయిల్ హుస్సేన్ | ||
| తరువాత | అబ్దుల్ ఖలేక్ | ||
| నియోజకవర్గం | బార్పేట | ||
| పదవీ కాలం 2006 – 2014 | |||
| ముందు | బద్రుద్దీన్ అజ్మల్ | ||
| తరువాత | అబ్దుర్ రహీం అజ్మల్ | ||
| నియోజకవర్గం | జమునముఖ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1958 February 21 హోజై , అస్సాం | ||
| రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ | ||
| జీవిత భాగస్వామి | మునిరా సిరాజుద్దీన్ అజ్మల్ | ||
| బంధువులు | బద్రుద్దీన్ అజ్మల్ (సోదరుడు) అమీరుద్దీన్ అజ్మల్ (సోదరుడు) నజీరుల్ హక్ అజ్మల్ (సోదరుడు) | ||
| సంతానం | అబ్దుల్ హలీమ్ అజ్మల్ (కొడుకు)
అబ్దుల్ హఫీజ్ అజ్మల్ (కొడుకు) అబ్దుల్ కరీం అజ్మల్ (కొడుకు) 3 కుమార్తెలు | ||
| నివాసం | హోజై , అస్సాం | ||
| పూర్వ విద్యార్థి | ముంబై విశ్వవిద్యాలయం | ||
సిరాజుద్దీన్ అజ్మల్ (జననం 21 ఫిబ్రవరి 1958) అసోం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు.[1] ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్పేట లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]సిరాజుద్దీన్ అజ్మల్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2006లో జమునముఖ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2011 అసోం శాసనసభ ఎన్నికలలో ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రెజాల్ కరీం చౌదరిపై 12,726 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
సిరాజుద్దీన్ అజ్మల్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్పేట లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చంద్ర మోహన్ పటోవరీపై 42,341 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2021 అసోం శాసనసభ ఎన్నికలలో ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏజిపి అభ్యర్థి సాదిక్ ఉల్లా భుయాన్‌పై 1,18,560 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Sirajuddin Ajmal" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "The other Ajmal: Sirajuddin returns to contest from Jamnamukh" (in ఇంగ్లీష్). The Indian Express. 1 April 2021. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.